(1) .(طسٓمٓ) తా - సీన్ - మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
(2) ఇవి అసత్యము నుండి సత్యమును స్పష్టపరిచే ఖుర్ఆన్ ఆయతులు.
(3) ఓ ప్రవక్తా బహుశా మీరు వారు సన్మార్గము పొందాలనే మీ ఆశ వలన వారి సన్మార్గము పొందటంపై బాధతో ఆశతో మీ ప్రాణములను కోల్పోతారేమో.
(4) ఒక వేళ మేము ఆకాశము నుండి వారిపై ఏదైన నిదర్శనమును అవతరించదలిస్తే వారిపై దాన్ని అవతరింపజేసే వారము. అప్పుడు వారి మెడలు దాని కొరకు వంగిపోయి లొంగిపోతాయి. కానీ వారి పరీక్ష కొరకు మేము అలా తలచుకోలేదు. ఏమీ వారు అగోచర విషయాలను విశ్వసిస్తారా ?.
(5) ఈ ముష్రికుల వద్దకు కరుణామయుడి వద్ద నుండి ఏదైన నూతన హితోపదేశం ఆయన ఏకత్వమును,ఆయన ప్రవక్త నిజాయితీని సూచించే వాదనలతో అవతరించి వచ్చినా వారు దాన్ని వినటం నుండి,దాన్ని నమ్మటం నుండి విముఖత చూపకుండా ఉండలేదు.
(6) నిశ్ఛయంగా వారు తమ వద్దకు తమ ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించారు. తొందరలోనే వారు దేని గురించైతే హేళన చేసేవారో వాటి వార్తల నిరూపణ వారి వద్దకు వస్తుంది. మరియు వారిపై శిక్ష వాటిల్లుతుంది.
(7) ఏ వారు భూమిలో మేము మంచి దృశ్యం కల చాలా ప్రయోజనాలు కల రకరకాల మొక్కల్లోంచి ప్రతి రకములో నుండి ఎన్ని మొలకెత్తించామో వాటిని చూడకుండా వీరందరు తమ అవిశ్వాసంపై మొండిగా ఉండిపోయారా ?!.
(8) నిశ్ఛయంగా వేరు వేరు రకాల మొక్కలతో భూమిని మొలకెత్తించటంలో వాటిని మొలకెత్తించిన వాడి సామర్ధ్యం మృతులను జీవింపజేయటంలో ఉన్నదనటానికి స్పష్టమైన ఆధారం కలదు. వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
(9) ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మీ ప్రభువు ఆయనే తనపై ఎవరూ ఆధిక్యతను కనబరచని ఆధిక్యుడు. తన దాసులపై కరుణిెంచేవాడు.
(10) ఓ ప్రవక్తా మీరు మీ ప్రభువు మూసాను అల్లాహ్ పై తమ అవిశ్వాసం వలన,మూసా జాతి వారిని బానిసలుగా చేసుకోవటం వలన హింసకు పాల్పడిన జాతి వారి వద్దకు వెళ్ళమని ఆదేశిస్తూ పిలిచినప్పటి వైనమును గుర్తు చేసుకోండి.
(11) వారు ఫిర్ఔన్ జాతి వారు. అప్పుడు ఆయన వారికి అల్లాహ్ ఆదేశములను పాటించటం ద్వారా,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా అల్లాహ్ భయభీతి కలిగి ఉండాలని సున్నితంగా,మృధువుగా ఆదేశిస్తాడు.
(12) మూసా అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు : నిశ్ఛయంగా నీ వద్ద నుండి నేను వారికి చేరవేసిన వాటి విషయంలో వారు నన్ను తిరస్కరిస్తారని నేను భయపడుతున్నాను.
(13) వారు నన్ను తిరస్కరించటం వలన నా హృదయం కుంచించుకుపోతుంది (ఇబ్బందికి గురి అవుతుంది). నా నాలుక మాట్లాడటం నుండి ఆగిపోతుంది. అయితే నీవు జిబ్రయీల్ అలైహిస్సలాంను నా సోదరుడు హారూన్ వద్దకు అతడు నాకు సహాయకుడిగా అవటానికి పంపించు.
(14) మరియు వారి వద్ద నేను ఖిబ్తీను హత్య చేయటం వలన నాపై ఒక నేరం ఉన్నది. అయితే వారు నన్ను హతమారుస్తారని నేను భయపడుతున్నాను.
(15) అల్లాహ్ మూసా అలైహిస్సలాంతో ఇలా పలికాడు : అలా జరగదు. వారు నిన్ను హతమార్చరు. అయితే నీవు మరియు నీ సోధరుడు హారూన్ మీ నిజీయితీని దృవీకరించే మా సూచనలను తీసుకుని వెళ్ళండి. నిశ్ఛయంగా మేము మీరు ఏమి పలుకుతారో వాటికి,వారు మీకు ఏమి పలుకుతారో వాటికి సహాయము ద్వారా మద్దతు ద్వారా మేము మీకు తోడుగా ఉంటాము. వాటి లో నుండి ఏది మా నుండి తప్పిపోదు.
(16) అయితే మీరిద్దరు ఫిర్ఔన్ వద్దకు వెళ్ళి అతనితో ఇలా పలకండి : నిశ్ఛయంగా మేము సమస్త సృష్టి రాసుల ప్రభువు వద్ద నుండి నీ వద్దకు ప్రవక్తలుగా పంపించబడ్డాము.
(17) కావున నీవు ఇస్రాయీలు సంతతి వారిని మాతోపాటు పంపించు.
(18) మూసా అలైహిస్సలాంతో పిర్ఔన్ ఇలా సమాధానమిచ్చాడు : ఏమీ మేము నిన్ను బాల్యంలో మా వద్ద పోషించలేదా, నీవు మా మధ్యలో నీ వయస్సులోని చాలా సంవత్సరాలు ఉండిపోయావు. అయితే దైవ దౌత్యం యొక్క వాదన వైపునకు నిన్ను ఏది పిలుస్తుంది ?.
(19) మరియు నీ జాతి వారిలో నుండి ఒక వ్యక్తికి సహాయం చేయటానికి ఖిబ్తీని హతమార్చినప్పుడు నీవు గొప్ప ఘనకార్యం చేశావు. మరియు నీవు నీపై ఉన్న నా అనుగ్రహాలను తిరస్కరించే వారిలో నుంచి అయిపోయావు.
(20) మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ తో అంగీకరిస్తూ ఇలా పలికారు : నేను ఆ మనిషిని నా వద్దకు దైవ వాణి రాక ముందు అజ్ఞానుల్లోంచి ఉన్నప్పుడు హత్య చేశాను.
(21) అతన్ని హత్య చేసిన తరువాత మీరు నన్ను అతనికి బదులుగా నన్ను హతమారుస్తారని నేను భయపడినప్పుడు మద్యన్ బస్తీ వైపునకు మీ నుండి పారిపోయాను. అప్పుడు నా ప్రభువు నాకు జ్ఞానమును ప్రసాదించాడు. మరియు ఆయన నన్ను తాను ప్రజల వైపునకు ప్రవక్తలుగా పంపించే తన ప్రవక్తల్లోంచి చేశాడు.
(22) మరియు నీవు నన్ను బానిసగా చేయకుండా ఇస్రాయీలు సంతతి వారిని బనిసలుగా చేసి నన్ను నీవు పోషించటాన్ని నిజంగా నాపై చేసిన ఉపకారంగా ఎత్తిపొడుస్తున్నావు.
(23) ఫిర్ఔన్ మూసా అలైహిస్సలాంను ఇలా అడిగాడు : ఆయన దూతగా నీవు చెప్పుకున్న సృష్టితాల ప్రభువు ఎవడు ?.
(24) మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ కు సమాధానమిస్తూ ఇలా పలికారు : సృష్టితాల ప్రభువు,ఆకాశముల ప్రభువు,భూమి యొక్క ప్రభువు మరియు ఆ రెండింటి మధ్య ఉన్న వాటి యొక్క ప్రభువు ఒక వేళ ఆయన వారి ప్రభువు అని మీరు నమ్మే వారైతే మీరు అతనొక్కడినే ఆరాధించండి.
(25) ఫిర్ఔన్ తన చుట్టూ ఉన్న తన జాతి నాయకులతో ఇలా పలికాడు : మీరు మూసా సమాధానమును,అందులో ఉన్న అబద్దపు వాదనను వినటంలేదా ?!.
(26) మూసా అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : అల్లాహ్ మీ ప్రభువు,మీ పూర్వ తాతముత్తాతల ప్రభువు.
(27) ఫిర్ఔన్ ఇలా పలికాడు : నిశ్చయంగా మీ వద్దకు ప్రవక్తగా పంపించబడ్డాడని వాదించే ఇతను ఎలా సమాధానం ఇవ్వాలో తెలియని పిచ్చివాడు. తనకు అర్ధం కాని వాటిని చెబుతున్నాడు.
(28) మూసా అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు : నేను మిమ్మల్ని పిలిచే అల్లాహ్ తూర్పునకు ప్రభువు,పడమరనకు ప్రభువు మరియు ఆ రెండింటికి మధ్య ఉన్న వాటికి ప్రభువు ఒక వేళ మీకు వాటిని అర్ధం చేసుకునే బుద్దులు ఉంటే.
(29) ఫిర్ఔన్ ముసాతో వాదించటం నుండి అశక్తుడైన తరువాత మూసాతో ఇలా పలికాడు : నీవు నన్ను కాదని మరెవరినైన ఆరాధ్య దైవంగా ఆరాధిస్తే నేను నిన్ను చెరసాలలో బందీలుగా ఉన్నవారిలో చేరుస్తాను.
(30) మూసా అలైహిస్సలాం ఫిర్ఔన్ కి ఇలా సమాధానమిచ్చారు : ఏమీ ఒక వేళ నేను అల్లాహ్ వద్ద నుండి నీ వద్దకు తీసుకుని వచ్చిన దాని విషయంలో నా నిజాయితీని స్పష్టపరిచే దాన్ని నీ వద్దకు తీసుకుని వచ్చిన తరువాత కూడా నీవు నన్ను చెరసాలలో బందీలుగా ఉన్న వారిలో చేరుస్తావా ?.
(31) నీవు వాదిస్తున్న విషయంలో ఒక వేళ నీవు నిజాయితీ పరులలోంచి అయితే నీ నిజాయితీని సూచిస్తుందని నీవు ప్రస్తావించిన దాన్ని తీసుకుని రా అని అతడు పలికాడు.
(32) అప్పుడు మూసా తన చేతి కర్రను భూమిపై విసిరారు అది అకస్మాత్తుగా చూసేవారికి ఒక స్పష్టమైన సర్పంగా మారిపోయింది.
(33) మరియు ఆయన తన చేతిని తెల్లగా లేకుండా ఉన్న స్థితిలో తన జేబులో దూర్చారు. అప్పుడు ఆయన దాన్ని బొల్లి తెల్లదనం కాకుండా వెలిగిపోతున్న తెల్లదనముతో బయటకు తీశారు. దాన్ని చూసేవారు చూశారు.
(34) ఫిర్ఔన్ తన చుట్టూ ఉన్న తన జాతి నాయకులతో ఇలా పలికాడు : నిశ్చయంగా ఈ వ్యక్తి మంత్రజాలము తెలిసిన ఒక మంత్రజాలకుడు.
(35) ఇతను తన మంత్రజాలముతో మిమ్మల్ని మీ భూమి నుండి వెళ్ళగొట్ట గోరుతున్నాడు. అయితే మేము అతని విషయంలో తీసుకునే చర్య గురించి మీ సలహా ఏమిటి ?.
(36) వారు అతనికి ఇలా సమాధానమిచ్చారు : అతన్ని,అతని సోదరుడిని ఇద్దరిని శిక్షించటంలో తొందర చేయకుండా గడువు ఇచ్చి మిసర్ పట్టణాలలో మంత్రజాలకులను సమీకరించే వారిని పంపించండి.
(37) వారు మంత్రజాలమును తెలిసిన ప్రతీ మంత్రజాలకుడిని నీ వద్దకు తీసుకుని వస్తారు.
(38) అప్పుడు ఫిర్ఔన్ మూసాతో పోటీ చేయటానికి తన మంత్రజాలకులను ఒక నిర్ణీత ప్రదేశంలో,నిర్ణీత కాలంలో సమీకరించాడు.
(39) మరియు ప్రజల్లో ఇలా ప్రకటించబడినది : ఏమీ మీరు గెలిచే వాడిని చూడటానికి సమావేశమవుతారా అతడు మూసానా లేదా మంత్రజాలకులా ?.
(40) ఒక వేళ మంత్రజాలకులకు మూసా అలైహిస్సలాంపై గెలుపు కలిగితే మేము వారి ధర్మము విషయంలో వారిని అనుసరించాలని ఆశ.
(41) మంత్రజాలకులు మూసాపై గెలవటానికి ఫిర్ఔన్ వద్దకు వచ్చినప్పుడు వారు అతనితో ఇలా పలికారు : ఒక వేళ మూసా పై మనకు గెలుపు కలిగితే మనకు ఆర్ధిక ప్రతిఫలం లేదా నైతిక ప్రతిఫలం ఉంటుందా ?.
(42) ఫిర్ఔన్ వారితో ఇలా పలికాడు : అవును మీ కొరకు ప్రతిఫలం గలదు. నిశ్ఛయంగా మీరు అతనిపై సఫలీకృతమైతే నా వద్ద మీకు ఉన్నత స్థానాలను ప్రసాదించటం ద్వారా సన్నిదుల్లోంచి అవుతారు.
(43) మూసా అలైహిస్సలాం అల్లాహ్ సహాయముపై నమ్మకమును కలిగి ఉండి మరియు తన వద్ద ఉన్నది మంత్రజాలము కాదని స్పష్టపరుస్తూ వారితో ఇలా పలికారు : మీరు వేయదలచుకున్న మీ త్రాళ్ళను,మీ చేతి కర్రలను వేయండి.
(44) అప్పుడు వారు తమ త్రాళ్ళను,చేతి కర్రలను విసిరారు.వాటిని విసిరినప్పుడు వారు ఇలా పలికారు : ఫిర్ఔన్ గొప్పతనము సాక్షిగా నిశ్ఛయంగా మేమే విజయం పొందే వారము. మరియు మూసా అతడే ఓడిపోయేవాడు.
(45) అప్పుడు మూసా అలైహిస్సలాం తన చేతి కర్రను విసిరారు. అప్పుడు అది సర్పముగా మారిపోయింది. అప్పుడు అది వారు మంత్రజాలముతో ప్రజలను మోసం చేసిన దాన్ని మింగసాగింది.
(46) మంత్రజాలకులు మూసా చేతి కర్ర వారు విసిరిన తమ మంత్రజాలమును మ్రింగి వేయటమును చూసినప్పుడు సాష్టాంగపడిపోయారు.
(47) వారు ఇలా అన్నారు : మేము సృష్టితాలన్నిటి ప్రభువును విశ్వసించాము.
(48) మూసా,హారూన్ అలైహిమస్సలాం ప్రభువును.
(49) ఫిర్ఔన్ మంత్రజాలకుల విశ్వాసమును ఖండిస్తూ ఇలా పలికాడు : ఏమీ నేను మీకు దీని అనుమతి ఇవ్వక ముందే మీరు మూసా పై విశ్వాసమును కనబరుస్తారా ?!. నిశ్చయంగా మూసా మీకు మంత్రజాలమును నేర్పించిన మీ పెద్దవాడు. వాస్తవానికి మీరందరు మిసర్ వాసులందరిని దాని నుండి వెళ్ళగొట్టడానికి కుట్ర పన్నారు. నేను మీకు ఏ శిక్ష విధిస్తానో మీరు తొందరలోనే తెలుసుకుంటారు. నేను తప్పకుండా మీలో నుండి ప్రతి ఒక్కరి ఒక కాలును,ఒక చేయిని ఆ రెండింటి మధ్య వ్యతిరేక దిశలో కోసివేస్తాను ఎడమ చేతితోపాటు కుడి కాలును కోయటం లేదా దానికి భిన్నంగా. మరియు నేను తప్పకుండా మీ అందరిని ఖర్జూరపు చెట్టు బోదెలపై సిలువ వేస్తాను. మీలో నుండి ఎవరినీ నేను వదలను.
(50) మంత్రజాలకులు ఫిర్ఔన్ కు ఇలా సమాధానమిచ్చారు : ఇహ లోకంలో నీవు కోయటం,సిలువ వేయటం గురించి మమ్మల్ని బెదిరిస్తున్న దానిలో ఎటువంటి నష్టం లేదు. నీ శిక్ష తరిగిపోతుంది. మరియు మేము మా ప్రభువు వైపునకు మరలి వెళ్ళుతాము. మరియు ఆయన మమ్మల్ని తన శాశ్వత కారుణ్యంలో ప్రవేశింపజేస్తాడు.
(51) నిశ్చయంగా మొదట మేమే మూసాపై విశ్వాసమును కనబరచి ఆయనను నమ్మాము కాబట్టి అల్లాహ్ మేము పాల్పడిన పూర్వ పాపాలను తుడిచి వేస్తాడని మేము ఆశిస్తున్నాము.
(52) మరియు మేము మూసా అలైహిస్సలాం వైపునకు ఆయన ఇస్రాయీలు సంతతి వారిని రాత్రి తీసుకుని వెళ్ళమని ఆదేశిస్తూ దైవ వాణిని అవతరింపజేశాము. ఎందుకంటే ఫిర్ఔన్,అతనితో పాటు ఉన్నవారు వారిని పట్టుకోవటానికి వారిని వెంబడిస్తారు.
(53) అయితే ఫిర్ఔన్ పట్టణాలలో ఇస్రాయీలు సంతతి వారిని పట్టుకోవటానికి ఎప్పుడైతే మిసర్ నుండి వారి బయలదేరటమును తెలుసుకున్నాడో సైన్యములను సమీకరించే వారిని తన సైన్యముల్లోంచి కొంత మందిని పంపించాడు.
(54) ఫిర్ఔన్ ఇస్రాయీలు సంతతి వారి విషయంలో చిన్నవిగా చూపిస్తూ ఇలా పలికాడు : నిశ్ఛయంగా వీరందరు చిన్న వర్గము.
(55) మరియు నిశ్ఛయంగా వారు వారిపై మమ్మల్ని ఆగ్రహమును కలిగించే చర్యలకు పాల్పడ్డారు.
(56) మరియు నిశ్ఛయంగా మేము వారి కొరకు సిద్ధంగా,అప్రమత్తంగా ఉన్నాము.
(57) కావున మేము ఫిర్ఔన్ ను,అతని జాతి వారిని దట్టమైన తోటలు,నీటితో ప్రవహించే కాలువలు గల మిసర్ భూమి నుండి వెళ్ళగొట్టాము.
(58) మరియు సంపదల నిధులు గల,మంచి నివాసాలు గల (భూమి నుండి)
(59) ఈ విధంగా మేము ఫిర్ఔన్,అతని జాతి వారిని ఈ అనుగ్రహాల నుండి వెళ్ళగొట్టి వారి తరువాత ఈ అనుగ్రహాలను షామ్ ప్రాంతములో ఇస్రాయీలు సంతతి వారి కొరకు చేశాము.
(60) ఫిర్ఔన్,అతని జాతి వారు సూర్యోదయ సమయంలో ఇస్రాయీలు సంతతి వారిని వెంబడించారు.
(61) ఎప్పుడైతే ఫిర్ఔన్ అతని జాతి వారు మూసా అలైహిస్సలాం,అయన జాతి వారితో ఎదురుపడి ప్రతీ పక్షము రెండోవ పక్షమును చూసే విధంగా అయిపోయారో మూసా అనుచరులు నిశ్ఛయంగా ఫిర్ఔన్,అతని జాతి వారు మమ్మల్ని పట్టుకుంటారు. వారిని ఎదుర్కునే శక్తి మాకు లేదు అని అన్నారు.
(62) మూసా అలైహిస్సలాం తన జాతి వారితో ఇలా పలికారు : విషయం మీరు అనుకున్నట్లు కాదు. ఎందుకంటే నిశ్చయంగా మద్దతుతో,సహాయముతో నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. తొందరలోనే ఆయన నన్ను విముక్తి మార్గము వైపునకు మార్గ దర్శకత్వము చేస్తాడు.
(63) అప్పుడు మేము మూసాను తన చేతి కర్రను సముద్రంపై కొట్టమని ఆదేశిస్తూ దైవ వాణి అవతరింపజేశాము. అప్పుడు ఆయన దాన్ని దానితో కొట్టారు. అప్పుడు సముద్రం చీలిపోయి ఇస్రాయీలు సంతతి వారి తెగల లెక్క ప్రకారం పన్నెండు మార్గములుగా మారిపోయింది. అప్పుడు సముద్రం యొక్క చీలిన ప్రతీ ముక్క పెద్దది అవటంలో,స్థిరత్వంలోపెద్ద పర్వతము వలె అందులో నుండి ఎటువంటి నీరు ప్రవహించకుండా ఉన్నట్లు అయిపోయినది.
(64) మరియు మేము ఫిర్ఔన్,అతని జాతి వారిని సమీపింపజేశాము చివరికి వారు మార్గమును దారిగా భావిస్తూ సముద్రంలో ప్రవేశించారు.
(65) మరియు మేము మూసా అలైహిస్సలాం,ఆయనతోపాటు ఉన్న ఇస్రాయీలు సంతతి వారిని రక్షించాము. వారిలో నుంచి ఎవరూ నాశనం కాలేదు.
(66) ఆ తరువాత మేము ఫిర్ఔన్,అతని జాతి వారిని సముద్రంలో ముంచి తుదిముట్టించాము.
(67) నిశ్ఛయంగా మూసా అలైహిస్సలాం కొరకు సముద్రం విడిపోయి ఆయనకు విముక్తి కలగటంలో,ఫిర్ఔన్,అతని జాతి వారికి వినాశనం కలగటంలో మూసా నిజాయితీ పై సూచించే ఒక సూచన కలదు. మరియు ఫిర్ఔన్ తో పాటు ఉన్న చాలా మంది విశ్వసించరు.
(68) ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
(69) ఓ ప్రవక్తా మీరు ఇబ్రాహీం గాధను వారికి చదివి వినిపించండి.
(70) ఆయన తన తండ్రి ఆజరుతో,తన జాతి వారితో మీరు అల్లాహ్ ను వదిలి ఎవరిని ఆరాధిస్తున్నారు ? అని అడిగినప్పుడు.
(71) ఆయన జాతి వారు ఆయనకు ఇలా సమాధానమిచ్చారు : మేము కొన్ని విగ్రహాలను వాటి ఆరాధనను వాటి కొరకు అట్టిపెడుతూ పాటిస్తూ ఆరాధిస్తున్నాము.
(72) ఇబ్రాహీం అలైహిస్సలాం మీరు విగ్రహాలను పిలుస్తున్నప్పుడు వారు మీ పిలుపును వింటున్నారా ? అని ప్రశ్నించారు.
(73) లేదా ఒక వేళ మీరు వారికి విధేయత చూపితే మీకు వారు ప్రయోజనం చేకూరుస్తారా ? లేదా ఒక వేళ మీరు వారికి అవిధేయులైతే వారు మీకు నష్టం చేకూరుస్తారా ? అని వారితో అడిగారు.
(74) వారు ఇలా సమాధానమిచ్చారు : మేము వారిని పిలిచినప్పుడు వారు మమ్మల్ని విన లేదు,ఒక వేళ మేము వారికి విధేయత చూపితే వారు మమ్మల్ని ప్రయోజనం కలిగించరు,ఒక వేళ మేము వారికి అవిధేయత చూపితే వారు మమ్మల్ని నష్టం కలిగించలేరు. కాని జరిగిందేమిటంటే మేము మా తాతముత్తాతలను ఇలా చేస్తుండగా చూశాము. మేము వారిని అనుకరిస్తున్నాము.
(75) ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇలా పలికారు : మీరు యోచన చేసి చూశారా ?మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న విగ్రహాలను;
(76) మరియు మీ పూర్వ తాతముత్తాతలు ఆరాధన చేసే వాటిని.
(77) నిశ్చయంగా వారందరు నాకు శతృవులు ఎందుకంటే సమస్త సృష్టి రాసుల ప్రభువైన అల్లాహ్ తప్ప వారందరు అసత్యులు.
(78) ఆయనే నన్ను సృష్టించాడు. కనుక ఆయన నన్ను ఇహపరాల మంచి వైపునకు మార్గ నిర్దేశకం చేస్తాడు.
(79) ఆయన ఒక్కడే నాకు ఆకలి కలిగినప్పుడు నాకు తినిపిస్తాడు,నాకు దాహం వేసినప్పుడు నాకు త్రాపిస్తాడు.
(80) మరియు ఆయన ఒక్కడే నాకు రోగం కలిగినప్పుడు రోగము నుండి నన్ను నయం చేస్తాడు. ఆయన తప్ప ఇంకెవరూ నాకు నయం చేసేవాడు లేడు.
(81) ఆయన ఒక్కడే నా వయస్సు అంతమైపోయినప్పుడు నన్ను మరణింపజేస్తాడు,నేను మరణించిన తరువాత నన్ను జీవింపజేస్తాడు.
(82) ప్రతిఫలం దినం నాడు నా పాపములను మన్నిస్తాడని ఆయన ఒక్కడితోనే నేను ఆశిస్తున్నాను.
(83) ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రభువుతో దుఆ చేస్తూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నాకు ధర్మ అవగాహన ప్రసాదించు. మరియు నన్ను నా కన్నా మునుపటి పుణ్యాత్ములైన దైవ ప్రవక్తలతో వారితో పాటు నన్ను స్వర్గంలో ప్రవేశింపజేసి కలుపు.
(84) మరియు నీవు నా తరువాత వచ్చే తరాలలో నా కొరకు అందమైన చర్చను,మంచి కీర్తిని కలిగించు.
(85) మరియు నీవు నన్ను స్వర్గ స్థానాలకు వారసులై వాటిలో సుఖభోగాలను అనుభవించే విశ్వాసపరులైన నీ దాసుల్లో చేర్చి వాటిలో నాకు నివాసం కల్పించు.
(86) మరియు నీవు నా తండ్రిని మన్నించు. నిశ్ఛయంగా అతడు ,షిర్కు వలన సత్యము నుండి తప్పిన వారిలో అయిపోయాడు. ఇబ్రాహీం అలైహ్స్సలాం తన తండ్రి కొరకు అతను నరక వాసుల్లోంచి వాడు అని స్పష్టమవక మునుపు దుఆ చేశారు. ఎప్పుడైతే అది స్పష్టమైనదో ఆయన అతడి నుండి విసిగిపోయారు,అతని కొరకు దుఆ చేయలేదు.
(87) లెక్క తీసుకోబడటం కొరకు ప్రజలు లేపబడే రోజున నన్ను శిక్షించి బట్టబయలు చేయకు.
(88) ఆ రోజు మనిషి ఇహలోకంలో సమీకరించిన సంపద గానీ,సంతానం గానీ ప్రయోజనం చేకూర్చవు. ప్రతి ఒక్కరు వారిపై జయిస్తారు.
(89) ఎటువంటి సాటి గానీ,కపటత్వం గానీ,ప్రదర్శనా బుద్ది గానీ,అహంకారము గానీ లేని నిర్మలమైన హృదయమును తీసుకుని అల్లాహ్ సన్నిధిలో హాజరయ్యేవాడు మాత్రమే. అతడే అల్లాహ్ మార్గంలో తాను ఖర్చు చేసిన సంపద ద్వారా,అతని కొరకు దుఆ చేసే తన సంతానము ద్వారా ప్రయోజనం చెందుతాడు.
(90) మరియు తమ ప్రభువు ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి ఆయన భీతి కలిగిన వారి కొరకు స్వర్గము దగ్గర చేయబడుతుంది.
(91) సత్య ధర్మము నుండి తప్పిపోయి మార్గ భ్రష్టులయ్యే వారి కొరకు మహషర్ లో నరకాగ్ని ప్రత్యక్షపరచబడుతుంది.
(92) మీరు ఆరాధించే విగ్రహాలు ఏవి అని వారితో దూషిస్తూ అడగటం జరుగుతుంది.
(93) అల్లాహ్ ను వదిలి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు అల్లాహ్ శిక్షను మీ నుండి ఆపి మీకు సహాయం చేయగలరా ? లేదా వారు తమ స్వయం కొరకు సహాయం చేసుకోగలరా ?.
(94) వారు,వారిని మార్గభ్రష్టతకు గురి చేసిన వారు నరకంలో ఒకరిపై ఒకరు విసిరివేయబడుతారు.
(95) మరియు షైతానుల్లోంచి ఇబ్లీసు సహాయకులందరు కూడా. వారిలో నుండి ఎవరు వదిలి వేయబడరు.
(96) అల్లాహేతరులను ఆరాధించి వారిని ఆయనను వదిలి సాటి కల్పించేవారు వారునూ,ఎవరినైతే వారు ఆరాధించేవారో వారితో తగువులాడుతూ ఇలా పలుకుతారు :
(97) అల్లాహ్ సాక్షిగా నిశ్ఛయంగా మేము సత్యము నుండి స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్నాము.
(98) మేము మిమ్మల్ని సమస్త సృష్టి రాసుల ప్రభువుతో సమానులుగా చేసి ఆయనను మేము ఆరాధించినట్లే మిమ్మల్ని ఆరాధించాము.
(99) అల్లాహ్ ను వదిలి వారి ఆరాధన వైపునకు మమ్మల్ని పిలిచిన అపరాధులు మాత్రమే మమ్మల్ని సత్య మార్గము నుంచి తప్పించారు.
(100) అల్లాహ్ వద్ద మా కొరకు సిఫారసు చేసి ఆయన శిక్ష నుండి మమ్మల్ని విముక్తి కలిగించటానికి సిఫారసు చేసే వారు లేరు.
(101) మా తరపు నుండి ప్రతిఘటించే,మా కొరకు సిఫారసు చేసే ప్రత్యక ఆప్యాయత కల ఎటువంటి స్నేహితుడు మాకు లేడు.
(102) అయితే ఒక వేళ మా కొరకు ఇహలోక జీవితం వైపు మరలటం అన్నది ఉంటే మేము అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే వారిలోంచి అయిపోతాము.
(103) నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన ఇబ్రాహీమ్ అలైహిస్సలాం గాధలో,తిరస్కారుల పరిణామంలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలామంది విశ్వసించటంలేదు.
(104) ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
(105) నూహ్ అలైహిస్సలాం జాతి వారు నూహ్ అలైహిస్సలాంను తిరస్కరించినప్పుడు ప్రవక్తలను తిరస్కరించారు.
(106) వారితో వంశ పరంగా సోదరుడైన నూహ్ ఇలా పలికినప్పుడు : ఏమీ మీరు అల్లాహ్ భయంతో ఇతరుల ఆరాధనను విడనాడి ఆయనతో భయపడరా ?!.
(107) నిశ్ఛయంగా నేను మీ కొరకు అల్లాహ్ మీ వైపునకు పంపించిన ఒక ప్రవక్తను.అల్లాహ్ నా వైపునకు వహీ చేసిన దానిలో నేను అధికం చేయని,తరగించని నీతిమంతుడను.
(108) అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
(109) మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది ఇతరులపై లేదు.
(110) అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
(111) ఆయనతో ఆయన జాతి వారు ఇలా అన్నారు : ఓ నూహ్ మేము నిన్ను అనుసరించాలా ? మరియు నీవు తీసుకుని వచ్చిన దాన్ని అనుసరించి ఆచరించాలా , పరిస్థితి చూస్తే నిన్ను అనుసరిస్తున్నది మాత్రం ప్రజల్లోంచి అధములే. వారిలో నాయకులు,గొప్పవారు దొరకరు ?!.
(112) నూహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : ఈ విశ్వాసపరులందరు ఏమి చేసేవారో నాకు తెలియదు. నేను వారి ఆచరణలను లెక్కవేసే పరిరక్షకుడిగా వారిపై లేను.
(113) వారి లెక్క మాత్రం వారి రహస్యాలను,వారి బహిరంగాలను తెలిసిన అల్లాహ్ పై ఉన్నది. నా వద్ద లేదు. మీరు ఏమి చెప్పారో ఒక వేళ మీరు తెలుసుకుంటే చెప్పేవారు కాదు.
(114) మరియు నేను మీరు విశ్వసించటానికి మీ కోరికను అంగీకరిస్తూ విశ్వాసపరులను నా సభ నుండి గెంటివేసే వాడను కాను.
(115) నేను హెచ్చరికను స్పష్టపరిచే హెచ్చరిక చేసేవాడను మాత్రమే నేను మిమ్మల్ని అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరిస్తున్నాను.
(116) ఆయనతో ఆయన జాతి వారు ఇలా పలికారు : నీవు మమ్మల్ని పిలుస్తున్న దాని నుండి ఆపకపోతే నీవు తప్పకుండా దూషించబడిన వారిలో నుంచి,రాళ్ళతో కొట్టబడి హతమార్చబడిన వారిలో నుంచి అయిపోతావు.
(117) నూహ్ అలైహిస్సలాం తన ప్రభువుతో వేడుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నిశ్చయంగా నా జాతి వారు నన్ను తిరస్కరించారు. మరియు నేను నీ వద్ద నుండి తీసుకుని వచ్చిన దాని విషయంలో నన్ను సత్యవంతుడని నమ్మలేదు.
(118) అయితే నీవు నాకూ,వారికి మధ్య అసత్యముపై వారు మొండిగా ఉండటం వలన వారిని తుదిముట్టించే ఒక తీర్పును ఇవ్వు. నీవు నా జాతి వారిలో నుంచి అవిశ్వాసపరులని దేనితోనైతే వినాశనమునకు గురి చేస్తావో దాని నుండి నన్ను,నాతోపాటు ఉన్న విశ్వాసపరులని రక్షించు.
(119) అప్పుడు మేము అతని కొరకు అతని దుఆను స్వీకరించాము. మరియు మేము అతనిని,అతనితోపాటు ఉన్న విశ్వాసపరులని మనుషులతో,జంతువులతో నిండి ఉన్న నావలో రక్షించాము.
(120) ఆ తరువాత మేము వారిలో మిగిలి ఉన్న వారిని ముంచి వేశాము, వారు నూహ్ జాతివారు.
(121) నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన నూహ్,అతని జాతి వారి గాధలో,నూహ్,అతనితో పాటు ఉన్న విశ్వాసపరుల విముక్తిలో,అతని జాతి వారిలో నుండి అవిశ్వాసపరుల వినాశనంలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం కలదు. మరియు వారిలో నుండి చాలా మంది విశ్వసించటం లేదు.
(122) ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
(123) ఆద్ జాతి వారు తమ ప్రవక్త హూద్ అలైహిస్సలాంను తిరస్కరించినప్పుడు ప్రవక్తలను తిరస్కరించారు.
(124) వారితో వంశ పరంగా సోదరుడైన హూద్ ఇలా పలికినప్పుడు : ఏమీ మీరు అల్లాహ్ భయంతో ఇతరుల ఆరాధనను విడనాడి ఆయనతో భయపడరా ?!.
(125) నిశ్ఛయంగా నేను మీ కొరకు అల్లాహ్ మీ వైపునకు పంపించిన ఒక ప్రవక్తను. అల్లాహ్ నన్ను చేరవేయమని ఆదేశించిన దానిలో నేను అధికం చేయని,అందులో తరగించని నీతిమంతుడను.
(126) అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
(127) మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది ఇతరులపై లేదు.
(128) ఏమీ మీరు ప్రతీ ఎత్తైన స్థలంలో మీ ఇహములో లేదా మీ పరములో మీపై మరలని ప్రయోజనం లేని ఒక నిష్ప్రయోజనమైన స్మారక కట్టడమును నిర్మిస్తారా ?!.
(129) మీరు ఈ ఇహలోకములో శాస్వతంగా ఉండిపోయేటట్లుగా కోటలను,భవనములను నిర్మిస్తున్నారు. మీరు వాటి నుండి మరలించరని.
(130) మరియు మీరు హత్య ద్వారా,కొట్టడం ద్వారా దాడి చేసినప్పుడు దయా,దాక్షిణ్యాలు లేని దౌర్జన్యపరులుగా దాడి చేస్తారు.
(131) అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
(132) మరియు మీరు మీకు తెలిసిన అనుగ్రహాలు ప్రసాదించిన ఆ అల్లాహ్ క్రోధము నుండి మీరు భయపడండి.
(133) ఆయన మీకు పశువులను ప్రసాదించాడు,మీకు సంతానమును ప్రసాదించాడు.
(134) మీకు తోటలను,ప్రవహించే చెలమలను ప్రసాదించాడు.
(135) ఓ నా జాతి వారా నిశ్ఛయంగా నేను మీపై గొప్ప దినపు శిక్ష నుండి భయపడుతున్నాను. అది ప్రళయదినము.
(136) అతని జాతి వారు అతనితో ఇలా పలికారు : మాకు నీ హితబోధన చేయటం,చేయకపోవటం మా వద్ద సమానము. మేము నిన్ను విశ్వసించమంటే విశ్వసించము. మేము ఉన్న దాని నుండి మరలమంటే మరలము.
(137) ఇది మాత్రం పూర్వికుల ధర్మము,వారి అలవాట్లు,వారి గుణాలు.
(138) మేము శిక్షించబడము.
(139) అప్పుడు వారు తమ ప్రవక్త హూద్ అలైహిస్సలాంను తిరస్కరిస్తూనే ఉన్నారు. అప్పుడు మేము వారి తిరస్కారమునకు బదులుగా వంధ్య గాలితో వారిని వినాశనమునకు గురి చేశాము. నిశ్చయంగా ఈ వినాశనములో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలా మంది విశ్వసించటం లేదు.
(140) ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
(141) సమూద్ జాతి తమ ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాంను తిరస్కరించటం వలన ప్రవక్తలందరిని తిరస్కరించింది.
(142) వారితో వంశ పరంగా సోదరుడైన సాలిహ్ ఇలా పలికినప్పుడు : ఏమీ మీరు అల్లాహ్ భయంతో ఇతరుల ఆరాధనను విడనాడి ఆయనతో భయపడరా ?!.
(143) నిశ్చయంగా నేను ఒక ప్రవక్తను ,అల్లాహ్ నన్ను మీ వద్దకు ప్రవక్తగా పంపించాడు. నేను ఆయన వద్ద నుండి మీకు చేరవేస్తున్న వాటి విషయంలో నీతిమంతుడిని. దానిపై నేను అధికం చేయను,దానిలో నుండి తగ్గించను.
(144) అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
(145) మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది ఇతరులపై లేదు.
(146) ఏమీ మీరు ఉన్న సుఖబోగాల్లో,అనుగ్రహాల్లో నిశ్ఛింతగా మీరు భయపడకుండా వదలివేయబడుతారని ఆశిస్తున్నారా ?!.
(147) తోటలలో,ప్రవహించే చెలమలలో,
(148) మరియు పంట చేలలో, పండిపోయి మెత్తగా ఉన్న ఖర్జూరపు పండ్ల తోటలలో.
(149) మరియు మీరు నివసించటానికి ఇండ్లు నిర్మించటానికి పర్వతాలను చెక్కుతారు. మరియు మీరు వాటిని చెక్కటంలో నైపుణ్యవంతులు.
(150) అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
(151) మరియు మీరు పాపములకు పాల్పడి తమ స్వయం పై మితిమీరే వారి ఆజ్ఞను అనుసరించకండి.
(152) వారే ఎవరైతే పాప కార్యములను వ్యాపింపజేసి భూమిలో అల్లకల్లోలాలను రేకెత్తిస్తారో,అల్లాహ్ విధేయతను చేపట్టి స్వయం సంస్కరణ చేయరో.
(153) అతనితో అతని జాతివారు ఇలా పలికారు : నీవు మాత్రం పదే పదే మంత్రజాలమునకు వశపరచబడి చివరికి మంత్రజాలము వారి బుద్దులను వశపరచుకుని తీసుకుని వెళ్ళిపోయిన వారిలో వాడివి.
(154) నీవు మాత్రం మాలాంటి ఒక మనిషి మాత్రమే,నీవు ప్రవక్త అవటానికి నీకు మాపై ఎటువంటి వ్యత్యాసం లేదు. నీవు ప్రవక్త అని వాదించే విషయంలో ఒక వేళ సత్యమంతుడివే అయితే నీవు ప్రవక్త అవటంపై సూచించే ఒక సూచనను తీసుకుని రా.
(155) సాలిహ్ అలైహిస్సలాం - వాస్తవానికి అల్లాహ్ ఆయనకు ఒక సూచనను ప్రసాదించాడు. అది ఒక ఆడ ఒంటె. దాన్ని అల్లాహ్ రాతి బండ నుండి వెలికి తీశాడు - వారితో ఇలా పలికారు : ఇది చూడబడే,తాకబడే ఒక ఆడ ఒంటె.దాని కొరకు నీటిని త్రాగే ఒక వంతు మరియు మీ కొరకు ఒక వంతు నిర్ధారితమై ఉన్నది. మీ వంతు దినమున అది త్రాగదు మరియు దాని వంతు దినమున మీరు త్రాగరు.
(156) మరియు మీరు దాన్ని కోయటం ద్వారా గానీ లేదా కొట్టడం ద్వారా గానీ దానికి కీడు కలిగించే దానితో ముట్టుకోకండి. అప్పుడు దాని వలన మీపై ఆపద కురిసే గొప్ప దినములో అల్లాహ్ శిక్ష మిమ్మల్ని వినాశనమునకు గురి చేస్తుంది.
(157) వారందరు దాని వెనుక కాలి మోకాలి వద్ద నరమును కోసి చంపటానికి కలిసి కట్టుగా నిర్ణయించుకున్నారు. వారిలో పెద్ద దుష్టుడు దాన్ని కోసి చంపివేశాడు. ఎప్పుడైతే వారు తమపై ఖచ్చితంగా శిక్ష కురుస్తుందని తెలుసుకున్నారో వారు తాము ముందడుగు వేసిన దానిపై పశ్ఛాత్తాప్పడే వారిలో నుంచి అయిపోయారు. కానీ శిక్షను ప్రత్యక్ష్యంగా చూసినప్పుడు ప్రయోజనం ఉండదు.
(158) అయితే వారితో వాగ్దానం చేయబడిన భూకంపము,భయంకర శబ్దము ద్వారా వారిని శిక్ష కబళించింది. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన సాలిహ్,ఆయన జాతి వారి గాధలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. కానీ వారిలో చాలామంది విశ్వసించలేదు.
(159) ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
(160) లూత్ అలైహిస్సలాం జాతి వారు తమ ప్రవక్త లూత్ అలైహిస్సలాంను తిరస్కరించటం వలన ప్రవక్తలను తిరస్కరించారు.
(161) వారితో వారి సోదరుడు లూత్ ఇలా పలికినప్పుడు : ఏమీ మీరు అల్లాహ్ కు ఆయన భయంతో ఆయనతో పాటు షిర్కును చేయటంను విడనాడి భయపడరా ?!.
(162) నిశ్చయంగా నేను ఒక ప్రవక్తను ,అల్లాహ్ నన్ను మీ వద్దకు ప్రవక్తగా పంపించాడు. నేను ఆయన వద్ద నుండి మీకు చేరవేస్తున్న వాటి విషయంలో నీతిమంతుడిని దానిపై నేను అధికం చేయను,దానిలో నుండి తగ్గించను.
(163) అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
(164) మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది. ఇతరులపై లేదు.
(165) ఏమీ మీరు ప్రజల్లోంచి మగవారి వద్దకు (కామ కోరికలను తీర్చుకోవటానికి) వారి వెనుక భాగంలో వస్తున్నారా ?!.
(166) మరియు మీరు అల్లాహ్ మీరు మీ కామ కోరికలు తీర్చుకోవటానికి సృష్టించిన మీ భార్యల మర్మావయవాల వద్దకు రావటమును వదిలివేశారు. కానీ మీరు ఈ చెడు అపరిమితితో అల్లాహ్ హద్దులను మితిమీరిపోయారు.
(167) ఆయనతో ఆయన జాతివారు ఇలా పలికారు : ఓ లూత్ నీవు ఒక వేళ మమ్మల్ని ఈ చర్య నుండి ఆపటం నుండి, దాన్ని మాపై ఇష్టపడకపోవటం నుండి విడనాడకపోతే తప్పక నీవు,నీతోపాటు ఉన్న వారు మా ఊరి నుండి వెళ్ళగొట్టబడుతారు.
(168) లూత్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : నిశ్ఛయంగా మీ ఈ చర్యను అసహ్యించుకునే,ధ్వేషించుకునే వారిలో నేనూ ఉన్నాను.
(169) ఆయన తన ప్రభువుతో వేడుకుంటూ ఇలా పలికారు : ఓ నా ప్రభువా నీవు వీరందరికి వీరు చేసిన దుష్కర్మల వలన కలిగే శిక్ష నుండి నన్ను రక్షించు, నా ఇంటి వారిని రక్షించు.
(170) అప్పుడు మేము అతని దఆను స్వీకరించి అతన్నీ,అతని ఇంటి వారందరినీ రక్షించాము.
(171) ఆయన సతీమణి తప్ప. ఆమె అవిశ్వాసపరురాలు. ఆమె వెళ్ళిపోయె వారిలో,వినాశనం చెందేవారిలో నుండి అయిపోయింది.
(172) ఆ పిదప లూత్,ఆయన ఇంటి వారు ఊరి నుండి (సదూమ్) బయలదేరిన తరువాత మిగిలి ఉన్న ఆయన జాతి వారిని మేము తీవ్రంగా వినాశనమునకు గురి చేశాము.
(173) మరియు మేము వారిపై వర్షమును కురిపించేటట్లుగా ఆకాశము నుండి రాళ్ళను కరిపించాము. లూత్ అలైహిస్సలాం ఎవరినైతే అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించారో,వారిని భయ పెట్టారో ఒక వేళ వారు తాము ఉన్న దుష్కర్మలను పాల్పడటంలో కొనసాగితే వారందరిపై కురిసే వర్షం ఎంతో చెడ్డదైనది.
(174) నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన లూత్ అలైహిస్సలాం జాతి వారిపై ఆశ్లీల కార్యము వలన కురిసే శిక్షలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలామంది విశ్వసించటంలేదు.
(175) ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
(176) మద్యన్ కు దగ్గరలో ఉన్న దట్టమైన చెట్లు కల పట్టణం వారు తమ ప్రవక్త షుఐబ్ అలైహిస్సలాంను తిరస్కరించినప్పుడు ప్రవక్తలను తిరస్కరించారు.
(177) వారితో వారి ప్రవక్త ఇలా పలికినప్పుడు : ఏమీ మీరు అల్లాహ్ కు ఆయన భయంతో ఆయనతో పాటు షిర్కును చేయటమును విడనాడి భయపడరా ?!.
(178) నిశ్ఛయంగా నేను ఒక ప్రవక్తను ,అల్లాహ్ నన్ను మీ వద్దకు ప్రవక్తగా పంపించాడు. నేను ఆయన వద్ద నుండి మీకు చేరవేస్తున్న వాటి విషయంలో నీతిమంతుడిని,నాకు ఆయన దేనిని చేరవేయమని ఆదేశించాడో దానిపై నేను అధికం చేయను,తగ్గించను.
(179) అయితే మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు నేను మీకు ఆదేశించిన వాటి విషయంలో,మీకు వారించిన వాటి విషయంలో నాకు విధేయత చూపండి.
(180) మరియు నేను నా ప్రభువు తరపు నుండి మీకు చేరవేసిన దానిపై మీ నుండి ఎటువంటి ప్రతిఫలమును నేను కోరను. నా ప్రతిఫలము సృష్టితాల ప్రభువైన అల్లాహ్ పై మాత్రమే ఉన్నది. ఇతరులపై లేదు.
(181) మీరు ప్రజలకు అమ్మేటప్పుడు పూర్తిగా కొలవండి. ప్రజలకు అమ్మినప్పుడు కొలవటంలో తగ్గించే వారిలో మీరు కాకండి.
(182) ఇతరుల కొరకు తూకమేసేటప్పుడు సరైన తూకముతో తూకమేయండి.
(183) మరియు మీరు ప్రజల హక్కులను తగ్గించకండి. మరియు మీరు పాపకార్యములకు పాల్పడి భూమిలో ఉపద్రవాలను అధికం చేయకండి.
(184) ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో మరియు పూర్వ సమాజాలను సృష్టించాడో ఆయన మీపై తన శిక్షను అవతరింపజేస్తాడని ఆయనతో భయముతో భీతిని కలిగి ఉండండి.
(185) షుఐబ్ జాతి వారు షుఐబ్ తో ఇలా ఫలికారు : నీవు మాత్రం పదే పదే మంత్రజాలము సంభవించిన వారిలోంచి వాడివి చివరికి మంత్రజాలము నీ బుద్ధిని వశపరచుకుని దాన్ని పోగొట్టింది.
(186) మరియు నీవు మాత్రం మాలాంటి మనిషివి మాత్రమే నీకు మాపై ఎటువంటి వ్యత్యాసం లేదు. అటువంటప్పుడు నీవు ఎలా ప్రవక్తవవుతావు ?. నీవు ప్రవక్తవని వాదిస్తున్న విషయంలో నిన్ను అసత్యడువని మేము భావిస్తున్నాము.
(187) నీవు వాదిస్తున్న విషయంలో ఒక వేళ సత్యవంతుడివి అయితే ఆకాశము నుండి ఒక తునకను మాపై పడవేయి.
(188) షుఐబ్ వారితో ఇలా పలికారు : మీరు చేస్తున్న షిర్కు ,పాపకార్యాల గురించి మా ప్రభువుకు బాగా తెలుసు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు.
(189) అయితే వారు తమ తిరస్కారముపైనే కొనసాగారు. అప్పుడు వారికి పెద్ద శిక్ష తీవ్ర వేడి కల దినము తరువాత ఒక మేఘము వారిని నీడ నిచ్చేటట్లు చుట్టుకుంది. అప్పుడు అది వారిపై అగ్నిని కురిపించి వారిని కాల్చివేసింది. నిశ్ఛయంగా వారి వినాశనము యొక్క దినము పెద్ద భయంకర దినమైనది.
(190) నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన షుఐబ్ అలైహిస్సలాం జాతి వారి వినాశనంలో గుణపాఠం నేర్చుకునే వారి కొరకు గుణపాఠం ఉన్నది. మరియు వారిలో చాలామంది విశ్వసించటంలేదు.
(191) ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ఆయనే తన శతృవులతో ప్రతీకారం తీసుకునే ఆధిక్యుడు. మరియు వారిలో నుండి తౌబా చేసే వారిపై కరుణించేవాడును.
(192) మరియు నిశ్ఛయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడిన ఈ ఖుర్ఆన్ సృష్టి రాసుల ప్రభువు వద్ద నుండి అవతరింపబడినది.
(193) దీన్ని విశ్వసనీయుడైన జిబ్రయీల్ అలైహిస్సలాం తీసుకుని దిగారు.
(194) ఓ ప్రవక్తా అతడు దాన్ని తీసుకుని నీ హృదయంపై నీవు ప్రజలను అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించే, వారిని భయపెట్టే ప్రవక్తల్లోంచి అవటానికి దిగాడు.
(195) అతడు దాన్ని స్పష్టమైన అరబీ భాషలో తీసుకుని దిగాడు.
(196) మరియు నిశ్చయంగా ఈ ఖుర్ఆన్ పూర్వ గ్రంధాలలో ప్రస్తావించబడినది. నిశ్ఛయంగా పూర్వ దివ్య గ్రంధాలు దీని గురించి శుభవార్తను ఇచ్చినవి.
(197) ఏమీ అబ్దుల్లాహ్ బిన్ సలాం లాంటి ఇస్రాయీలు సంతతి వారి పండితులకు సయితం మీపై అవతరింపబడిన దాని వాస్తవికత తెలిసి ఉండటం మీ నిజాయితీపై ఒక సూచనగా మిమ్మల్ని తిరస్కరించే వీరందరికి సరిపోదా ?.
(198) మరియు ఒక వేళ మేము ఈ ఖుర్ఆన్ ను అరబీ మట్లాడలేని అరబ్బేతరుల్లోంచి కొందరిపై అవతరింపజేసి ఉంటే.
(199) అప్పుడు అతను దాన్ని వారికి చదివి వినిపించినా వారు దాన్ని విస్వసించేవారు కాదు; ఎందుకంటే వారు మాకు అది అర్ధం కాలేదు అంటారు. కావున వారు అది వారి భాషలో అవతరింపబడినది కాబట్టి అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
(200) ఈ విధంగా మేము తిరస్కారమును,అవిశ్వాసమును అపరాధుల హృదయాలలో ప్రవేశింపజేశాము.
(201) వారు బాధాకరమైన శిక్షను చూడనంత వరకు తాము ఉన్న అవిశ్వాసము నుండి మారరు,విశ్వసించరు.
(202) అప్పుడు ఈ శిక్ష వారి వద్దకు అకస్మాత్తుగా వచ్చిపడుతుంది. వారి వద్దకు అది అకస్మాత్తుగా వచ్చేంతవరకు దాని రావటమును వారు గుర్తించరు.
(203) వారిపై శిక్ష అకస్మాత్తుగా అవతరించినప్పుడు వారు తీవ్ర బాధతో ఇలా పలుకుతారు : మేము అల్లాహ్ యందు పశ్ఛాత్తాప్పడటానికి మాకు గడువు ఇవ్వబడుతుందా ?!.
(204) ఏమి ఈ తిరస్కారులందరు మా శిక్ష గురించి ఇలా పలుకుతూ తొందర చేస్తున్నారా : నీవు మాపై వాదించినట్లు ఆకాశము ఏదైన తునకమును పడవేసేనంత వరకు మేము నిన్ను విశ్వసించమంటే విశ్వసించము ?!
(205) ఓ ప్రవక్తా మీరు నాకు తెలపండి ఒక వేళ మేము మీరు తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించటము నుండి విముఖత చూపే ఈ అవిశ్వాసపరులందరికి కొంత కాలము అనుగ్రహాల ద్వారా ప్రయోజనం చేకూర్చినా.
(206) ఆ తరువాత వారు ఈ అనుగ్రహాలను పొందిన కాలం తరువాత వారితో వాగ్దానం చేయబడిన శిక్ష వారి వద్దకు వచ్చినది.
(207) ఇహ లోకంలో వారికి ఉన్నఅనుగ్రహాలు వారికి ఏమి ప్రయోజనం కలిగించగలవు ?!. నిశ్ఛయంగా ఈ అనుగ్రహాలన్నీఅంతమైపోయాయి. మరియు అవి ఏవి లాభం కలిగించవు.
(208) సమాజాల్లోంచి ఏ సమాజమును కూడా వారి వద్దకు ప్రవక్తలను పంపించి,గ్రంధాలను అవతరింపజేసి సాకులు లేకుండా చేసిన తరువాతే మేము నాశనం చేశాము.
(209) వారికి ఉపదేశముగా,హితోపదేశముగా. మరియు ప్రవక్తలను పంపించి,గ్రంధములను అవతరింపజేసి వారి వద్ద సాకులు లేకుండా చేసిన తరువాత వారిని శిక్షించటం వలన మేము అన్యాయము చేసిన వారము కాము.
(210) ఈ ఖుర్ఆన్ ను తీసుకుని షైతానులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హృదయంపై దిగలేదు.
(211) వారు ఆయన హృదయంపై దిగటం సరి కాదు. మరియు వారికి దాని శక్తి లేదు.
(212) వారికి దాని శక్తి లేదు ఎందుకంటే వారు ఆకాశము నుండి దూరపు స్థలంలో తొలగించబడ్డారు. అప్పుడు వారు దాని వద్దకు ఎలా చేర గలరు. మరియు దాన్ని తీసుకుని ఎలా దిగ గలరు ?!.
(213) అయితే మీరు అల్లాహ్ తో పాటు వేరే ఆరాధ్య దైవమును ఆయనతో పాటు మీరు సాటి కల్పిస్తూ ఆరాధించకండి. అప్పుడు మీరు దాని కారణం వలన శిక్షింపబడే వారిలో అయిపోతారు.
(214) ఓ ప్రవక్తా మీరు మీ జాతి వారిలోంచి దగ్గర బంధువులను ఒక వేళ వారు షిర్కు పై ఉంటే వారికి అల్లాహ్ శిక్ష కలగనంత వరకు హెచ్చరిస్తూ ఉండండి.
(215) మరియు విశ్వాసపరులోంచి నిన్ను అనుసరించిన వారి కొరకు నీ రెక్కలను కర్మ పరంగా,మాట పరంగా వారిపై కనికరిస్తూ,దయను చూపుతూ మృధు వైఖరిని కలిగి ఉండు.
(216) ఒక వేళ వారు నీపై అవిధేయత చూపి,నీవు వారికి ఆదేశించిన అల్లాహ్ ఏకత్వమును,ఆయన విధేయతను స్వీకరించకపోతే, మీరు వారితో ఇలా పలకండి : మీరు చేస్తున్న షిర్కు,పాప కార్యాల నుండి నేను అతీతుడను.
(217) మరియు నీవు నీ వ్యవహారాలన్నింటిలో తన శతృవులతో ప్రతీకారం తీసుకునే సర్వ శక్తిమంతుడి పై,వారిలోంచి అతని వైపు మరలే వారిపై కరుణించేవాడిపై నమ్మకమును కలిగి ఉండు.
(218) పరిశుద్ధుడైన ఆయనే నీవు నమాజు కొరకు నిలబడినప్పుడు చూస్తున్నాడు.
(219) మరియు పరిశుద్ధుడైన ఆయన నమాజ్ చదివే వారిలో ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి మీ మారటమును చూస్తున్నాడు. మీరు నెలకొల్పిన (నమాజులను) వాటిలోంచి,ఇతరులు నెలకొల్పిన వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
(220) నిశ్ఛయంగా ఆయనే మీరు పఠించిన ఖుర్ఆన్ ను,మీ నమాజులో స్మరణను వినే వాడును,మీ ఉద్దేశమును తెలిసినవాడును.
(221) ఈ ఖుర్ఆన్ ను తీసుకుని షైతానులు దిగుతారని మీరు వాదించారో వారు ఎవరిపై దిగుతారో మీకు నేను తెలియపరచనా ?.
(222) షైతానులు జ్యోతిష్యుల్లోంచి అధికంగా పాపాలకు,అవిధేయ కార్యాలకు పాల్పడే ప్రతీ అసత్యపరునిపై దిగుతారు.
(223) షైతానులు పై లోకాల్లో ఉన్న దూతల (మలయే ఆలా) నుండి విన్న వాటిని ఎత్తుకుని వచ్చి జ్యోతిష్యుల్లోంచి తమ స్నేహితులకు చేరవేసేవారు. చాలామంది జ్యోతిష్యులు అసత్యపరులై ఉంటారు. ఒక వేళ వారు ఒక మాట నిజం పలికినా దానితో పాటు వంద మాటలు అబద్దాలు పలుకుతారు.
(224) ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కవుల్లోంచి అని మీరు వాదిస్తున్నారో వారిని సన్మార్గము నుండి,ఋజు మార్గము నుండి తప్పిపోయిన వారే అనుసరిస్తారు. వారు ఏ కవిత్వాలను పలుకుతారో వాటినే వారు చదువుతారు.
(225) ఓ ప్రవక్తా మీరు చూడలేదా - వారి అపమార్గపు దృశ్యాల్లోంచి వారు ప్రతీ లోయలో ఒకోసారి పొగుడుతూ తచ్చాడితే ఒకోసారి దూషిస్తూ తచ్చాడితే,ఒకో సారి వేరే వాటిలో తచ్చాడతున్నారు.
(226) మరియు వారు అబద్దం పలుకుతున్నారని, మేము ఇలా చేశాము అని అంటారు. కాని వార అలా చేయలేదు.
(227) కవుల్లోంచి ఎవరైతే విశ్వసించారో, సత్కార్యాలు చేశారో, అధికంగా అల్లాహ్ స్మరణ చేశారో, అల్లాహ్ శతృవులు వారిపై అన్యాయమునకు పాల్పడిన తరువాత వారిపై గెలుస్తారో వారు కాదు. ఉదాహరణకు హస్సాన్ బిన్ సాబిత్ రజిఅల్లాహు అన్హు. మరియు అల్లాహ్ తో పాటు సాటి కల్పించి,ఆయన దాసులపై హింసకు పాల్పడిన వారు ఎవరి వైపు మరల వలసినదో తొందలోనే మరలి వెళుతారు. వారు గొప్ప స్థానము,ఖచ్చితమైన గణన వైపునకు మరలుతారు.