(1) (الٓـمٓ) అలిఫ్-లామ్-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
(2) ఓ ప్రవక్తా మీపై అవతరింపబడిన ఈ ఆయతులు విజ్ఞతతో మాట్లాడే గ్రంధ ఆయతులు.
(3) మరియు అది తమ ప్రభువు హక్కులను,ఆయన దాసుల హక్కులను నెరవేర్చటంతో సత్కార్యము చేసే వారి కొరకు మార్గదర్శకత్వము,కారుణ్యము.
(4) వారు నమాజును పరిపూర్ణ పద్దతిలో పాటిస్తారు మరియు వారు తమ సంపదల జకాత్ విధి దానమును చెల్లిస్తారు. మరియు వారు అంతిమ దినములో ఉన్న మరణాంతరం లేపబడటం,లెక్క తీసుకోబడటం,ప్రతిఫలం ప్రసాదించబడటం,శిక్షింపబడటం పై విశ్వాసమును కనబరుస్తారు.
(5) ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరు తమ ప్రభువు వద్ద నుండి సన్మార్గంపై ఉన్నారు. మరియు వారందరే తాము ఆశించిన వాటిని పొంది,తాము భయపడే వాటి నుండి దూరంగా ఉండటంతో సాఫల్యం చెందుతారు.
(6) మరియు ప్రజల్లోంచి నజర్ బిన్ హారిస్ లాంటి వారు పరధ్యానంలో పడవేసే మాటలను ఎంచుకుని ప్రజలను ఎటువంటి జ్ఞానం లేకుండా అల్లాహ్ ధర్మం నుండి వాటి వైపు మరలిస్తారు. మరియు అల్లాహ్ ఆయతులను ఎగతాళిగా చేసుకుని వాటి నుండి పరిహాసమాడేవారు. ఈ గుణాలతో వర్ణించబడిన వీరందరికి పరలోకంలో అవమానమును కలిగించే శిక్ష ఉన్నది.
(7) మరియు అతనిపై మా ఆయతులు చదివి వినిపించినప్పుడు అతడు వాటిని వినటం నుండి అహంకారమును చూపుతూ వాటిని విననట్లుగా, శబ్దములను వినటం నుండి అతని రెండు చెవులలో చెవుడు ఉన్నట్లుగా మరలిపోతాడు. ఓ ప్రవక్తా మీరు అతనికి అతని గురించి నిరీక్షించే బాధాకరమైన శిక్ష గురించి శుభవార్తనివ్వండి.
(8) నిశ్చయంగా అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యములు చేసే వారి కొరకు అనుగ్రహభరితమైన స్వర్గ వనాలు కలవు. అల్లాహ్ వారి కోసం సిద్ధం చేసి ఉంచిన వాటిని అనుభవిస్తారు.
(9) వారు వాటిలో శాశ్వతంగా ఉంటారు. దీని గురించి అల్లాహ్ వారితో ఎటువంటి సందేహం లేని సత్య వాగ్దానము చేశాడు. మరియు పరిశుద్ధుడైన ఆయన తనని ఎవరూ ఓడించని సర్వ శక్తిమంతుడు మరియు తన సృష్టించటంలో,తన విధి వ్రాతలో,తన ధర్మ శాసనములలో వివేకనంతుడు.
(10) పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ ఆకాశములను ఎత్తుగా ఎటువంటి స్థంభములు లేకుండా సృష్టించాడు. మరియు భూమిలో అది మిమ్మల్ని తీసుకుని ప్రకంపించకుండా ఉండేందుకు పర్వతములను పాతాడు. మరియు భూమిపై రకరకాల జంతువులను విస్తరింపజేశాడు. మరియు మేము ఆకాశము నుండి వర్షపు నీటిని అవతరింపజేశాము. అప్పుడు మేము భూమిలో ఆనందభరితమైన దృశ్యము కల అన్ని రకముల వాటిని మొలకెత్తించాము. దానితో ప్రజలు,పశువులు ప్రయోజనం చెందుతారు.
(11) ఈ ప్రస్తావించబడినవి అల్లాహ్ సృష్టితాలు. ఓ ముష్రికులారా అల్లాహ్ ను వదిలి మీరు ఆరాధించేవి ఏమి సృష్టించాయో నాకు చూపించండి ?!. కాని దుర్మార్గులు సత్యము నుండి స్పష్టమైన మార్గ భ్రష్టతలో ఉన్నారు. ఏవిధంగానంటే వారు తమ ప్రభువుతో పాటు ఏమీ సృష్టించని వారిని సాటి కల్పిస్తున్నారు. మరియు వారే సృష్టించబడినవారు.
(12) మరియు నిశ్చయంగా మేము లుఖ్మాన్ కు ధర్మ విషయంలో అవగాహన,వ్యవహారాల విషయంలో ఖచ్చితత్వమును ప్రసాదించాము. మరియు అతనితో మేము ఇలా పలికాము : ఓ లుఖ్మాన్ నీవు నీ ప్రభువునకు తన విధేయత కొరకు నీకు ఆయన అనుగ్రహించిన భాగ్యముపై కృతజ్ఞత తెలుపుకో. మరియు ఎవరైతే తన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుకుంటాడో అతని కృతజ్ఞత తేలుపుకోవటం యొక్క ప్రయోజనం అతనిపైనే మరలుతుంది. కాని అల్లాహ్ అతని కృతజ్ఞత తెలుపుకోవటం నుండి అక్కర లేని వాడు. మరియు ఎవరైతే తనపై ఉన్న అల్లాహ్ అనుగ్రహమును తిరస్కరించి దాని పట్ల కృతఘ్నుడైపోతాడో ఆయన పరిశుద్ధుడు. అతని కృతఘ్నత యొక్క నష్టము మాత్రం అతనిపైనే ఉంటుంది. మరియు అతడు అల్లాహ్ కు ఎటువంటి నష్టం కలిగించలేడు. ఎందుకంటే ఆయన తన సృష్టితాలన్నింటి నుండి అక్కర లేని వాడు. ప్రతీ స్థితిలో స్థుతింపబడినవాడు.
(13) ఓ ప్రవక్తా మీరు లుఖ్మాన్ తన కొడుకును మంచి విషయంలో ప్రోత్సహిస్తూ మరియు అతన్ని చెడు నుండి హెచ్చరిస్తూ ఇలా పలికినప్పటి వైనమును గుర్తు చేసుకోండి : ఓ నా ప్రియ కుమారుడా నీవు అల్లాహ్ తో పాటు ఇతరులను ఆరాధించకు. నిశ్చయంగా అల్లాహ్ తో పాటు ఏ ఆరాధ్య దైవమునకు ఆరాధన చేయటం అనేది మనిషిని నరకాగ్నిలో శాశ్వతంగా ఉండటానికి దారి తీసే పెద్ద పాపమునకు పాల్పడటం ద్వారా మనిషి కొరకు పెద్ద అన్యాయము.
(14) మరియు మేము మానవునికి తన తల్లిదండ్రులకి విధేయత చూపమని మరియు అల్లాహ్ కొరకు అవిధేయత లేని విషయములలో వారి పట్ల ఉత్తమంగా మెలగమని తాకీదు చేశాము. అతని తల్లి అతన్ని తన గర్భములో బాధ తరువాత బాధను పొందుతూ మోసింది. మరియు అతనికి పాలు త్రాపించటమును ఆపటమనేది రెండు సంవత్సరముల కాలములో. మరియు మేము అతనితో ఇలా పలికాము : నీవు అల్లాహ్ కొరకు ఆయన నీపై అనుగ్రహించిన అనుగ్రహాలపై కృతజ్ఞత తెలుపుకో. ఆ తరువాత నీవు నీ తల్లిదండ్రులకు వారు నీ పెంపకము,నీ సంరక్షణ పట్ల స్థిరంగా ఉన్న దానికి కృతజ్ఞత తెలుపుకో. నా ఒక్కడి వైపే మరలటం జరుగుతుంది. అప్పుడు నేను ప్రతి ఒక్కరికి అతను అర్హత కలిగిన దాన్ని ప్రతిఫలమును ప్రసాదిస్తాను.
(15) ఒక వేళ తల్లిదండ్రులు తమ తరపు నుండి నిర్ణయించుకుని నీవు అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పించటంపై నిన్ను ప్రేరేపించటానికి ప్రయత్నం చేస్తే ఆ విషయంలో నీవు వారి మాట వినకు. ఎందుకంటే సృష్టికర్త అవిధేయతలో ఎటువంటి సృష్టికి విధేయత చూపటం సరికాదు. మరియు నీవు ఇహలోకములో మంచితనముతో,బంధుత్వముతో,ఉపకారముతో వారికి తోడుగా ఉండు. మరియు నీవు నా వైపునకు ఏకత్వముతో,విధేయతతో మరలే వారి మార్గమును అనుసరించు. ఆ తరువాత ప్రళయదినాన నా ఒక్కడి వైపునకే మీ అందరి మరలటం ఉంటుంది. అప్పుడు నేను మీరు ఇహలోకంలో చేసే కర్మల గురించి మీకు తెలియపరుస్తాను. మరియు వాటి పరంగా మీకు నేను ప్రతిఫలమును ప్రసాదిస్తాను.
(16) ఓ నా ప్రియ కుమారా నిశ్చయంగా దుష్కర్మ లేదా సత్కర్మ ఒక వేళ అది ఒక ఆవ గింజ బరువంత చిన్నదిగా ఉండి,ఏదైన ఒక పెద్ద రాతి బండ లోపల ఉండి దాన్ని ఎవరు తెలుసుకోకపోయినా లేదా అది ఆకాశముల్లో గాని భూమిలో గానీ ఏ ప్రదేశములో ఉన్నా నిశ్చయంగా అల్లాహ్ దాన్ని ప్రళయదినమున తీసుకుని వస్తాడు. దాని పరంగా ఆయన దాసుడికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సూక్ష్మగ్రాహి సున్నితమైన వస్తువులు ఆయనపై గోప్యంగా ఉండవు. ఆయన వాటి వాస్తవికతలను,వాటి స్థానాలను తెలుసుకునేవాడు.
(17) ఓ నా ప్రియ కుమారా నీవు నమాజును దాని పరిపూర్ణ పద్దతిలో పాటించి నెలకొల్పు,మంచి గురించి ఆదేశించు,చెడు గురించి వారించు. ఆ విషయంలో నీకు కలిగే బాదపై సహనం చూపు. వాటిలో నుండి నీకు ఏవైతే ఆజ్ఞాపించబడినవో అవి నీవు చేయాలని అల్లాహ్ నీపై గట్టిగా తెలిపినవి. అందులో నీకు ఎటువంటి ఎంపిక లేదు.
(18) మరియు నీవు నీ ముఖమును అహంకారముతో ప్రజల నుండి త్రిప్పకు మరియు నీవు భూమిపై నీ స్వయమును ఇష్టపడుతూ నవ్వుతూ నడవకు. నిశ్చయంగా అల్లాహ్ తన నడకలో గర్వించే,తనకు ప్రసాదించబడిన అనుగ్రహాల పట్ల గర్వించి ప్రజల ముందు వాటిపై అహంను ప్రదర్శించి,అల్లాహ్ కు వాటిపై కృతజ్ఞత తెలుపని ప్రతి ఒక్కడినీ ఇష్టపడడు.
(19) మరియు నీవు నీ నడకలో వేగమునకు,నిదానమునకు మధ్యలో ఉండి హొందాతనము బహిర్గతమయ్యే మధ్య మార్గమును పాటించు. మరియు నీ స్వరమును తగ్గించు, బాధ పెట్టేంత బిగ్గరగా దానిని చేయకు. నిశ్చయంగా స్వరాలలో అతి చెడ్డ స్వరము గాడిద స్వరము బిగ్గరగా ఉండటం వలన.
(20) ఓ ప్రజలారా మీరు చూడలేదా,గమనించలేదా అల్లాహ్ ఆకాశములలో ఉన్న సూర్యుడిని,చంద్రుడిని,నక్షత్రాలను ప్రయోజనం పొందటమునకు మీ కొరకు అందుబాటులో ఉంచాడు. మరియు భూమిపై ఉన్న జంతువులను,వృక్షాలను,మొక్కలను కూడా మీకు అందుబాటులో ఉంచాడు. మరియు ఆయన ప్రత్యక్షంగా కనబడే రూప అందము, మంచి శరీరాకృతి లాంటి మరియు లోపల దాగి ఉన్న బుద్ధి,జ్ఞానము లాంటి తన అనుగ్రహాలను మీపై పరిపూర్ణం చేశాడు. ఈ అనుగ్రహాలు ఉండి కూడా ప్రజల్లోంచి కొంతమంది అల్లాహ్ వద్ద నుండి దివ్య జ్ఞానముతో ఎటువంటి పత్రిక జ్ఞానం లేకుండా లేదా కాంతివంతమైన బుద్ధి, అల్లాహ్ వద్ద నుండి అవతరింపబడిన ఎటువంటి స్పష్టమైన గ్రంధం లేకుండా అల్లాహ్ ఏకత్వము విషయంలో వాదులాడుతున్నారు.
(21) మరియు అల్లాహ్ తౌహీద్ విషయంలో వాదులాడే వీరందరితో "మీరు అల్లాహ్ తన ప్రవక్తపై అవతరింపజేసిన దైవ వాణిని అనుసరించండి" అని పలికినప్పుడు వారు ఇలా సమాధానమిచ్చేవారు : మేము దాన్ని అనుసరించము కాని మేము మా పూర్వికులను మా ఆరాధ్య దైవాల ఆరాధనల్లోంచి దేనిపై మేము పొందామో దాన్ని అనుసరిస్తాము. ఏమీ ఒక వేళ షైతాను వారి పూర్వికులను వారిని అపమార్గమునకు లోను చేసే విగ్రహారాాధన ద్వారా ప్రళయదినమున అగ్ని శిక్ష వైపునకు పిలిచినా వారు వారిని అనుసరిస్తారా ?!.
(22) మరియు ఎవరైతే అల్లాహ్ వైపునకు తన ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకిస్తూ,తన ఆచరణను మంచిగా చేస్తూ ముందుకు పోతాడో అతడు ముక్తిని ఆశించే వాడు, సంబంధంపెట్టుకునే దృఢమైన దాన్ని పట్టుకున్నాడు ఏ విధంగానంటే తాను పట్టుకున్నది తెగిపోతుందన్నభయం అతనికి ఉండదు. మరియు అల్లాహ్ ఒక్కడి వైపే వ్యవహారలన్నింటి పరిణామము,వాటి మరలటం ఉంటుంది. ఆయన ప్రతి ఒక్కడికి దేనికి అతడు హక్కు దారుడో దాన్ని ప్రసాదిస్తాడు.
(23) మరియు ఎవరైతే అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరుస్తాడో ఓ ప్రవక్తా అతని అవిశ్వాసం మిమ్మల్ని దుఃఖానికి గురి చేయకూడదు. మా ఒక్కరి వైపే ప్రళయదినాన వారి మరలటం జరుగును. అప్పుడు మేము వారు ఇహలోకంలో చేసిన దుష్కర్మల గురించి వారికి తెలియపరుస్తాము. మరియు వాటి పరంగా వారికి మేము ప్రతిఫలమును ప్రసాదిస్తాము. నిశ్ఛయంగా అల్లాహ్ హృదయములలో ఉన్న వాటిని బాగా తెలిసినవాడు. వాటిలో ఉన్నవి ఏవీ ఆయనపై గోప్యంగా ఉండవు.
(24) మరియు మేము ఇహలోకంలో వారికి ప్రసాదించిన సుఖాలను కొంత కాలం వరకు వారిని అనుభవించనిస్తాము. ఆ తరువాత మేము వారిని ప్రళయదినమున తీవ్ర శిక్ష వైపునకు మళ్ళిస్తాము. అది నరక శిక్ష.
(25) ఓ ప్రవక్తా ఒక వేళ మీరు ఈ ముష్రికులందరితో ఆకాశములను సృష్టించినదెవరు,భూమిని సృష్టించినదెవరు ? అని అడిగితే వారు తప్పకుండ వాటిని సృష్టించినది అల్లాహ్ అని సమాధానమిస్తారు. మీరు వారితో ఇలా అనండి : స్థుతులన్ని మీపై వాదనను బహిర్గతం చేసిన అల్లాహ్ కే చెందుతాయి. అంతే కాదు వారిలో చాలా మంది తమ అజ్ఞానం వలన స్థుతులకు హక్కుదారుడెవరో తెలుసుకోలేకపోతున్నారు.
(26) ఆకాశముల్లో ఉన్నవన్నీ,భూమిపై ఉన్నవన్నీ సృష్టి పరంగా,అధికారము పరంగా,కార్యనిర్వహణ పరంగా అల్లాహ్ ఒక్కడికే చెందుతాయి. నిశ్చయంగా అల్లాహ్ తన సృష్టితాలన్నింటి నుండి అక్కర లేని వాడు. ఇహపర లోకాల్లో స్థుతింపబడేవాడు.
(27) మరియు ఒక వేళ భూమిలో ఉన్న వృక్షములన్నింటిని నరికివేసి కలములుగా తయారు చేసి మరియు సముద్రమును వాటిని సిరాగా చేసి,ఒక వేళ దాన్ని ఏడు సముద్రములుగా విస్తరింపజేసిన అల్లాహ్ మాటలు వాటి ముగింపు లేకపోవటం వలన అంతం కావు. నిశ్చయంగా అల్లాహ్ అతన్ని ఎవరూ ఓడించని సర్వాధిక్యుడు. అతడు తన సృష్టించటంలో,తన వ్యవహారములను నడిపించటంలో వివేకవంతుడు.
(28) ఓ ప్రజలారా ప్రళయదినాన లెక్క తీసుకోవటం కొరకు, ప్రతిఫలం ప్రసాదించటం కొరకు మిమ్మల్ని సృష్టించటం,మిమ్మల్ని మరల లేపటం ఒక ప్రాణమును సృష్టించటం మాదిరి మాత్రమే. మరియు దాన్ని మరల లేపటం సులభము. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు ఒక శబ్ధమును వినటం ఇంకో శబ్ధమును వినటం నుండి ఆయనకు పరధ్యానంలో ఉంచదు. ఆయన సర్వం చూసే వాడు ఒక వస్తువును చూడటం ఇంకో వస్తువుని చూడటం నుండి ఆయనను పరధ్యానంలో ఉంచదు. మరియు ఇదేవిధంగా ఒక ప్రాణమును సృష్టించటం లేదా దాన్ని మరల లేపటం ఇంకొక ప్రాణమును సృష్టించటం,దాన్ని మరల లేపటం నుండి ఆయనను పరధ్యానంలో ఉంచదు.
(29) ఏమీ మీరు చూడలేదా అల్లాహ్ పగలును అధికం చేయటానికి రాత్రిని తగ్గిస్తున్నాడని మరియు రాత్రిని అధికం చేయటానికి పగలును తగ్గిస్తున్నాడని. మరియు ఆయన సూర్య,చంద్రుల పయన మార్గమును నిర్దేశించాడు అప్పుడే వాటిలోని ప్రతి ఒక్కటి ఒక నిర్ణీత కాలం వరకు తన కక్ష్యలో పయనిస్తున్నవి. మరియు అల్లాహ్ మీరు చేస్తున్న కర్మల గురించి తెలిసినవాడని (మీకు తెలియదా). మీ కర్మలలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు. మరియు తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(30) ఈ కార్య నిర్వహణ,విధి వ్రాత రెండూ అల్లాహ్ ఒక్కడే సత్యమని, ఆయన తన ఉనికిలో,తన గుణాలలో,తన కార్యాలలో సత్యమని, ముష్రికులు ఆయనను వదిలి ఆరాధిస్తున్నది నిరాధారమైన అసత్యమని, అల్లాహ్ ఆయనే తన ఉనికిలో,తన ఆధిక్యతలో,తన విధి వ్రాతలో తన సృష్టితాలన్నింటిపై ఉన్నతుడని, ఆయనకన్న ఉన్నతుడు లేడని,ఆయనే అన్నింటికన్న గొప్పవాడని సాక్ష్యం పలుకుతున్నవి.
(31) ఏమీ మీరు చూడటం లేదా ఓడలు తన దయతో, తన ఆదీనంలో చేయటంతో ఓ ప్రజలారా పరిశుద్ధుడైన ఆయన మీకు తన సామర్ధ్యం,తన దయపై సూచించే తన సూచనలను చూపించటానికి సముద్రంలో పరిగెడుతున్నవి. నిశ్చయంగా వీటిలో తనకు ఆపద కలిగినప్పుడు ప్రతీ సహనం చూపే వాడి కొరకు మరియు తనకు అనుగ్రహాలు కలిగినప్పుడు కృతజ్ఞతలు తెలుపుకునే వాడి కొరకు ఆయన సామర్ధ్యంపై సూచించే సూచనలు కలవు.
(32) మరియు వారికి అన్నివైపుల నుండి ఒక అల పర్వతముల వలె,మేఘమువలె చుట్టుముట్టినప్పుడు వారు అల్లాహ్ ఒక్కడినే ఆయన కొరకు దుఆను,ఆరాధనను ప్రత్యేకిస్తూ వేడుకుంటారు. మరియు ఎప్పుడైతే అల్లాహ్ వారి కొరకు దుఆను స్వీకరించి,వారిని ఒడ్డుకు చేర్చి రక్షించి,వారిని మునగటం నుండి భద్రపరుస్తాడో వారిలో నుండి కొందరు (విశ్వాసానికి-అవిశ్వాసానికి ) మధ్యలో ఉండిపోయేవారు తమపై విధిగావించబడిన కృతజ్ఞతను పరిపూర్ణ రూపంలో నెలకొల్పరు. మరియు వారిలో నుండి కొందరు అల్లాహ్ అనుగ్రహమును తిరస్కరిస్తారు. మరియు మన ఆయతులను ప్రతీ ద్రోహి - అతడు ఈ వ్యక్తి లాంటి వాడు ఎవడైతే తనను రక్షిస్తే కృతజ్ఞత తెలుపుకునే వారిలోంచి అయిపోతానని ప్రమాణం చేశాడో - తనపై అనుగ్రహాలను ప్రసాదించిన తన ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపని ,అల్లాహ్ అనుగ్రహాలపట్ల కృతఘ్నుడై ఉండేవాడు మాత్రమే తిరస్కరిస్తాడు.
(33) ఓ ప్రజలారా మీరు మీ ప్రభవుపట్ల ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భీతిని కలిగి ఉండండి. మరియు మీరు ఆరోజు శిక్ష నుండి భయపడండి అందులో ఏ తండ్రి తన ఏ సంతానమునకు కొంచెముకూడా పనికి రాడు. మరియు ఏ సంతానము తన తండ్రికి కొంచెము కూడా పనికి రాడు. నిశ్చయంగా ప్రళయదినమున ప్రతిఫలమును ప్రసాదించే అల్లాహ్ వాగ్దానము నిరూపితమవుతుంది,ఖచ్చితముగా నెరవేరుతుంది. ఇహలోక జీవితము దానిలో ఉన్న కోరికలు,పరధ్యానంలో చేసే వస్తువులు మిమ్మల్ని మోసం చేయకూడదు సుమా. మరియు షైతాను నిన్ను మోసగించకూడదు మీపై అల్లాహ్ యొక్క క్షమాపణ,కోపముపై అదిగమించటం వలన,మీ నుండి శిక్షను ఆయన ఆలస్యం చేయటం వలన.
(34) నిశ్చయంగా అల్లాహ్ ఆయన ఒక్కడి వద్దే ప్రళయదినము గురించి జ్ఞానము కలదు. కాబట్టి అది ఎప్పుడు వాటిల్లుతుందో ఆయనకు తెలుసు.ఆయన తలచుకున్నప్పుడు వర్షమును కురిపిస్తాడు. మరియు మాతృ గర్భములో ఉన్నది మగ శిసువా లేదా ఆడ శిసువా ?,దుష్టుడా,పుణ్యాత్ముడా ? అన్నది ఆయనకు తెలుసు. మరియు ఏ ప్రాణికీ తాను రేపటి దినమున సంపాదించేది మేలైనదా లేదా చెడుదైనదా తెలియదు. మరియు ఏ ప్రాణికీ తాను ఏ ప్రాంతములో మరణిస్తాడో తెలియదు. కానీ ఇవన్నీ అల్లాహ్ కు తెలుసు. నిశ్చయంగా అల్లాహ్ వీటన్నింటిగురించి బాగా తెలిసిన వాడు,ఎరుగువాడు. వీటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.