32 - As-Sajda ()

|

(1) (الٓـمٓ) అలిఫ్-లామ్-మీమ్.సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.

(2) ఈ ఖుర్ఆన్ ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చారో అది సర్వలోకాల ప్రభువు వద్ద నుండి ఆయనపై అవతరింపబడింది ఇందులో ఏమాత్రం సందేహం లేదు.

(3) నిశ్చయంగా ఈ అవిశ్వాసపరులందరు ఇలా పలుకుతున్నారు : నిశ్చయంగా ముహమ్మద్ దాన్ని తన ప్రభువుపై కల్పించుకున్నాడు. వారు తెలిపినట్లు విషయం కాదు. కానీ అది ఎటువంటి సందేహం లేని సత్యము. ఓ ప్రవక్త అది నీ ప్రభువు వద్ద నుండి నీపై అవతరింపబడినది మీకన్న పూర్వం అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టటానికి ఏ ప్రవక్త రాని ప్రజలకు మీరు భయపెట్టటానికి. బహుశా వారు సత్యం వైపునకు మర్గమును పొంది దానిని అనుసరించి దాని ప్రకారం ఆచరిస్తారని.

(4) అల్లాహ్ ఆయనే ఆకాశములను,భూమిని,ఆ రెండిటి మధ్యలో ఉన్న వాటన్నింటిని ఆరు దినములలో సృష్టించాడు. మరియు ఆయన కను రెప్ప వాల్చే కన్న తక్కువ సమయంలో వాటిని సృష్టించే సామర్ధ్యం కలవాడు. ఆ పిదప ఆయన తన ఔన్నత్యానికి తగిన విధంగా సింహాసనమునకు ఎక్కి అధీష్టించాడు. ఓ ప్రజలారా మీ కొరకు ఆయన కాకుండా మీ వ్వవహారాలను రక్షించే పరిరక్షకుడెవడూ లేడు లేదా మీ కొరకు మీ ప్రభువు వద్ద సిఫారసు చేసేవాడెవడూ లేడు. ఏమీ మీరు యోచన చేయరా ?. మరియు మిమ్మల్ని సృష్టించినటువంటి అల్లాహ్ ను ఆరాధించండి మరియు ఆయనతోపాటు ఇతరులను ఆరాధించకండి.

(5) పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ నే ఆకాశముల్లో,భూమిలో ఉన్న సృష్టి రాసులన్నింటి వ్యవహారమును నడిపిస్తున్న వాడు. ఆ తరువాత ఆ వ్యవహారము ఆయన వైపునకు ఒక దినములో పైకెక్కి చేరుతుంది. దాని పరిమాణం ఓ ప్రజలారా మీరు ఇహలోకములో లెక్క వేసే వేయి సంవత్సరాలు.

(6) వాటన్నింటిని వ్యవహరించే ఆయన అగోచర,గోచర విషయాల జ్ఞానం కలవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. ఆయనపై ఎవరూ ఆధిక్యతను చూపని సర్వశక్తివంతుడు తన శతృవుల పై ప్రతీకారము తీర్చుకునేవాడు. విశ్వాసపరులైన తన దాసులపై అపారంగా కరుణించేవాడు.

(7) ఆయనే తాను సృష్టించిన ప్రతీ వస్తువును ఉత్తమరీతిలో సృష్టించాడు. మరియు పూర్వ నమూనా లేకుండా ఆదమ్ సృష్టిని మట్టితో ఆరంభించాడు.

(8) ఆ తరువాత అతని సంతానమును అతని తరువాత అతని నుండి జారి వెలువడే నీటి నుండి (వీర్యం నుండి) చేశాడు.

(9) ఆ తరువాత మానవుని సృష్టిని సరి అగు రీతిలో పరిపూర్ణం చేసి,అందులో ఆదీనంలో ఉన్న దూతను ఆదేశించి ఆత్మను ఊదటంతో తన వద్ద నుండి ప్రాణమును ఊదాడు. మరియు ఓ ప్రజలారా ఆయన మీ కొరకు చెవులను వాటి ద్వారా మీరు వినటానికి , కళ్ళను వాటి ద్వారా మీరు చూడటానికి, హృదయములను వాటి ద్వారా మీరు అర్ధం చేసుకోవటానికి చేశాడు. ఈ అనుగ్రహాలను మీపై అనుగ్రహించిన అల్లాహ్ కి చాలా తక్కువ మీరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

(10) మరియు మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ముష్రికులు ఇలా పలికారు : మేము మరణించి భూమిలో అదృశ్యమైపోయి,మా శరీరములు మట్టిగా అయిపోయినప్పుడు ఏమీ సరికొత్తగా జీవించబడి మేము మరణాంతరం లేపబడుతామా ?!. వారు దాన్ని అర్ధం చేసుకోరు. అంతే కాదు వారు వాస్తవానికి మరణాంతర జీవితమును తిరస్కరిస్తున్నారు,దాన్ని వారు విశ్వసించరు.

(11) ఓ ప్రవక్తా మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : అల్లాహ్ మీ ఆత్మలను స్వీకరించే బాధ్యతను అప్పజెప్పబడిన మరణ దూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు ప్రళయదినమున లెక్కతీసుకోబడటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించబడటానికి మా ఒక్కరి వైపు మరలించబడుతారు.

(12) అపరాధులు ప్రళయదినాన మరణాంతర జీవితము పట్ల తమ అవిశ్వాసము వలన అవమానమునకు లోనై తమ తలలను క్రిందకు వాల్చుతూ బహిర్గతమవుతారు. వారు అవమానమును గ్రహిస్తారు మరియు వారు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా మేము తిరస్కరించిన మరణాంతరజీవితమును మేము చూశాము. మరియు నీ వద్ద నుండి ప్రవక్తలు తీసుకుని వచ్చిన సత్యమును విన్నాము. కాబట్టి నీవు మమ్మల్ని ఇహలోక జీవితం వైపు మరలింపజేయి మేము సత్కార్యము చేస్తాము అది మా నుండి నిన్ను సంతుష్టపరుస్తుంది. నిశ్చయంగా మేము ఇప్పుడు మరణాంతర జీవితమును,ప్రవక్తలు తీసుకుని వచ్చిన సత్యమును నమ్ముతున్నాము. ఒక వేళ మీరు ఈ స్థితిలో అపరాధులను చూస్తే మీరు పెద్ద విషయమును చూస్తారు.

(13) మరియు ఒక వేళ మేము ప్రతీ ప్రాణికి దాని సన్మార్గమును,దాని భాగ్యమును ఇవ్వదలచుకుంటే మేము దాన్ని దానిపై పురిగొల్పే వారము. మరియు కాని అవిశ్వాసపరుల్లోంచి రెండు బాధ్యత వర్గముల్లోంచి జిన్నాతులను,మానవులను వారు విశ్వాస మార్గమునకు,సన్మార్గమునకు బదులుగా అవిశ్వాస మార్గము,అపమార్గమును ఎంచుకోవటం వలన ప్రళయదినాన నరకమును నేను తప్పకుండా నింపి వేస్తానన్న నా మాట విజ్ఞతగా,న్యాయముగా అనివార్యమైనది.

(14) ప్రళయదినాన వారిని దూషిస్తూ,మందలిస్తూ వారితో ఇలా పలకబడుతుంది : మీ లెక్క తీసుకోవటం కొరకు ప్రళయదినాన అల్లాహ్ ను కలుసుకోవటం నుండి ఇహలోకములో మీ అశ్రద్ధ వలన శిక్షను చవిచూడండి. నిశ్చయంగా మేము మిమ్మల్ని శిక్షలో మీరు దాని నుండి అనుభవిస్తున్న బాధను లెక్క చేయకండా వదిలివేశాము. మీరు ఇహలోకంలో చేసుకున్న పాపాల కారణం చేత మీరు అంతంకాని,శాశ్వత నరకాగ్ని శిక్షను చవిచూడండి.

(15) మన ప్రవక్తలపై అవతరింపబడిన మా ఆయతులను మాత్రం వారే విశ్వసిస్తారు ఎవరికైతే వాటితో హితబోధన చేయబడితే వారు అల్లాహ్ కొరకు ఆయన స్థుతులతో పరిశుద్ధతను తెలుపుతూ సాష్టాంగపడుతారో. మరియు వారు ఏ స్థితిలోను కూడా అల్లాహ్ ఆరాధన నుండి,ఆయనకు సాష్టాంగపడటం నుండి అహంకారమును చూపరు.

(16) వారి ప్రక్కలు వారు నిదురించే పరుపుల నుండి దూరమవుతాయి,వారు వాటిని వదిలి అల్లాహ్ వైపునకు మరలుతారు. వారు ఆయనను తమ నమాజులో,ఇతర వాటిలో ఆయన శిక్ష నుండి భయముతో,ఆయన కారుణ్య ఆశతో వేడుకుంటారు. మరియు మేము వారికి ప్రసాదించిన సంపదలనే వారు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తారు.

(17) కాని ఏ ప్రాణి అల్లాహ్ వారు ఇహ లోకంలో చేసుకున్న కర్మలకు తన వద్ద నుండి వారికి ప్రతిఫలంగా వారి కొరకు కంటి చలువను కలిగించే వేటిని తయారు చేసి ఉంచాడో తెలియదు. అది ఎటువంటి ప్రతిఫలమంటే అల్లాహ్ మాత్రమే తన గొప్పతనం వలన దాన్ని చుట్టుముట్టి ఉన్నాడు.

(18) ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచే వాడై ఆయన ఆదేశించిన వాటిని పాటించేవాడై ఆయన వారించిన వాటికి దూరంగా ఉండేవాడై ఉంటాడో ఆయన విధేయత నుండి వైదొలగిన వాడివలె ఉండడు. ఇరు వర్గముల వారు ప్రతిఫల విషయంలో అల్లాహ్ వద్ద సమానులు కాలేరు.

(19) ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కార్యములు చేస్తారో వారికి ప్రతిఫలంగా వారి కొరకు స్వర్గ వనములు తయారు చేయబడి ఉన్నాయి. వారు అందులో అల్లాహ్ వద్ద నుండి తమ కొరకు ఆతిధ్యమర్యాదలుగా,ఇహలోకములో తాము చేసుకున్న సత్కర్మల ప్రతిఫలముగా నివాసముంటారు.

(20) మరియు ఎవరైతే అవిశ్వాసముతో,పాపకార్యములతో అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోయారో వారి కొరకు ప్రళయదినమున తయారు చేయబడిన వారి నివాస స్థలము నరకాగ్ని. అందులో వారు శాశ్వతంగా నివాసముంటారు. ఎప్పుడెప్పుడైతే వారు దాని నుండి బయటకు రావాలనుకుంటారో అప్పుడు అందులోనికే మరలించబడుతారు. మరియు వారిని దూషిస్తూ వారితో ఇలా పలకబడుతుంది : మీరు నరకాగ్ని యొక్క ఆ శిక్ష రుచి చూడండి దేని గురించైతే మీ ప్రవక్తలు మిమ్మల్ని భయపెట్టినప్పుడల్లా మీరు తిరస్కరించే వారో.

(21) తమ ప్రభువు విధేయత నుండి వైదొలిగే ఈ తిరస్కారులందరికి ఒక వేళ వారు తౌబా చేయకపోతే వారి కొరకు పరలోకంలో తయారు చేయబడ్డ పెద్ద శిక్ష కన్న ముందే మేము తప్పకుండా ఇహలోకములో బాధల,ఆపదల రుచి చూపిస్తాము. బహుశా వారు తమ ప్రభువు విధేయత వైపునకు మరలుతారని.

(22) అల్లాహ్ ఆయతులతో హితబోధన చేయబడినా వాటితో హితబోధన గ్రహించకుండా వాటిని లెక్క చేయకుండా వాటి నుండి విముఖత చూపే వాడి కన్నా ఎక్కువ దుర్మార్గుడు ఎవడూ ఉండడు. నిశ్చయంగా మేము అవిశ్వాసమునకు,పాపములకు పాల్పడి అల్లాహ్ ఆయతుల నుండి విముఖత చూపి అపరాదులైన వారి నుండి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము.

(23) మరియు నిశ్చయంగా మేము మూసాకు తౌరాతును ప్రసాదించాము. అయితే ఓ ప్రవక్తా మీరు ఇస్రా,మీరాజ్ రాత్రి మూసాను మీరు కలిసిన విషయం గురించి సందేహంలో పడకండి. మరియు మేము మూసాపై అవతరింపబడిన గ్రంధమును ఇస్రాయీలు సంతతి వారి కొరకు అపమార్గము నుండి సన్మార్గము చూపే దానిగా చేశాము.

(24) మరియు మేము ఇస్రాయీలు సంతతి వారిలో నుంచి నాయకులను చేశాము,సత్యం విషయంలో ప్రజలు వారిని అనుసరించేవారు. మరియు వారు సత్యం వైపునకు మార్గదర్శకం చేసేవారు. ఎప్పటి వరకైతే వారు అల్లాహ్ ఆదేశించిన వాటిని పాటించటంపై,అల్లాహ్ వారించిన వాటి పై,సందేశ ప్రచార మార్గములో కలిగిన బాధలపై సహనం చూపుతారో. మరియు వారు తమ ప్రవక్తలపై అవతరింపబడిన ఆయతులను గట్టిగా నమ్ముతారో.

(25) ఓ ప్రవక్తా నిశ్చయంగా నీ ప్రభువు, ఆయనే ప్రళయదినమున వారు ఇహలోకములో విబేధించుకున్న వాటి విషయంలో వారి మధ్య తీర్పునిస్తాడు. అప్పుడు సత్యం పలికే వాడిని,అసత్యం పలికే వాడిని స్పష్టపరుస్తాడు. ప్రతీ ఒక్కరు దేనికి అర్హత కలిగి ఉన్నారో అది ప్రసాదించబడుతుంది.

(26) ఏమీ వీరందరు అంధులైపోయారా మేము వారికన్నముందు గతించిన ఎన్ని జాతులను నాశనం చేశామో వారికి స్ఫష్టం కాలేదా ?!. ఇదిగో వారి వినాశనము కాక ముందు వారు నివాసమున్న నివాసములలో వారు వచ్చిపోయేవారు. అయినా వారు వారి స్థితిని చూసి హతోపదేశం గ్రహించలేదు. నిశ్చయంగా తమ అవిశ్వాసం,తమ పాపకార్యముల వలన వినాశనము కలిగిన ఈ జాతులలో గుణపాఠం ఉన్నది దాని ద్వారా వారి ప్రవక్తలు ఎవరైతే అల్లాహ్ వద్ద నుండి వారి వద్దకు వచ్చారో వారి నిజాయితీ ఆధారించబడుతున్నది. ఏమీ అల్లాహ్ ఆయతులను తిరస్కరించే వీరందరు స్వీకరించే ఉద్దేశముతో,హితబోధన గ్రహించే ఉద్దేశంతో వినటం లేదా ?!.

(27) ఏ మరణాంతర జీవితమును తిరస్కరించే వీరందరు ఎటువంటి మొక్కలు లేని బంజరు భూమిపై మేము వర్షపు నీటిని కురిపించి అప్పుడు మేము ఆ నీటితో పంటలను వెలికి తీస్తే వాటి నుండి వారి ఒంటెలు,వారి ఆవులు,వారి గొర్రెలు తినటమును చూడటంలేదా ?!. ఏ వారు దాన్ని చూసి బంజరు భూమిని మొలకెత్తించినవాడు మృతులను జీవింపజేయటంలో సామర్ధ్యం కలవాడని గ్రహించలేరా ?!.

(28) మరణాంతర జీవితమును తిరస్కరించి శిక్ష గురించి తొందర పెట్టేవారు ఇలా పలుకుతారు : ఈ తీర్పు ఎప్పుడు ఉన్నది దేని గురించైతే మీరు అది మీకు,మాకు మధ్యన తీర్పునిస్తుందని మరియు మా పరిణామం నరకము అవుతుందని,మీ పరిణామం స్వర్గమవుతుందని మీరు గట్టిగా వాదించినది.

(29) ఓ ప్రవక్తా వారితో ఇలా పలకండి : ఈ వాగ్దానము ప్రళయదినము అది. నిశ్చయంగా అది దాసుల మధ్య తీర్పునిచ్చే దినము. అది ఏవిధంగా ఉంటుందంటే ఆ రోజు ఇహలోకములో అల్లాహ్ ను తిరస్కరించిన వారు ప్రళయదినమును కళ్ళారా చూసిన తరువాత వారు దాన్ని నిజమని విశ్వసించినా వారికి ప్రయోజనం కలగదు. వారు తమ ప్రభువు వైపునకు పశ్చాత్తాప్పడి ఆయన వైపున మరలటానికి వారికి గడువు ఇవ్వబడదు.

(30) ఓ ప్రవక్తా మీరు వీరందరి నుండి వారు తమ మార్గభ్రష్టతలో కొనసాగిన తరువాత వారి నుండి విముఖత చూపండి. మీరు వారిపై కురిసే దాని గురించి నిరీక్షించండి. నిశ్చయంగా వారు వారికి వాగ్దానం చేయబడిన శిక్ష గురించి నిరీక్షిస్తారు.