39 - Az-Zumar ()

|

(1) ఖుర్ఆన్ అవతరణ ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడైన అల్లాహ్ వద్ద నుండి జరిగింది. తన సృష్టించటంలో మరియు తన పర్యాలోచనలో మరియు తన ధర్మ శాసనాల్లో వివేకవంతుడు. అది పరిశుద్ధుడైన ఆయన వద్ద నుండి కాకుండా ఇతరుల వద్ద నుండి అవతరించలేదు.

(2) ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మేము సత్యముతో కూడుకుని ఉన్న ఖుర్ఆన్ ను మీపై అవతరింపజేశాము. అయితే దాని సందేశములన్ని సత్యము మరియు దాని ఆదేశాలన్ని న్యాయపూరితమైనవి. కాబట్టి మీరు అల్లాహ్ నే ఆయన కొరకు ఏకేశ్వరోపాసనను చేస్తూ,ఆయన కొరకు షిర్కు నుండి తౌహీదును ప్రత్యేకిస్తూ ఆరాధన చేయండి.

(3) వినండి షిర్కు నుండి ఖాళీ అయిన ధర్మం అల్లాహ్ కే ప్రత్యేకము. మరియు ఎవరైతే అల్లాహ్ ను వదిలి విగ్రహాలను మరియు షైతానులను స్నేహితులుగా చేసుకుని అల్లాహ్ ను వదిలి వారిని ఆరాధించే వారు తమ ఆరాధనను వారి కొరకు తమ మాటల్లో ఇలా నిరాకరిస్తారు : మేము వారందరిని ఆరాధించేది వారు మమ్మల్ని స్థానపరంగా దగ్గర చేయటానికి మరియు మా అవసరాలను ఆయనకు చేరవేయటానికి మరియు మా కొరకు ఆయన వద్ద సిఫారసు చేయటానికి. నిశ్చయంగా అల్లాహ్ ప్రళయదినాన ఏకేశ్వరోపాసన చేసే విశ్వాసపరుల మధ్య మరియు సాటికల్పించే అవిశ్వాసపరుల మధ్య వారు తౌహీద్ విషయంలో విభేదించుకునే దాని గురించి తీర్పునిస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ పై ఆయన కొరకు సాటిని అంటగట్టి అబద్దమును పలికే వాడిని మరియు తనపై ఉన్న అల్లాహ్ అనుగ్రహాలపట్ల కృతఝ్నుడయ్యే వాడిని సత్యం వైపునకు సన్మార్గం పొందటము కొరకు సౌభాగ్యమును కలిగించడు.

(4) ఒక వేళ అల్లాహ్ కొడుకుని చేయదలచుకుంటే తన సృష్టి రాసుల్లోంచి తాను కోరిన వారిని ఎంచుకుని అతడిని కొడుకు స్థానమును కలిగించేవాడు. అతడు ఈ ముష్రికులందరు పలికే మాటల నుండి అతీతుడు మరియు పరిశుద్ధుడు. ఆయన తన అస్తిత్వంలో, తన గుణాల్లో, తన కార్యాల్లో ఒక్కడు. వాటిలో ఆయనకు సాటి ఎవరూ లేరు. తన సృష్టితాలపై ఆధిక్యతను కలిగినవాడు.

(5) ఆయన గొప్ప జ్ఞానముతో ఆకాశములను మరియు భూమిని సృష్టించాడు. దుర్మార్గులు పలికినట్లు వృధాగా కాదు. ఆయన రాత్రిని పగటిపై ప్రవేశింపజేస్తాడు. మరియు పగలును రాత్రిపై ప్రవేశింపజేస్తాడు. ఒకటి వచ్చినప్పుడు రెండవది అదృశ్యమైపోతుంది. మరియు ఆయన సూర్యుడిని ఉపయుక్తంగా చేశాడు. మరియు చంద్రుడిని ఉపయుక్తంగా చేశాడు. వాటిలో నుండి ప్రతి ఒక్కటి ఒక నిర్ధారిత సమయం కొరకు పయనిస్తుంది. అది ఈ జీవితము ముగింపు. వినండి పరిశుద్ధుడైన ఆయనే సర్వాధిక్యుడు ఎవరైతే తన శతృవులపై ప్రతీకారం తీర్చుకుంటాడో. మరియు ఆయనపై ఎవరూ ఆధిక్యతను చూపరు. ఆయన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడు.

(6) ఓ ప్రజలారా మీ ప్రభువు మిమ్మల్ని ఒకే ప్రాణమైన ఆదం నుండి సృష్టించాడు. ఆ తరువాత ఆదం నుండి ఆయన భార్య హవ్వాను సృష్టించాడు. మరియు ఆయన మీ కొరకు ఒంటెల నుండి,ఆవుల నుండి,గొర్రెల నుండి,మేకల నుండి ఎనిమిది రకముల వాటిని సృష్టించాడు. ప్రతీ రకము నుండి మగ,ఆడను సృష్టించాడు. పరిశుద్ధుడైన ఆయన మిమ్మల్ని మీ మాతృ గర్భములో ఒక దశ తరువాత ఇంకో దశను కడుపు,గర్భము,మావి (తల్లి గర్భములో శిసువుపై ఉండే పొర) యొక్క చీకట్లలో సృష్టించాడు. వాటన్నింటిని సృష్టించిన వాడే మీ ప్రభువైన అల్లాహ్. రాజ్యాధికారము ఆయన ఒక్కడికే చెందుతుంది. ఆయన తప్ప వాస్తవ ఆరాధ్య దైవం ఇంకొకడు లేడు. అటువంటప్పుడు మీరు ఎలా ఆయన ఆరాధన చేయటం నుండి ఏమీ సృష్టించకుండా తామే సృష్టించబడి వాటి ఆరాధన చేయటం వైపునకు మరలిపోతున్నారు ?!.

(7) ఓ ప్రజలారా ఒక వేళ మీరు మీ ప్రభువు పట్ల అవిశ్వాసమును కనబరిస్తే నిశ్ఛయంగా అల్లాహ్ మీ విశ్వాసము అక్కర లేని వాడు. మరియు మీ అవిశ్వాసం ఆయనకు నష్టం కలిగించదు. మరియు మీ అవిశ్వాసము యొక్క నష్టము మీ వైపునకు మాత్రమే మరలుతుంది. మరియు ఆయన తన దాసుల కొరకు తనను అవిశ్వసించటమును ఇష్టపడడు. మరియు వారిని అవిశ్వసించమని ఆదేశించడు. ఎందుకంటే అల్లాహ్ అశ్లీలత గురించి,చెడు గురించి ఆదేశించడు. మరియు ఒక వేళ మీరు అల్లాహ్ కు ఆయన అనుగ్రహాలపై కృతజ్ఞత తెలిపి ఆయనపై విశ్వాసమును కనబరిస్తే ఆయన మీ కృతజ్ఞత నుండి సంతుష్టపడి మీకు దాని ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. మరియు ఒక ప్రాణం వేరే ప్రాణము యొక్క పాపమును మోయదు. అంతేకాదు ప్రతీ వ్యక్తి తాను చేసుకున్న దానికి ప్రతిగా తాకట్టుగా ఉంటాడు. ఆ తరువాత మీరు ప్రళయదినమున మీ మరలటం ఒక్కడైన మీ ప్రభువు వైపునకు జరుగును. అప్పుడు ఆయన ఇహలోకంలో మీరు చేసుకున్న కర్మల గురించి మీకు సమాచారమిస్తాడు. మరియు ఆయన మీ కర్మలపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. నిశ్ఛయంగా పరిశుద్ధుడైన ఆయన తన దాసుల హృదయములలో ఉన్న వాటి గురించి బాగా తెలిసినవాడు. వాటిలో ఉన్నది ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.

(8) మరియు అవిశ్వాసపరుడికి ఏదైన కీడు రోగము ,సంపదను కోల్పోవటము, మునిగిపోయే భయం రూపంలో సంభవించినప్పుడు అతడు పరిశుద్ధుడైన తన ప్రభువుతో ఆయన ఒక్కడి వైపు మరలుతూ తనకు కలిగిన కీడును తొలగించమని వేడుకుంటాడు. ఆయన అతనికి కలిగిన కీడును తొలగించి అతనికి అనుగ్రహాన్ని కలిగించినప్పుడు అతడు ముందు నుండి కడువినయంతో వేడుకున్న అల్లాహ్ ను వదిలివేస్తాడు. మరియు అతడు అల్లాహ్ కొరకు భాగస్వాములను చేసుకుని వారిని అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తాడు ఇతరులను అల్లాహ్ మర్గము ఏదైతే ఆయనకు చేరుతుందో దాని నుండి మరలించటానికి. ఓ ప్రవక్తా ఈ స్థితి కలిగిన వాడితో ఇలా పలకండి : నీ అవిశ్వాసముతో మిగిలిన నీ జీవితమంతా ప్రయోజనం చెందు. అది కొద్దిపాటి కాలమే. నిశ్ఛయంగా నీవు నరకవాసుల్లోంచి వాడివి ప్రళయదినమున నీవు దాన్ని ఒక స్నేహితుడు తన స్నేహితుడిని అట్టిపెట్టుకుని ఉన్నట్లుగా అట్టిపెట్టుకుని ఉంటావు.

(9) ఏమిటీ ఎవరైతే అల్లాహ్ కు విధేయుడై రాత్రి సమయములను తన ప్రభువు కొరకు సాష్టాంగపడుతూ మరియు ఆయన కొరకు నిలబడుతూ గడిపి,పరలోక శిక్ష నుండి భయపడి తన ప్రభువు కారుణ్యము గురించి యోచన చేస్తాడో అతడు ఉత్తముడా లేదా ఆ విశ్వాసపరుడు ఎవరైతే కష్ట సమయముల్లో అల్లాహ్ ను ఆరాధించి కలిమిలో ఆయన పట్ల అవిశ్వాసమును కనబరచి,అల్లాహ్ తో పాటు భాగస్వాములను చేసుకుంటాడో అతడు ఉత్తముడా ?!. ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఏమీ ఎవరైతే అల్లాహ్ తమపై అనివార్యం చేసిన వాటిని అల్లాహ్ ను తాము గుర్తించటం వలన తెలుసుకుంటారో వారు మరియు ఎవరైతే వీటిలో నుండి ఏమీ తెలియనివారు సమానులవుతారా ?!. ఈ రెండు వర్గముల మధ్య ఉన్న వ్యత్యాసమును సరైన బుద్ధులు కలవారు మాత్రమే గుర్తిస్తారు.

(10) ఓ ప్రవక్తా మీరు నాపై,నా ప్రవక్తలపై విశ్వాసమును కనబరచిన నా దాసులతో ఇలా పలకండి : మీరు మీ ప్రభువుతో ఆయన ఆదేశించిన వాటిని పాటిస్తూ మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ భయభీతిని కలిగి ఉండండి. మీలో నుండి ఇహలోకంలో సత్కర్మలను చేసిన వారి కొరకు ఇహలోకములో విజయము (సహాయము),ఆరోగ్యము, సంపద రూపములో మరియు పరలోకములో స్వర్గము రూపములో మేలు కలదు. మరియు అల్లాహ్ యొక్క భూమి విశాలమైనది. కావున మీరు అందులో అల్లాహ్ ఆరాధన చేయటానికి ఏదైన ప్రదేశం పొంది,మిమ్మల్ని ఏ ఆటంకము ఆపనంత వరకు హిజ్రత్ చేయండి. సహనం పాటించేవారు ప్రళయదినమున వారి పుణ్యము లెక్క లేనంత మరియు దాని అధికమవటం వలన,దాని రకరకాలు ఉండటం వలన షుమారు చేయలేనంత ప్రసాదించబడుతుంది.

(11) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్ఛయంగా అల్లాహ్ నేను ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకిస్తూ ఆయన ఒక్కడినే ఆరాధన చేయాలని ఆదేశించాడు.

(12) మరియి నేను ఈ సమాజము (ఉమ్మత్) నుండి మొట్టమొదట ఆయనకు విధేయుడినై,కట్టుబడి ఉండే వాడినవ్వాలని ఆయన నాకు ఆదేశించాడు.

(13) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఒక వేళ నేను అల్లాహ్ కు అవిధేయుడినై ఆయనకు విధేయత చూపకుండా ఉంటే గొప్ప దిన శిక్ష నుండి భయపడుతున్నాను. అది ప్రళయదినము.

(14) ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి : నిశ్చయంగా నేను అల్లాహ్ ఒక్కడినే ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకిస్తూ ఆరాధిస్తున్నాను. ఆయనతో పాటు నేను ఇతరులను ఆరాధించను.

(15) ఓ ముష్రికులారా మీరు ఆయనను వదిలి మీరు కోరుకున్న విగ్రహాలను ఆరాధించుకోండి (బెదిరించటానికి ఈ ఆదేశం). ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నిశ్చయంగా వాస్తవానికి నష్టపోయే వారు ఎవరంటే తమ స్వయానికి,తమ ఇంటి వారికి నష్టం కలిగించుకుని వారు ఒక్కరే స్వర్గములో ప్రవేశించటం వలన లేదా తమతో పాటు వారూ నరకములో ప్రవేశించటం వలన తమ నుండి వారిని విడిపోవటం వలన వారు వారిని కలుసుకోరు. ఎన్నటికి కలవరు. వినండి ఇదే ఎటువంటి సందేహం లేని స్పష్టమైన నష్టము.

(16) వారి కొరకు వారిపై నుండి పొగ,జ్వాల,వేడి క్రమ్ముకుని ఉంటాయి. మరియు వారి క్రింది నుండి పొగ,జ్వాల,వేడి క్రమ్ముకుని ఉంటాయి. ఈ ప్రస్తావించబడిన శిక్ష ద్వారా అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. ఓ నా దాసులారా మీరు నా ఆదేశాలను పాటిస్తూ మరియు నేను వారించిన వాటికి దూరంగా ఉంటూ నాకు భయపడండి.

(17) మరియు ఎవరైతే విగ్రహాల ఆరాధన చేయటం నుండి మరియు అల్లాహ్ ను వదిలి ఆరాధించబడే వాటన్నిటి ఆరాధన నుండి దూరంగా ఉండి,పశ్చాత్తాపముతో అల్లాహ్ వైపునకు మరలుతారో వారి కొరకు మరణము సమయమున,సమాధిలో,ప్రళయదినమున స్వర్గము యొక్క శుభవార్త కలదు. ఓ ప్రవక్తా మీరు నా దాసులకు శుభవార్తనివ్వండి.

(18) ఎవరైతే మాటను విని దాని నుండి మంచిని,చెడును వ్యత్యాసపరచి మంచిమాటను దానిలో ఉన్న ప్రయోజనం వలన అనుసరిస్తారో ఈ గుణాలతో వర్ణించబడిన వారికే అల్లాహ్ సన్మార్గము కొరకు భాగ్యమును కలిగించాడు. మరియు వారందరు సరైన బుద్ధులు కలవారు.

(19) ఎవరిపైనైతే తాను తన అవిశ్వాసమును కనబరచటంలో,అపమార్గంలో కొనసాగిపోవటం వలన శిక్ష యొక్క వాక్కు అనివార్యమైపోయినదో ఓ ప్రవక్తా అతనికి సన్మార్గం చూపటంలో, అతడిని అనుగ్రహించటంలో మీకు ఎటువంటి వ్యూహం లేదు. ఓ ప్రవక్తా ఏమిటీ మీరు ఈ లక్షణాలు కలిగిన వాడిని నరకాగ్ని నుండి రక్షించగలరా ?!.

(20) కానీ ఎవరైతే తమ ప్రభువు నుండి ఆయన ఆదేశములను పాటిస్తూ మరియు ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉంటూ భయపడుతారో అటువంటి వారి కొరకు ఎత్తైన భవనములు కలవు. అవి ఒక దానిపై ఒకటి ఉంటాయి. వాటి క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అల్లాహ్ వారికి వాటి గురించి గట్టి వాగ్దానం చేశాడు. మరియు అల్లాహ్ వాగ్దానమును భంగపరచడు.

(21) నిశ్చయంగా మీరు వీక్షించటం వలన అల్లాహ్ ఆకాశము నుండి వర్షపు నీటిని కురిపించాడని తెలుసుకున్నారు. అప్పుడు ఆయన దాన్ని సెలయేరులలో,ప్రవాహములలో ప్రవేశింపజేశాడు. ఆ తరువాత ఆ నీటితో రకరకాల రంగులుకల పంటలను వేలికి తీస్తాడు. ఆ తరువాత పంటలు ఎండిపోతాయి. ఓ వీక్షకుడా నీవు దాన్ని పచ్చగా ఉండిన తరువాత పసుపు రంగులో చూస్తావు. ఆ పిదప అది ఎండిన తరువాత ఆయన దాన్ని చూర్ణంగా,విచ్చిన్నంగా చేస్తాడు. నిశ్ఛయంగా ఈ ప్రస్తావించబడిన దానిలో జీవించి ఉన్న హృదయములు కలవారి కొరకు హితోపదేశం కలదు.

(22) ఏమి ఎవరి హృదయమునైతే అల్లాహ్ ఇస్లాం కొరకు తెరిస్తే అతడు దానివైపునకు మార్గం పొంది,తన ప్రభువు వద్ద నుండి వెలుగుపై ఉంటే అతడు ఎవరి హృదయమైతే అల్లాహ్ స్మరణ నుండి కఠినంగా మరిపోయినదో అతనిలా ఉంటాడా ?. వారిద్దరు ఎన్నటికి సమానులు కారు. సన్మార్గం పొందిన వారి కొరకు సాఫల్యము కలదు. మరియు అల్లాహ్ స్మరణ నుండి కఠినంగా మారిపోయిన హృదయములు కలవారి కొరకు నష్టము కలదు. వారందరు సత్యము నుండి స్పష్టమైన అపమార్గంలో ఉన్నారు.

(23) అల్లాహ్ తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై సర్వశ్రేష్ఠమైన బోధనలైన ఖుర్ఆన్ ను అవతరింపజేశాడు. ఆయన దానిని పరస్పరం పోలినట్లుగా అవతరింపజేశాడు. అవి నిజాయితీలో,శ్రేష్ఠతలో,సంకీర్ణంలో,వ్యతిరేకతలు లేకపోవటంలో ఒక దానితో మరోకటి పోలి ఉన్నాయి.అందులో ఎన్నో గాధలు,ఆదేశములు,వాగ్దానములు,బెదిరింపులు,సత్యవంతుల గుణాలు,అసత్యపరుల గుణాలు మరియు వేరేవి ఉన్నాయి. అందులో ఉన్న హెచ్చరికలను,బెదిరింపులను తమ ప్రభుతో భయపడేవారు విన్నప్పుడు వారి శరీరములపైన ఉన్న రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తరువాత అందులో ఉన్న ఆశలను,శుభవార్తలను విన్నప్పుడు అల్లాహ్ స్మరణ వైపునకు వారి శరీరములు మరియు వారి హృదయములు మెత్తబడిపోతాయి. ఈ ప్రస్తావించబడిన ఖుర్ఆన్,దాని ప్రభావము అల్లాహ్ మార్గదర్శకత్వము. దాని ద్వారా ఆయన తాను తలచిన వారికి సన్మార్గం చూపుతాడు. మరియు అల్లాహ్ ఎవరిని పరాభవమునకు లోను చేస్తాడో అతడికి ఆయన సన్మార్గము కొరకు భాగ్యమును కలిగించడు. అప్పుడు అతని కొరకు సన్మార్గం చూపేవాడెవడూ ఉండడు.

(24) ఏమీ ఈ వ్యక్తి ఎవరినైతే అల్లాహ్ సన్మార్గం చూపించి మరియు అతడిని ఇహలోకములో అనుగ్రహించి,పరలోకములో అతడిని స్వర్గములో ప్రవేశింపజేశాడో అతడు మరియు ఎవరైతే అవిశ్వాసమును కనబరిచి తన అవిశ్వాస స్థితిలో మరణిస్తే ఆయన (అల్లాహ్) అతడిని చేతులూ కాళ్ళు బందించబడినట్లు ప్రవేశింపజేస్తే అతడు బోర్లాపడినటువంటి తన ముఖముతో మాత్రమే నరకాగ్ని నుండి కాపాడుకోవలసిన వాడు సమానులవుతారా ?. మరియు అవిశ్వాసముతో,పాపకార్యములతో తమ స్వయంపై హింసకు పాల్పడిన వారితో మందలించే విధంగా ఇలా పలకబడుతుంది : మీరు చేసుకున్న అవిశ్వాసము,పాపకార్యములను రుచి చూడండి. ఇదే మీ ప్రతిఫలము.

(25) ఈ ముష్రికులందరికన్న ముందు ఉన్న సమాజములన్ని తిరస్కరించినవి. అప్పుడు వారి వద్దకు శిక్ష అకస్మాత్తుగా వచ్చిపడింది ఏ విధంగానంటే దాని కొరకు పశ్ఛాత్తాపముతో సిద్ధమవటానికి దాన్ని వారు గ్రహించలేకపోయారు.

(26) అప్పుడు అల్లాహ్ వారికి అవమానకరమైన,సిగ్గుమాలిన,పరాభవమైన శిక్ష రుచి చూపించాడు. మరియు నిశ్చయంగా వారి కోసం నిరీక్షిస్తున్నటువంటి పరలోక శిక్ష ఎంతో పెద్దది మరియు తీవ్రమైనది. ఒక వేళ వారు తెలుసుకుంటే (బాగుండేది).

(27) మరియు నిశ్చయంగా మేము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ లో మంచి గురించి, చెడు గురించి మరియు సత్యం గురించి,అసత్యం గురించి మరియు విశ్వాసము గురించి,అవిశ్వాసము గురించి మరియు ఇతరవాటి గురించి ప్రజలకొరకు రకరకాల ఉపమానములను తెలియపరచాము. వాటిలో నుండి మేము తెలియపరచిన వాటి (ఉపమానముల) ద్వారా వారు గుణపాఠం నేర్చుకుని సత్యమును ఆచరించి అసత్యమును విడనాడుతారని ఆశిస్తూ (తెలియపరచాము).

(28) మేము దాన్ని అందులో ఎటువంటి వక్రత గాని వంకరుతనం గాని సందేహము గాని లేకుండా,వారు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడుతూ ఉంటారని ఆశిస్తూ ఖుర్ఆన్ ను అరబీ భాషలో తయారు చేశాము.

(29) అల్లాహ్ ముష్రిక్ (బహుదైవాలను ఆరాధించేవాడు) కొరకు మరియు మువహ్హిద్ (ఏకేశ్వరోపాసన చేసేవాడు) కొరకు ఒక ఉపమానము ఒక వ్యక్తిది తెలుపుతున్నాడు అతడు చాలా మంది తగాదాలాడే భాగస్వాముల ఆదీనంలో ఉన్నాడు. వారిలో కొంతమంది సంతృప్తి చెందితే కొందరు ఆగ్రహంగా ఉన్నారు. అప్పుడు అతడు కలతలో మరియు గందరగోళంలో పడిపోయాడు. మరియు ఇంకో వ్యక్తిది తెలుపుతున్నాడు అతడు ఒకే వ్యక్తికి ప్రత్యేకమై ఉన్నాడు. అతను ఒక్కడే అధికారం కలవాడు. మరియు అతని అవసరాలను తెలుసుకుంటాడు. అప్పుడు అతను ప్రశాంతంగా మరియు నిస్సంకోచముగా ఉన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు సమానులు కారు. ప్రశంసలన్నీ అల్లాహ్ కే శోభిస్తాయి. కానీ వారిలో చాలా మందికి తెలియదు. అందుకనే వారు అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పిస్తున్నారు.

(30) ఓ ప్రవక్తా నిశ్చయంగా మీరు మరణిస్తారు మరియు వారు కూడా ఖచ్చితంగా మరణిస్తారు.

(31) ఆ తరువాత ఓ ప్రజలారా నిశ్చయంగా మీరు ప్రలయదినమున మీ ప్రభువు వద్ద మీరు పరస్పరం వివాదమాడుకున్న విషయం గురించి తగువులాడుతారు. అప్పుడు అసత్యపరుడు నుండి సత్యపరుడు స్పష్టమవుతాడు.

(32) మరియు అల్లాహ్ కు తగనటువంటి భాగస్వామిని,భార్యను,సంతానమును అంటగట్టే వాడి కంటే పెద్ద దుర్మార్గుడు ఎవడూ ఉండడు. మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిసుకుని వచ్చిన దైవ వాణిని తిరస్కరించే వాడికంటే పెద్ద దుర్మార్గుడు ఇంకెవడూ ఉండడు. ఏమీ నరకాగ్నిలో అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్త తీసుకుని వచ్చిన దాని పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి కొరకు ఆశ్రయం,నివాసం లేదా ?!. ఎందుకు లేదు నిశ్చయంగా వారి కొరకు అందులో ఆశ్రయం మరియు నివాసము ఉన్నవి.

(33) మరియు దైవప్రవక్తల్లోంచి,ఇతరుల్లోంచి ఎవరైతే తన మాటల్లో,తన చేతల్లో సత్యాన్ని తీసుకుని వస్తాడో మరియు దాన్ని విశ్వాసస్థితిలో నమ్మి దానికి తగినట్లుగా ఆచరిస్తాడో వారందరే వస్తవానికి దైవభీతి కలవారు. వారు తమ ప్రభువు ఆదేశమును పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటారు.

(34) వారి కొరకు వారి ప్రభువు వద్ద వారు కోరుకునే శాశ్వత సుఖాలు కలవు. ఇది తమ సృష్టికర్తతో,ఆయన దాసులతో మంచిగా మెలిగే వారి కర్మల ప్రతిఫలం.

(35) అల్లాహ్ వారు ఇహలోకములో చేసుకున్న పాపములను వాటి నుండి వారి పశ్ఛాత్తాపము వలన మరియు వారి ప్రభువు వైపు వారి మరలటం వలన తుడిచి వేయటానికి మరియు వారు చేసుకున్న సత్కర్మలకు మంచి ప్రతిఫలమును వారికి ప్రసాదించటానికి.

(36) ఏమీ అల్లాహ్ తన దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఆయన ధర్మ ,ప్రాపంచిక విషయంలో చాలడా మరియు ఆయన నుండి ఆయన శతృవును అడ్డుకోడా ?!. ఎందుకు కాదు . నిశ్చయంగా ఆయన ఆయనకి చాలు. ఓ ప్రవక్తా వారు మిమ్మల్ని తమ అజ్ఞానం మరియు తమ మూర్ఖత్వం వలన తాము అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న విగ్రహాల నుండి అవి మీకు కీడు కలిగిస్తాయని భయపెడుతున్నారు. అల్లాహ్ ఎవరినైతే నిస్సహాయుడిగా వదిలి వేసి అతనికి సన్మార్గం పొందే భాగ్యమును కలిగించడో అతనికి సన్మార్గం చూపించి అనుగ్రహించటానికి మార్గదర్శకుడెవడూ ఉండడు.

(37) మరియు అల్లాహ్ ఎవరికైతే సన్మార్గమును పొందే భాగ్యమును కలిగిస్తాడో అతడికి మార్గభ్రష్టతకు లోను చేసే వాడెవడూ అతడిని మార్గభ్రష్టతకు గురి చేయలేడు. ఏమీ అల్లాహ్ ఎవరూ ఓడించని, తనను అవిశ్వసించి తనకు అవిధేయతకు పాల్పడిన వారితో ప్రతీకారము తీర్చుకునే సర్వాధిక్యుడు కాడా ?!. ఎందుకు కాదు నిశ్చయంగా ఆయన ప్రతీకారము తీర్చుకునే సర్వాధిక్యుడు.

(38) ఓ ప్రవక్త ఒక వేళ మీరు ఈ ముష్రికులందరితో ఆకాశములను,భూమిని ఎవరు సృష్టించారు అని అడిగితే వారు తప్పకుండా వాటిని సృష్టించినవాడు అల్లాహ్ అని సమాధానమిస్తారు. మీరు వారి విగ్రహాల అసమర్ధతను బహిరంగపరుస్తూ ఇలా పలకండి : మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న ఈ విగ్రహాల గురించి నాకు తెలియపరచండి. ఒక వేళ అల్లాహ్ నాకు ఏదైన కీడును కలగదలచితే అవి అతని కీడును నా నుండి తొలగించగలవా ?! లేదా నా ప్రభువు తన వద్ద నుండి నాకు ఏదైన కారుణ్యమును అనుగ్రహించదలచితే వాటికి ఆయన కారుణ్యమును ఆపె శక్తి కలదా ?! . మీరు వారితో ఇలా పలకండి : అల్లాహ్ ఒక్కడే నాకు చాలు. నా వ్యవహారాలన్నింటిలో ఆయనపైనే నేను నమ్మకమును కలిగి ఉంటాను. నమ్మకమును కలిగి ఉండేవారు ఆయన ఒక్కడిపైనే నమ్మకమును కలిగి ఉంటారు.

(39) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ నా జాతి వారా మీరు మీకు సంతృప్తికరమైన స్థితి అయిన అల్లాహ్ తో పాటు సాటి కల్పించటంపై ఆచరించండి. నిశ్చయంగా నేనూ నా ప్రభువు నాకు ఆదేశించినటువంటి ఆయన ఏకత్వం వైపునకు పిలవటం మరియు ఆరాధనను ఆయనకే ప్రత్యేకించుకోవటం పై ఆచరిస్తాను. అయితే తొందరలోనే మీరు ప్రతీ మార్గము యొక్క పరిణామమును తెలుసుకుంటారు.

(40) అయితే ఇహలోకములో ఎవరిపై వారిని పరాభవము కలిగించే,అవమానము కలిగించే శిక్ష వస్తుందో,ప్రళయ దినాన అతనిపై అంతము కాని,తొలగిపోని శాశ్వత శిక్ష వస్తుందో వారు తొందరలోనే తెలుసుకుంటారు.

(41) ఓ ప్రవక్తా నిశ్ఛయంగా మేము ఖుర్ఆన్ ను మీపై ప్రజల కొరకు సత్యముతో అవతరింపజేశాము మీరు వారిని హెచ్చరించటానికి. ఎవరైతే సన్మార్గము పొందుతాడో అతని సన్మార్గం పొందటం యొక్క ప్రయోజనం అతని స్వయం కొరకే. అయితే అతని సన్మార్గం పొందటం అల్లాహ్ కు ప్రయోజనం చేకూర్చదు. ఎందుకంటే ఆయన దాని నుండి అక్కరలేనివాడు. మరియు ఎవరైతే అపమార్గము పొందుతాడో అతని అపమార్గం పొందటం యొక్క నష్టము అతని స్వయమునకే కలుగును. అయితే పరిశుద్ధుడైన అల్లాహ్ కు అతని అపమార్గము నష్టం కలిగించదు. మరియు మీరు వారిని సన్మార్గముపై బలవంతం చేయటానికి మీరు వారిపై బాధ్యులు కారు. వారికి చేరవేయమని మీకు ఆదేశించబడిన వాటిని చేరవేయటం మాత్రమే మీపై బాధ్యత కలదు.

(42) అల్లాహ్ యే ఆత్మలను వాటి ఆయుషు ముగిసేటప్పుడు స్వాధీనపరచుకుంటాడు. వేటి ఆయుషు పూర్తికాలేదో ఆ ఆత్మలను నిదుర సమయములో స్వాధీనపరచుకుని వేటి యొక్క మరణం నిర్ణయించబడినదో వాటిని ఆపుకుని వేటి పై దాని (మరణం) నిర్ణయం కాలేదో వాటిని పరిశుద్ధుడైన ఆయన జ్ఞానంలో నిర్ధారించబడిన వేళ వరకు వదిలివేస్తాడు. నిశ్చయంగా స్వాధీనపరచటం,వదిలివేయటం మరియు మరణం కలిగించటం,జీవింపజేయటంలో వీటిని చేసే సామర్ధ్యం కలవాడు ప్రజలను వారి మరణం తరువాతా లెక్కతీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు మరణాంతరం లేపటంపై సామర్ధ్యం కలవాడని యోచన చేసే ప్రజలకు ఆధారాలు కలవు.

(43) వాస్తవానికి ముష్రికులు తమ విగ్రహాలను అల్లాహ్ ను వదిలి వారి వద్ద ప్రయోజనమును ఆశిస్తూ సిఫారసు చేసేవారిగా చేసుకున్నారు. ఓ ప్రవక్తా వారితో మీరు ఇలా పలకండి : ఏమీ ఒక వేళ వారికి మీపై,వారి స్వయంపై ఎటువంటి అధికారము లేకపోయినా,వారు ఏమీ అర్ధం చేసుకోకపోయినా మీరు వారిని సిఫారసు చేసేవారిగా చేసుకుంటారా. వారు మాట్లాడలేని మూగబోయిన, వినలేని,చూడలేని,ప్రయోజనం కలిగించని,నష్టం కలిగించని రాతిపలకలు ?!.

(44) ఓ ప్రవక్తా ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : సిఫారసు అంతా ఒక్కడైన అల్లాహ్ కే చెందుతుంది. ఆయన వద్ద ఆయన అనుమతించిన వారు మాత్రమే సిఫరసు చేస్తారు. మరియు ఆయన ఇష్టపడిన వారి కొరకు మాత్రమే సిఫారసు చేస్తాడు. ఆకాశముల సామ్రాజ్యాధికారము మరియు భూమి సామ్రాజ్యాధికారము ఆయన ఒక్కడి కొరకే చెందుతుంది. ఆ తరువాత ప్రళయదినమున లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు ఆయన ఒక్కడి వైపునకే మీరు మరలించబడుతారు. అప్పుడు ఆయన మీ ఆచరణల పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

(45) మరియు ఒక్కడైన అల్లాహ్ ప్రస్తావన వచ్చినప్పుడు పరలోకమును మరియు అందులో ఉన్నటువంటి మరణాంతరం లేపబడటము,లెక్క తీసుకోబడటం,ప్రతిఫలం ప్రసాదించబడటం పై విశ్వాసమును కనబరచని ముష్రికుల హృదయములు ధ్వేషిస్తాయి. మరియు అల్లాహ్ ను వదిలి వారు ఆరాధించే విగ్రహాల ప్రస్తావన వచ్చినప్పుడు వారు సంతోషపడేవారు,ఆనందపడేవారు.

(46) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ అల్లాహ్ భూమ్యాకాశములను పూర్వ నమూనా లేకుండా సృష్టించినవాడా, అగోచర,గోచరాలను తెలిసినవాడా వాటిలో నుండి ఏదీ నీపై గోప్యంగా ఉండదు. నీవు ఒక్కడే ప్రళయదినమున దాసుల మధ్య వారు ఇహలోకంలో విభేదించుకున్న వాటి విషయంలో తీర్పునిచ్చేవాడివి. అప్పుడు సత్యవంతుడు ,అసత్యవంతుడు మరియు పుణ్యాత్ముడు, దుష్టుడు స్పష్టమవుతారు.

(47) మరియు ఒక వేళ షిర్కు,పాప కార్యములతో తమ స్వయముపై హింసకు పాల్పడిన వారి కొరకు భూమిలో ఉన్న విలువైన వస్తువులు,సంపదలు ఉంటే దాన్ని వారు మరణాంతరం లేపబడిన తరువాత చూసిన కఠినమైన శిక్షకు పరిహారంగా చెల్లిస్తారు. కాని అది వారి కొరకు ఉండదు. ఒక వేళ అది వారి వద్ద ఉన్నా అది వారి నుండి స్వీకరించబడదు. మరియు వారి కొరకు అల్లాహ్ వద్ద నుండి వారు ఊహించని రకరకాల శిక్షలు బహిర్గతమవుతాయి.

(48) మరియు వారు చేసుకున్న షిర్కు,పాపకార్యముల దుష్ఫలితాలు వారి ముందు బహిర్గతమవుతాయి. మరియు వారికి ఆ శిక్ష దేని గురించైతే వారు ఇహలోకములో భయపెట్టబడినప్పుడు పరిహాసమాడేవారో అది వారిని చుట్టుముట్టుతుంది.

(49) అవిశ్వాస మానవునికి రోగము గాని పేదరికం గాని వేరే ఏమైనా కలిగినప్పుడు అతనికి కలిగిన వాటిని అతని నుండి మేము తొలగించటానికి మమ్మల్ని వేడుకుంటాడు. ఆ తరువాత మేము అతనికి ఆరోగ్యము లేదా సంపద అనుగ్రహమును ప్రసాదించినప్పుడు అవిశ్వాసపరుడు ఇలా పలుకుతాడు : అల్లాహ్ తన జ్ఞానం వలన నేను దానికి యోగ్యుడినని గుర్తించి నాకు ప్రసాదించాడు. వాస్తవమేమిటంటే అది ఒక పరీక్ష మరియు మోసము. కాని చాలా మంది అవిశ్వాసపరులకు అది తెలియదు. అందుకనే వారు అల్లాహ్ వారికి అనుగ్రహించిన వాటితో మోసపోతున్నారు.

(50) వాస్తవానికి ఇలాంటి మాటనే వారికన్న పూర్వం గతించిన అవిశ్వాసపరులూ పలికారు. అప్పుడు వారు సంపాదించుకున్న సంపదలు మరియు స్థానం వారికి ఏమీ పనికి రాలేదు.

(51) అప్పుడు వారు పాల్పడిన షిర్కు,అవిధేయ కార్యాల యొక్క పాపముల ప్రతిఫలం వారిపై పడింది. మరియు హాజరై ఉన్న వీరందరిలోంచి షిర్కు,పాపకార్యములకు పాల్పడి తమపై హింసకు పాల్పడిన వారిపై వారు చేసుకున్న దుష్కర్మల ప్రతిఫలము గతించిన వారి మాదిరిగా వచ్చిపడుతుంది. మరియు వారు అల్లాహ్ నుండి తప్పించుకోలేరు మరియు ఆయనను ఓడించలేరు.

(52) ఏమి ఈ ముష్రికులందరు వారు పలికినదే పలికారా. మరియు వారికి తెలియదా అల్లాహ్ తాను తలచిన వారిపై ఆహారోపాధిని పుష్కలంగా ఇస్తాడు. అతడిని పరీక్షించటానికి అతడు కృతజ్ఞత తెలుపుకుంటాడా లేదా కృతఘ్నుడవుతాడా ?!. మరియు ఆయన దాన్ని తాను కోరిన వారిపై కుదించివేస్తాడు అతడిని పరీక్షించటానికి అతడు అల్లాహ్ యొక్క కుదించటంపై సహనం చూపుతాడా లేదా ఆగ్రహానికి లోనవుతాడా ?!. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడినటువంటి ఆహారోపాధిని పుష్కలంగా చేయటం మరియు దాన్ని కుదించటంలో విశ్వసించే జనుల కొరకు అల్లాహ్ పర్యాలోచనపై సూచనలు కలవు. ఎందుకంటే వారే ఆధారాల ద్వారా ప్రయోజనం చెందుతారు. మరియు అవిశ్వాసపరులు వాటిపై నుండి వాటి నుండి విముఖత చూపుతూ దాటిపోతారు.

(53) ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ తో పాటు సాటి కల్పించి,పాపకార్యములకు పాల్పడి తమ స్వయంపై అతిక్రమించిన నా దాసులతో ఇలా పలకండి : మీరు అల్లాహ్ కారుణ్యము నుండి మరియు మీ పాపములకు ఆయన మన్నింపు నుండి నిరాశ చెందకండి. నిశ్ఛయంగా అల్లాహ్ ఆయన వైపునకు పశ్చాత్తాపముతో మరలేవారి పాపములన్నింటిని మన్నించి వేస్తాడు. నిశ్ఛయంగా ఆయన పశ్ఛాత్తాప్పడే వారి పాపములను బాగా మన్నించేవాడును, వారిపై కరుణించేవాడును.

(54) మరియు మీరు ప్రళయదనమున శిక్ష మీ వద్దకు రాక మునుపు పశ్ఛాత్తాపముతో మరియు సత్కర్మలతో మీ ప్రభువు వైపునకు మరలండి. మరియు ఆయనకు విధేయులవ్వండి. ఆ తరువాత శిక్ష నుండి మిమ్మల్ని రక్షించటం ద్వారా మీకు సహాయపడే వాడిని మీ విగ్రహాల్లోంచి గాని మీ ఇంటి వారిలోంచి గాని మీరు పొందరు.

(55) మరియు మీరు మీ ప్రభువు తన ప్రవక్తపై అవతరింపజేసిన శ్రేష్ఠమైన ఖుర్ఆన్ ను అనుసరించండి. అయితే మీరు దాని ఆదేశములను పాటించండి మరియు అది వారించిన వాటి నుండి దూరంగా ఉండండి. మీ వద్దకు శిక్ష అకస్మాత్తుగా రాక ముందే. మరియు మీరు దాని కొరకు పశ్చాత్తాపముతో సిద్ధం కావటానికి దాన్ని మీరు గ్రహించలేరు.

(56) ప్రళయదినమున అవమాన తీవ్రత వలన ఏ ప్రాణమయినా ఇలా పలకటం నుండి జాగ్రత్తగా ఉండటానికి మీరు దాన్ని చేయండి : అయ్యో అల్లాహ్ విషయంలో అది దేనిపైనైతే ఉన్నదో అవిశ్వాసము,పాపకార్యముల వలన అది చేసిన నిర్లక్ష్యం పై మరియు విశ్వాసపరులపై,విధేయులపై అది ఎగతాళి చేయటం పై దాని అవమానము.

(57) లేదా అది (ప్రాణము) విధి వ్రాత గురించి వాదించి ఇలా పలకటం నుండి : ఒక వేళ అల్లాహ్ నన్ను అనుగ్రహించి ఉంటే నేను కూడా ఆయనకు భయపడేవారిలోంచి అయిపోయి,ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండేవాడిని.

(58) లేదా అది శిక్షను చూసినప్పుడు ఆశపడుతూ ఇలా పలకటం నుండి : ఒక వేళ నాకు ఇహలోకం వైపునకు మరలింపు ఉంటే నేను అల్లాహ్ తో తౌబా చేసి తమ కర్మలను మంచిగా చేసుకునే వారిలో నుంచి అయిపోతాను.

(59) సన్మార్గమును ఆశించి నీవు అనుకున్నట్లు విషయం కాదు. వాస్తవానికి నా సూచనలు నీ వద్దకు వచ్చాయి అప్పుడు నీవు వాటిని తిరస్కరించి అహంకారమును చూపావు. మరియు అల్లాహ్ పట్ల,ఆయన ఆయతుల పట్ల,ఆయన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరిచే వారిలో నుంచి అయిపోయావు.

(60) మరియు ప్రళయదినమున మీరు అల్లాహ్ పై ఆయనతో సాటిని మరియు సంతానమును అంటగట్టి అబద్దమును ఆపాదించే వారి ముఖములను నల్లగా మారటమును చూస్తారు. వారి దుష్టత్వమునకు ఒక చిహ్నము. ఏమీ అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచటం పై అహంకారమును చూపేవారి కొరకు నరకంలో ఆశ్రయం లేదా ?. ఎందుకు లేదు. నిశ్చయంగా వారి కొరకు అందులో ఆశ్రయం ఉన్నది.

(61) ఎవరైతే తమ ప్రభువు పట్ల ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయభీతి కలిగి ఉంటారో వారిని అల్లాహ్ వారి సాఫల్య ప్రదేశమైన స్వర్గములో ప్రవేశింపజేసి శిక్ష నుండి రక్షిస్తాడు. వారికి శిక్ష ముట్టుకోదు. తాము ఇహలోక భాగములను కోల్పోవటంపై దుఃఖించరు.

(62) అల్లాహ్ యే ప్రతీ వస్తువును సృష్టించినవాడు. మరియు ఆయన ప్రతీ వస్తువును సంరక్షించేవాడు. దాని వ్యవహారమును పర్యాలోచన చేసి దాన్ని తాను తలచిన విధంగా నడిపిస్తాడు.

(63) ఆకాశములలో,భూమిలో ఉన్న మేళ్ళ నిక్షేపాల యొక్క తాళాలు ఆయన ఒక్కడి చేతిలో కలవు. ఆయన వాటిని తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. తాను తలచిన వారి నుండి వాటిని ఆపుతాడు. మరియు అల్లాహ్ ఆయతులపట్ల అవిశ్వాసమును కనబరిచేవారందరే తమ ఇహలోక జీవితంలో విశ్వాసమును కోల్పోవటం వలన మరియు వారు పరలోకములో నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటూ ప్రవేశించటం వలన నష్టమును చవిచూస్తారు.

(64) ఓ ప్రవక్తా మిమ్మల్ని తమ విగ్రహాలను ఆరాధించమని ప్రేరేపించే ఈ ముష్రికులందరితో ఇలా పలకండి : ఓ మీ ప్రభువు పట్ల అజ్ఞానులైన వారా మీరు నన్ను అల్లాహ్ ను వదిలి ఇతరులను ఆరాధన చేయమని ఆదేశిస్తున్నారా ?. కేవలం అల్లాహ్ ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. కాబట్టి నేను ఆయనను వదిలి ఇతరులను ఆరాధించనంటే ఆరాధించను.

(65) ఓ ప్రవక్తా నిశ్చయంగా అల్లాహ్ మీ వైపునకు ఇలా దైవవాణిని అవతరింపజేశాడు మరియు మీకన్న పూర్వ ప్రవక్తలకు ఇలా దైవవాణిని అవతరింపజేశాడు : ఒక వేళ మీరు అల్లాహ్ తో పాటు ఇతరులను ఆరాధన చేస్తే మీ సత్కర్మ యొక్క పుణ్యము వృధా అయిపోతుంది. మరియు మీరు ఇహలోకములో మీ ధర్మమును నష్టపోవటము ద్వారా మరియు పరలోకములో శిక్ష ద్వారా నష్టపోయేవారిలోంచి అయిపోతారు.

(66) అలా కాదు మీరు అల్లాహ్ ఒక్కడినే ఆరాధించి ఆయనతో పాటు ఎవరిని సాటి కల్పించకండి. మరియు మీరు ఆయన మీకు అనుగ్రహించిన ఆయన అనుగ్రహాలపై కృతజ్ఞతలు తెలుపుకునే వారిలోంచి అయిపోండి.

(67) మరియు ముష్రికులు బలహీనులైన,అశక్తులైన అల్లాహ్ సృష్టిరాసుల్లోంచి ఇతరులను ఆయనతో పాటు సాటి కల్పించినప్పుడు అల్లాహ్ ను ఏవిధంగా ఆదరించాలో ఆవిధంగా ఆదరించలేదు. మరియు వారు అల్లాహ్ సామర్ధ్యమును నుండి నిర్లక్ష్యం వహించారు. దాని (అల్లాహ్ సామర్ధ్యం) దృశ్యముల్లోంచి భూమి తనలో ఉన్నటువంటి పర్వతాలు,చెట్లు,కాలువలు,సముద్రాలతో సహా ప్రళయదినమున ఆయన ఆదీనంలో (పిడికిిలిలో) ఉంటాయి. మరియు సప్తాకాశములన్నీ ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. మరియు ముష్రికులు ఆయన గురించి పలుకుతున్న మాటల నుండి,విశ్వసిస్తున్న విశ్వాసముల నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు మరియు మహోన్నతుడు.

(68) ఆ రోజు బాకా ఊదే బాధ్యత ఇవ్వబడిన దూత కొమ్ములో (బాకాలో) ఊదుతాడు. అప్పుడు ఆకాశములలో మరియు భూమిలో ఉన్నవన్నీ చనిపోతాయి. ఆ పిదప దైవదూత రెండవసారి మరణాంతరం లేపబడటానికి అందులో (బాకాలో) ఊదుతాడు. అప్పుడు జీవించిన వారందరు నిలబడి అల్లాహ్ వారి పట్ల ఏమి వ్యవహరిస్తాడని నిరీక్షిస్తుంటారు.

(69) సర్వాధిక్యుడైన ప్రభువు దాసుల మధ్య తీర్పునివ్వటం కొరకు ప్రత్యక్షమయినప్పుడు భూమి కాంతితో వెలిగిపోతుంది. మరియు ప్రజల కర్మల పత్రాలు తెరవబడుతాయి. మరియు ప్రవక్తలను తీసుకుని రావటం జరుగుతుంది. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జాతి వారిని దైవ ప్రవక్తల కొరకు వారి జాతుల వారిపై సాక్ష్యం పలకటానికి తీసుకురాబడుతుంది. మరియు అల్లాహ్ వారందరి మధ్య న్యాయపరంగా తీర్పునిస్తాడు. ఆ రోజు వారికి అన్యాయం చేయబడదు. అప్పుడు ఏ మనిషి యొక్క పాపము అధికం చేయబడదు మరియు ఏ పుణ్యమూ తగ్గించబడదు.

(70) అల్లాహ్ ప్రతీ ప్రాణము యొక్క పుణ్యమును పూర్తి చేస్తాడు. దాని ఆచరణ మంచి అయినా గాని చెడు అయినా గాని. వారు చేస్తున్నది అల్లాహ్ కు తెలుసు. వారి కార్యల్లోంచి మంచివైనవి , చెడ్డవైనవి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే ఆ రోజు వారికి వారి కర్మలపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

(71) మరియు దైవదూతలు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచిన వారిని నరకం వైపునకు గుంపులు గుంపులుగా అవమానపరచి తోలుతారు. చివరికి వారు నరకం వద్దకు వచ్చినప్పుడు వారి కొరకు దానిపై బాధ్యులుగా నియమింపబడిన దైవదూతల్లోంచి దాని పర్యవేక్షకులు దాని తలపులను తెరుస్తారు. మరియు వారు వారితో మందలింపులతో ఇలా పలుకుతూ అభివందనములు చేస్తారు : ఏమీ మీ వద్దకు మీ కోవకు చెందిన ప్రవక్తలు తమపై అవతరింపబడిన మీ ప్రభువు ఆయతులను మీపై చదువుతూ మరియు మిమ్మల్ని ప్రళయదినమున కలవటం గురించి అందులో ఉన్న కఠినమైన శిక్ష నుండి మిమ్మల్ని భయపెడుతూ రాలేదా ?. అవిశ్వాసపరులు స్వయంగా అంగీకరిస్తూ ఇలా పలుకుతారు : ఎందుకు కాదు. వాస్తవానికి ఇదంత జరిగింది. మరియు అవిశ్వాసపరులపై శిక్ష యొక్క వాక్కు అనివార్యమైనది. మరియు మేము అవిశ్వసిస్తూ ఉండేవారము.

(72) వారిని అవమానపరుస్తూ మరియు అల్లాహ్ కారుణ్యము నుండి, నరకాగ్ని నుండి బయటపడటం నుండి నిరాశపరుస్తూ వారితో ఇలా పలకబడుతుంది : మీరు నరక ద్వారాలలోనికి అందులో శాశ్వతంగా ఉంటూ ప్రవేశించండి. సత్యం ముందు గర్వపడే మరియు అహంకారమును చూపే వారి నివాసము ఎంతో చెడ్డది మరియు దుర్భరమైనది.

(73) మరియు దైవదూతలు తమ ప్రభువు ఆదేశాలను పాటించి,ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి ఆయన భయభీతి కలిగిన విశ్వాసపరులను గౌరవోన్నతులైన(దైవదూదలు) గుంపులుగుంపులుగా స్వర్గం వైపునకు మృధువుగా తీసుకునివస్తారు. చివరికి వారు స్వర్గం వద్దకు వచ్చినప్పుడు వారి కొరకు దాని ద్వారములు తెరవబడి ఉంటాయి. మరియు దాని బాధ్యత ఇవ్వబడిన దైవదూతలు వారితో ఇలా పలుకుతారు : ప్రతీ కీడు నుండి మరియు మీరు ఇష్టపడని ప్రతీ దాని నుండి మీపై శాంతి కురియుగాక. మీ మనస్సులు,మీ కర్మలు శ్రేష్ఠమయ్యాయి. అయితే మీరు స్వర్గములో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశించండి.

(74) స్వర్గంలో ప్రవేశించినప్పుడు విశ్వాసపరులు ఇలా పలుకుతారు : పొగడ్తలన్నీ ఆ అల్లాహ్ కొరకే ఎవరైతే తన ప్రవక్తల నోటి ద్వారా మాకు చేసిన వాగ్దానమును మాకు నిజం చేసి చూపించాడో. నిశ్ఛయంగా ఆయన మమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపచేస్తాడని,స్వర్గము యొక్కభూమికి మమ్మల్ని వారసులను చేస్తానని మాకు వాగ్దానం చేశాడు. మేము అక్కడ దిగదలచిన చోటులో దిగుతాము. తమ ప్రభువు మన్నతను ఆశిస్తూ సత్కర్మలు చేసే వారి పుణ్యము ఎంతో గొప్పది.

(75) మరియు దైవదూతలు ఈ హాజరుపరచబడే రోజున సింహాసనమును (అర్ష్ ను) చుట్టుముట్టి ఉంటారు. అవిశ్వాసపరులు పలుకుతున్న అల్లాహ్ కు తగని మాటల నుండి వారు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడుతూ ఉంటారు. మరియు అల్లాహ్ సృష్టిరాసులందరి మధ్య న్యాయముతో తీర్పునిస్తాడు. గౌరవించిన వాడిని గౌరవిస్తాడు. మరియు శిక్షించిన వాడిని శిక్షిస్తాడు. మరియు ఇలా పలుకబడింది : ప్రశంసలన్నీ సృష్టిరాసుల ప్రభువైన అల్లాహ్ కొరకు తన విశ్వాసపరులైన దాసుల కొరకు కారుణ్యము గురించి,మరియు అవిశ్వాసపరుల దాసుల కొరకు శిక్ష గురించి ఆయన తీర్పునిచ్చిన తన తీర్పు పై.