(1) హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
(2) ఎవరు ఆధిక్యత చూపని సర్వాధిక్యుడైన,తన దాసుల ప్రయోజనముల గురించి జ్ఞానము కలిగిన అల్లాహ్ తరపు నుండి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఖుర్ఆన్ అవతరణ
(3) పాపాలకు పాల్పడే వారి పాపములను మన్నించేవాడు, తన దాసుల్లోంచి తన వైపునకు తౌబా చేసేవారి తౌబాను స్వీకరించేవాడు, ఎవరైతే తన పాపముల నుండి తౌబా చేయడో వారిని కఠినంగా శిక్షించేవాడు, దాతృత్వం కలవాడు,అనుగ్రహించేవాడు. ఆయన తప్ప సత్య ఆరాధ్యదైవం వేరేది లేదు. ప్రళయదినమున దాసుల మరలింపు ఆయన ఒక్కడి వైపే జరుగును. అప్పుడు ఆయన వారు దేనికి హక్కుదారులో అది వారికి ప్రసాదిస్తాడు.
(4) అల్లాహ్ తౌహీద్ పై మరియు ఆయన ప్రవక్త నిజాయితీపై సూచించే అల్లాహ్ ఆయతుల విషయంలో తమ బుద్ధులు చెడిపోవటం వలన అల్లాహ్ పట్ల అవిశ్వాసమునకు పాల్పడిన వారు మాత్రమే తగువులాడుతారు. వారి మూలంగా మీరు దుఃఖించకండి. మరియు ఆహారోపాధిలో,అనుగ్రహాల్లో వారికి ఉన్న పుష్కలము మిమ్మల్ని మోసగించకూడదు. కావున వారికి గడువివ్వటం వారికి నెమ్మదినెమ్మదిగా (శిక్షకు) దగ్గర చేయటం మరియు వారి పట్ల వ్యూహ రచన చేయటం.
(5) వీరందరికన్న ముందు నూహ్ అలైహిస్సలాం జాతివారు తిరస్కరించారు. మరియు వారి కన్న ముందు నూహ్ అలైహిస్సలాం జాతి వారి తరువాత వర్గాల వారు తిరస్కరించారు. ఆద్ జాతి తిరస్కరించింది మరియు సమూద్,లూత్ జాతి,మద్యన్ వారు తిరస్కరించారు. మరియు ఫిర్ఔన్ తిరస్కరించాడు. మరియు సమాజముల్లోంచి ప్రతీ సమాజము తమ ప్రవక్తను పట్టుకుని అతన్ని హతమార్చటానికి దృఢ సంకల్పం చేసుకున్నారు. మరియు వారు తమ వద్దనున్న అసత్యముతో సత్యమును తొలగించటానికి వాదులాడారు. ఆ సమాజములన్ని పట్టుబడ్డాయి. వారిపై నా శిక్ష ఎలా ఉన్నది యోచన చేయండి. అది కఠినమైన శిక్ష.
(6) మరియు ఏ విధంగానైతే ఈ తిరస్కార సమాజముల వినాశనము యొక్క అల్లాహ్ తీర్పునిచ్చాడో ఓ ప్రవక్తా అవిశ్వాసపరులు నరకవాసులన్న దానిపై నీ ప్రభువు యొక్క మాట అనివార్యమైనది.
(7) ఓ ప్రవక్తా నీ ప్రభువు యొక్క సింహాసమును మోస్తున్న దైవదూతలు మరియు దాని చుట్టు ఉన్న వారు తమ ప్రభువుకు తగని వాటి నుండి పరిశుద్ధతను కొనియాడుతారు. మరియు ఆయనను విశ్వసిస్తారు. మరియు అల్లాహ్ పై విశ్వాసమును కనబరచిన వారి కొరకు మన్నింపును వేడుకుంటారు. తమ దుఆల్లో ఇలా పలుకుతూ : ఓ మా ప్రభువా నీ జ్ఞానం మరియు నీ కారుణ్యం ప్రతీ వస్తువుని చుట్టుముట్టి ఉన్నది. అయితే నీవు తమ పాపముల నుండి మన్నింపును వేడుకుని నీ ధర్మమును అనుసరించిన వారిని మన్నించు. మరియు వారికి నరకాగ్ని ముట్టుకోవటం నుంచి వారిని రక్షించు.
(8) మరియు దైవదూతలు ఇలా పలుకుతారు : ఓ మా ప్రభువా నీవు విశ్వాసపరులని ఆ శాశ్వత స్వర్గవనాల్లోకి ప్రవేశింపజేయి వేటిలోనైతే నీవు వారిని ప్రవేశింపజేస్తానని వాగ్దానం చేశావో. మరియు నీవు వారితో పాటు వారి తాతముత్తాతల్లోంచి, వారి భార్యల్లోంచి,వారి సంతానములో నుంచి ఎవరి ఆచరణ మంచిగా ఉన్నదో వారినీ ప్రవేశింపజేయి. నిశ్చయంగా నీవే సర్వాధిక్యుడివి నీపై ఎవరూ ఆధిక్యత చూపలేరు. నీ విధివ్రాతలో మరియు నీ పర్యాలోచనలో విజ్ఞత కలవాడివి.
(9) మరియు నీవు వారిని వారి దుష్కర్మల నుండి పరిరక్షించు. వారిని వాటి పరంగా శిక్షించకు. ప్రళయదినమున నీవు ఎవడినైతే అతని దుష్కర్మల పై శిక్ష నుండి పరిరక్షిస్తావో అతడిపై నీవు కనికరించావు. శిక్ష నుండి ఈ రక్షణ మరియు స్వర్గ ప్రవేశముతో కారుణ్యము ఇదే ఏదీ సరి తూగని గొప్ప సాఫల్యము.
(10) నిశ్చయంగా అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త పై అవిశ్వాసమును కనబరచినవారు నరకములో ప్రవేశించేటప్పుడు మరియు తమ స్వయంపై కోపాన్ని ప్రదర్శించుకుని తమను దూషించుకునే టప్పుడు ఇలా పిలవబడుతారు : మీ స్వయం కొరకు ఉన్న మీ ధ్వేషము తీవ్రత కన్నా మీరు ఇహలోకంలో అల్లాహ్ పై విశ్వాసమును కనబరచటం వైపునకు పిలవబడితే మీరు ఆయన్ని తిరస్కరించి,ఆయనతో పాటు ఇతర ఆరాధ్య దైవమును ఏర్పరచుకున్నప్పుడు అల్లాహ్ యొక్క ధ్వేషము తీవ్రత మీ కొరకు అధికంగా ఉండేది.
(11) మరియు అవిశ్వాసపరులు తమ పాపములను అంగీకరిస్తూ ఇలా పలుకుతారు అప్పుడు వారి అంగీకారము గాని వారి పశ్చాత్తాపము గాని ప్రయోజనం కలిగించదు : ఓ మా ప్రభువా నీవు మాకు రెండు సార్లు మరణమును కలిగించావు మేము ఉనికిలో లేనప్పుడు అప్పుడు నీవు మమ్మల్ని ఉనికిలోకి తెచ్చావు, ఆ తరువాత ఉనికిలోకి తెచ్చిన తరువాత నీవు మమ్మల్ని మరణింపజేశావు. మరియు నీవు మమ్మల్ని రెండు సార్లు జీవింపజేశావు ఉనికిలో లేని స్థితి నుండి ఉనికిలోకి తెచ్చి మరియు మరణాంతరం లేపటం కొరకు మమ్మల్ని జీవింపజేసావు. మేము చేసుకున్న పాపములను మేము అంగీకరించాము. ఏమి ఏదైన మార్గము ఉన్నదా దానిపై మేము నడిచి మేము నరకాగ్ని నుండి బయటపడటానికి. అప్పుడు మేము మా కర్మలను సరిచేసుకోవటానికి జీవితం వైపునకు మరలుతాము . అప్పుడు నీవు మా నుండి సంతుష్టి చెందుతావు ?!.
(12) మీరు శిక్షించబడిన ఈ శిక్షకు కారణం ఏమిటంటే ఒక్కడైన అల్లాహ్ ఆరాధన చేయబడి,ఆయనతో పాటు ఎవరినీ సాటి కల్పించబడనప్పుడు మీరు ఆయన పట్ల అవిశ్వాసమును కనబరచి,ఆయన కొరకు భాగస్వాములను తయారు చేసుకున్నారు. మరియు అల్లాహ్ తో పాటు ఎవరైన భాగస్వామి ఆరాధన చేయబడితే మీరు విశ్వసించారు. ఆదేశము ఒక్కడైన అల్లాహ్ కొరకే. తన అస్తిత్వంలో,తన సామర్ధ్యంలో,తన ఆధిక్యతలో మహోన్నతుడు. అన్నింటి కన్న గొప్పవాడు.
(13) ఆల్లాహ్ ఆయనే మీకు తన సూచనలను విశ్వంలో,ప్రాణముల్లో తన సామర్ధ్యముపై,తన ఏకత్వముపై అవి మిమ్మల్ని సూచించటానికి చూపిస్తాడు. మరియు ఆయన మీ కొరకు ఆకాశము నుండి వర్షపు నీటిని మీరు ఆహారముగా ప్రసాదించబడే మొక్కలు,పంటలు వివిధ వాటికి కారణం అవటానికి కురిపిస్తాడు. మరియు అల్లాహ్ ఆయతులతో ఆయన వైపునకు పశ్ఛాత్తాపముతో,చిత్తశుద్ధితో మరలేవాడు మాత్రమే హితబోధనను గ్రహిస్తాడు.
(14) ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ కు విధేయత చూపటంలో మరియు వేడుకోవటంలో ఆయన కొరకు చిత్తశుద్ధిని చూపుతూ,ఆయనతో పాటు సాటి కల్పించకుండా ప్రార్ధించండి. ఒక వేళ దాన్ని అవిశ్వాసపరులు ఇష్టపడకపోయినా మరియు వారికి కోపం కలిగించిన.
(15) ఆయన కొరకు ఆరాధన మరియు విధేయత ప్రత్యేకించబడటానికి ఆయనే యోగ్యుడు. ఆయన తన సృష్టిరాసులన్నింటి కన్న వ్యత్యాసమైన ఉన్నత స్థానములు కలవాడు. మరియు ఆయన మహోన్నత సింహాసనమునకు ప్రభువు. ఆయన తన దాసుల్లోంచి తాను తలచిన వారిపై వారు జీవించి ఉండటానికి మరియు ఇతరులను జీవింపజేయటానికి మరియు మొదటి వారు,చివరి వారు కలుసుకునే రోజైన ప్రళయదినము నుండి ప్రజలను వారు భయపెట్టటానికి దైవవాణిని అవతరింపజేస్తాడు.
(16) ఆ రోజు వారు బహిర్గతమై ఒకే ప్రాంతంలో సమావేశమవుతారు. వారి నుండి అల్లాహ్ పై వారి అస్తిత్వాల్లోంచిగాని వారి కర్మల్లోంచి గాని వారి ప్రతిఫలముల్లోంచి గాని ఏదీ గోప్యంగా ఉండదు. ఈ రోజు విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరి కొరకు ? అని అడుగుతాడు. అప్పుడు సమాధానం ఒక్కటే అవుతుంది . సామ్రాజ్యాధికారము తన అస్తిత్వంలో,తన గుణగణాల్లో,తన కార్యాల్లో ఒక్కడే అయిన అల్లాహ్ కే చెందుతుంది. అన్నింటిపై ఆధిక్యత కలవాడు మరియు ప్రతీది ఆయనకు లోబడి ఉంటుంది.
(17) ఆ రోజు ప్రతీ మనిషి తాను చేసుకున్న కర్మలకు ప్రతిఫలం ప్రసాదించబడుతాడు. ఒక వేళ అది మంచిగా ఉంటే (ప్రతిఫలం) మంచిగా ఉంటుంది. ఒక వేళ అది చెడుగా ఉంటే (ప్రతిఫలం) చెడుగా ఉంటుంది. ఆ రోజు అన్యాయం చేయబడదు. ఎందుకంటే తీర్పునిచ్చేవాడు అల్లాహ్ యే న్యాయాధిపతి. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల కొరకు వారిని తన జ్ఞానం పరంగా చుట్టుముట్టి ఉండటం వలన త్వరగా లెక్క తీసుకునేవాడు.
(18) ఓ ప్రవక్తా మీరు వారిని ప్రళయదినము నుండి భయపెట్టండి. దగ్గరకు వచ్చిన ఈ ప్రళయము వస్తున్నది. మరియు ప్రతీ వచ్చేది దగ్గరవుతుంది. ఆ రోజున హృదయములు దాని భయాందోళనల వలన పైకి వచ్చేస్తాయి చివరికి అవి తమ యజమానుల గొంతుల వరకు వచ్చేస్తాయి. ఎవరైతే మౌనంగా ఉంటారో వారిలో నుండి ఎవరూ మాట్లాడరు కాని కరుణామయుడు ఎవరికి అనుమతిస్తే తప్ప. మరియు షిర్కు,పాపకార్యముల ద్వారా తమ స్వయంపై హింసకు పాల్పడే వారి కొరకు ఏ స్నేహితుడు గాని దగ్గరి బంధువు గాని ఉండడు. మరియు అతని కొరకు సిఫారసు చేయటానికి నియమించబడినప్పుడు అతని మాట చెలామణి చేసుకొనబడే సిఫారసు చేసేవాడు ఎవడూ ఉండడు.
(19) చూసేవారి కళ్ళు గోప్యంగా మోసం చేసి తీసుకునే వాటి గురించి అల్లాహ్ కు తెలుసు. మరియు హృదయములు దాచే వాటి గురించి ఆయనకు తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
(20) మరియు అల్లాహ్ న్యాయముగా తీర్పునిస్తాడు. ఆయన ఏ ఒక్కరిని అతని పుణ్యాలను తగ్గించి మరియు అతని పాపములను అధికం చేసి హింసించడు. మరియు ఎవరినైతే ముష్రికులు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్నారో వారు దేని గురించి తీర్పునివ్వరు. ఎందుకంటే వాటికి దేని అధికారము లేదు. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల మాటలను బాగా వినేవాడును, వారి సంకల్పాలను,వారి కర్మలను చూసేవాడును. మరియు ఆయన వారికి వాటిపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(21) ఏమిటీ ఈ ముష్రికులందరు భూమిలో సంచరించలేదా వారికన్న ముందు తిరస్కరించిన జాతుల వారి ముగింపు ఏమయిందో వారు యోచన చేయటానికి. నిశ్ఛయంగా ముగింపు దుర్బరంగా అయినది. ఆ జాతుల వారు వీరందరి కన్న అధిక బలము కలవారు. మరియు వారు భూమిలో నిర్మాణములు ఏర్పరచి వారందరు వదలనన్ని గుర్తులను వదిలి వెళ్ళారు. అప్పుడు అల్లాహ్ వారి పాపముల వలన వారిని నాశనం చేశాడు. మరియు వారి కొరకు అల్లాహ్ శిక్ష నుండి వారిని ఆపేవాడు ఎవడూ లేకపోయాడు.
(22) వారికి కలిగిన ఈ శిక్ష వారికి మాత్రమే కలిగినది. ఎందుకంటే వారి వద్దకు వారి ప్రవక్తలు అల్లాహ్ వద్ద నుండి స్పష్టమైన సూచనలను మరియు అద్భుతమైన వాదనలను తీసుకుని వచ్చారు. అప్పుడు వారు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,ఆయన ప్రవక్తలను తిరస్కరించారు. మరియు వారు దానికి తోడుగా అధిక బలమును కలిగి ఉన్నారు. అప్పుడు అల్లాహ్ వారిని పట్టుకుని తుదిముట్టించాడు. నిశ్ఛయంగా పరిశుద్ధుడైన ఆయన మహా బలశాలి,తనపట్ల అవిశ్వాసమునకు పాల్పడి తన ప్రవక్తను తిరస్కరించే వాడిని కఠినంగా శిక్షించేవాడు.
(23) మరియు నిశ్ఛయంగా మేము మూసా అలైహిస్సలాం ను మా స్పష్టమైన సూచనలతో మరియు ఖచ్చితమైన ఆధారములతో పంపించాము.
(24) ఫిర్ఔన్,అతని మంత్రి హామాన్ మరియు ఖారూన్ వద్దకు. అప్పుడు వారు ఇలా పలికారు : మూసా తాను ప్రవక్త అని వాదిస్తున్న విషయంలో మంత్రజాలకుడు,అసత్యవాది.
(25) మూసా అలైహిస్సలాం వారి వద్దకు తన నజాయితీపై సూచించే ఆధారాలను తీసుకొచ్చినప్పుడు ఫిర్ఔన్ ఇలా పలికాడు : అతని తో పాటు విశ్వసించిన వారి మగ సంతానమును హతమార్చి వారి ఆడవారిని వారికి అవవమానము కొరకు వదిలివేయండి. విశ్వాసపరుల సంఖ్యా బలమును తగ్గించే ఆదేశముతో అవిశ్వాసపరుల కుట్ర మాత్రం నాశనమయింది,వెళ్ళిపోయింది. దాని ఎటువంటి ప్రభావం లేకపోయింది.
(26) మరియు ఫిర్ఔన్ ఇలా పలికాడు : మీరు నన్ను వదలండి నేను మూసాను అతనికి శిక్షగా చంపివేస్తాను. మరియు అతడు నా నుండి అతడిని ఆపటానికి తన ప్రభువును పిలుచుకోవాలి. అతను తన ప్రభువును పిలుచుకోవటమును నేను లెక్కచేయను. మీరు ఉన్న ధర్మమును అతడు మార్చి వేస్తాడని లేదా హతమార్చటం మరియు విధ్వంసం చేయటం ద్వారా భూమిలో చెడును వ్యాపింపజేస్తాడని నేను భయపడుతున్నాను.
(27) మరియు మూసా అలైహిస్సలాం తన కొరకు ఫిర్ఔన్ బెదిరింపులను తెలుసుకున్నప్పుడు ఇలా పలికారు : సత్యము నుండి మరియు దానిపై విశ్వాసము నుండి అహంకారమును చూపే,ప్రళయదినము పై మరియు అందులో ఉన్న లెక్క తీసుకోవటం మరియు శిక్షంచటం పై విశ్వాసమును కనబరచని ప్రతీ వ్యక్తి నుండి నిశ్ఛయంగా నేను నా ప్రభువు, మీ ప్రభువుని(అల్లాహ్ని) ఆశ్రయించి రక్షణను కోరుతాను.
(28) మరియు ఫిర్ఔన్ వంశము నుండి అల్లాహ్ పై విశ్వాసముంచిన ఒక వ్యక్తి తన విశ్వాసమును తన జాతి వారి నుండి దాచి ఉంచినవాడు మూసా హత్య గురించి వారు చేసుకున్న దృఢ సంకల్పమును విభేదిస్తూ ఇలా పలికాడు : ఏమీ మీరు ఏ పాపము చేయని ఒక వ్యక్తిని నా ప్రభువు అల్లాహ్ అని చెప్పినంత మాత్రాన చంపేస్తారా ?. వాస్తవానికి అతను తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని అతని వాదనలో అతని నిజాయితీ పై సూచించే వాదనలను మరియు ఆధారాలను మీ వద్దకు తీసుకుని వచ్చాడు. ఒక వేళ అతడు అసత్యపరుడని అనుకుంటే అతని అసత్యము యొక్క కీడు అతనిపైనే మరలుతుంది. ఒక వేళ అతడు నిజాయితీపరుడైతే మీకు అతను వాగ్దానం చేసిన శిక్ష నుండి కొంత భాగము తొందరగా మీకు చేరుతుంది. నిశ్ఛయంగా అల్లాహ్ తన హద్దులను అతిక్రమించే వాడిని,తనపై మరియు తన ప్రవక్త పై అబద్దములను అపాదించేవాడికి సత్యము వైపునకు భాగ్యమును కలిగించడు.
(29) ఓ నా జాతి వారా ఈ రోజు రాజ్యాధికారం మీదే ,మిసర్ భూ బాగములో విజయమును పొందేవారు మీరే. మూసాను హతమార్చటం వలన మాపై అల్లాహ్ శిక్ష వచ్చిపడితే మాకు సహాయం చేసేవాడు ఎవడు ?!. ఫిర్ఔన్ ఇలా పలికాడు : నాదే నిర్ణయం మరియు నాదే ఆదేశం. మరియు నేను కీడును,చెడును తొలగించటానికి మూసాను హతమార్చదలిచాను. మరియు నేను మిమ్మల్ని మాత్రం సరైన,సముచితమైన మార్గమును మాత్రమే మీకు చూపుతాను.
(30) విశ్వసించిన వాడు తన జాతివారిని హితోపదేశం చేస్తూ ఇలా పలికాడు : ఒక వేళ మీరు దుర్మార్గముతో ,శతృత్వముతో మూసా ను హతమారిస్తే మీ పై నేను పూర్వ ప్రవక్తలపై వర్గాలుగా వచ్చిన వర్గముల శిక్ష లాంటి శిక్ష మీ పై వచ్చిపడతుందని నేను భయపడుతున్నాను. అప్పుడు అల్లాహ్ వారిని నాశనం చేశాడు.
(31) నూహ్ జాతి ,ఆద్, సమూద్ మరియు వారి తరువాత వచ్చినటువంటివారు ఎవరైతే అవిశ్వశించి ప్రవక్తలను తిరస్కరించిన వారి అలవాటు లాంటిది. నిశ్ఛయంగా అల్లాహ్ వారిని వారి అవిశ్వాసము,తన ప్రవక్తను వారు తిరస్కరించటం వలన తుదిముట్టించాడు. మరియు అల్లాహ్ దాసుల కొరకు హింసను కోరుకోడు. ఆయన మాత్రం వారిని వారి పాపముల వలన శిక్షిస్తాడు. పూర్తి ప్రతిఫలంగా.
(32) ఓ నా జాతి ప్రజలారా నిశ్చయంగా నేను మీపై ప్రళయదినము గురించి భయపడుతున్నాను. ఆ రోజు ప్రజలు ఒకరినొకరు బంధుత్వం వలన లేదా ఉన్నత స్థానం వలన ఈ వర్గము ఈ భయానక స్థితిలో ప్రయోజనం కలిగిస్తుందని భావించి పిలుస్తారు.
(33) ఆ రోజు మీరు నరకాగ్ని నుండి భయపడి వెనుతిప్పి పారిపోతారు. అల్లాహ్ శిక్ష నుండి మిమ్మల్ని ఆపేవాడు మీ కొరకు ఎవడూ ఉండడు. మరియు అల్లాహ్ ఎవరినైతే నిస్సహాయ స్థితిలో వదిలివేసి అతనికి విశ్వాసము కొరకు భాగ్యమును కలిగించడో అతడికి సన్మార్గం చూపేవాడు ఎవడూ ఉండడు. ఎందుకంటే సన్మార్గము యొక్క భాగ్యమును కలిగించటం అల్లాహ్ ఒక్కడి చేతిలోనే ఉన్నది.
(34) మరియు నిశ్చయంగా మూసా అలైహిస్సలాం కన్న ముందు యూసుఫ్ అలైహిస్సలాం అల్లాహ్ ఏకత్వముపై స్పష్టమైన ఆధారములను తీసుకుని వచ్చారు. అప్పుడు మీరు ఆయన మీ వద్దకు తీసుకుని వచ్చిన దాని విషయంలో సందేహంలో మరియు తిరస్కరించటంలో పడి ఉన్నారు. చివరికి ఆయన చనిపోయినప్పుడు మీరు సందేహంలో,సంశయంలో అధికమైపోయారు. మరియు మీరు ఇలా పలికారు : అల్లాహ్ అతని తరువాత ఏ ప్రవక్తనూ ఖచ్చితంగా పంపించడు. సత్యము నుండి మీ ఈ పెడద్రోవపడటం లాగే అల్లాహ్ ఎవరైతే అల్లాహ్ హద్దులను అతిక్రమిస్తాడో,ఆయన ఏకత్వం విషయంలో సందేహములో పడుతాడో అతడిని పెడద్రోవపెడతాడు.
(35) ఎవరైతే అల్లాహ్ ఆయతుల విషయంలో వాటిని నిర్వీర్యం చేయటానికి తమ వద్దకు వచ్చిన ఎటువంటి వాదన గాని ఆధారంగాని లేకుండా తగువులాడుతారో వారి వాదులాట అల్లాహ్ వద్ద మరియు ఆయనను విశ్వసించిన వారి వద్ద మరియు ఆయన ప్రవక్తల వద్ద ఎంతో అయిష్టమైనది. ఏ విధంగానైతే అల్లాహ్ మా ఆయతుల విషయంలో వాటిని నిర్వీర్యం చేయటానికి వాదులాడిన వారి హృదయములపై సీలు వేశాడో అలాగే ప్రతి సత్యము నుండి అహంకారమును చూపే,దుర్మార్గుని హృదయముపై సీలు వేస్తాడు. అప్పుడు అతను సరైన మార్గమును పొందడు. మరియు మేలు వైపునకు మార్గం పొందడు.
(36) మరియు ఫిర్ఔన్ తన మంత్రి హామాన్ తో ఇలాపలికాడు : ఓ హామాన్ నీవు నా కొరకు ఒక ఎత్తైన నిర్మాణమును నేను మార్గములను పొందుతానని ఆశిస్తూ నిర్మించు.
(37) నేను వాటికి చేర్చే ఆకాశముల మార్గములను నేను చేరుకుని మూసా యొక్క ఆరాధ్య దైవము ఎవరి గురించైతే సత్య ఆరాధ్య దైవమని అతడు వాదిస్తున్నాడో ఆయనను నేను చూస్తానని ఆశిస్తూ. మరియు నిశ్ఛయంగా మూసా తాను వాదిస్తున్న విషయంలో అసత్యపరుడు. మరియు ఈ విధంగా ఎప్పుడైతే ఫిర్ఔన్ హామాన్ నుండి ఏదైతే కోరాడో అప్పుడు ఫిర్ఔన్ కొరకు అతని దుష్కార్యము మంచిగా అనిపించింది. మరియు అతడు సత్య మార్గము నుండి అపమార్గము వైపునకు మరలించబడ్డాడు. మరియు ఫిర్ఔన్ తాను ఉన్న తన అసత్యమును ఆధిక్యతపరచటానికి మరియు మూసా తీసుకుని వచ్చిన సత్యాన్ని నిర్వీర్యం చేయటానికి చేసిన కుట్ర మాత్రం నష్టంలో పడిపోయింది. ఎందుకంటే అతని వ్యవహారము అతని ప్రయత్నంలో నిరాశకు గురవటం మరియు విఫలమవటం. మరియు ఎన్నటికి అంతం కాని దురదృష్టం.
(38) మరియు ఫిర్ఔన్ వంశములో నుండి విశ్వసించిన వ్యక్తి తన జాతి వారిని ఉపదేశం చేస్తూ మరియు వారిని సత్య మార్గము వైపు మార్గదర్శకం చేస్తూ ఇలా పలికాడు : ఓ నా జాతివారా మీరు నన్ను అనుసరించండి నేను మీకు సరైన మార్గం వైపునకు,సత్యం వైపున కల రుజుమార్గం వైపునకు మార్గనిర్దేశకం చేస్తాను.
(39) ఓ నా జాతివారా ఈ ఇహలోక జీవితం మాత్రం అంతమైపోయే సుఖభోగాల ద్వారా ప్రయోజనం చెందటమే. అయితే అందులోని తరిగిపోయే సామగ్రి మిమ్మల్ని మోసగించకూడదు. మరియు నిశ్చయంగా అంతముకాని శాశ్వత అనుగ్రహాలు కల పరలోక నివాసము అదే స్థిర నివాసము మరియు నివాసస్థలము. కాబట్టి మీరు దాని కొరకు అల్లాహ్ విధేయత ద్వారా ఆచరించండి. మరియు ఇహలోక జీవితం ద్వారా పరలోక ఆచరణ నుండి నిర్లక్ష్యం వహించటం నుండి జాగ్రత్తపడండి.
(40) దుష్కర్మకు పాల్పడిన వాడు అతను చేసిన కర్మ మాదిరిగానే మాత్రమే శిక్షింపబడుతాడు. అతనిపై శిక్షను అధికం చేయటం జరగదు. మరియు అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తూ సత్కర్మ చేసిన వాడికి ఆచరించిన వాడు పురుషుడైన లేదా స్త్రీ అయిన అతడు అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసం కనబరచిన వాడై ఉండాలి. ఈ ప్రశంసదగిన గుణాలను కలిగిన వారందరు ప్రళయదినమున స్వర్గములో ప్రవేశిస్తారు. అల్లాహ్ వారికి అందులో వాగ్దానం చేసిన ఫలాలను,ఎన్నటికి అంతము కాని స్థిరమైన అనుగ్రహాలను లెక్క లేనంతగా ఆహారముగా ప్రసాదిస్తాడు.
(41) ఓ నా జాతి వారా నేను మిమ్మల్ని ఇహలోకజీవితంలో మరియు పరలోకములో నష్టపోవటం నుండి అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేయటం ద్వారా మోక్షం వైపునకు పిలుస్తుంటే మీరు నన్ను అల్లాహ్ పై అవిశ్వాసము,ఆయనకు అవిధేయత చూపటం వైపునకు పిలవటం ద్వారా మీరు నన్ను నరకంలో ప్రవేశము వైపునకు పిలుస్తున్నారేమిటి ?!.
(42) నేను అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచాలని,ఆయనతో పాటు ఇతరులను ఎవరి ఆరాధన అల్లాహ్ తో పాటు సరి అన్న జ్ఞానము నాకు లేదో వాటి ఆరాధన నేను చేయాలని ఆశిస్తూ మీరు నన్ను మీ అసత్యం వైపునకు పిలుస్తున్నారు. మరియు ఎవరూ ఓడించలేని సర్వ శక్తిమంతుడైన,తన దాసులపట్ల గొప్ప మన్నించేవాడైన అల్లాహ్ పై విశ్వాసము వైపునకు నేను మిమ్మల్ని పిలుస్తున్నాను.
(43) వాస్తవానికి మీరు నన్ను ఎవరి విశ్వాసము వైపునకు,ఎవరి విధేయత వైపునకు పిలుస్తున్నారో అతని కొరకు ఆరాధన చేయబడటానికి సత్యంతో కూడుకున్న ఎటువంటి ఆరాధన ఇహలోకంలో గాని పరలోకంలో గాని లేదు. మరియు అతడు తనను వేడుకునే వాడి అర్ధనలను స్వీకరించడు. మరియు నిశ్చయంగా మా అందరి మరలటం అల్లాహ్ ఒక్కడి వైపే జరుగుతుంది. మరియు నిశ్ఛయంగా అవిశ్వాసంలో,పాప కార్యముల్లో మితిమీరిపోయినవారే నరక వాసులు. ప్రళయదినమున వారు అందులో ప్రవేశించటమును తప్పనిసరి చేసుకుంటారు.
(44) అప్పుడు వారు ఆయన హితోపదేశములను వదిలివేశారు. అప్పుడు ఆయన ఇలా పలికారు : మీరు తొందరలోనే నేను మీకు చేసిన హితోపదేశములను గుర్తు చేసుకుంటారు. మరియు మీరు వాటిని స్వీకరించకపోవటం పై బాధపడుతారు. మరియు నేను నా వ్యవహారములన్నీ ఒక్కడైన అల్లాహ్ కి అప్పజెప్పుతున్నాను. నిశ్ఛయంగా అల్లాహ్ ఆయన తన దాసుల కర్మల్లోంచి ఏదీ గోప్యంగా ఉండదు.
(45) అప్పుడు వారు అతన్ని హత్య చేయటమునకు నిర్ణయించుకున్నప్పటి వారి కుట్ర కీడు నుండి అల్లాహ్ అతన్ని రక్షించాడు. మరియు ఫిర్ఔన్ వంశమునకు మునిగిపోయే శిక్ష చుట్టుముట్టింది. నిశ్చయంగా అల్లాహ్ ఇహలోకములో అతడిని మరియు అతని పూర్తి సైన్యమును ముంచివేశాడు.
(46) వారి మరణం తరువాత వారు వారి సమాదులలో దినము మొదటి వేళలో మరియు దాని చివరి వేళలో నరకాగ్నిపై ప్రవేశపెట్టబడుతారు. మరియు ప్రళయదినమున ఇలా అనబడుతుంది : ఫిర్ఔన్ ను అనుసరించేవారిని వారు పాల్పడిన అవిశ్వాసము,తిరస్కారము మరియు అల్లాహ్ మార్గము నుండి ఆపటం వలన తీవ్రమైన మరియు పెద్దదైన శిక్షలో ప్రవేశింపజేయండి.
(47) ఓ ప్రవక్త నరకవాసుల్లోంచి అనుసరించేవారు మరియు అనుసరించబడేవారు వాదులాడుతున్నప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు బలహీనులుగా పరిగణించబడే అనుసరించేవారు గర్వించే అనుసరించబడేవారితో ఇలా పలుకుతారు : నిశ్ఛయంగా మేము ఇహలోకంలో మిమ్మల్ని అపమార్గము విషయంలో అనుసరించేవారముగా ఉన్నాము. ఏమీ మీరు అల్లాహ్ శిక్ష నుండి కొంత భాగమును తీసుకుని మోసి మా నుండి తొలగించగలరా ?!.
(48) దురహంకారములో మునిగి ఉన్న అనుసరించబడేవారు ఇలా పలుకుతారు : నిశ్చయంగా మేము అనుసరించే వారమైన లేదా అనుసరించబడే వారమైన నరకాగ్నిలో సమానము. మాలో నుండి ఎవరూ ఇంకొకరి శిక్ష నుండి ఎటువంటి భాగమును మోయరు. నిశ్చయంగా అల్లాహ్ దాసుల మధ్య తీర్పునిచ్చాడు. ఆయన ప్రతి ఒక్కరికి వారి హక్కు అయిన శిక్షను ప్రసాదించాడు.
(49) మరియు అనుసరించే మరియు అనుసరించబడేవారిలో నుంచి నరకంలో శిక్షింపబడేవారు తౌబా చేసుకోవటం కొరకు నరకము నుండి బయటకు వచ్చి ఇహలోకమువైపునకు మరలటం నుండి నిరాశ్యులైనప్పుడు నరకాగ్ని యొక్క బాధ్యత వహించే దైవదూతలతో ఇలా పలుకుతారు : మీరు ఈ శాశ్వత శిక్ష నుండి ఒక్క రోజు శిక్షను మా నుండి తేలిక చేయమని మీ ప్రభువుతో వేడుకోండి.
(50) నరకము యొక్క సంరక్షకులు అవిశ్వాసపరులను ఖండిస్తూ ఇలా పలుకుతారు : ఏమీ మీ వద్దకు మీ ప్రవక్తలు స్పష్టమైన ఆధారములను మరియు సూచనలను తీసుకుని రాలేదా ?!. అప్పుడు అవిశ్వాసపరులు ఎందుకు కాదు వారు మా వద్దకు స్పష్టమైన ఆధారములను మరియు వాదనలను తీసుకుని వచ్చారు. పరిరక్షకులు వారిపై వ్యంగ్యంగా ఇలా పలికారు : అయితే మీరే వేడుకోండి. మేము మాత్రం అవిశ్వాసపరుల కొరకు సిఫారసు చేయము. మరియు అవిశ్వాసపరుల దుఆ మాత్రం వారి అవిశ్వాసం కారణం చేత స్వీకరించకపోవటం వలన నిర్వీర్యం మరియు వృధా అయింది.
(51) నిశ్చయంగా మేము మా ప్రవక్తలను మరియు అల్లాహ్ ను ఆయన ప్రవక్తలను విశ్వసించినవారిని ఇహలోకంలో వారి వాదనలకు ఆధిక్యతను కలిగించి మరియు వారి శతృవులకు వ్యతిరేకంగా వారికి తోడ్పాటును కలిగించి సహాయపడుతాము. మరియు మేము వారికి ప్రళయదినమున వారిని స్వర్గంలో ప్రవేశింపజేసి ఇహలోకములో వారి ప్రత్యర్దులైన వారిని ఇహలోకంలో శిక్షించి మరియు దైవప్రవక్తలు, దైవదూతలు మరియు విశ్వాసపరులు సందేశప్రచారము,జాతులవారి తిరస్కారముపై సాక్ష్యం పలికిన తరువాత నరకములో ప్రవేశింపజేసి సహాయపడుతాము.
(52) ఆ రోజు అవిశ్వాసము మరియు పాపకార్యముల ద్వారా తమ స్వయం పై హింసకు పాల్పడిన వారికి వారి హింస నుండి వారి క్షమాపణ ప్రయోజనం కలిగించదు. ఆ రోజున వారికి అల్లాహ్ కారుణ్యము నుండి గెంటివేయటం జరుగుతుంది. మరియు వారి కొరకు వారు పొందే బాధాకరమైన శిక్ష ద్వారా పరలోకములో చెడ్డ నివాసము కలదు.
(53) మరియు నిశ్చయంగా మేము మూసా అలైహిస్సలాంకు జ్ఞానమును ప్రసాదించాము దాని ద్వారా ఇస్రాయీల్ సంతతి వారు సత్యము వైపునకు మార్గమును పొందుతారు. మరియు మేము తౌరాత్ ను ఇస్రాయీల్ సంతతి వారిలో వాస్తవ పుస్తకంగా చేశాము ఒక తరం తరువాత ఒక తరం వారు దానికి వారసులవుతారు.
(54) సరైన బుద్ధులు కల వారి కొరకు సత్య మార్గము వైపునకు మార్గదర్శకత్వంగా మరియు హితోపదేశంగా.
(55) ఓ ప్రవక్త మీరు మీ జాతి వారి తిరస్కారము మరియు వారి బాధ పెట్టటం నుండి మీరు పొందిన దానిపై సహనం చూపండి. నిశ్చయంగా మీ కొరకు సహాయము మరియు తోడ్పాటు ద్వారా అల్లాహ్ వాగ్దానము సత్యము,అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మీరు మీ పాపముల కొరకు మన్నింపును వేడుకోండి. మరియు మీరు దినము మొదటి వేళలో,దాని చివరి వేళలో మీ ప్రభువు యొక్క స్థుతులతో పరిశుద్ధతను కొనియాడండి.
(56) నిశ్ఛయంగా ఎవరైతే అల్లాహ్ ఆయతుల విషయంలో వాటిని నిర్వీర్యం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఎటువంటి వాదన మరియు ఆధారం లేకుండా వాదులాడుతున్నారో వారికి దానిపై ప్రేరేపిస్తున్నది మాత్రం సత్యంపై గర్వము అహంకారము. వారు కోరుకుంటున్న దాని పై గర్వమునకు వారు చేరుకోరంటే చేరుకోరు. ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ ను (మార్గంను) గట్టిగా పట్టుకోండి. నిశ్చయంగా ఆయన తన దాసుల మాటలను వినేవాడు మరియు వారి కర్మలను వీక్షించేవాడు. వాటిలో నుండి ఏదీ ఆయన నుండి తప్పిపోదు. మరియు ఆయన వారికి వాటిపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
(57) ఆకాశములను మరియు భూమిని వాటి పరిమాణం వలన మరియు వాటి వెడల్పు వలన సృష్టించటం ప్రజలను సృష్టించటం కన్న ఎంతో గొప్ప విషయం. మరియు ఎవరైతే అవి పెద్దవిగా ఉండినా కూడా సృష్టించాడో మృతులను వారి సమాదుల నుండి వారి లెక్క తీసుకుని వారికి ప్రతిఫలమును ప్రసాదించటానికి జీవింపజేసి మరల లేపటంపై సామర్ధ్యమును కలవాడు. కానీ చాలా మంది ప్రజలకి తెలియదు. దాని నుండి వారు గుణపాఠం నేర్చుకోవటం లేదు. మరియు అది స్పష్టమైనా కూడా దాన్ని వారు మరణాంతరం లేపబడటంపై ఆధారంగా చేసుకోవటంలేదు.
(58) మరియు ఎవరైతే చూడలేడో, ఎవరైతే చూడగలడో ఇద్దరు సమానులు కారు. మరియు ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కలిగి ఉండి, ఆయన ప్రవక్తను నిజమని నమ్మి, తమ కర్మలను మంచిగా చేస్తారో వారు మరియు వారితో పాటు ఎవరి ఆచరణ అయితే దురవిశ్వాసము,పాపకార్యముల వలన చెడుగా ఉంటుందో సమానులు కారు. మీరు మాత్రం చాలా తక్కువ హితోపదేశం గ్రహిస్తారు. ఒక వేళ మీరు హితోపదేశం గ్రహిస్తే మీరు రెండు వర్గముల మధ్య వ్యత్త్యాసమును తెలుసుకుని మీరు ఎవరైతే విశ్వసించి అల్లాహ్ మన్నతను ఆశిస్తూ సత్కర్మలు చేస్తారో వారిలో నుండి అయిపోవటానికి ప్రయత్నిస్తారు.
(59) నిశ్చయంగా ప్రళయము దేనిలోనైతే అల్లాహ్ మృతులను లెక్కతీసుకుని ప్రతిఫలం ప్రసాదించటానికి మరల లేపుతాడో ఖచ్ఛితంగా వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాని చాలా మంది ప్రజలు దాని రావటంపై విశ్వసించటంలేదు. అందుకనే వారు దాని కొరకు సిద్ధం చేసుకోవటంలేదు.
(60) మరియు మీ ప్రభువు ఇలా పలికాడు : ఓ ప్రజలారా మీరు ఆరాధనలో మరియు అర్ధించటంలో నా ఒక్కడినే ప్రత్యేకించుకోండి. నేను మీ అర్ధనను స్వీకరించి, మీ నుండి మన్నించివేస్తాను మరియు మీపై కరుణిస్తాను. నిశ్చయంగా ఎవరైతే ఆరాధనను నా ఒక్కడికే ప్రత్యేకించటం నుండి అహంకారమును చూపుతారో వారు తొందరలోనే ప్రళయదినమున దిగజారి,అవమానమునకు గురై నరకములో ప్రవేశిస్తారు.
(61) అల్లాహ్ యే మీ కొరకు రాత్రిని మీరు అందులో నివాసముండి విశ్రాంతి తీసుకోవటానికి చీకటిగా చేశాడు. మరియు పగలును అందులో మీరు పనులు చేసుకోవటానికి కాంతివంతంగా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రజలపట్ల ఎంతో పెద్ద అనుగ్రహుడు అప్పుడే ఆయన వారిపై తన బాహ్యపరమైన మరియు అంతరపరమైన అనుగ్రహములను కురిపించాడు. కానీ చాలా మంది ప్రజలు పరిశుద్ధుడైన ఆయనకు ఆయన అనుగ్రహించిన వాటిపై కృతజ్ఞతలు తెలుపుకోరు.
(62) మీ పై తన అనుగ్రహములను కలిగించిన వాడు ఆయనే అల్లాహ్ . ఆయన ప్రతీది సృష్టించినవాడు. ఆయన తప్ప వేరే సృష్టికర్త లేడు. ఆయన తప్ప వాస్తవ ఆరాధ్య దైవం లేడు. అటువంటప్పుడు మీరు ఆయన ఆరాధన నుండి ఏ విధమైన లాభమునకు మరియు నష్టమునకు అధికారము లేని ఇతరుల ఆరాధన వైపునకు ఎలా మరలిపోతున్నారు.
(63) వీరందరు అల్లాహ్ పై విశ్వాసము నుండి మరియు ఆయన ఒక్కడి ఆరాధన నుండి మరలిపోయినట్లే ప్రతీ కాలములో ప్రతీ చోట అల్లాహ్ తౌహీద్ పై సూచించే ఆయతులను నిరాకరించేవారు దాని నుండి మరలిపోతారు. వారు సత్యం వైపునకు మార్గం పొందరు. వారికి సన్మార్గము కొరకు సౌభాగ్యం కలిగించబడదు.
(64) ఓ ప్రజలారా అల్లాహ్ యే మీ కొరకు భూమిని మీరు దానిపై నివాసముండటానికి నివాసస్థలంగా సిద్ధం చేసి ఉంచాడు. మరియు ఆయన ఆకాశమును మీ పై పడిపోవటం నుండి ఆగిపోయినట్లుగా పటిష్టమైవ కట్టడంగా చేశాడు. మరియు మీ తల్లుల గర్భములలో మీకు రూపమునిచ్చి మీ రూపములను ఎంతో చక్కగా తీర్చిదిద్దాడు. మరియు ఆయన మీకు ధర్మ సమ్మతమైన ఆహారోపాధిని, వాటిలో శ్రేష్ఠమైనవి ప్రసాదించాడు. మీపై ఈ అనుగ్రహములను అనుగ్రహించిన వాడే అల్లాహ్ మీ ప్రభువు. కావున సృష్టితాలన్నింటి ప్రభువైన అల్లాహ్ శుభధాయకుడు. పరిశుద్ధుడైన ఆయన తప్ప ఇంకొకరు వారి కొరకు ప్రభువు లేడు.
(65) ఆయన మరణించని సజీవుడు. ఆయన తప్ప ఇంకొకరు వాస్తవ ఆరాధ్యుడు లేడు. కావున మీరు ఆయనను ఆరాధన మరియు అర్ధన యొక్క వేడుకోవటమును ఆయన ఒక్కడి మన్నతను ఉద్ధేశించుకుని వేడుకోండి. మరియు మీరు ఆయనతో పాటు ఆయన సృష్టితాల్లోంచి ఇతరులను సాటి కల్పించకండి. పొగడ్తలన్నీ సృష్టితాల ప్రభువైన అల్లాహ్ కొరకే చెందుతాయి.
(66) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేని మరియు ఎటువంటి నష్టం కలిగించని మీరు అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న ఈ విగ్రహాలను నేను ఆరాధించటం నుండి ఎప్పుడైతే వాటి ఆరాధన చేయటం అసత్యమని సూచించే స్పష్టమైన ఆధారాలు నా వద్దకు వచ్చాయో నిశ్చయంగా అల్లాహ్ నన్ను వారించాడు. మరియు అల్లాహ్ ఆయన ఒక్కడికే విధేయత చూపుతూ ఆరాధన చేయమని నన్ను ఆదేశించాడు. ఆయనే సృష్టిరాసులన్నింటికి ప్రభువు. ఆయన తప్ప ఇంకెవరూ వారికి ప్రభువు లేడు.
(67) ఆయనే మీ తండ్రి అయిన ఆదమ్ ను మట్టితో సృష్టించాడు. మరల ఆయన మిమ్మల్ని దాని తరువాత వీర్యబిందువుతో ఆ పిదప వీర్య బిందువు తరువాత రక్తపు గడ్డతో మిమ్మల్ని సృష్టించాడు. దాని తరువాత ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భముల నుండి చిన్న పిల్లలుగా వెలికి తీస్తాడు. ఆ తరువాత మీరు దృఢమైన శరీరములు కల వయసుకు చేరుకుని ఆ తరువాత మీరు పెద్దవారై వృద్ధులయ్యే వరకు (మిమ్మల్ని పెంచుతాడు). మరియు మీలో నుండి కొందరు దాని కన్న ముందే చనిపోయేవారున్నారు. మరియు (ఆయన మిమ్మల్ని వదిలేస్తాడు) మీరు అల్లాహ్ జ్ఞానంలో నిర్ణీత కాలమునకు చేరుకోవటానికి. మీరు దాని నుండి తగ్గించలేరు. మరియు మీరు దానికన్న పెంచలేరు. మరియు బహుశ మీరు ఆయన సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచించే ఈ వాదనలు,ఆధారల ద్వారా ప్రయోజనం చెందుతారని.
(68) పరిశుద్ధుడైన ఆయన ఒక్కడి చేతిలోనే జీవితాన్ని ప్రసాదించటం కలదు. మరియు ఆయన ఒక్కడి చేతిలోనే మరణాన్ని కలిగించటం కలదు. ఆయన ఏదైన చేయదలచుకున్నప్పుడు దాన్ని ఇలా అంటాడు (కున్) నీవు అయిపో. అప్పుడు అది అయిపోతుంది.
(69) ఓ ప్రవక్తా అల్లాహ్ ఆయతుల విషయంలో అవి స్పష్టమైన తరువాత కూడా వాటిని తిరస్కరిస్తూ వాదులాడే వారిని మీరు చూడలేదా ?. (ఒక వేళ మీరు చూస్తే) వారి స్థితి నుండి మీరు ఆశ్ఛర్యపోతారు. వాస్తవానికి వారు సత్యము నుండి అది స్పష్టమైనా కూడా వారు విముఖత చూపుతున్నారు.
(70) వారే ఖుర్ఆన్ ను మరియు మేము మా ప్రవక్తలకు ఇచ్చి పంపించిన సత్యమును తిరస్కరించారు. ఈ తిరస్కరించే వారందరు తమ తిరస్కార పరిణామును తొందరలోనే తెలుసుకుంటారు. మరియు వారు చెడ్డ ముగింపును చూస్తారు.
(71) వారు దాని పరిణామమును తెలుసుకుంటారు అప్పుడు వారి మెడలలో బేడీలు మరియు వారి కాళ్ళలో సంకెళ్ళు ఉంటాయి. వారిని శిక్ష భటులు ఈడ్చుతుంటారు.
(72) వారు వారిని తీవ్రమైన వేడి గల నీళ్ళలోకి ఈడ్చుతారు. ఆ తరువాత వారు నరకాగ్నిలో కాల్చబడుతారు.
(73) ఆ తరువాత వారికి చివాట్లు పెడుతూ మరియు మందలిస్తూ ఇలా పలకబడింది : మీరు ఆరోపించిన దైైవుములు ఏరి వేటి ఆరాధన చేయటం ద్వారా మీరు సాటి కల్పించినారో?.
(74) అల్లాహ్ ను వదిలి ఏ విధమైన ప్రయోజనం కలిగించని మరియు నష్టం కలిగించనివైన మీ విగ్రహాలు ఏవి ?!. అవిశ్వాసపరులు ఇలా పలికారు : వారు మా నుండి అదృశ్యమైపోయారు మేము వారిని చూడలేక పోతున్నాము. అంతే కాదు మేము ఆరాధనకు యోగ్యత కలది దేనిని మేము ఆరాధించేవారము కాము. వీరందరిని అపమార్గమునకు లోను చేసినట్లే అల్లాహ్ అవిశ్వాసపరులను సత్యం నుండి ప్రతీ కాలములో,ప్రతీ చోటా అపమార్గమునకు లోను చేస్తాడు.
(75) మరియు వారితో ఇలా పలకబడుతుంది : మీరు అనుభవిస్తున్న ఈ శిక్ష మీరు దేనిపైనైతే ఉన్నారో షిర్కుతో మీ సంతోషము వలన మరియు మీ సంతోషమును విస్తరింపజేయటం వలన.
(76) మీరు నరక ద్వారముల్లో దానిలో శాశ్వతంగా ఉండుటకు ప్రవేశించండి. సత్యము నుండి అహంకారము చూపేవారి నివాసము ఎంతో చెడ్డది.
(77) ఓ ప్రవక్తా మీరు మీ జాతివారు బాధించిన దానిపై మరియు వారి తిరస్కారముపై సహనం చూపండి. నిశ్చయంగా మీకు సహాయం చేసే అల్లాహ్ వాగ్దానం సత్యము అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ విధంగానైతే బదర్ దినమున సంభవించినదో అలా మీరు జీవించి ఉన్నప్పుడే వారికి మేము వాగ్దానం చేసిన శిక్ష లో నుండి కొంత భాగమును మీకు చూపించినా లేదా దాని కన్న ముందు మేము మీకు మరణమును కలిగించినా వారు ప్రళయదినమున మా ఒక్కరి వైపునకే మరలుతారు. అప్పుడు మేము వారికి వారి కర్మలపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాము. అప్పుడు మేము వారందరిని నరకములో శాశ్వతంగా ఉండేవిధంగా ప్రవేశింపజేస్తాము.
(78) మరియు నిశ్ఛయంగా మేము ఓ ప్రవక్తా మీ కన్న ముందు చాలా ప్రవక్తలను వారి జాతుల వద్దకు పంపించాము. అప్పుడు వారు వారిని తిరస్కరించారు మరియు వారికి బాధలు పెట్టారు. అప్పుడు వారు వారి తిస్కారముపై మరియు వారి బాధించటంపై సహనం చూపారు. ఈ ప్రవక్తలందరిలో నుంచి కొందరి సమాచారమును మేము మీకు వివరించి తెలియపరచాము. మరియు వారిలో నుంచి కొందరి సమాచారమును మేము మీకు తెలియపరచలేదు. మరియు ఏ ప్రవక్తకి తన జాతి వారి వద్దకు తన ప్రభువు వద్ద నుండి ఎటువంటి సూచనను పరిశుద్ధుడైన ఆయన ఇచ్ఛతో తప్ప తీసుకుని రావటం సరికాదు. కావున అవిశ్వాసపరులు తమ సమాజాలపై సూచనలను తీసుకుని రమ్మని సూచించటం అన్యాయము. అయితే విజయం లేదా ప్రవక్తలకు వారి జాతుల వారి మధ్య తీర్పు ద్వారా అల్లాహ్ ఆదేశము వచ్చినప్పుడు వారి మధ్య న్యాయపూరితంగా తీర్పు జరుగును. అప్పుడు అవిశ్వాసపరులు నాశనం చేయబడుతారు. మరియు ప్రవక్తలకు విముక్తి కలిగించబడును. మరియు దాసుల మధ్య తిర్పుఇవ్వబడే ఆ పరిస్థితులలో అసత్యపరులు తమ అవిశ్వాసం వలన వినాశన స్థానమునకు చేరుకోవటం వలన తమ స్వయానికి నష్టం కలిగించుకుంటారు.
(79) అల్లాహ్ యే మీ కొరకు ఒంటెలను,ఆవులను,మేకలను వాటిలో నుండి కొన్నింటిపై మీరు స్వారి చేయటానికి మరియు కొన్నింటి మాంసమును మీరు తినటానికి సృష్టించాడు.
(80) ఈ సృష్టితాల్లో మీ కొరకు అనేక ప్రయోజనాలు కలవు. అవి ప్రతి యుగములో పునరుద్ధరించబడతాయి. మరియు వాటి ద్వారా మీరు మీ మనస్సులు కోరుకునే అవసరాలు మీకు దొరుకుతాయి. మరియు భూమి, సముద్రంలో రాకపోకలు వాటిలో ముఖ్యమైనవి.
(81) మరియు పరిశుద్ధుడైన ఆయన తన సామర్ధ్యంపై మరియు తన ఏకత్వముపై సూచించే తన సూచనలను మీకు చూపిస్తాడు. అయితే అల్లాహ్ యొక్క ఏ ఆయతులను మీ వద్ద అవి ఆయన ఆయతులని నిరూపితమైన తరువాత కూడా మీరు వాటిని అంగీకరించరు.
(82) అయితే ఈ తిరస్కారులందరు భూమిలో సంచరించి వారికన్న మునుపటి సమాజాలవారి ముగింపు ఎలా జరిగినదో చూసి వాటి ద్వారా గుణపాఠం నేర్చుకోలేదా ?. నిశ్ఛయంగా ఈ సమాజాలు వారి కన్నఅధికంగా సంపద కలవారై, ఎక్కువ బలవంతులై, భూమిలో ఎక్కువ చిహ్నాలను వదిలినవారై ఉండేవారు. ఎప్పుడైతే వారి వద్దకు నాశనం చేసే అల్లాహ్ శిక్ష వచ్చిపడినదో వారు సంపాదించుకున్న బలము వారికి దేనికి పనికిరాకపోయినది.
(83) మరియు వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన ఆధారాలను తీసుకుని వచ్చినప్పుడు వారు వాటిని తిరస్కరించారు. మరియు వారు తమ వద్ద ఉన్న తమ ప్రవక్తలు తమ వద్దకు తీసుకుని వచ్చిన దానికి వ్యతిరేకంగా ఉన్న జ్ఞానముతో సంతుష్టపడ్డారు. మరియు వారిపై వారు పరిహాసమాడే శిక్ష దేనితోనైతే వారి ప్రవక్తలు వారిని భయపెట్టేవారో వచ్చిపడినది.
(84) ఎప్పుడైతే వారు మా శిక్షను చూశారో అంగీకరిస్తూ ఇలా పలికారు ఆ సమయంలో అంగీకారం వారికి ప్రయోజనం కలిగించదు : మేము ఒక్కడైన అల్లాహ్ ను విశ్వసించాము.మరియు మేము ఆయనను వదిలి వేటినైతే ఆరాధించేవారమో భాగస్వాములను మరియు విగ్రహాలను తిరస్కరించాము.
(85) వారిపై కురిసే మా శిక్షను వారు కళ్ళారా చూసినప్పుడు వారి విశ్వాసము వారికి ఎటువంటి ప్రయోజనం కలిగించదు. అల్లాహ్ యొక్క సంప్రదాయము శిక్షను కళ్ళారా చూసినప్పుడు వారి విశ్వాసము వారికి ప్రయోజనం కలిగించదని తన దాసులలో జరిగినది. మరియు అవిశ్వాసపరులు శిక్ష అవతరించినప్పుడు అల్లాహ్ పై తమ అవిశ్వాసం వలన మరియు శిక్షను కళ్ళారా చూడక ముందే తౌబా చేయకపోవటం వలన వినాశన స్థానములకు చేరుకుని తమ స్వయమునకు నష్టమును కలిగించుకున్నారు.