42 - Ash-Shura ()

|

(1) {حمٓ ۝۱ عٓسٓقٓ} హా- మీమ్, ఐన్ - సీన్ - ఖాఫ్ సూరె బఖరా ఆరంభములో వీటి సారుప్యముపై చర్చ జరిగినది.

(2) {حمٓ ۝۱ عٓسٓقٓ} హా- మీమ్, ఐన్ - సీన్ - ఖాఫ్ సూరె బఖరా ఆరంభములో వీటి సారుప్యముపై చర్చ జరిగినది.

(3) ఈ దివ్యవాణి లాగే ఆయన ఓ ముహమ్మద్ మీ వైపునకు మరియు మీకన్న మునుపటి అల్లాహ్ సందేశహరుల వైపునకు దివ్యవాణిని అవతరింపజేశాడు. అల్లాహ్ తన శతృవుల నుండి ప్రతీకారం తీర్చుకోవటంలో సర్వాధిక్యుడు మరియు తన పర్యాలోచనలో,తన సృష్టించటంలో వివేకవంతుడు.

(4) ఆకాశముల్లో ఉన్నది మరియు భూమిలో ఉన్నది సృష్టి పరంగా,అధికారము పరంగా,పర్యాలోచన పరంగా అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. మరియు ఆయన తన అస్తిత్వములో,తన సామర్ధ్యములో,తన ఆధిఖ్యతలో మహోన్నతుడు. తన ఉనికిలో గొప్పవాడు.

(5) పరిశుద్దుడైన ఆయన ఔన్నత్యములో నుంచి ఆకాశములు అవి పెద్దవై,ఎత్తుగా ఉండి కూడా భూముల పై నుండి పేలిపోవటానికి సిద్ధంగా ఉండటం మరియు దైవ దూతలు తమ ప్రభువు యొక్క పరిశుద్ధతను కొనియాడటం మరియు ఆయన కొరకు అణుకువతో,ఆదరణతో స్థుతులను పలుకుతూ ఆయన గొప్పతనమును కొనియాడటం మరియు భూమిలో ఉన్న వారందరి కొరకు అల్లాహ్ నుండి మన్నింపును కోరుకోవటం. వినండీ నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి మన్నింపు కోరుకునే వారి పాపములను బాగా మన్నించేవాడు మరియు వారిపై కరుణించేవాడు.

(6) మరియు ఎవరైతే అల్లాహ్ ను వదిలి విగ్రహాలను తయారు చేసుకున్నారో వారు అల్లాహ్ ను వదిలి వారిని సంరక్షకులుగా చేసుకుని వారిని ఆరాధిస్తున్నారో. అల్లాహ్ వారి కొరకు మాటువేసి ఉండి వారి కర్మలను నమోదు చేసి ఉంటాడు. మరియు వారికి వాటిపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఓ ప్రవక్త మీకు వారి కర్మలను పరిరక్షించే బాధ్యత లేదు. మీరు వారి కర్మల గురించి ప్రశ్నించబడరు. మీరు మాత్రం సందేశాలను చేరవేసేవారు మాత్రమే.

(7) ఓ ప్రవక్తా మేము మీ కన్న మునుపటి ప్రవక్తలకు దైవవాణి పంపించినట్లే మీ వైపున అరబీ ఖుర్ఆన్ ను దైవవాణి ద్వారా పంపించినాము. మీరు మక్కా వాసులను,దాని పరిసరములైన అరబ్ బస్తీలను, ఆ తరువాత ప్రజలందరిని హెచ్చరించటానికి మరియు అల్లాహ్ లెక్క తీసుకోవటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించటం కొరకు ముందు వారిని మరియు చివరి వారిని ఒకే భూమిలో సమీకరించే రోజైన ప్రళయదినము నుండి ప్రజలను మీరు భయపెట్టటానికి. ఆ రోజు వాటిల్లటంలో ఎటువంటి సందేహం లేదు. మరియు ప్రజలు అందులో రెండు వర్గములుగా విభజించబడి ఉంటారు : ఒక వర్గము స్వర్గములో ఉంటారు, వారు విశ్వాసపరులు. మరియు ఒక వర్గము నరకాగ్నిలో ఉంటారు, వారు అవిశ్వాసపరులు.

(8) ఒక వేళ అల్లాహ్ వారిని ఇస్లాం ధర్మంపై ఒకే సమాజముగా చేయదలచితే వారిని దానిపై ఒకే సమాజముగా చేస్తాడు. మరియు కాని ఆయన తలచిన వారిని ఇస్లాంలో ప్రవేశింపజేసి అతడిని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడని ఆయన వివేకము నిర్ణయించి ఉన్నది. మరియు అవిశ్వాసము ద్వారా,పాప కార్యముల ద్వారా తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడిన వారిని పరిరక్షించేవాడు ఎవడూ ఉండడు మరియు అల్లాహ్ శిక్ష నుండి వారిని రక్షించే సహాయకుడెవడూ ఉండడు.

(9) కాని ఈ ముష్రికులందరు అల్లాహ్ ను వదిలి వారిని సంరక్షించే సంరక్షకులుగా చేసుకున్నారు. మరియు అల్లాహ్ యే వాస్తవ సంరక్షకుడు. ఇతరులు లాభమూ చేకూర్చలేరు మరియు నష్టమూ కలిగించలేరు. మరియు ఆయన మృతులను వారిని మరల లేపటం ద్వారా లెక్క తీసుకుని,ప్రతిఫలం ప్రసాదించటానికి జీవింపజేసేవాడు. పరిశుద్ధుడైన ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.

(10) ఓ ప్రజలారా మీరు మీ ధర్మ మూలముల్లో నుండి లేదా దాని శాఖల్లో నుండి దేని గురించైతే విభేదించుకున్నారో దాని ఆదేశం అల్లాహ్ వద్ద ఉన్నది. కాబట్టి అది ఆ విషయంలో ఆయన గ్రంధం వైపునకు లేదా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ (హదీస్) వైపునకు మరలుతుంది. ఈ గుణాలను కలిగిన ఇతనే నా ప్రభువు. నా వ్యవహారములన్నింటిలో ఆయనపైనే నేను నమ్మకమును కలిగి ఉన్నాను. మరియు నేను ఆయన వైపునకే పశ్చాత్తాపముతో మరలుతాను.

(11) అల్లాహ్ పూర్వ నమూనా లేకుండా ఆకాశములను మరియు భూమిని సృష్టించినవాడు. ఆయన మీలో నుండే మీ కొరకు జతలను చేశాడు. మరియు ఒంటెల్లో నుంచి,ఆవుల్లోంచి, మేకల్లో నుంచి మీ కొరకు జతలను చేశాడు. చివరికి మీరు మీ వలన అధికమయ్యారు. ఆయన మీ కొరకు తయారు చేసిన జతల నుండి వివాహం చేసుకోవటం ద్వారా మిమ్మల్ని సృష్టిస్తున్నాడు మరియు ఆయన మీ కొరకు తయారు చేసిన జంతువుల మాంసముల నుండి మరియు వాటి పాల నుండి మిమ్మల్ని జీవింపజేస్తున్నాడు. ఆయన సృష్టి రాసుల్లోంచి ఏదీ ఆయనకు పోలినది లేదు. ఆయన తన దాసుల మాటలను వినేవాడును మరియు వారి కర్మలను వీక్షించేవాడును. వాటిలో నుండి ఏదీ ఆయన నుండి తప్పిపోదు. మరియు ఆయన వారి కర్మల పరంగా వారికి తొందరలోనే ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఒక వేళ అది మంచిగా ఉంటే మంచిని మరియు చెడ్డగా ఉంటే చెడును ప్రసాదిస్తాడు.

(12) ఆకాశముల మరియు భూమి యొక్క నిక్షేపాల తాళములు ఆయన ఒక్కడి కొరకే చెందుతాయి. ఆయన తన దాసుల్లోంచి తాను తలచిన వారి కొరకు ఆహారోపాధిని వారు కృతజ్ఞత తెలుపుకుంటారా లేదా కృతఘ్నులవుతార పరీక్షించటానికి పుష్కలంగా చేస్తాడు. మరియు దాన్ని తాను తలచుకున్న వారిపై వారు సహనం చూపుతారా లేదా అల్లాహ్ నిర్ణయంపై ఆగ్రహానికి లోనవుతారా పరీక్షంచటానికి దాన్ని కుదించివేేస్తాడు. నిశ్చయంగా ఆయనకు ప్రతీది తెలుసు. ఆయన దాసుల ప్రయోజనాలు ఉన్న వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.

(13) మీ కొరకు నూహ్ అలైహిస్సలాంనకు దేనినైతే చేరవేసి ఆచరించమని మేము ఆదేశించామో ఆ ధర్మమునే ఆయన మీకు ధర్మబద్దము చేశాడు మరియు ఓ ప్రవక్తా దాన్ని మీకు దైవ వాణి ద్వారా చేరవేశాము. మరియు దేనినైతే చేరవేసి ఆచరించమని ఇబ్రాహీం,మూసా,ఈసా అలైహిముస్సలాంను మేము ఆదేశించినటువంటి దానినే మీ కొరకు ధర్మబద్దం చేశాము. మరియు దాని సారాంశము : మీరు ధర్మాన్ని నెలకోల్పండి, మరియు అందులో విభేదములను కలిగించటమును మీరు వదిలివేయండి. ముష్రికులపై మీరు వారిని పిలుస్తున్నటువంటి అల్లాహ్ తౌహీదు మరియు ఇతరుల ఆరాధనను వదిలివేయటం భారమైపోయింది. అల్లాహ్ తన దాసుల్లోంచి తాను తలచిన వారిని ఎంచుకుని తన ఆరాధన చేయటానికి మరియు తనపై విధేయత చూపటానికి భాగ్యమును కలిగిస్తాడు. మరియు వారిలో నుండి ఎవరైతే తమ పాపముల నుండి పశ్చాత్తాపముతో తన వైపునకు మరలే వారిని తన వైపునకు మార్గదర్శకం చేస్తాడు.

(14) మరియు అవిశ్వాసపరులు,ముష్రికులు కేవలం తమ వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడటంపై వాదన తమ ముందట నెలకొల్పబడిన తరువాత విభేదించుకున్నారు. వారి విభేదము కేవలం దౌర్జన్యము మరియు దుర్మార్గము వలన మాత్రమే. మరియు ఒక వేళ అల్లాహ్ జ్ఞానములో వారి నుండి శిక్షను ఆయన జ్ఞానములో నిర్ణయించబడిన కాలమైన ప్రళయదినము వరకు వెనుకకు నెట్టటం అన్నది ముందే జరిగి ఉండకపోతే అల్లాహ్ వారి మధ్య తీర్పు చేసేవాడు. అప్పుడు ఆయన అల్లాహ్ పట్ల వారి అవిశ్వాసము మరియు ఆయన ప్రవక్త పట్ల వారి తిరస్కారము వలన వారికి శిక్షను తొందరగా విధించేవాడు. మరియు నిశ్చయంగా తమ పూర్వికుల తరువాత మరియు ఈ ముష్రికులందరి తరువాత యూదుల్లోంచి తౌరాత్ కు, క్రైస్తవుల్లోంచి ఇంజీల్ కు వారసులు చేయబడిన వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన ఈ ఖుర్ఆన్ విషయంలో సందేహములో ఉండి,దాన్ని తిరస్కరిస్తున్నారు.

(15) మీరు ఈ తిన్నని ధర్మము కొరకు పిలవండి. మరియు మీరు దానిపై స్థిరంగా ఉండి,అల్లాహ్ మీకు ఆదేశించిన విధంగా చేయండి. మరియు మీరు వారి అసత్య మనోవాంచనలను అనుసరించకండి. మరియు మీరు వారితో వాదించే సమయంలో ఇలా పలకండి : నేను అల్లాహ్ ను మరియు అల్లాహ్ తన ప్రవక్తలపై అవతరింపజేసిన గ్రంధములపై విశ్వాసమును కనబరిచాను. మరియు నేను మీ మధ్యన న్యాయముగా తీర్పు చేయమని అల్లాహ్ నన్ను ఆదేశించాడు. నేను ఆరాధించే అల్లాహ్ యే మాకు,మీకందరికి ప్రభువు. మా కర్మలు చెడ్డవైన,మంచివైనా మా కొరకే. మరియు మీ కర్మలు చెడ్డవైన,మంచివైన మీ కొరకే. మీ మధ్య,మా మధ్య వాదన స్పష్టమైన తరువాత ఎటువంటి వివాదం లేదు. అల్లాహ్ యే మా అందరి మధ్య సమీకరించేవాడు. ప్రళయదిమున ఆయన వైపునకే మరలటం జరుగును. అప్పుడు ఆయన మాలో నుండి ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. అప్పుడు అసత్యపరుడి నుండి సత్య వంతుడు మరియు అసత్య వంతుడి నుండి సత్యవంతుడు స్పష్టమవుతాడు.

(16) మరియు ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపబడిన ఈ ధర్మ విషయంలో ప్రజలు దాన్ని స్వీకరించిన తరువాత కూడా అసత్య వాదనల ద్వారా వాదిస్తున్నారో,ఈ వాదించే వారి వాదనలన్ని వారి ప్రభువు వద్ద,విశ్వాసపరుల వద్ద నిర్ధకమైపోతాయి,రాలిపోతాయి. వాటికి ఎటువంటి ప్రభావము ఉండదు. వారిపై వారి అవిశ్వాసము వలన, సత్యమును తిరస్కరించటం వలన అల్లాహ్ వద్ద నుండి ఆగ్రహం కురుస్తుంది. మరియు ప్రళయ దినమున వారిని నిరీక్షిస్తున్న కఠిన శిక్ష వారి కొరకు కలదు.

(17) అల్లాహ్ యే ఎటువంటి సందేహం లేని ఖుర్ఆన్ ను సత్యముతో అవతరింపజేశాడు. మరియు ఆయన ప్రజల మధ్య న్యాయముగా తీర్పునివ్వటం కొరకు న్యాయమును అవతరింపజేశాడు. వీరందరు తిరస్కరించే ప్రళయము దగ్గరలోనే ఉన్నది. మరియు ప్రతీ రాబోయేది దగ్గరలోనే ఉన్నదని తెలుసు.

(18) దాన్ని విశ్వసించని వారు దాని తొందరగా రావటమును కోరుకుంటారు. ఎందుకంటే వారు ఎటువంటి లెక్క తీసుకోవటమును గాని ప్రతిఫలమును గాని ఏ శిక్షను గాని విశ్వసించరు. మరియు అల్లాహ్ ను విశ్వసించేవారు దానిలో ఉన్న వారి పరిణామము నుండి వారి భయము వలన దాని నుండి భయపడుతారు. మరియు అది ఎటువంటి సందేహము లేని సత్యమని ఖచ్చితమైన జ్ఞానముతో వారు తెలుసుకుంటారు. వినండి నిశ్ఛయంగా ఎవరైతే ప్రళయం విషయంలో వాదిస్తారో మరియు దాని గురించి తగువులాడుతారో మరియు దాని వాటిల్లే విషయంలో సందేహపడుతారో వారు సత్యము నుండి దూరంగా అపమార్గములో ఉన్నారు.

(19) అల్లాహ్ తన దాసుల పట్ల దయ గలవాడు. ఆయన తాను తలచుకున్న వారికి ఆహారోపాధిని కలిగిస్తాడు. మరియు అతని కొరకు పుష్కలంగా ప్రసాదిస్తాడు. మరియు తాను తలచుకున్న వారిపై వివేకంగా, కారుణ్యంగా కుదించివేస్తాడు. మరియు ఆయన ఎవరూ ఓడించని బలవంతుడు,తన శతృవులతో ప్రతీకారము తీర్చుకునే సర్వాధిక్యుడు.

(20) ఎవరైతే పరలోక ప్రతిఫలమును దానికి తగిన ఆచరణలను చేస్తూ కోరుకుంటాడో మేము అతని కొరకు అతని పుణ్యమును అధికం చేస్తాము. కాబట్టి ప్రతి పుణ్యము దానికి పది రెట్ల నుండి ఏడువందల రెట్లకు ఇంకా చాలా అధిక రెట్లకు పెరుగుతుంది. మరియు ఎవరైతే ఇహలోకమునొక్కటినే కోరుకుంటాడో మేము అతనికి అందులో అతని కొరకు నిర్ణయించబడిన భాగమును ప్రసాదిస్తాము. మరియు అతని కొరకు పరలోకములో దానిపై అతను ఇహలోకమును ప్రాధాన్యతను ఇవ్వటం వలన ఎటువంటి భాగము ఉండదు.

(21) ఏమీ ఈ ముష్రికులందరి కొరకు అల్లాహ్ కాకుండా ఇతర దైవాలు ఉన్నారా. మరియు వారు వారి కొరకు ధర్మములో అల్లాహ్ వారి కొరకు తన తో పాటు సాటికల్పించటమును,ఆయన ధర్మసమ్మతం చేసిన వాటిని నిషేధించటమును,ఆయన నిషేధించిన వాటిని ధర్మసమ్మతం చేయటమును అనుమతించని వాటిని ధర్మబద్ధం చేశారా ?. ఒక వేళ అల్లాహ్ విభేదించుకునే వారి మధ్య తీర్పు కొరకు నిర్ణీత సమయమును నిర్దేశించి,ఆయన వారిని అప్పటి వరకు గడువు ఇస్తానని తెలిపి ఉండకపోతే వారి మధ్య తీర్పు చేసి ఉండేవాడు. మరియు నిశ్ఛయంగా అల్లాహ్ తొ పాటు సాటి కల్పించటం ద్వారా,పాపకార్యముల ద్వారా తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడినవారి కొరకు ప్రళయదినమున వారి కొరకు నిరీక్షించే బాధాకరమైన శిక్ష కలదు.

(22) ఓ ప్రవక్తా షిర్కు ద్వారా,పాపకార్యముల ద్వారా తమ స్వయంపై దుర్మార్గమునకు పాల్పడిన వారు తాము చేసుకున్న పాపము వలన కలిగే శిక్ష నుండి భయపడుతుండగా మీరు చూస్తారు. మరియు శిక్ష వారిపై ఖచ్చితంగా వచ్చిపడుతుంది. అప్పుడు పశ్చాత్తాపముతో ఖాళీగా ఉన్న భయము వారికి ప్రయోజనం కలిగించదు. మరియు అల్లాహ్ పై, ఆయన ప్రవక్త పై విశ్వాసమును కనబరచి వారికి భిన్నంగా సత్కర్మలు చేసిన వారు స్వర్గవనములలో సుఖభోగాలను అనుభవిస్తుంటారు. వారి కొరకు వారి ప్రభువు వద్ద వారు కోరుకునే ఎన్నటికి అంతం కాని రకరకాల అనుగ్రహాలు కలవు. అదే పెద్ద అనుగ్రహము దానికి ఏ అనుగ్రహము సమానము కాదు.

(23) ఇదే గొప్ప శుభవార్త దేని గురించైతే అల్లాహ్ తన ప్రవక్త చేతి ద్వారా అల్లాహ్ పై,ఆయన ప్రవక్తల పై విశ్వాసమును కనబరచి సత్కర్మలను చేసేవారికి శుభవార్తను ఇస్తున్నాడు. ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను సత్యమును చేరవేయటం పై మీ వైపునకు ప్రయోజనం మరలే ఒక పుణ్యమును మాత్రమే మీ నుండి కోరుతున్నాను. అది మీలో నా బంధుత్వము కొరకు మీరు నన్ను ఇష్టపడటం. మరియు ఎవరైతే ఒక పుణ్యము సంపాదించుకుంటాడో అతని కొరకు మేము దాని పుణ్యమును అధికం చేస్తాము. ఎలాగంటే ఒక పుణ్యమును దానికి పది రెట్లుగా. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి తన వైపునకు పశ్చాత్తాపముతో మరలే వారి పాపములను మన్నించేవాడును, ఆయన మన్నతను ఆశిస్తూ సత్కర్మలను చేసేవారి సత్కర్మలను ఆదరించేవాడును.

(24) ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఖుర్ఆన్ ను కల్పించుకుని దాన్ని తన ప్రభువుకి సంబంధము అంటగట్టారని ముష్రికుల ఆరోపణ. మరియు అల్లాహ్ వారిని ఖండిస్తూ ఇలా పలికాడు : ఒక వేళ మీరు స్వయంగా అబద్దమును కల్పించుకుంటే నేను మీ హృదయముపై సీలు వేసేవాడిని మరియు కల్పించబడిన అసత్యమును తుడిచివేసేవాడిని మరియు సత్యమును ఉండేట్లు చేసేవాడిని. విషయం అలా కానప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తన ప్రభువు వద్ద నుండి దైవవాణి అవతరింపబడటం సత్యం అని ఋజువవుతున్నది. నిశ్ఛయంగా ఆయన తన దాసుల హృదయములలో ఉన్న వాటిని బాగా తెలిసినవాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.

(25) పరిశుద్ధుడైన ఆయన తన దాసుల్లోంచి అవిశ్వాసము,పాపకార్యముల నుండి పశ్చాత్తాప్పడే వారి యొక్క పశ్చాత్తాపమును తన వైపునకు మరలినప్పుడు అంగీకరించేవాడును. మరియు వారు పాల్పడిన పాపములను మన్నించేవాడును. మరియు మీరు చేసేవి ఆయనకు తెలుసు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే మీకు వాటి పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

(26) మరియు ఆయన అల్లాహ్ ను,ఆయన ప్రవక్తలను విశ్వసించి సత్కర్మలు చేసిన వారి అర్ధనను స్వీకరిస్తాడు. మరియు తన అనుగ్రహము నుండి వారు అడగని దానిపై వారికి అధికంగా ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తలను అవిశ్వసించేవారి కొరకు ప్రళయదినమున వారిని నిరీక్షిస్తున్న కఠినమైన శిక్ష కలదు.

(27) మరియు ఒక వేళ అల్లాహ్ తన దాసులందరికి ఆహారోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తే వారు భూమిలో హింసతో మితిమీరిపోతారు. కాని పరిశుద్ధుడైన ఆయన ఆహారోపాధిని మితంగా తాను కోరిని దాన్ని పుష్కలంగా మరియు కుదించి దించుతాడు. నిశ్చయంగా ఆయన తన దాసుల పరిస్థితులను బాగా తెలుసుకునేవాడును,వాటిని చూస్తుండేవాడును. కాబట్టి ఆయన విజ్ఞతతో ప్రసాదిస్తాడు మరియు విజ్ఞతతోనే ఆపుతాడు.

(28) మరియు ఆయనే తన దాసులపై వర్షమును వారు దాని కురవటం నుండి నిరాశ్యులైపోయిన తరువాత కురిపిస్తాడు. మరియు ఆయన ఈ వర్షమును వ్యాపింపజేస్తే భూమి మొలకెత్తుతుంది. మరియు ఆయన తన దాసుల వ్యవహారముల సంరక్షకుడు. ప్రతీ స్థితిలో ప్రశంసనీయుడు.

(29) ఆకాశములను సృష్టించటం,భూమిని సృష్టించటం మరియు ఆ రెండింటిలో విచిత్రమైన జీవరాసులను వ్యాపింపజేయటం అల్లాహ్ సామర్ధ్యంపై,ఆయన ఏకత్వం పై సూచించే సూచనలు. మరియు ఆయన హషర్ (సమీకరించటం),ప్రతిఫలం ప్రసాదించటం కొరకు వారందరిని సమావేశపరచటంపై తాను తలచుకున్నప్పుడు సామర్ధ్యం కలవాడు. వాటిని మొదటిసారి సృష్టించటం ఆయనను అశక్తుడిని చేయనట్లుగానే అది ఆయనను అశక్తుడిని చేయదు.

(30) ఓ ప్రజలారా మీకు మీ స్వయములో,మీ సంపదల్లో ఏదైన ఆపద సంభవిస్తే మీరు మీ చేజేతులా చేసుకున్న పాపముల మూలముగా. మరియు అల్లాహ్ వాటిలో నుండి చాలావాటిని మీ కొరకు మన్నించివేస్తాడు. వాటి ద్వారా మిమ్మల్ని శిక్షించడు.

(31) మరియు మీరు మీ ప్రభువు నుండి ఆయన మిమ్మల్ని శిక్షించదలచినప్పుడు పారిపోయి విముక్తిని పొందలేరు. మరియు మీ కొరకు ఆయన తప్ప మీ వ్యవహారములను పరిరక్షించే పరిరక్షకుడెవడూ లేడు. మరియు ఆయన మిమ్మల్ని శిక్షించదలచుకుంటే మీ నుండి శిక్షను తొలగించే సహాయకుడెవడూ ఉండడు.

(32) మరియు సముద్రంలో పర్వతములవలె తమ ఎత్తులో మరియు తమ పొడుగవటంలో పయనించే ఓడలు అల్లాహ్ సామర్ధ్యముపై,ఆయన ఏకత్వముపై సూచించే సూచనలు.

(33) ఒక వేళ అల్లాహ్ వాటిని నడిపించే గాలులను ఆపదలచితే వాటిని ఆపివేస్తాడు. అప్పుడు అవి సముద్రంలోనే చలనం లేకుండి స్థిరంగా ఉండిపోతాయి. నిశ్చయంగా ఈ ప్రస్తావించబడిన ఓడలను సృష్టించటం మరియు గాలులను ఆదీనం చేయటంలో ఆపదపై,కష్టంపై బాగా సహనం చూపే,తన పై ఉన్న అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞత తెలుపుకునే ప్రతీ ఒక్కరి కొరకు అల్లాహ్ సామర్ధ్యంపై స్పష్టమైన సూచనలు కలవు.

(34) లేదా పరిశుద్ధుడైన ఆయన ప్రజలు చేసుకున్న పాపముల వలన ఈ ఓడలను వాటిపై తీవ్రమైన పెను గాలులను పంపించి నాశనం చేయదలచుకుంటే వాటిని నాశనం చేసేవాడు. మరియు ఆయన తన దాసుల చాలా పాపములను మన్నించివేస్తాడు. వాటిపై ఆయన వారిని శిక్షించడు.

(35) మరియు తీవ్ర పెనుగాలులు పంపించటం వలన ఈ ఓడల వినాశనము చేసేటప్పుడు అల్లాహ్ సూచనలను అసత్యపరిచే విషయంలో వాదులాడే వారు తమకు వినాశనం నుండి పారిపోయే ఎటువంటి ప్రదేశము లేదని తెలుసుకుంటారు. అప్పుడు వారు అల్లాహ్ ను మాత్రమే వేడుకుంటారు. ఇతరులను వదిలివేస్తారు.

(36) ప్రజలారా మీరు ప్రసాదించబడిన సంపద,స్థానము,సంతానము ఇహలోక జీవిత సంపద మాత్రమే. మరియు అది తరిగిపోయేది,అంతమైపోయేది. మరియు అల్లాహ్ పై,ఆయన ప్రవక్తలపై విశ్వాసమును కనబరచి,తమ వ్యవహారములన్నింటిలో ఒక్కడైన తమ ప్రభువు పై నమ్మకమును కలిగిన వారి కౌరకు అల్లాహ్ సిద్ధం చేసి ఉంచిన స్వర్గ అనుగ్రహాలు శాశ్వతమైన అనుగ్రహాలు కలవు.

(37) మరియు పెద్ద పాపముల నుండి,వాటి చెడుల నుండి దూరంగా ఉండేవారు తమకు మాటల ద్వారా,చేతల ద్వారా చెడు చేసిన వాడిపై ఆగ్రహానికి లోనయినప్పుడు అతనికి అతని అవమానపరచటమును మన్నించివేసి,వాటిపై అతన్ని శిక్షించరు. మరియు ఈ మన్నింపు అందులో ఏదైన మేలు,ప్రయోజనం ఉండినప్పుడు వారి తరపు నుండి అనుగ్రహము.

(38) మరియు వారే తమ ప్రభువునకు ఆయన ఆదేశమును పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆజ్ఞాపాలన చేసేవారు మరియు నమాజులను పరిపూర్ణ రీతిలో సంపూర్ణం చేసేవారు. మరియు వారు తమ అత్యవసర వ్యవహారములలో పరస్పర సంప్రదింపులు చేసుకుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన వాటిలో నుండి అల్లాహ్ మన్నతను ఆశిస్తూ ఖర్చు చేస్తారు.

(39) మరియు వారు తమకు అన్యాయం జరిగినప్పుడు తమ స్వయం యొక్క గౌరవానికి,ఆధిక్యతకి ప్రతీకారం తీర్చుకుంటారు. అన్యాయానికి ఒడిగట్టినవాడు క్షమాపణకు అర్హుడు కానప్పుడు. మరియు ఈ ప్రతీకారము సరైనదే. ప్రత్యేకంగా మన్నింపులో ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు.

(40) మరియు ఎవరైతే తన హక్కును తీసుకోదలచుకుంటాడో అది అతనికే చెందుతుంది. కానీ అది ఏ విధమైన అధికం చేయకుండా మితిమీరకుండా ఎలా ఉన్నదో అలా. మరియు ఎవరైతే తనకు కీడు చేసిన వాడికి మన్నించి,తనకు కీడు కలిగించిన దానిపై అతనికి శిక్షించకుండా తనకు మరియు తన సోదరునికి మధ్య ఉన్న దాన్ని సరిదిద్దుకుంటాడో అతని పుణ్యము అల్లాహ్ వద్ద ఉన్నది. నిశ్చయంగా ప్రజలపై వారి ప్రాణముల విషయంలో,వారి సంపదల విషయంలో,వారి మానముల విషయంలో అన్యాయం చేసేవారిని అల్లాహ్ ఇష్టపడడు. అంతేకాక వారిని ధ్వేషిస్తాడు.

(41) మరియు ఎవరైతే తన స్వయం కొరకు ప్రతీకారం తీర్చుకుంటారో వారందరిపై తమ హక్కును తీసుకోవటం వలన ఎటువంటి నింద లేదు.

(42) నింద మరియు శిక్ష మాత్రం ప్రజలకు అన్యాయం చేసి,భువిలో పాపకార్యాలకు పాల్పడే వారికి మాత్రమే ఉంటుంది. వారందరి కొరకు పరలోకంలో బాధాకరమైన శిక్ష కలదు.

(43) ఇక ఎవరైతే ఇతరులు తనకు బాధ కలిగించటం పై సహించి వారిని మన్నించి వేస్తాడో నిశ్ఛయంగా ఆ సహనం అతనికి మరియు సమాజమునకు మేలును కలిగించును. మరియు అది పొగడబడిన విషయము. మరియు అతనికి గొప్ప భాగమే ప్రసాదించబడును.

(44) మరియు అల్లాహ్ ఎవరినైతే సన్మార్గము పొందటం నుండి విఫలం చేసి అతన్ని సత్యము నుండి తప్పించివేస్తాడో అతని కొరకు దాని తరువాత అతని వ్యవహారమును పరిరక్షించే పరిరక్షకుడు ఎవడూ ఉండడు. మరియు అవిశ్వాసముతో,పాపకార్యములతో తమ స్వయంపై దుర్మార్గమునకు పాలపడిన వారు ప్రళయదినమున శిక్షను కళ్ళారా చూసినప్పుడు ఈ విధంగా ఆశిస్తూ ఇలా పలుకుతుండగా మీరు చూస్తారు : మేము అల్లాహ్ తో తౌబా చేసుకోవటానికి ఇహలోకము వైపు మరలటం కొరకు ఏదైన మార్గం ఉన్నదా ?.

(45) మరియు ఓ ప్రవక్తా ఈ దుర్మార్గులందరిని, వారు నరకాగ్నిపై ప్రవేశపెట్టబడినప్పుడు వారు అవమానమునకు గురై,సిగ్గు పడతూ ప్రజల వైపునకు దాని భయము వారికి ఉండటం వలన దొంగ చూపులు చూస్తుండగా మీరు చూస్తారు. మరియు అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచిన వారు ఇలా పలుకుతారు : నిశ్చయంగా వాస్తవానికి నష్టపోయేవారు వారే ఎవరైతే అల్లాహ్ శిక్షను పొందటం వలన ప్రళయ దినమున తమకు మరియు తమ ఇంటి వారికి నష్టం కలిగించుకుంటారో. వినండి నిశ్ఛయంగా అవిశ్వాసముతో,పాపకార్యములతో తమ స్వయంనకు అన్యాయం చేసుకున్న వారు ఎన్నటికి అంతం కాని శాశ్వతమైన శిక్షలో ఉంటారు.

(46) మరియు వారి కొరకు ప్రళయదినమున అల్లాహ్ శిక్ష నుండి రక్షించటం ద్వారా వారికి సహాయం చేసే సంరక్షకుడెవడూ ఉండడు. మరియు అల్లాహ్ ఎవరినైతే సత్యము నుండి విఫలం చేసి అపమార్గమునకు లోను చేస్తాడో అతని కొరకు ఎన్నటికి సత్యం వైపునకు మార్గదర్శకం చేయటం వైపునకు దారి తీసే ఎటువంటి మార్గం ఉండదు.

(47) ఓ ప్రజలారా మీరు మీ ప్రభువునకు ఆయన ఆదేశములను పాటించటానికి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటానికి మరియు కాలయాపనను వదిలిపెట్టటానికి వెంటనే ప్రతిస్పందించండి. ప్రళయం రాక ముందే అది వచ్చినప్పుడు దాన్ని తొలగించేవాడు ఎవడూ ఉండడు. మీ కొరకు మీరు శరణం తీసుకోవటానికి ఎటువంటి శరణాలయం ఉండదు. మరియు మీరు ఇహలోకములో చేసుకున్నటువంటి మీ పాపములను మీరు నిరాకరించటానికి మీ కొరకు ఎటువంటి నిరాకరము ఉండదు.

(48) అయితే ఒక వేళ వారు దేని గురించైతే మీరు వారికి ఆదేశించారో వాటి నుండి విముఖత చూపితే ఓ ప్రవక్తా మేము మిమ్మల్ని వారి కర్మలను పరిరక్షించటానికి వారిపై పరిరక్షకునిగా పంపించలేదు. మీకు ఏ సందేశములను చేరవేయమని ఆదేశించబడినదో వాటిని చేరవేసే బాధ్యత మాత్రమే మీపై ఉన్నది. వారి లెక్క తీసుకునే బాధ్యత అల్లాహ్ పై ఉన్నది. మరియు నిశ్చయంగా మేము మానవునికి మా వద్ద నుండి ఐశ్వర్యము,ఆరోగ్యము, వాటి లాంటి వాటిని కారుణ్యముగా రుచి చూపించినప్పుడు అతడు వాటితో సంబరపడిపోయేవాడు. మరియు ఒక వేళ మానవునికి ఏదైన ఆపద వారి పాపముల వలన కలిగితే నిశ్ఛయంగా వారి స్వభావము అల్లాహ్ అనుగ్రహములకు కృతఘ్నులయ్యి వాటికి కృతజ్ఞత తెలుపకపోవటం మరియు అల్లాహ్ తన విజ్ఞతతో నిర్ణయించిన దాని విషయంలో ఆగ్రహానికి లోనవటం.

(49) ఆకాశముల సామ్రాజ్యాధికారము మరియు భూమి యొక్క సామ్రాజ్యాధికారము అల్లాహ్ కే చెందుతుంది. మగ లేదా ఆడ లేదా ఇతర వాటిలోంచి తాను తలచిన దాన్ని సృష్టిస్తాడు. తాను తలచిన వారికి ఆడ సంతానమును ఇచ్చి వారికి మగ సంతానమును ఇవ్వడు. మరియు తాను తలచిన వారికి మగ సంతానమును ఇచ్చి వారికి ఆడ సంతానమును ఇవ్వడు. మరియు తాను తలచిన వారికి ఆడ,మగ సంతానమును కలిపి ఇస్తాడు. మరియు తాను తలచిన వారికి సంతానము కలగకుండా గొడ్రాలుగా చేస్తాడు. నిశ్చయంగా జరుగుతున్నది,భవిష్యత్తులో జరగబోయేది ఆయనకు బాగా తెలుసు. మరియు ఇది ఆయన పరిపూర్ణ జ్ఞానం వలన మరియు సంపూర్ణ విజ్ఞత వలన జరుగుతుంది. ఆయన పై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.

(50) ఆకాశముల సామ్రాజ్యాధికారము మరియు భూమి యొక్క సామ్రాజ్యాధికారము అల్లాహ్ కే చెందుతుంది. మగ లేదా ఆడ లేదా ఇతర వాటిలోంచి తాను తలచిన దాన్ని సృష్టిస్తాడు. తాను తలచిన వారికి ఆడ సంతానమును ఇచ్చి వారికి మగ సంతానమును ఇవ్వడు. మరియు తాను తలచిన వారికి మగ సంతానమును ఇచ్చి వారికి ఆడ సంతానమును ఇవ్వడు. మరియు తాను తలచిన వారికి ఆడ,మగ సంతానమును కలిపి ఇస్తాడు. మరియు తాను తలచిన వారికి సంతానము కలగకుండా గొడ్రాలుగా చేస్తాడు. నిశ్చయంగా జరుగుతున్నది,భవిష్యత్తులో జరగబోయేది ఆయనకు బాగా తెలుసు. మరియు ఇది ఆయన పరిపూర్ణ జ్ఞానం వలన మరియు సంపూర్ణ విజ్ఞత వలన జరుగుతుంది. ఆయన పై ఏదీ గోప్యంగా ఉండదు. మరియు ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.

(51) అల్లాహ్ ఏ మానవునితో మాట్లాడటం సంభవం కాదు కాని దైవ వాణి తో లేదా వేరే విధంగా లేదా అతనితో కనబడకుండా తన మాటను వినే విధంగా లేదా జిబ్రయీల్ లాంటి ఒక దూతను పంపించి మాట్లాడుతాడు. అప్పుడు అతను మానవ పాత్రుడైన ప్రవక్తకు అల్లాహ్ ఆదేశం మేరకు ఆయనకు అల్లాహ్ దైవ వాణి చేరవేయదలచుకున్న దైవవాణిని చేరవేస్తాడు. నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన తన అస్తిత్వంలో,తన గుణములలో మహోన్నతుడు, తన సృష్టించటంలో,తన విధివ్రాతలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడు.

(52) మరియు మేము ప్రవక్తా మీకన్న మునుపు ప్రవక్తలకు దైవవాణిని చేరవిసినట్లే మేము మీకు ఖుర్ఆన్ ను మా వద్ద నుండి దైవవాణి ద్వారా చేరవేశాము. దానికన్న ముందు దైవ ప్రవక్తలపై అవతరింపబడిన దివ్యగ్రంధములేమిటో మీకు తెలియదు. మరియు విశ్వాసమంటే ఏమిటో మీకు తెలియదు ?. కాని మేము ఈ ఖుర్ఆన్ ను జ్యోతిగా అవతరింపజేసి దాని ద్వారా మా దాసుల్లోంచి మేము కోరిన వారికి సన్మార్గంపై తీసుకుని వస్తాము. మరియు నిశ్ఛయంగా మీరు ప్రజలను సన్మార్గమును చూపుతారు. అదే ఇస్లాం.

(53) ఆ అల్లాహ్ మార్గము ఆకాశముల్లో ఉన్నవి మరియు భూమిలో ఉన్నవి సృష్టి పరంగా,అధికారము పరంగా,పర్యాలోచన పరంగా ఆయనకే చెందుతాయి. వ్యవహారములన్ని తమ విధి వ్రాతలో,పర్యాలోచనలో ఖచ్చితంగా ఒక్కడైన అల్లాహ్ వైపునకే మరలుతాయి.