(1) హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.
(2) అల్లాహ్ సత్యం వైపునకు మార్గదర్శకం యొక్క మార్గమును స్పష్ట పరిచే ఖుర్ఆన్ పై ప్రమాణం చేశాడు.
(3) నిశ్చయంగా మేము ఖుర్ఆన్ ను ఘనమైన రాత్రిలో అవతరింపజేశాము. మరియు అది అధిక శుభాలు కల రాత్రి. నిశ్చయంగా మేము ఈ ఖుర్ఆన్ ద్వారా భయపెడుతున్నాము.
(4) ఈ రాత్రిలో ఆహారములకు,ఆయుషులకు మరియు ఇతర విషయాలకు సంబంధించినది అల్లాహ్ ఆ సంవత్సరంలో సంభవింపజేసే ప్రతీ ధృడమైన విషయము నిర్ణయించబడుతుంది.
(5) ప్రతీ ధృడమైన విషయము మా వద్ద నుండే నిర్ణయించబడుతుంది. నిశ్ఛయంగా మేమే ప్రవక్తలను పంపించేవారము.
(6) నీ ప్రభువు వద్ద నుండి కారుణ్యముగా మేము ప్రవక్తలను పంపిస్తాము -ఓ ప్రవక్తా - ఎవరి వద్దకు వారు పంపించబడ్డారో వారి కొరకు. పరిశుద్ధుడైన ఆయనే తన దాసుల మాటలను వినేవాడును, వారి కర్మలను,వారి సంకల్పాలను తెలుసుకునేవాడును. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
(7) ఆకాశముల ప్రభువు,భూమి యొక్క ప్రభువు,ఆ రెండిటి మధ్య ఉన్న వాటికి ప్రభువు ఒక వేళ మీరు దీన్ని నమ్మే వారే అయితే నా ప్రవక్తను విశ్వసించండి.
(8) ఆయన తప్ప వేరే వాస్తవ ఆరాధ్య దైవం లేడు. ఆయనే జీవనమును కలిగించేవాడు మరియు మరణమును కలిగించేవాడు. ఆయన తప్ప వేరే జీవింపజేసేవాడు లేడు,మరణింపజేసేవాడు లేడు. మీకూ ప్రభువు మరియు మీ పూర్వికులైన మీ తాతముత్తాతలకు ప్రభువు.
(9) ఈ ముష్రికులందరు దీన్ని విశ్వసించేవారు కారు. అంతేకాక దాని నుండి సందేహంలో పడి ఉన్నారు,వారు ఉన్న అసత్యము వలన దాని నుండి నిర్లక్ష్యం వహిస్తున్నారు.
(10) ఓ ప్రవక్త నీ జాతి వారిపై దగ్గరలో వచ్చే శిక్ష గురించి నిరీక్షించు. ఆ రోజు ఆకాశము స్పష్టమైన పొగను తీసుకుని వస్తుంది, వారు దాన్ని నొప్పి తీవ్రత నుండి తమ కళ్ళతో చూస్తారు.
(11) అది నీ జాతి వారందరిపై వస్తుంది. మరియు వారితో ఇలా పలకబడుతుంది : మీకు సంభవించిన ఈ శిక్ష ఒక బాధాకరమైన శిక్ష.
(12) అప్పుడు వారు తమ ప్రభువుతో కడు దీనంగా వేడుకుంటూ ఇలా అడుగుతారు : ఓ మా ప్రభువా నీవు మా పై పంపించిన శిక్షను మా నుండి తొలగించు. ఒక వేళ నీవు దాన్ని మా నుండి తొలగిస్తే నిశ్చయంగా మేము నీపై,నీ ప్రవక్తపై విశ్వాసమును కనబరుస్తాము.
(13) హితబోధన స్వీకరించటం మరియు తమ ప్రభువు వైపునకు పశ్ఛాత్తాపముతో మరలటం వారి కొరకు ఎలా సాధ్యం ?. వాస్తవానికి వారి వద్దకు ఒక ప్రవక్త వచ్చి దైవదౌత్యమును స్పష్టపరిచాడు. మరియు వారు అతని నిజయితీని,నీతిని గుర్తించారు.
(14) ఆ తరువాత వారు అతన్ని విశ్వసించటం నుండి విముఖత చూపారు. మరియు ఇలా పలికారు : అతడు నేర్చుకున్న వాడు అతడికి ఇతరులు నేర్పించారు మరియు అతడు ఏ ప్రవక్తా కాదు. మరియు వారు అతని గురించి ఇలా పలికారు : అతడు ఒక పిచ్చివాడు.
(15) నిశ్చయంగా మేము మీ నుండి కొంచం శిక్షను తొలగించినప్పుడు నిశ్చయంగా మీరు మీ అవిశ్వాసం వైపునకు మరియు మీ తిరస్కారము వైపునకు మరలిపోయేవారు.
(16) మరియు - ఓ ప్రవక్త - వారి కొరకు (ఆ రోజు గురించి) నిరీక్షించండి. మేము బదర్ దినమున మీ జాతిలో నుండి అవిశ్వాసపరులను పెద్ద పట్టు పట్టుకుంటాము. నిశ్చయంగా మేము అల్లాహ్ పట్ల వారి అవిశ్వాసం వలన మరియు ఆయన ప్రవక్త పట్ల వారి తిరస్కారము వలన వారితో ప్రతీకారం తీర్చుకుంటాము.
(17) మరియు నిశ్ఛయంగా మేము మీ కన్న ముందు ఫిర్ఔన్ జాతివారిని పరీక్షకు గురి చేశాము. మరియు వారి వద్దకు ఒక ప్రవక్త అల్లాహ్ వద్ద నుండి ఒక గౌరవనీయుడైన ప్రవక్త వారిని అల్లాహ్ ఏకత్వం (తౌహీద్) వైపునకు మరియు ఆయన ఆరాధన వైపునకు పిలుస్తూ వచ్చాడు. మరియు ఆయనే మూసా అలైహిస్సలాం.
(18) మూసా ఫిర్ఔన్ తో,అతని జాతి వారితో ఇలా పలికారు : మీరు బనీ ఇస్రాయీల్ ను నాకు వదిలేయండి (నాకు అప్పజెప్పండి). వారు అల్లాహ్ దాసులు. మీరు వారిని బానిసలుగా చేసుకునే హక్కు మీకు లేదు. నిశ్చయంగా నేను మీ కొరకు అల్లాహ్ వద్ద నుండి పంపించబడ్డ ఒక ప్రవక్తను. ఆయన నాకు మీకు చేరవేయమని ఆదేశించిన వాటిలో నీతిమంతుడిని. అందులో నుండి నేను ఏమీ తగ్గించను మరియు అధికం చేయను.
(19) మరియు మీరు అల్లాహ్ ముందు ఆయన ఆరాధన చేయటంను వదిలి మరియు ఆయన దాసులపై ఆధిక్యతను చూపి గర్వపడకండి. నిశ్చయంగా నేను మీ వద్దకు స్పష్టమైన వాదనను తీసుకుని వచ్చాను.
(20) మరియు నిశ్చయంగా మీరు నన్ను రాళ్ళతో కొట్టి చంపటం నుండి నేను నా ప్రభువు,మీ ప్రభువు యొక్క రక్షణను పొందాను.
(21) మరియు ఒక వేళ మీరు నేను తీసుకుని వచ్చిన దాన్ని నమ్మకపోతే మీరు నా నుండి వేరైపోండి. మరియు దుర ఉద్దేశంతో మీరు నాకు దగ్గరవకండి.
(22) అప్పుడు మూసా అలైహిస్సలాం తన ప్రభువుతో ఇలా వేడుకున్నారు : ఈ జాతి వారందరు - ఫిర్ఔన్,అతని సభాప్రముఖులు - శీఘ్ర శిక్షకు అర్హులైన అపరాద జనులు.
(23) అప్పుడు అల్లాహ్ మూసాను తన జాతి వారిని తీసుకుని రాత్రివేళ బయలుదేరమని ఆదేశించాడు. మరియు ఫిర్ఔన్,అతని జాతి వారు వారిని వెంబడిస్తారని ఆయనకు సమాచారమిచ్చాడు.
(24) మరియు అతను మరియు బనూ ఇస్రాయీలు సముద్రమును దాటినప్పుడు దాన్ని ఏవిధంగా ఉన్నదో అలాగే వదిలివేయమని ఆయన అతనికి ఆదేశమిచ్చాడు. నిశ్ఛయంగా ఫిర్ఔన్ మరియు అతని సైన్యం సముద్రంలో మునిగి నాశనమవుతారు.
(25) ఫిర్ఔన్ మరియు అతని జాతివారు ఎన్నో తోటలను,ప్రవహించే చెలమలను తమ వెనుక వదిలివేశారు.
(26) మరియు వారు ఎన్నో పంటపొలాలను,మంచి కూర్చునే ప్రదేశములను తమ వెనుక వదిలివెళ్ళారు.
(27) మరియు వారు తాము అనుభవించిన ఎంతో జీవితము తమ వెనుక వదిలి వెళ్ళారు.
(28) మీకు తెలిపినట్లే వారికి ఇలాగే జరిగింది. మరియు మేము వారి తోటలకు,వారి చెలమలకు,వారి పంటపొలాలకు,వారి నివాసములకు వేరే జాతి వారైన ఇస్రాయీల్ సంతతి వారిని వారసులుగా చేశాము.
(29) అయితే ఫిర్ఔన్ మరియు అతని జాతివారిపై వారు మునిగిపోయినప్పుడు ఆకాశము,భూమి ఏడవలేదు. మరియు వారు పశ్ఛాత్తాప్పడటానికి వారికి గడువు ఇవ్వబడలేదు.
(30) మరియు నిశ్చయంగా మేము ఇస్రాయీల్ సంతతివారిని అవమానకరమైన శిక్ష నుండి రక్షించాము. ఎందుకంటే ఫిర్ఔన్ మరియు అతని జాతివారు వారి కుమారులను హతమార్చి,వారి ఆడవారిని జీవించి ఉండేట్లుగా వదిలివేసేవారు.
(31) మేము వారిని ఫిర్ఔన్ శిక్ష నుండి రక్షించాము. నిశ్చయంగా అతడు అల్లాహ్ ఆదేశములను,ఆయన ధర్మమును అతిక్రమించే వారిలో నుండి అహంకారి అయిపోయాడు.
(32) మరియు నిశ్చయంగా మేము ఇస్రాయీల్ సంతతివారిని మా జ్ఞానముతో వారి ప్రవక్తలు అధికమవటం వలన వారి కాలపు లోకవాసులపై ఎన్నుకున్నాము.
(33) మరియు మేము వారికి మన్న మరియు సల్వా మొదలగు వాటి లాంటి సూచనలను,ఆధారాలను వేటి ద్వారానైతే మేము మూసా అలైహిస్సలాంనకు మద్దతునిచ్చామో,వేటిలోనైతే వారి కొరకు స్పష్టమైన అనుగ్రహం ఉన్నదో ప్రసాదించాము.
(34) నిశ్ఛయంగా తిరస్కారులైన ముష్రికులు మరణాంతరం లేపబడటమును తిరస్కరిస్తూ తప్పకుండా ఇలా పలుకుతారు :
(35) మాకు మా ఈ మొదటి మరణం మాత్రమే ఉన్నది. దాని తరువాత ఎటువంటి జీవితం లేదు. మరియు ఈ మరణం తరువాత మేము మరల లేపబడేవారిలోంచి కాము.
(36) అయితే ఓ ముహమ్మద్ నీవు మరియు నీతో పాటు ఉండి నిన్ను అనుసరించేవారు మరణించిన మా తాతముత్తాతలను జీవింపజేసి తీసుకుని రండి ఒక వేళ లెక్క తీసుకును ప్రతిఫలం ప్రసాదించటం కొరకు అల్లాహ్ మృతులను జీవింపజేసి మరల లేపుతాడన్న మీరు వాదించే విషయంలో మీరు సత్యవంతులేనైతే.
(37) ఓ ప్రవక్తా బలములో,ప్రతిఘటించటంలో మిమ్మల్ని తిరస్కరించిన ఈ ముష్రికులందరు ఉత్తములా లేదా తుబ్బఅ జాతివారా,ఆద్ సమూద్ లాంటి వారికన్న ముందు ఉన్న వారా. మేము వారందరిని నాశనం చేశాము. నిశ్చయంగా వారు అపరాధులు.
(38) మరియు మేము ఆకాశములను,భూమిని మరియు ఆ రెండిటిలో ఉన్న వాటిని ఆటగా సృష్టించలేదు.
(39) మరియు మేము భూమ్యాకాశములను అత్యంత విజ్ఞతతో సృష్టించాము. కాని చాలామంది ముష్రికులకు ఇది తెలియదు.
(40) అల్లాహ్ దాసుల మధ్య తీర్పునిచ్చేదైన ప్రళయదినము సృష్టితాలన్నింటి కొరకు నిర్ణీత సమయము. అల్లాహ్ వారిని అందులో సమీకరిస్తాడు.
(41) ఆ రోజు ఏ సన్నిహితుడు తన సన్నిహితుడినికి గాని ఏ స్నేహితుడు తన ఏ స్నేహితునికి ప్రయోజనం కలిగించడు. మరియు వారు అల్లాహ్ శిక్షను ఆపలేరు. ఎందుకంటే ఆ రోజు అధికారం అల్లాహ్ కే చెందుతుంది. ఎవరు దానిగురించి వాదించలేడు.
(42) కాని అల్లాహ్ ప్రజల్లోంచి ఎవరిపై కరుణిస్తే అతడు తాను ముందు చేసి పంపించుకున్న సత్కర్మతో ప్రయోజనం చెందుతాడు. నిశ్చయంగా అల్లాహ్ ఎవరూ ఓడించని సర్వాధిక్యుడు,తన దాసుల్లోంచి తౌబా చేసిన వారిపై కరుణించేవాడు.
(43) నిశ్ఛయంగా జఖ్ఖుమ్ వృక్షము దాన్ని అల్లాహ్ నరకము మధ్యలో మొలకెత్తిస్తాడు.
(44) మహా పాపి అయిన అవిశ్వాసపరుని ఆహారము,దాని హానికరమైన ఫలమును అతడు తింటాడు.
(45) ఈ ఫలము నల్లటి నూనే వలె ఉంటుంది. అది తన వేడి తీవ్రత వలన వారి కడుపులలో మరుగుతుంది.
(46) తీవ్ర వేడి నీరు మరుగటంలాగా.
(47) నరక భటులతో ఇలా ఆదేశించబడును : మీరు అతడిని పట్టుకుని నరకం మధ్యం వైపునకు కఠినంగా,బలంగా ఈడ్చండి.
(48) ఆ తరువాత మీరు శిక్షంపబడే ఈ వ్యక్తి తల పైనుండి వేడి నీళ్లను గుమ్మరించండి. అయితే శిక్ష అతని నుండి వేరవదు.
(49) మరియు అతనితో వ్యంగ్యముగా ఇలా పలకబడుతుంది : ఈ భాధాకరమైన శిక్ష రుచిని చూడు. నిశ్ఛయంగా నీవే నీ జాతిలో నీ ఉన్నతమైన గౌరవమును కించబరచకుండా ఉండిన ఆధిక్యుడివి.
(50) నిశ్ఛయంగా ప్రళయదినమున వాటిల్లే విషయంలో మీరు సందేహపడిన శిక్ష ఇదే. దాన్ని మీరు ప్రత్యక్షంగా చూడటంతో మీ నుండి సందేహం తొలగిపోయినది.
(51) నిశ్ఛయంగా తమ ప్రభువుపట్ల ఆయన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భీతి కలిగిన వారు తమకు కలిగే ప్రతీ బాధ నుండి సురక్షిత ప్రదేశంలో ఉంటారు.
(52) తోటలలో,ప్రవహించే చెలమలలో,
(53) వారు స్వర్గంలో పలుచని మరియు మందమైన పట్టు వస్త్రములను తొడుగుతారు. వారు ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. మరియు వారిలోని ఒకరు ఇంకొకరి తల వెనుక భాగమును చూడరు.
(54) ఈ ప్రస్తావించిన వాటితో మేము వారిని గౌరవించినట్లే మేము స్వర్గంలో తమ తెల్లదనం,తమ నలుపుదనం ఉండి కూడా పెద్దపెద్ద కళ్ళు కలిగిన అందమైన స్త్రీలతో వారి వివాహం చేస్తాము.
(55) అక్కడ వారు తమ సేవకులను తాము కోరిన ప్రతీ ఫలమును తమ వద్దకు తీసుకుని రమ్మని విన్నపించుకుంటారు వారు వాటి అంతమైపోవటం నుండి,వాటి నష్టముల నుండి నిశ్ఛింతగా ఉంటారు.
(56) వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వారు ఇహలోకములోని మొదటి మరణం తప్ప అందులో మరణం రుచి చూడరు. మరియు వారి ప్రభువు వారిని నరకాగ్ని శిక్ష నుండి రక్షించాడు.
(57) వారిపై తమ ప్రభువు వద్ద నుండి అనుగ్రహముగా మరియు ఉపకారముగా. ఈ ప్రస్తావించబడిన స్వర్గములో వారి ప్రవేశము మరియు నరకాగ్ని నుండి వారికి రక్షణ ఇదే దానికి ఎటువంటి సాఫల్యము సరితూగని గొప్ప సాఫల్యము.
(58) నిశ్ఛయంగా మేము ఈ ఖుర్ఆన్ ను ఓ ప్రవక్తా మీ అరబీ భాషలో అవతరింపజేసి దాన్ని సులభతరం చేశాము. బహుశా వారు హితోపదేశం గ్రహిస్తారని.
(59) అయితే మీరు మీకు సహాయం కలగటానికి మరియు వారి వినాశనమునకు నిరీక్షించండి. నిశ్చయంగా వారు మీ వినాశనమునకు నిరీక్షిస్తున్నారు.