45 - Al-Jaathiya ()

|

(1) హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది.

(2) ఎవరు ఓడించని సర్వాధిక్యుడైన అల్లాహ్ వద్ద నుండి ఖుర్ఆన్ అవతరణ జరిగింది. ఆయన తన సృష్టించటంలో,తన విధివ్రాతలో మరియు తన పర్యాలోచనలో వివేకవంతుడు.

(3) నిశ్ఛయంగా ఆకాశముల్లో,భూమిలో విశ్వాసపరుల కొరకు అల్లాహ్ సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచనలు కలవు. ఎందుకంటే వారే సూచనల ద్వారా గుణపాఠం నేర్చుకుంటారు.

(4) ఓ ప్రజలారా వీర్య బిందువు నుండి,ఆ పిదప మాంసపు ముద్దతో,ఆ తరువాత రక్తపు ముద్దతో మీ సృష్టిలో మరియు అల్లాహ్ వ్యాపింపజేసిన నేలపై పాకే జంతువులలో విశ్వసించే జనుల కొరకు ఆయన ఏకత్వంపై సూచనలు కలవు ఎందుకంటే అల్లాహ్ యే సృష్టికర్త.

(5) రాత్రింబవళ్ళను ఒక దాని వెనుక ఒకటిని తీసుకుని రావటంలో, అల్లాహ్ ఆకాశము నుండి వర్షమును కురిపించి దాని ద్వారా భూమిని అందులో ఎటువంటి మొక్కలు లేకుండా మృతునిగా ఉన్న తరువాత అందులో మొలకెత్తించి జీవింపజేయటంలో మరియు గాలులను మీ ప్రయోజనముల కొరకు వాటిని ఒకసారి ఒక దిశ నుండి మరోకసారి ఇంకొ దిశ నుండి తీసుకుని వచ్చి వ్యాపింపజేయటంలో బుద్ధి కల జనుల కొరకు సూచనలు కలవు. అప్పుడు వారు వాటితో అల్లాహ్ ఏకత్వముపై,మరణాంతరం లేపటంపై ఆయన సామర్ధ్యంపై మరియు ప్రతీది చేసే ఆయన సామర్ధ్యం పై ఆధారమును చూపుతారు.

(6) ఓ ప్రవక్తా మేము మీపై ఉన్నదున్నట్లుగా చదివి వినిపించిన ఆయతులు,ఆధారాలు ఇవి. ఒక వేళ మీరు అల్లాహ్ తన దాసునిపై అవతరింపజేసిన మాటను,ఆయన ఆధారాలను విశ్వసించకపోతే దీని తరువాత మీరు ఏ మాటను విశ్వసిస్తారు మరియు దాని తరువాత మీరు ఏ ఆధారాలను నమ్ముతారు ?.

(7) ప్రతీ అసత్యపరుడుని కొరకు,అధికంగా పాపాలకు పాల్పడే వాడి కొరకు అల్లాహ్ వద్ద నుండి శిక్ష మరియు వినాశనము కలదు.

(8) ఈ అవిశ్వాసపరుడు తనకు చదివి వినిపించబడిన ఖుర్ఆన్ లోని అల్లాహ్ ఆయతులను వినేవాడు. ఆ తరువాత అతడు తాను ఉన్న అవిశ్వాసము,పాపకార్యములోనే కొనసాగేవాడు,సత్యమును అనుసరించటం నుండి తన మనస్సులో అహంకారమును కలిగిన వాడు. ఎలాగంటే తనకు చదివి వినిపించబడిన ఈ ఆయతులను అతడు విననట్లుగా ఉన్నాడు. ఓ ప్రవక్త మీరు అతనికి అతని పరలోకంలో అతనికి బాధ కలిగించే దాని గురించి సమాచారమివ్వండి. మరియు అది బాధాకరమైన శిక్ష అందులో అతని కొరకు నిరీక్షిస్తుంది.

(9) మరియు వారికి ఖుర్ఆన్ నుండి ఏదైన చేరితే వారు దాన్ని పరిహాసముగా చేసుకుని దాన్ని హేళణ చేసేవారు. ఖుర్ఆన్ పట్ల పరిహాస గుణమును కలిగిన వారందరి కొరకు ప్రళయదినమున అవమానకరమైన శిక్ష కలదు.

(10) పరలోకములో వారి ముందట నరకాగ్ని వారి కొరకు నిరీక్షిస్తూ ఉంటుంది. వారు సంపాదించుకున్న వారి సంపాదనలు అల్లాహ్ నుండి వారికి ఏమాత్రం ప్రయోజనం కలిగించవు. మరియు వారు అల్లాహ్ ను వదిలి తాము తయారు చేసుకుని ఆరాధించిన విగ్రహాలు వారి నుండి ఏమాత్రం తొలగించవు. మరియు వారి కొరకు ప్రళయదినమున పెద్ద శిక్ష కలదు.

(11) మేము మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసిన ఈ గ్రంధము సత్యమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు ఎవరైతే తమ ప్రభువు ఆయన ప్రవక్తపై అవతరింపజేసిన ఆయతుల పట్ల అవిశ్వాసమును కనబరుస్తారో వారి కొరకు దుర్బరమైన బాధాకరమైన శిక్ష కలదు.

(12) ఒక్కడైన అల్లాహ్ యే ఓ ప్రజలారా మీ కొరకు సముద్రమును అందులో ఓడలు ఆయన ఆదేశముతో పయనించటం కొరకు మరియు మీరు రకరకాల సమ్మతించబడిన సంపాదనల ప్రదేశములలో అయన అనుగ్రహమును అన్వేషించటం కొరకు ఉపయుక్తంగా చేశాడు. మరియు మీరు మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహములపట్ల కృతజ్ఞతలు తెలుపుకోవటానికి.

(13) మరియు పరిశుద్ధుడైన ఆయన ఆకాశములో ఉన్న సూర్యుడిని,చంద్రుడిని,నక్షత్రములను మరియు భూమిలో ఉన్న కాలువలను,వృక్షములను,పర్వతములను మరియు మొదలగువాటిని మీ కొరకు ఉపయుక్తంగా చేశాడు. నిశ్ఛయంగా వాటిని మీకు ఉపయుక్తంగా చేయటంలో అల్లాహ్ సూచనల్లో యోచన చేసేవారి కొరకు అల్లాహ్ సామర్ధ్యంపై,ఆయన ఏకత్వం పై సూచించే సూచనలు కలవు. కావున వారు వాటితో గుణపాఠం నేర్చుకుంటారు.

(14) ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ ను విశ్వసించి,ఆయన ప్రవక్తను విశ్వసించిన వారితో ఇలా పలకండి : మీరు మీకు బాధ కలిగించిన, అల్లాహ్ అనుగ్రహములను లేదా ఆయన శిక్షలను పట్టించుకోని వారైన అవిశ్వాసపరులను మన్నించి వదిలేయండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ సహనం చూపే విశ్వాసపరుడికి మరియు అతిక్రమించే అవిశ్వాసపరుడికి ఇహలోకంలో వారు చేసుకున్న కర్మలకు తొందరలోనే ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

(15) ఎవరైన ఏదైన సత్కర్మను చేస్తే అతని కర్మ యొక్క ఫలితము అతని కొరకు ప్రయోజనకరమైనది. అతని కర్మ అల్లాహ్ కు అవసరం లేదు. మరియు ఎవరి కర్మ చెడుగా ఉంటుందో అతని కర్మ యొక్క ఫలితము దాని యొక్క శిక్ష అతనిపై చెడుగా ఉండును. మరియు అతని చెడు చేయటం అల్లాహ్ కు నష్టం కలిగించదు. ఆ తరువాత పరలోకంలో ప్రతి ఒక్కరికి యోగ్యమైన ప్రతిఫలమును మేము ప్రసాదించటానికి మీరు మా ఒక్కరి వైపునకే మరలించబడుతారు.

(16) మరియు నిశ్చయంగా మేము ఇస్రాయీలు సంతతి వారికి తౌరాత్ ను,దాని ఆదేశాలతో ప్రజల మధ్య తీర్పునివ్వటమును ప్రసాదించాము. మరియు మేము వారిలో నుండి చాలామంది ప్రవక్తలను ఇబ్రాహీం అలైహిస్సలాం సంతతిలో నుండి చేశాము. మరియు మేము వారికి రకరకాలైన మంచి ఆహారోపాధిని ప్రసాదించాము. మరియు మేము వారికి వారి కాలము నాటి సర్వజనులపై ప్రాధాన్యతను కలిగించాము.

(17) మరియు మేము వారికి అసత్యము నుండి సత్యమును స్పష్టపరిచే సూచనలను ప్రసాదించాము. వారు మాత్రం మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యము గురించి వారి ముందు వాదనలు నెలకొన్న తరువాత విభేదించుకున్నారు. మరియు వారికి ఈ విభేదాలకు దారి తీసింది మాత్రం వారిలో కొందరు కొందరిపై నాయకత్వము,ప్రతిష్ట పట్ల ఉన్న అత్యాస వలన ఆధిక్యతను ప్రదర్శించటం. ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు ప్రళయదినమున వారి మధ్య వారు ఇహలోకంలో విభేదించుకున్న వాటి విషయంలో తీర్పునిస్తాడు. అప్పుడు ఎవరు సత్యవంతుడో,ఎవరు అసత్యవంతుడో తేటతెల్లమవుతుంది.

(18) ఆ తరువాత మేము మీ కన్న మునుపు ప్రవక్తలకు ఆదేశించిన మా ఆదేశము నుండి మేము మిమ్మల్ని విశ్వాసము వైపునకు మరియు సత్కర్మ వైపునకు పిలిచే ఒక మార్గము,సంప్రదాయము,పధ్ధతిపై నియమించాము. కావున మీరు ఈ ధర్మమును అనుసరించండి. మరియు మీరు సత్యమును గురించి తెలియని వారి మనోవాంఛలను అనుసరించకండి. వారి మనోవాంఛలు సత్యము నుండి తప్పించివేస్తాయి.

(19) నిశ్చయంగా సత్యమును గురించి తెలియని వారు ఒక వేళ మీరు వారి మనోవాంఛలను అనుసరిస్తే వారు మీ నుండి అల్లాహ్ శిక్షను కొంచము కూడా ఆపజాలరు. మరియు నిశ్చయంగా అన్నీ ధర్మాల్లోంచి,మతాల్లోంచి దుర్మార్గులు ఒకరినొకరు మద్దతిస్తారు. వారి మద్దతు విశ్వాసపరులకు వ్యతిరేకంగా ఉంటుంది. మరియు అల్లాహ్ తన ఆదేశములను పాటించి,తను వారించినవాటి నుండి దూరంగా ఉండి తన భయభీతి కలిగిన వారికి సహాయకుడిగా ఉంటాడు.

(20) మన ప్రవక్తపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ అంతర్దృష్టిని ఇచ్చేది దీని ద్వారా ప్రజలు అసత్యము నుండి సత్యమును చూస్తారు. మరియు సత్యము వైపునకు మార్గ దర్శకత్వం చేసేది మరియు నమ్మకమును కలిగిన జనులకు కారుణ్యము. ఎందుకంటే వారే దాని ద్వారా సన్మార్గము వైపునకు తమ నుండి తమ ప్రభువు సంతృప్తి చెంది తమను ఆయన స్వర్గంలో ప్రవేశింపజేసి మరియు తమను నరకాగ్ని నుండి దూరం చేయటానికి మార్గమును పొందుతారు.

(21) ఏమీ తమ అవయవాలతో అవిశ్వాసమునకు,పాపకార్యములకు పాల్పడిన వారిని మేము ప్రతిఫల విషయంలో అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలను చేసిన వారి మాదిరిగా ఇహలోకములో,పరలోకములో సమానంగా ఉండేటట్లుగా చేస్తామని భావిస్తున్నారా ?. వారి ఈ తీర్పు ఎంతో చెడ్డది.

(22) మరియు అల్లాహ్ ఆకాశములను మరియు భూమిని అత్యంత విజ్ఞతతో సృష్టించాడు. ఆ రెండిటిని ఆయన వృధాగా సృష్టించలేదు. మరియు ప్రతీ ప్రాణి తాను చేసుకున్న మంచి లేదా చెడుకు ప్రతిఫలం ప్రసాదించబడటానికి. మరియు అల్లాహ్ వారి పుణ్యములను తగ్గించి మరియు వారి పాపములను అధికం చేసి వారికి అన్యాయం చేయడు.

(23) ఓ ప్రవక్తా మీరు తన మనోవాంఛలను అనుసరించి దాన్ని తాను విభేదించని ఆరాధ్యదైవం స్థానంలో చేసినవాడిని చూడండి. అల్లాహ్ తన జ్ఞానముతో అతన్ని అపమార్గమునకు లోను చేశాడు. ఎందుకంటే అతడు అపమార్గమునకు యోగ్యుడు. మరియు ఆయన అతని హృదయంపై సీలు వేశాడు కాబట్టి అతను తాను ప్రయోజనం చెందే విధంగా వినలేడు. మరియు అల్లాహ్ అతని చూపుపై తెరను కప్పివేశాడు అది అతన్ని సత్యమును చూడటం నుండి ఆపుతుంది. అయితే అల్లాహ్ అపమార్గమునకు లోను చేసిన తరువాత అతనికి సత్యము కొరకు అనుగ్రహించేవాడెవడు ?. ఏమీ మీరు మనోవాంఛలను అనుసరించటం యొక్క నష్టము నుండి మరియు అల్లాహ్ ధర్మమును అనుసరించటం యొక్క ప్రయోజనం నుండి హితబోధనను గ్రహించరా ?.

(24) మరియు మరణాంతరం లేపబడటంను తిరస్కరించే అవిశ్వాసపరులు ఇలా పలికారు : మా ఈ ఇహలోక జీవితము మాత్రమే జీవితము. దాని తరువాత ఎటువంటి జీవితం లేదు. చాలా తరాలు మరణించి అవి తిరిగి రావు. మరియు చాలా తరాలు జీవిస్తాయి. మరియు మమ్మల్ని రాత్రింబవళ్ళు ఒకదాని వెనుకు ఒకటి రావటం మాత్రమే మరణింపజేస్తుంది. మరియు మరణాంతరం లేపబడటమును వారి తిరస్కారములో వారికి ఎటువంటి జ్ఞానం లేదు. వారు కేవలం ఊహగానాలే చేస్తున్నారు. మరియు నిశ్చయంగా ఊహగానాలు సత్యం ముందు ఏమి పనికి రావు.

(25) మరియు మరణాంతరం లేపబడటమును తిరస్కరించే ముష్రికులపై స్పష్టమైన మా ఆయతులను చదివి వినిపించినప్పుడు వారు వాదించటానికి ప్రవక్తసల్లల్లాహు అలైహి వసల్లంతో,ఆయన సహచరులతో వారి ఈ మాటలు తప్ప వారి కొరకు ఎటువంటి వాదన ఉండేది కాదు : "మేము మా మరణం తరువాత లేపబడుతామని వాదనలో మీరు సత్యవంతులేనైతే మరణించిన మా తాతముత్తాతలను మీరు మా కొరకు జీవింపజేయండి".

(26) ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : అల్లాహ్ మిమ్మల్ని సృష్టించి మిమ్మల్ని జీవింపజేస్తాడు ఆ తరువాత ఆయన మిమ్మల్ని మరణింపజేస్తాడు. ఆ తరువాత మీ మరణం తరువాత లెక్క తీసుకోవటం కొరకు,ప్రతిఫలం ప్రసాదించటం కొరకు ప్రళయదినం నాడు మిమ్మల్ని ఆయన సమీకరిస్తాడు. ఆ దినము రావటం విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాని చాలా మందికి తెలియదు. అందుకనే వారు దాని కొరకు సత్కర్మల ద్వారా సిద్ధం కావటం లేదు.

(27) మరియు ఆకాశముల సామ్రాజ్యాధికారము,భూమి యొక్క సామ్రాజ్యాధికారము ఒక్కడైన అల్లాహ్ కొరకే చెందుతుంది. ఆ రెండింటిలో న్యాయపూరితంగా ఆయన తప్ప ఇతరుల ఆరాధన చేయబడదు. లెక్క తీసుకుని ప్రతిఫలం ప్రసాదించటానికి అల్లాహ్ మృతులను మరల లేపే ప్రళయం నెలకొనే దినమున అల్లాహ్ ను వదిలి ఇతరులను ఆరాధన చేసే వారైన,సత్యమును నిర్వీర్యం చేయటానికి,అసత్యమును నిరూపించటానికి ప్రయత్నించే అసత్యవాదులు నష్టమును చూస్తారు.

(28) ఓ ప్రవక్తా మీరు ఆ రోజున ప్రతీ సమాజమును తమ మోకాళ్ళపై కూర్చుని తమ పట్ల ఏమి చేయబడుతుంది అని నిరీక్షిస్తుండగా చూస్తారు. ప్రతీ సమాజము సంరక్షదూతలు వ్రాసిన తమ కర్మల పుస్తకం వైపునకు పిలవబడుతారు. ఓ ప్రజలారా ఈ రోజు మీరు ఇహలోకంలో చేసుకున్న మేలు,చెడు యొక్క ప్రతిఫలం ప్రసాదించబడుతారు.

(29) ఇది మా పుస్తకము దీనిలోనే మా దూతలు మీ కర్మలను వ్రాసేవారు. అది మీకు వ్యతిరేకం సత్యం గురించే సాక్ష్యం పలుకుతుంది కాబట్టి మీరు దాన్ని చదవండి. నిశ్ఛయంగా మేము ఇహలోకంలో మీరు చేసే కర్మల గురించి వ్రాయమని సంరక్షదూతలకు ఆదేశించాము.

(30) కాని విశ్వసించి సత్కర్మలను చేసిన వారిని పరిశుద్ధుడైన వారి ప్రభువు తన కారుణ్యము ద్వారా తన స్వర్గములో ప్రవేశింపజేస్తాడు. అల్లాహ్ వారికి ప్రసాదించే ఈ ప్రతిఫలం దాని ఏ ప్రతిఫలము సరితూగని స్పష్టమైన ప్రతిఫలము.

(31) మరియు అల్లాహ్ పై అవిశ్వాసమును కనబరచినవారిని దూషిస్తూ వారితో ఇలా పలకబడును : మీ ముందట మా ఆయతులు చదివి వినిపించబడలేదా ?. అప్పుడు మీరు వాటిపై విశ్వాసమును కనబరచటం నుండి అహంకారమును చూపారు. మరియు మీరు అపరాధ జనులైపోయారు. మీరు అవిశ్వాసముకు,పాపకార్యములకు పాల్పడ్డారు.

(32) నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసులకు ఆయన వారిని మరణాంతరం లేపి వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తానని చేసిన వాగ్దానము ఎటువంటి సందేహం లేని సత్యమని, ప్రళయం సత్యమని అందులో ఎటువంటి సందేహం లేదని మీరు దాని కొరకు ఆచరణలు చేయండి అని మీతో తెలపబడినప్పుడు మీరు ఇలా పలికారు : ఈ ప్రళయం ఏమిటో మాకు తెలియదు. అది వస్తుంది అన్నది బలహీనమైన ఊహగానమని మేము భావిస్తున్నాము. అది తొందరలోనే రాబోతున్నదన్న విషయమును మేము నమ్మము.

(33) మరియు వారు ఇహలోకంలో చేసుకున్న అవిశ్వాసము,పాపకార్యములు వారి కొరకు బహిర్గతమవుతాయి. మరియు వారిపై వారు దేని గురించైతే హెచ్చరించబడినప్పుడు హేళన చేసేవారో ఆ శిక్ష కురుస్తుంది.

(34) మరియు అల్లాహ్ వారితో ఇలా పలుకుతాడు : ఈ రోజు మేము మిమ్మల్ని నరకాగ్నిలో వదిలివేస్తాము ఏ విధంగానైతే మీరు మీ ఈదినపు సమావేశమును మరచిపోయి విశ్వాసము,సత్కర్మ ద్వారా దాని కొరకు సిద్ధం కాలేదో ఆ విధంగా. మరియు మీరు శరణం తీసుకునే మీ నివాస స్థలము నరకాగ్నియే. మరియు అల్లాహ్ శిక్షను మీ నుండి తొలగించే సహాయకులు మీ కొరకు ఉండరు.

(35) మీరు శిక్షించబడిన ఈ శిక్షకు కారణం మీరు అల్లాహ్ ఆయతులను పరిహాసంగా చేసుకుని వాటి పట్ల హేళన చేయటం. మరియు ఇహలోక జీవితం తన రుచుల ద్వారా,తన కోరికల ద్వారా మిమ్మల్ని మోసపుచ్చింది. కావున ఈ రోజు అల్లాహ్ ఆయతుల పట్ల హేళన చేసే ఈ అవిశ్వాసపరులందరు నరకాగ్ని నుండి బయటకు రాలేరు. అంతే కాదు వారు అందులో శాశ్వతంగా ఉండిపోతారు. మరియు వారు సత్కర్మలు చేసుకోవటానికి ఇహలోకజీవితం వైపునకు మరలించబడరు. మరియు వారి నుండి వారి ప్రభువు ప్రసన్నుడవడు.

(36) అయితే సర్వస్తోత్రాలు అల్లాహ్ ఒక్కడికే చెందుతాయి. (ఆయనే) ఆకాశములకు ప్రభువు,భూమికి ప్రభువు మరియు సృష్టిరాసులందరికి ప్రభువు.

(37) మరియు ఆకాశముల్లో,భూమిలో మహత్యము,గొప్పతనము ఆయనకే చెందుతుంది. ఆయనే ఎవరూ ఓడించని సర్వాధిక్యుడు. తన సృష్టించటంలో,తన విధివ్రాతలో,తన పర్యాలోచనలో,తన ధర్మశాసనంలో విజ్ఞత కలవాడు,