(1) ఓ ప్రవక్త నిశ్ఛయంగా మేము హుదేబియా ఒడంబడిక ద్వారా మీకు స్పష్టమైన విజయమును కలిగించాము.
(2) ఈ విజయము కన్న ముందు జరిగిన,దాని తరువాత జరిగే మీ తప్పును అల్లాహ్ మన్నించటానికి మరియు మీ ధర్మ సహాయము ద్వారా మీపై తన అనుగ్రహమును పూర్తి చేయటానికి మరియు ఎటువంటి వంకరతనం లేని సన్మార్గము వైపునకు మీకు మార్గదర్శకత్వం చేయటానికి. అది తిన్నని ఇస్లాం యొక్క మార్గము.
(3) మరియు మీకు అల్లాహ్ మీ శతృవులకు వ్యతిరేకంగా గొప్ప సహకారమును కలిగించటానికి. దాన్ని ఎవరు అడ్డుకోలేరు.
(4) అల్లాహ్ యే విశ్వాసపరుల హృదయములలో వారు తమ విశ్వాసముపై విశ్వాసమును అధికం చేసుకోవటానికి నిలకడను మరియు మనశ్శాంతిని అవతరింపజేశాడు. మరియు ఆకాశములలో,భూమిలో ఉన్న సైన్యములు ఒక్కడైన అల్లాహ్ వే. వాటి ద్వారా ఆయన తన దాసుల్లోంచి తలచుకున్న వారికి మద్దతును కలిగిస్తాడు. మరియు అల్లాహ్ తన దాసుల ప్రయోజనముల గురించి బాగా తెలిసినవాడును మరియు తాను దేనిలోనైతే సహాయమును,మద్దతును కలిగిస్తున్నాడో అందులో వివేకవంతుడు.
(5) అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరిచే పురుషులను మరియు విశ్వాసమును కనబరిచే స్త్రీలను స్వర్గవనములలో ప్రవేశింపజేయటానికి. వాటి భవనముల మరియు చెట్ల క్రింది నుండి సెలయేరులు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు వారి నుండి వారి పాపములను తుడిచివేయటానికి. కావున ఆయన వాటిపరంగా వారిని పట్టుకోడు. ఈ ప్రస్తావించబడిన - ఆశించినది పొందటం అది స్వర్గము మరియు భయపడుతున్న దాని నుండి దూరమవటం అది పాపముల వలన పట్టుబడటం - అల్లాహ్ వద్ద గొప్ప సాఫల్యము దానికి సమానమైన ఎటువంటి సాఫల్యం లేదు.
(6) మరియు కపటవిశ్వాస పరుషులను,కపటవిశ్వాస స్త్రీలను శిక్షించటానికి మరియు అల్లాహ్ తో పాటు సాటి కల్పించే పురుషులను మరియు సాటి కల్పించే స్త్రీలను, తన ధర్మమునకు సహాయము చేయడని మరియు తన కలిమాను ఉన్నత శిఖరాలకు చేర్చడని అల్లాహ్ పట్ల అపనమ్మకము కలిగిన వారిని శిక్షించటం కొరకు. శిక్ష యొక్క వృత్తం వారిపైనే మరలివచ్చింది. మరియు అల్లాహ్ వారి అవిశ్వాసం వలన మరియు వారి అపనమ్మకం వలన వారిపై ఆగ్రహమును చూపాడు. మరియు వారిని తన కారుణ్యము నుండి గెంటివేశాడు. మరియు వారి కొరకు పరలోకంలో నరకము సిద్ధం చేశాడు. వారు అందులో శ్వాశ్వతంగా ఉండేటట్లుగా ప్రవేసిస్తారు. వారు మరలి వెళ్ళే నరకము ఎంతో చెడ్డదైన నివాస స్థలము.
(7) మరియు ఆకాశముల,భూమి యొక్క సైన్యములు అల్లాహ్ వే. వాటి ద్వారా ఆయన తన దాసుల్లోంచి తలచిన వారికి మద్దతును కలిగిస్తాడు. మరియు అల్లాహ్ ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు మరియు తన సృష్టించటంలో,తన విధివ్రాతలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.
(8) ఓ ప్రవక్తా నిశ్చయంగా మిమ్మల్ని ప్రళయదినమున మీ జాతివారిపై సాక్ష్యమును పలికే సాక్షిగా మరియు ఇహలోకములో వారి కొరకు సిద్ధం చేసి ఉంచిన సహాయము,సాధికారత గురించి మరియు వారి కొరకు పరలోకంలో సిద్ధపరచిన అనుగ్రహాల గురించి శుభవార్తనిచ్చేవారిగా మరియు వారి కొరకు ఇహలోకములో సిద్ధపరచిన విశ్వాసపరుల చేతుల ద్వారా అవమానము,పరాభవము గురించి మరియు పరలోకంలో వారి కొరకు సిద్ధపరచిన వారి కోసం నిరీక్షిస్తున్న బాధాకరమైన శిక్ష గురంచి అవిశ్వాసపరులకు భయపెట్టే వారిగా మేము పంపించాము.
(9) మీరు అల్లాహ్ పై విశ్వాసమును కనబరుస్తారని,ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరుస్తారని మరియు మీరు ఆయన ప్రవక్తని గౌరవిస్తారని,ఆదరిస్తారని మరియు దినపు మొదటి,చివరి వేళల్లో అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడుతారని ఆశిస్తూ.
(10) ఓ ప్రవక్తా నిశ్చయంగా ముష్రికులైన మక్కా వాసులతో యుద్దం చేయటం విషయంలో మీతో బైఅతె రిజ్వాన్ శపథం చేసినవారు అల్లాహ్ తో శపథం చేసినవారు. ఎందుకంటే ఆయనే ముష్రికులతో యుద్దం చేయమని వారిని ఆదేశించాడు. మరియు ఆయనే వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. శపథం సమయంలో అల్లాహ్ చేయి వారి చేతులపై ఉన్నది. మరియు ఆయన వారి గురించి తెలుసుకునేవాడు ఆయనపై వారి నుండి ఏదీ గోప్యంగా ఉండదు. అయితే ఎవరైతే తన శపథమును భంగపరచి అల్లాహ్ తో ఆయన ధర్మమునకు సహాయము చేస్తానని చేసిన వాగ్దానమును పూర్తి చేయలేదో నిశ్చయంగా అతని శపథమును అతను భంగపరచిన దాని నష్టము మరియు తన ప్రమాణమును భంగపరచిన దాని నష్టము అతనిపైనే మరలుతుంది. అది అల్లాహ్ కు నష్టం కలిగించదు. మరియు ఎవరైతే అల్లాహ్ తో ఆయన ధర్మమునకు సహాయం చేస్తానని చేసిన వాగ్దానమును పూర్తి చేస్తాడో అతనికి ఆయన తొందరలోనే గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. అది స్వర్గము.
(11) ఓ ప్రవక్తా మక్క వైపు మీ ప్రయాణములో మీతో తోడుగా ఉండటం నుండి అల్లాహ్ వెనుక ఉండేటట్లు చేసిన పల్లె వాసులను మీరు మందలించినప్పుడు వారు మీతో ఇలా పలుకుతారు : మా సంపదల బాధ్యత మరియు మా సంతానము బాధ్యత మీతో పాటు ప్రయాణం చేయటం నుండి మమ్మల్ని తీరిక లేకుండా చేశాయి. కావును మీరు అల్లాహ్ తో మా పాపముల మన్నింపును వేడుకోండి. వారు తమ కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో మన్నింపును వేడుకోవటమును కోరటం తమ మనసులలో లేనిది తమ నాలుకలతో పలుకుతున్నారు. ఎందుకంటే వారు తమ పాపముల నుండి పశ్చాత్తాప్పడలేదు. మీరు వారితో ఇలా పలకండి : ఒక వేళ అల్లాహ్ మీకు మేలు చేయదలచితే లేదా కీడు చేయదలచితే మీ కొరకు అల్లాహ్ నుండి ఎవరికీ ఏ అధికారముండదు. అంతేకాదు మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు. మీ కర్మల్లోంచి ఒక వేళ మీరు వాటిని దాచినా ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
(12) ఆయనతో పాటు బయలుదేరి వెళ్ళటం నుండి మీరు వెనుక ఉండిపోవటానికి సంపదల,సంతానముల బాధ్యత తీరికలేకండా చేయటం అని మీరు వంకపెట్టినది కారణం కాదు. కాని ప్రవక్త మరియు ఆయన సహచరులు వినాశనమునకు గురి అవుతారని మరియు వారు మదీనాలోని తమ ఇంటి వారి వైపునకు మరలిరారని మీరు భావించారు. దాన్ని షైతాను మీ హృదయములలో మంచిగా చేసి చూపించాడు. మరియు మీరు మీ ప్రభువు గురించి ఆయన తన ప్రవక్తకు సహాయం చేయడని తప్పుగా భావించారు. మరియు మీరు ఏదైతే అల్లాహ్ పట్ల చెడు ఆలోచనను కలిగి ముందడుగు వేయటం వలన మరియు ఆయన ప్రవక్త నుండి వెనుక ఉండిపోవటం వలన వినాశనమునకు గురి అయ్యే జనులైపోయారు.
(13) మరియు అల్లాహ్ పై, ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచనివాడు అతడు అవిశ్వాసపరుడు. నిశ్ఛయంగా వారి కొరకు ప్రళయదినమున మండే అగ్నిని సిద్ధంచేసి ఉంచాము వారు అందులో శిక్షంచబడుతారు.
(14) మరియు ఆకాశముల,భూమి యొక్క సామ్రాజ్యాధికారము ఒక్కడైన అల్లాహ్ కే చెందుతుంది. ఆయన తన దాసుల్లోంచు తాను తలచిన వాడి పాపములను మన్నించి తన అనుగ్రహముతో అతన్ని స్వర్గములో ప్రవేశింపజేస్తాడు. మరియు ఆయన తన దాసుల్లోంచి తాను తలచిన వారిని తన న్యాయముతో శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారి పాపములను మన్నించేవాడును మరియు వారిపై కరుణించేవాడును.
(15) ఓ విశ్వాసపరులారా మీరు హుదేబియా ఒప్పందము తరువాత అల్లాహ్ మీకు వాగ్దానం చేసిన ఖైబర్ విజయధనము గురించి మీరు వాటిని తీసుకోవటానికి వెళ్ళినప్పుడు అల్లాహ్ వెనుక ఉంచిన వారు మీతో ఇలా పలుకుతారు : మీరు మమ్మల్ని వదలండి మేము దాని నుండి మా భాగమును పొందటానికి మీతో పాటు బయలుదేరుతాము. వెనుక ఉండిపోయిన వీరందరు తమ ఈ కోరిక వలన అల్లాహ్ హుదేబియ ఒప్పందము తరువాత విశ్వాసపరులకొక్కరికే ఖైబర్ విజయ ధనమును ఇస్తానని చేసిన వాగ్దానమును మార్చివేయాలనుకున్నారు. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : ఈ విజయ ధనము పొందటానికి మీరు మా వెంట రాకండి. నిశ్చయంగా అల్లాహ్ ఖైబర్ విజయ ధనమును ప్రత్యేకించి హుదేబియాలో హాజరు అయిన వారికి మాత్రమే ఇస్తానని మాకు వాగ్దానం చేశాడు. అప్పుడు వారు ఇలా సమాధానమిస్తారు : ఖైబర్ వైపునకు మేము మీ వెంట రావటం నుండి మీరు మమ్మల్ని ఆపటం అన్నది అల్లాహ్ ఆదేశం కాదు. అది మాపై మీ అసూయ వలన. మరియు విషయం వెనుక ఉండిపోయిన వీరందరు అనుకున్నట్లు కాదు. కాని వారందరు అల్లాహ్ ఆదేశములను మరియు ఆయన వారింపులను చాలా తక్కువగా అర్ధం చేసుకునేవారు. అందుకనే వారు ఆయనకు అవిధేయత చూపటంలో పడిపోయారు.
(16) ఓ ప్రవక్తా మీరు మీతో పాటు మక్కాకు బయలుదేరటం నుండి వెనుక ఉండిపోయిన పల్లె వాసులతో వారికే తెలియపరుస్తూ ఇలా పలకండి : మీరు తొందరలోనే యుద్దంలో తీవ్రంగా,బలంగా పోరాడే జాతితో యుద్దం చేయటానికి పిలవబడుతారు. మీరు వారిని అల్లాహ్ మార్గంలో వదిస్తారు లేదా వారు యుద్దం జరగకుండానే ఇస్లాంలో ప్రవేశిస్తారు. ఒక వేళ మీరు వారితో యుద్దం విషయంలో మీరు పిలవబడిన దాని విషయంలో అల్లాహ్ కు విధేయత చూపితే ఆయన మీకు మంచి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. అది స్వర్గము. ఒక వేళ మీరు మక్కా వైపునకు ఆయనతో పాటు వెళ్ళటం నుండి వెనుక ఉండిపోయినప్పుడు విధేయత నుండి విముఖత చూపినట్లు ఆయన విధేయత నుండి విముఖత చూపితే ఆయన మీకు బాధాకరమైన శిక్షను కలిగిస్తాడు.
(17) గుడ్డితనం లేదా, కుంటితనం లేదా ఏదైన రోగం కారణం కలిగిన వారిపై అల్లాహ్ మార్గములో యుద్ధం చేయటం నుండి వెనుక ఉండిపోయినప్పుడు పాపం లేదు. మరియు ఎవరైతే అల్లాహ్ కు విధేయత చూపుతారో,ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో వారిని ఆయన స్వర్గవనములలో ప్రవేశింపజేస్తాడు. వాటి భవనముల క్రింది నుండి మరియు వాటి వృక్షముల క్రింది నుండి సెలయేరులు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు ఎవరైతే వారిద్దరి విధేయత నుండి విమిఖత చూపుతారో వారిని అల్లాహ్ బాధాకరమైన శిక్షను విధిస్తాడు.
(18) వాస్తవానికి అల్లాహ్ హుదేబియాలో చెట్టు క్రింద మీతో బైఅతే రిజ్వాన్ శపథం చేసిన విశ్వాసపరుల నుండి ప్రసన్నుడయ్యాడు. అప్పుడు ఆయన వారి హృదయములలో కల విశ్వాసమును,చిత్తశుద్ధిని,నిజాయితీని తెలుసుకున్నాడు. అప్పుడు వారి హృదయములపై మనశ్శాంతిని కురిపించాడు. మరియు వారికి దానికి బదులుగా తొందరలోనే ఒక విజయమును కలిగించాడు. అది ఖైబర్ పై విజయం. వారు ఏదైతే కోల్పోయారో మక్కాలో ప్రవేశము దానికి బదులుగా (ప్రసాదించాడు).
(19) మరియు ఆయన వారికి అధికముగా విజయధనమును ప్రసాదించాడు. వారు దాన్ని ఖైబర్ వారితో తీసుకున్నారు. మరియు అల్లాహ్ ఎవరూ ఓడించలేని సర్వాధిక్యుడు మరియు తన సృష్టించటంలో,తన విధివ్రాతలో,తన పర్యాలోచనలో వివేకవంతుడు.
(20) ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మీతో చాలా విజయధనముల గురించి మీరు వాటిని భవిష్యత్తులో ఇస్లామీయ విజయాల్లో పొందుతారని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన ఖైబర్ విజయధనములను మీ కొరకు చేశాడు. మరియు యూదుల చేతులను వారు మీ తరువాత మీ ఇంటి వారికి బాధించటానికి నిశ్చయించుకున్నప్పుడు ఆపివేశాడు. మరియు ఈ త్వరగా లభించే విజయధనములు మీకు అల్లాహ్ సహాయము మరియు మీ కొరకు ఆయన మద్దతు పై మీకు ఒక సూచన అవటానికి. మరియు అల్లాహ్ మీకు ఎటువంటి వంకరతనము లేని తిన్నని మార్గమునకు మార్గదర్శకత్వం చేస్తాడు.
(21) మరియు అల్లాహ్ ఈ సమయంలో మీరు సాధించని ఇతర విజయధనముల గురించి మీతో వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ ఒక్కడే వాటిపై సామర్ధ్యం కలవాడు. మరియు అది ఆయన జ్ఞానములో మరియు ఆయన పర్యాలోచనలో కలదు. మరియు అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదీనూ అశక్తుడిని చేయదు.
(22) ఓ విశ్వాసపరులారా ఒక వేళ అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను అవిశ్వసించినవారు మీతో యుద్ధము చేస్తే వారు మీ ముందు నుండి పరాభవమునకు లోనై వెనుతిరిగి పారిపోతారు. ఆ తరువాత వారు తమ వ్యవహారమును పరిరక్షించే ఎటువంటి పరిరక్షకుడిని పొందలేరు. మరయు వారు మీకు వ్యతిరేకంగా యుద్ధం చేయటంలో వారికి సహాయపడే ఎటువంటి సహాయకుడిని పొందలేరు.
(23) మరియు విశ్వాసపరుల విజయము మరియు అవిశ్వాసపరుల పరాజయము ప్రతీ కాలములో,ప్రతీ చోట నిరూపితమైనది. అది ఈ తిరస్కారులందరి మునుపు గతించిన సమాజములలో అల్లాహ్ సంప్రదాయము. ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ సంప్రదాయములో ఎటువంటి మార్పును పొందలేరు.
(24) మరియు ఆయనే మీ నుండి ముష్రికుల చేతులను హుదేబియాలో మీకు కీడుని కలిగించే ఉద్దేశముతో వారిలోని ఎనభై మంది వచ్చినప్పుడు ఆపాడు. మరియు వారి నుండి మీ చేతులను ఆపాడు అప్పుడు మీరు వారిని హతమార్చలేదు మరియు వారిని బాధించలేదు. వారిని బందీలుగా చేసుకునే సామర్ధ్యం ఉండి కూడా మీరు వారిని విడుదల చేశారు. మరియు అల్లాహ్ మీరు చేసేవాటిని చూస్తున్నాడు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
(25) వారందరే అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై అవిశ్వాసమును కనబరచి,మిమ్మల్ని మస్జిదుల్ హరామ్ నుండి ఆపారు మరియు బలి పశువును దాని జుబాహ్ అయ్యే ప్రదేశమైన హరమ్ నకు చేరకుండా ఉండేటట్లు ఆపారు. మరియు ఒక వేళ అక్కడ అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే పురుషులు,విశ్వాసమును కనబరిచే స్త్రీలు ఉండకుండా ఉంటే - మీరు వారిని గుర్తించకుండా ఉండి మీరు వారిని అవిశ్వాసపరులతో పాటు హతమార్చేసేవారు. వారిని మీరు మీకు తెలియకుండా హత్య చేసి ఉంటే మీకు పాపము మరియు రక్తపరిహారము కలిగి ఉండేది. కావున ఆయన మక్కా విజయము రోజు మీకు అనుమతినిచ్చాడు అల్లాహ్ మక్కాలోని విశ్వాసపరుల్లాంటి వారిలా తాను తలచిన వారిని తన కారుణ్యములో ప్రవేశింపజేస్తాడు. ఒక వేళ మక్కాలో విశ్వాసపరుల్లో నుంచి అవిశ్వాసపరులు వేరై ఉంటే అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్త పై అవిశ్వాసమును కనబరచిన వారిని మేము బాధాకరమైన శిక్షకు గురి చేసేవారము.
(26) అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును కనబరచిన వారు తమ హృదయముల్లో సత్య సాక్షాత్కారానికి సంబంధం లేకుండా కేవలం మనోవంఛలతో సంబంధం కల అజ్ఞాన కాలపు అహంభావమును పెంచుకున్నప్పుడు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవేశమును వారు తమను ఓడించి అపనిందలు వేస్తారనే భయముతో అసహ్యించుకున్నారు. అప్పుడు అల్లాహ్ తన వద్ద నుండి మనశ్శాంతిని తన ప్రవక్తపై అవతరింపజేశాడు మరియు దాన్ని విశ్వాసపరులపై అవతరింపజేశాడు. అయితే వారి మీద ఉన్న కోపము ముష్రికులతో పోరాటమును వారు చేసినట్లుగా కోరలేదు. మరియు అల్లాహ్ విశ్వాసపరులకి సత్య వాక్కు అది లా యిలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవము ఇంకొకరు లేడు) ను అనివార్యము చేశాడు. మరియు వారు దానికి తగినట్లుగా స్థిరంగా ఉండాలని అనివార్యము చేశాడు. అప్పుడు వారు దానిపై స్థిరంగా ఉన్నారు. మరియు విశ్వాసపరులు ఇతరులకన్న ఈ వాక్యమునకు ఎక్కువ హక్కుదారులు. అల్లాహ్ వారి హృదయముల్లో మంచితనమును తెలుసుకున్నప్పుడు వారే దానికి అర్హతకలిగే అర్హులు. మరియు అల్లాహ్ ప్రతీది తెలిసిన వాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
(27) నిశ్ఛయంగా అల్లాహ్ తన ప్రవక్తకు కలను నిజం చేసి చూపించాడు. ఎప్పుడైతే ఆయన దాన్నే తన కలలో చూశారో తన సహచరులకు దాన్ని గురించి సమాచారమిచ్చారు. అదేమిటంటే నిశ్చయంగా ఆయన మరియు ఆయన అనుచరులు అల్లాహ్ పవిత్ర గృహములో తమ శతృవుల నుండి నిర్భయంగా ప్రవేసిస్తున్నారు. వారిలో నుండి కొందరు తమ శిరో ముండనం చేస్తున్నారు. మరియు వారిలో నుండి కొందరు ఖుర్బానీ ముగింపు గురించి ప్రకటిస్తూ వెంట్రుకలను కత్తిరిస్తున్నారు. ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మీకు తెలియని మీ ప్రయోజనంను తెలుసుకున్నాడు. కావున ఆయన ఆ సంవత్సరం మక్కాలో ప్రవేశించటం ద్వారా కల నిరూపితం కాకుండానే దగ్గరలోనే విజయమును కలిగించాడు. మరియు అది అల్లాహ్ హుదైబియా సయోధ్యను జారీచేసి, మరియు దాని వెనువెంటనే హుదైబియాలో సమావేశమైన విశ్వాసపరుల చేతులపై ఖైబర్ పై విజయంను కలిగించి.
(28) అల్లాహ్ యే తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను స్పష్టమైన ప్రకటన మరియు ఇస్లాం ధర్మమైన సత్య ధర్మమును ఇచ్చి దాన్ని దానికి వ్యతిరేక ధర్మములన్నింటిపై ఆధిక్యతను కలిగించటానికి పంపించాడు. మరియు అల్లాహ్ దానికి సాక్షి. మరియు సాక్షిగా అల్లాహ్ యే చాలు.
(29) ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త మరియు ఆయన వెంట ఉన్న వారు ఆయన సహచరులు యుద్దం చేస్తూ వచ్చిన అవిశ్వాసపరులపై కఠినులు. వారు పరస్పరం దయ చూపుకుంటూ,ప్రేమా అభిమానములను చూపుకుంటూ కరుణామయులు. ఓ చూసేవాడా నీవు వారిని పరిశుద్ధుడైన అల్లాహ్ కొరకు రుకూ చేస్తుండగా,సాష్టాంగపడుతుండగా చూస్తావు. వారు అల్లాహ్ తో తమపై మన్నింపును మరియు ఉన్నతమైన పుణ్యయమును అనుగ్రహించమని మరియు తమ నుండి ప్రసన్నుడవమని కోరుతారు. వారి చిహ్నము వారి ముఖములలో సాష్టాంగపడటము వలన కలిగిన గుర్తుల నుండి ఏదైతే సన్మార్గము నుండి,దారి నుండి మరియు వారి ముఖముల్లో నమాజు కాంతి నుండి కనబడుతుంది. ఇది మూసా అలైహిస్సలాంపై అవతరింపబడిన గ్రంధం తౌరాత్ వర్ణించిన లక్షణము మరియు ఈసా అలైహిస్సలాంపై అవతరింపబడిన గ్రంధం ఇంజీలులో వారి పరస్పర సహాయము విషయంలో మరియు వారి పరిపూర్ణతలో వారి ఉపమానము ఒక పైరుతో పోల్చబడినది అది దాన్ని చిన్నదిగా వెలికి తీస్తుంది. ఆ తరువాత బలమువంతునిగా,గట్టిగా తయారై తన కాండములపై నిలబడుతుంది. దాని బలము మరియు దాని పరిపూర్ణత పండించేవారిని ఆనందపరుస్తుంది. అల్లాహ్ వారి ద్వారా అవిశ్వాసపరులకు వారు వారిలో ఉన్న బలము,సమన్వయము మరియు పరిపూర్నతను చూసినప్పుడు క్రోదానికి గురిచేయటానికి. మరియు అల్లాహ్ అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేసిన సహచరులకు వారి పాపములు మన్నిస్తాడని మరియు వాటి వలన ఆయన వారిని శిక్షించడని మరియు గొప్ప ప్రతిఫలమైన స్వర్గము ఉన్నదని వాగ్దానం చేశాడు.