5 - Al-Maaida ()

|

(1) ఓ విశ్వాసులారా, మీకు మరియు మీ సృష్టికర్తకు మధ్య మరియు మీకు మరియు ఆయన సృష్టికి మధ్య నమోదు చేయబడిన అన్ని ఒప్పందాలను పూర్తి చేయండి. వాస్తవానికి వేటిని నిషేధించినట్లు మీకు చదివి వినిపించబడినదో అవి తప్ప మరియు మీపై నిషేధించిన హజ్,ఉమ్రా ఇహ్రామ్ స్థితిలో అడవి జంతువులను వేటాడటం తప్ప ఆయన మీపై కారుణ్యముగా మీ కొరకు చతుష్పాద పశువులన్ని (ఒంటెలు,ఆవులు,గొర్రెలు) ధర్మసమ్మతం చేశాడు. నిశ్ఛయంగా అల్లాహ్ తన విజ్ఞతకు అనుగుణంగా తాను కోరుకున్నది ధర్మ సమ్మతం చేయటం మరియు నిషేధించటం నిర్ణయిస్తాడు. ఆయనను బలవంతం పెట్టేవాడు ఎవడూ లేడు. తన నిర్ణయమును వ్యతిరేకించేవాడు ఎవడూ లేడు.

(2) ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ యొక్క గౌరప్రదమైన విషయాలను వేటినైతే ఆయన గౌరవపరచమని ఆదేశించాడో వాటిని అగౌరవ పరచకండి. మరియు ఇహ్రామ్ నిషేధాజ్ఞలైనటువంటి కుట్టబడిన వస్త్రములను తొడగటం నుండి మరియు హరమ్ ప్రాంతపు నిషేధాజ్ఞలైనటువంటి వేటాడటం లాంటి నుండి మీరు ఆగిపోండి. మరియు మీరు నిషిద్ధ మాసముల్లో యుద్ధమును సమ్మతించకండి, అవి జీ ఖాఅద,జిల్ హిజ్జ,ముహర్రమ్ మరియు రజబ్ మాసములు. మరియు హరమ్ వైపునకు అక్కడ అల్లాహ్ కొరకు జుబాహ్ చేయటానికి తీసుకునిపోబడే జంతువులను బలవంతాన లాక్కోవటం ద్వారా మరియు అలాంటి వాటి ద్వారా లేదా వాటిని అవి వాటి స్థానమునకు చేరటం నుండి ఆపి అగౌరవపరచకండి. మరియు మీరు అవి బలి పశువులని గర్తింపుగా మెడలో పట్టాలను వేలాడదీయబడిన జంతువులను అగౌరవపరచకండి. మరియు అల్లాహ్ పవిత్ర గృహమునకు వ్యాపార లాభమును,అల్లాహ్ మన్నతలను ఆశిస్తూ వెళ్ళేవారిని మీరు అగౌరవపరచకండి. మరియు మీరు హజ్ లేదా ఉమరా ఇహ్రామ్ దీక్ష నుండి విరమించుకుని, హరమ్ ప్రాంతము నుండి బయటకు వచ్చినప్పుడు ఒక వేళ మీరు తలచుకుంటే వేటాడండి. మరియు మిమ్మల్ని మస్జిదుల్ హరాం నుండి నిలవరించటం వలన వారి పట్ల ఉన్న ద్వేషము మిమ్మల్ని హింసపై మరియు వారి విషయంలో న్యాయపూరితంగా వ్యవహరించటంను వదలటంపై పురిగొల్పకూడదు. ఓ విశ్వాసపరులారా మీకు ఆదేశించబడిన వాటిని చేయటంపై మరియు మీకు వారించబడిన వాటిని వదిలి వేయటంపై మీరు పరస్పరం సహాయం చేసుకోండి. మరియు మీరు అల్లాహ్ కు ఆయన పై విధేయతను చూపటమును మరియు ఆయన అవిధేయత నుండి దూరంగా ఉండటమును అంటిపెట్టుకుని భయపడండి. నిశ్ఛయంగా అల్లాహ్ తనపై అవిధేయత చూపే వారిని కఠినంగా శిక్షించేవాడు. అతని శిక్ష నుండి మీరు జాగ్రత్తగా ఉండండి.

(3) జుబాహ్ (హలాల్) చేయకుండానే మరణించిన జంతువును అల్లాహ్ మీపై నిషేధించాడు. మరియు ప్రవహించే రక్తమును,పంది మాంసమును,జుబాహ్ చేసే సమయమున అల్లాహ్ నామము కాకుండా ఇతరుల నామం తీసుకోబడిన దాన్ని, పీక పిసికటం వలన చనిపోయిన జంతువును,దెబ్బ తగలటం వలన మరియు పై నుండి పడిపోవటం వలన చనిపోయిన జంతువును మరియు వేరే జంతువు కొమ్ము పొడవటంతో చనిపోయిన జంతువును మరియు పులి,చిరుత,తోడేలు లాంటి మృగాలు చీల్చేసిన జంతువును అల్లాహ్ మీపై నిషేధించాడు. కాని ప్రస్తావించబడిన వాటిలో నుండి మీరు జీవించి ఉన్నప్పుడు పొంది వాటిని జుబాహ్ (హలాల్) చేస్తే అది మీ కొరకు ధర్మ సమ్మతము. విగ్రహాల కొరకు జుబాహ్ చేయబడిన దాన్ని ఆయన మీపై నిషేధించాడు. బాణాల ద్వారా మీరు అగోచరమైన మీ అదృష్టాన్ని కోరటమును ఆయన మీపై నిషేధించాడు. అవి రాళ్ళు లేదా బాణాలు ఉండి వాటిపై నీవు చేయి, నీవు చేయకు అని వ్రాయబడి ఉంటుంది. వాటిలో నుండి తన కొరకు ఏది వస్తే అది చేసేవారు. ఈ ప్రస్తావించబడిన నిషిద్ధితాలకు పాల్పడటం అల్లాహ్ విధేయత నుండి వైదొలగటమే. ఈ రోజు అవిశ్వాసపరులు మీరు ఇస్లాం ధర్మము నుండి - ఎప్పుడైతే వారు దాని బలాన్ని చూశారో - నిరాశ్యులైపోయారు. కావున మీరు వారితో భయపడకండి. నా ఒక్కడితోనే భయపడండి. ఈ రోజు నేను మీ కొరకు మీ ధర్మము అయిన ఇస్లాంను పరిపూర్ణం చేశాను. మరియు నేను మీపై బాహ్యగతమైన మరియు అంతర్గతమైన నా అనుగ్రహమును పూర్తి చేశాను. మరియు మీ కొరకు ధర్మముగా నేను ఇస్లాంను ఎంచుకున్నాను. కావున నేను అది కాకుండా వేరేవాటిని స్వీకరించను. కాని ఎవరైన కరువు వలన గత్యంతరం లేక పాపము వైపునకు వాలకుండామృత జంతువు నుండి తింటే అటువంటప్పుడు అతనిపై ఏ పాపము లేదు. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడును,కరుణించేవాడును.

(4) ఓ ప్రవక్తా మీ అనుచరులు వారి కొరకు అల్లాహ్ ఏది తినటమును సమ్మతించాడు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రవక్తా మీరు ఇలా తెలియపరచండి : అల్లాహ్ తినేవాటిలో నుంచి పరిశుద్ధమైన వాటిని మీ కొరకు ధర్మసమ్మతం చేశాడు. మరియు శిక్షణ ఇవ్వబడిన కొర పళ్ళు కల కుక్కలు,చిరుతల్లాంటివి మరియు వంకర గోళ్ళు కల డేగల్లాంటివి వేటాడిన వాటిని తినటం. మీరు వాటికి అల్లాహ్ మీకు అనుగ్రహించిన వాటి శిక్షణ పద్దతుల ద్వారా వాటికి వేటాడే శిక్షణను ఇస్తారు. చివరికి అవి తమకు ఇవ్వబడిన ఆదేశమునకు కట్టుబడి ఉంటాయి మరియు వాటిని వారించినప్పుడు అవి ఆగి పోతాయి. అవి పట్టుకొచ్చిన వేటాడిన వాటిని మీరు తినండి ఒక వేళ అవి వాటిని చంపి వేసినా సరే. వాటిని (వేటకు) వదిలేటప్పుడు అల్లాహ్ పేరు ఉచ్చరించండి. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ కర్మల లెక్కను త్వరగా తీసుకుంటాడు.

(5) ఈ రోజు అల్లాహ్ పరిశుద్ధమైన వాటిని తినటమును మరియు గ్రంధవహులైన యూదులు మరియు క్రైస్తవులు జుబాహ్ చేసిన వాటిని తినటమును మీ కొరకు సమ్మతం చేశాడు. మరియు ఆయన విశ్వాసపర స్త్రీలలోంచి స్వతంత్రులైన సౌశీలురైన స్త్రీలతో మరియు మీకన్నపూర్వం గ్రంధం ఇవ్వబడిన యూదుల,క్రైస్తవుల స్వతంత్రులైన సౌశీలురైన స్త్రీలతో మీరు వారికి వారి మహర్ ఇచ్చినప్పుడు నికాహ్ చేసుకోవటమును సమ్మతించాడు. మరియు మీరు వారితో వ్యభిచారమునకు పాల్పడునట్లు చేసే ప్రేమకలాపాలకు పాల్పడకుండా అశ్లీల కార్యములకు పాల్పడటం నుండి దూరంగా ఉండేవారై ఉండాలి. మరియు ఎవరైతే అల్లాహ్ తన దాసుల కొరకు ధర్మబద్ధం చేసిన ఆదేశములను తిరస్కరిస్తాడో అతడి కర్మ దాని షరతు అయిన విశ్వాసం లేకపోవటం వలన నిర్వార్యమైపోతుంది. మరియు అతడు ప్రళయదినమున నరకములో శాశ్వతంగా ఉండేటట్లుగా ప్రవేశించటం వలన నష్టం చవిచూసే వారిలో నుంచి అయిపోతాడు.

(6) ఓ విశ్వాసపరులారా మీరు నమాజును పాటించటానికి నిలబడదలచుకున్నప్పుడు మీరు చిన్న అశుద్ధతలో ఉంటే మీరు మీ ముఖములను కడుగక్కొని మరియు మీ చేతులను వాటి మోచేతితోసహా కడుక్కొని మరియు మీ తలలపై మసహ్ చేసుకుని మీ కాళ్ళను కాలి జాయింట్ నుండి వెలుపలికి పొడుచుకుని వచ్చిన రెండ మడమలతో సహా కడుక్కొని వజూ చేసుకోండి. ఒక వేళ మీరు పెద్ద అశుద్ధావస్తలో ఉంటే గుసుల్ చేసుకోండి. మరియు ఒక వేళ మీరు అనారోగ్యముతో ఉండి రోగము పెరిగిపోతుందని లేదా దాని నయం అవటం ఆలస్యం అవుతుందని మీకు భయం ఉంటే లేదా మీరు ఆరోగ్యముగానే ఉండి ప్రయాణంలో ఉంటే లేదా మీరు కాలకృత్యముల్లాంటి చిన్న అశుద్ధతలో ఉంటే లేదా మీరు భార్యలతో సంభోగము చేయటం వలన పెద్ద అశుద్దతావస్తలో ఉంటే మరియు మీకు వెతికిన తరువాత కూడా పరిశుద్ధత పొందటానికి నీరు లభించకపోతే నేల పై భాగము వైపునకు మరలి దానిపై మీ రెండు చేతులతో కొట్టి దాన్ని మీ ముఖములపై మరియు మీ చేతులపై స్పర్శించుకోండి (మసాహ్ చేసుకోండి). మీకు నష్టం వైపునకు తీసుకుని వెళ్ళే నీటిని వినియోగించటం మీపై తప్పనిసరి చేసి అల్లాహ్ తన ఆదేశముల్లో మీపై కష్టమును వేయదలచుకోలేదు. అందుకనే ఆయన మీ కొరకు అనారోగ్యం వలన లేదా నీరు లభించకపోవటం వలన ఇబ్బంది కలిగినప్పుడు దానికి బదులును ధర్మబద్ధం చేశాడు తన అనుగ్రహమును మీపై పరిపూర్ణం చేయటానికి బహుశా మీరు మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహమునకు కృతజ్ఞత తెలుపుకుంటారని మరియు దానికి కృతఘ్నులు కారని.

(7) మరియు మీరు ఇస్లాం కొరకు మార్గదర్శకత్వం ద్వారా మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహమును గుర్తు చేసుకోండి మరియు మీరు ఆయనతో చేసిన ఆ ప్రమాణమును గుర్తు చేసుకోండి మీరు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిమిలో మరియు లేమిలో వినటం,విధేయత చూపటంపై మీరు బైత్ (మాట ఇచ్చినప్పుడు) చేసినప్పుడు మీరు ఇలా పలికినప్పటిది : మేము మీ మాట విన్నాము మరియు మీ ఆదేశమునకు కట్టుబడి ఉన్నాము. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి - వాటిలో నుండి ఆయనతో చేసిన ప్రమాణములను - మరియు ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా హృదయముల్లో ఉన్నది అల్లాహ్ కు బాగా తెలుసు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.

(8) ఓ అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించినవారా మీరు మీపై ఉన్న అల్లాహ్ హక్కులను వాటి ద్వారా ఆయన మన్నతను ఆశిస్తూ నెలకొల్పేవారై అయిపోండి. మరియు మీరు అన్యాయంగా కాకుండా న్యాయముతో సాక్ష్యం పలికే వారైపోండి. జాతి పట్ల ద్వేషము మిమ్మల్ని న్యాయమును వదలటంపై ప్రేరేపించకూడదు. కాబట్టి న్యాయమన్నది స్నేహితునితో మరియు శతృవునితో పాటు ఆశించబడును. కావున మీరు వారిద్దరికి న్యాయం చేయండి. న్యాయము అన్నది అల్లాహ్ నుండి భయమునకు చాలా దగ్గర ఉంటుంది. మరియు అన్యాయం అన్నది ఆయనకు వ్యతిరేకంగా ధైర్యమునకు చాలా దగ్గర ఉంటుంది. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. నిశ్చయంగా అల్లాహ్ మీరు చేసే కర్మల గురించి తెలుసుకునేవాడు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏది గోప్యంగా ఉండదు. మరియు తొందరలోనే ఆయన వాటిపరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

(9) వాగ్దానమునకు వ్యతిరేకంగా చేయని అల్లాహ్, అల్లాహ్ ను ఆయన ప్రవక్తలను విశ్వసించి సత్కర్మలు చేసేవారికి వారి పాపముల మన్నింపు మరియు గొప్ప ప్రతిఫల వాగ్దానం చేశాడు అది స్వర్గములో ప్రవేశము.

(10) మరియు అల్లాహ్ ను అవిశ్వసించి ఆయన ఆయతులను తిరస్కరించిన వారు వారందరే నరకవాసులు. వారు తమ అవిశ్వాసము మరియు తమ తిరస్కారమునకు పర్యవసానముగా అందులో ప్రవేశిస్తారు. తోడు ఉండేవాడు తన తోడు ఉండేవాడికి అంటిపెట్టుకుని ఉన్నట్లే దాన్ని అంటిపెట్టుకుని ఉంటారు.

(11) ఓ విశ్వాసపరులారా మీరు మీ హృదయములతో మరియు మీ నాలుకలతో అలాహ్ మీపై అనుగ్రహించినదైన శాంతి మరియు మీ శతృవుల హృదయముల్లో వారు మీపై దాడి చేసి మిమ్మల్ని నాశనం చేయటానికి తమ చేతులను మీవైపునకు చాపాలని నిర్ణయించుకున్నప్పుడు భయమును వేసిన దాన్ని గుర్తు చేసుకోండి. అయితే అల్లాహ్ వారిని మీ నుండి మరల్చి వారి నుండి మిమ్మల్ని కాపాడాడు. మరియు మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశించిన వాటిని పాటించి ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉండి భయపడండి. మరియు విశ్వాసపరులు ధార్మిక మరియు ప్రాపంచిక తమ ప్రయోజనములను పొందటంలో ఒక్కడైన అల్లాహ్ పైనే నమ్మకమును కలిగి ఉండాలి.

(12) మరియు నిశ్చయంగా అల్లాహ్ ఇస్రాయీలు సంతతివారితో దృఢమైన ప్రమాణమును దగ్గరలోనే ప్రస్తావన వచ్చే వాటితో తీసుకున్నాడు. మరియు వారిపై పన్నెండు మంది నాయకులను నియమించాడు. ప్రతీ నాయకుడు తన ఆదీనంలో ఉన్న వారిపై పర్యవేక్షకుడిగా ఉంటాడు. మరియు అల్లాహ్ ఇస్రాయీలు సంతతివారితో ఇలా పలికాడు : నిశ్చయంగా మీరు నమాజును పరిపూర్ణ పద్దతిలో పాటించి,మీ సంపదల నుండి జకాత్ ను చెల్లించి,నా ప్రవక్తలందరిని వారి మధ్య ఎటువంటి బేధబావం లేకుండా విశ్వసించి ,వారిని గౌరవించి,వారికి సహాయం చేసి మరియు మంచి మార్గముల్లో మీరు ఖర్చు చేసినప్పుడు నేను సహాయముతో మరియు మద్దతుతో మీకు తోడుగా ఉంటాను. మీరు వీటన్నింటిని నెలకొల్పినప్పుడు నేను మీరు పాల్పడిన పాపములన్నింటిని మీ నుండి ప్రక్షాళన చేస్తాను. మరియు ప్రళయదినమున మిమ్మల్ని నేను స్వర్గవనముల్లో ప్రవేశింపజేస్తాను వాటి భవనముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఎవరైతే ఈ దృఢప్రమాణమును తీసుకున్న తరువాత అవిశ్వసిస్తాడో అతడు తెలిసి ఉద్దేశపూర్వకంగా సత్య మార్గము నుండి మరలిపోయాడు.

(13) వారితో తీసుకోబడిన ప్రమాణమును వారు భంగపరచటం వలన మేము వారిని మా కారుణ్యము నుండి గెంటివేశాము. మరియు వారి హృదయములను గట్టిగా,కఠినంగా చేశాము వాటికి మేలు అన్నది చేరదు. మరియు వాటికి హితోపదేశం ప్రయోజనం కలిగించదు. వారు మాటలను వాటి పదములను మార్చి మరియు వాటి అర్ధాలను తమ మనోవాంఛలకు అనుగుణంగా మార్చి వేసి వాటి స్థానముల నుండి తారుమారు చేసేవారు. మరియు వారు తమకు బోధించబడిన వాటిలో నుండి కొన్నింటిని ఆచరించటం వదిలివేశారు. ఓ ప్రవక్తా అల్లాహ్ విషయంలో మరియు ఆయన విశ్వాసపర దాసుల విషయంలో వారి అవినీతి మీకు అనునిత్యం బట్బయలు అవుతునే ఉంది. కాని వారిలో నుండి కొంత మంది తమతో తీసుకున్న ప్రమాణమును పూర్తి చేశారు. కావున వారిని మీరు మన్నించండి మరియు వారిని శిక్షించకండి. వారిని క్షమించి వేయండి. నిశ్ఛయంగా ఇది ఉపకారము. మరియు అల్లాహ్ ఉపకారము చేసేవారిని ఇష్టపడుతాడు.

(14) మరియు మేము యూదులతో దృవీకరించబడిన ,దృడమైన ప్రమాణమును తీసుకున్నట్లే తాము ఈసా అలైహిస్సలాంను అనుసరించేవారమని తమకు తాము పరిశుద్ధులమని కొనియాడిన వారితో మేము ప్రమాణమును తీసుకున్నాము. తమ పూర్వికులైన యూదులు చేసినట్లే వారూ తమకు బోధించబడిన దానిలో ఒక భాగమునే ఆచరించారు. మరియు మేము ప్రళయదినం వరకు వారి మధ్య తగువులాటను మరియు ద్వేషమును వేశాము. కావున వారు ఒకరినొకరు అవిశ్వాసపరులని చెప్పుకుంటూ పోరాడుకుంటూ తగువులాడుతూ ఉంటారు. మరియు అల్లాహ్ తొందరలోనే వారు చేసే దాని గురించి వారికి తెలియపరుస్తాడు. మరియు దాని పరంగా వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

(15) ఓ తౌరాత్ ను కలిగిన యూదుల్లోంచి మరియు ఇంజీలును కలిగిన క్రైస్తవుల్లోంచి గ్రంధహులారా నిశ్చయంగా మా ప్రవక్త ముహమమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ వద్దకు వచ్చారు మీపై అవతరింపబడిన గ్రంధములో నుంచి మీరు గోప్యంగా ఉంచుతున్న వాటిలో నుంచి చాలా విషయాలను మీ కొరకు ఆయన స్పష్టపరుస్తున్నారు. మరియు ఎటువంటి ప్రయోజనం లేని వాటిలో నుంచి చాలా వాటిని ఆయన ఉపేక్షిస్తున్నారు. కాని మిమ్మల్ని బట్టబయలు చేయటం తప్ప. నిశ్చయంగా ఖుర్ఆన్ మీ వద్దకు అల్లాహ్ వద్ద నుండి గ్రంధముగా వచ్చినది. మరియు అది వెలుగును ప్రసాదించే జ్యోతి. మరియు ప్రజలకు ప్రాపంచిక మరియు పరలోక తమ వ్యవహారాల్లో అవసరమైన ప్రతీ దాన్ని స్పష్టపరిచే ఒక గ్రంధము.

(16) అల్లాహ్ ఈ గ్రంధము ద్వారా తనను సంతుష్టపరిచే విశ్వాసము మరియు సత్కర్మలను అవలంబించే వారిని అల్లాహ్ శిక్ష నుండి భద్రపరిచే మార్గముల వైపునకు మార్గ దర్శకత్వం చేస్తాడు. అవి స్వర్గము వైపునకు చేరవేసే మార్గములు. మరియు ఆయన వారిని అవిశ్వాసము,పాప కార్యముల చీకట్ల నుండి విశ్వాసము మరియు విధేయత యొక్క వెలుగు వైపునకు తన ఆదేశముతో వెలికితీస్తాడు. మరియు వారికి సరళమైన,తిన్ననైన మార్గము ఇస్లాం మార్గము వైపునకు భాగ్యమును కలిగిస్తాడు.

(17) "నిశ్చయంగా క్రైస్తవుల్లోంచి, మర్యమ్ కుమారుడైన మసీహ్ ఈసా యే అల్లాహ్!" అని అనే వారు అవిశ్వాసమునకు ఒడిగట్టారు. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి :- మర్యమ్ కుమారుడగు మసీహ్ ఈసాను తుదిముట్టించటం నుండి మరియు ఆయన తల్లిని తుది ముట్టించటం నుండి మరియు భూమిపై ఉన్న వారందరిని తుదిముట్టించటం నుండి అల్లాహ్ వారిని తుదిముట్టించదలచినప్పుడు అల్లాహ్ను ఆపే శక్తి ఎవరికి ఉన్నది ?. మరియు ఎవరికి దాని నుండి ఆయనను ఆపే శక్తి లేనప్పుడు అది అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవము ఎవరూ లేరని మరియు మర్యమ్ కుమారుడగు ఈసా మరియు ఆయన తల్లి మరియు సమస్త సృష్టి అందరు అల్లాహ్ సృష్టి అన్న దానికి ఆధారము. మరియు భూమ్యాకాశముల రాజ్యాధికారము మరియు వాటి మధ్య ఉన్న దాని రాజ్యాధికారము అల్లాహ్ కే చెందుతుంది. ఆయన తాను తలచుకున్న వారిని సృష్టిస్తాడు. ఆయన తలచి సృష్టించిన వారిలో నుంచి ఈసా అలైహిస్సలాం ఉన్నారు. అతను ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త. మరియు అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు.

(18) మరియు యూదుల్లోంచి, క్రైస్తవుల్లోంచి ప్రతి ఒక్కరు తాము అల్లాహ్ కుమారులని మరియు ఆయనకు ప్రియమైనవారమని వాదించారు. ఓ ప్రవక్త వారిని ఖండిస్తూ ఇలా పలకండి : ఎందుకని అల్లాహ్ మీరు పాల్పడిన పాపములకు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు ? మీరు వాదించినట్లు ఆయన ప్రియతములేనైతే ఆయన మిమ్మల్ని ఇహలోకంలో హతమర్చటం ద్వారా మరియు రూపం మార్చటం ద్వారా మరియు పరలోకంలో నరకాగ్ని ద్వారా శిక్షంచడు. ఎందుకంటే ఆయన తాను ఇష్టపడిన వారిని శిక్షించడు. కాని మీరు మానవులందరిలాగే మానవులు. వారిలో నుండి ఎవరు మంచి చేస్తారో వారికి స్వర్గమును ప్రతిఫలంగా ప్రసాదిస్తాడు. మరియు ఎవరు చెడు చేస్తారో వారిని నరకాగ్నితో శిక్షిస్తాడు. అల్లాహ్ తాను తలచుకున్న వారిని తన అనుగ్రహముతో మన్నించివేస్తాడు మరియు తాను తలచుకున్న వారిని తన న్యాయముతో శిక్షిస్తాడు. మరియు భూమ్యాకాశముల రాజ్యాధికారము మరియు వాటి మధ్య ఉన్న వాటి యొక్క రాజ్యాధికారము అల్లాహ్ ఒక్కడికే చెందుతుంది. మరియు మరలిపోవలసిన చోటు ఆయన ఒక్కడి వైపే ఉన్నది.

(19) ఓ యూదుల్లోంచి మరియు క్రైస్తవుల్లోంచి గ్రంధవహులారా నిశ్చయంగా ప్రవక్తల్లోంచి రాక తెగిపోయిన తరువాత మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ వద్దకు వచ్చారు. మరియు ఆయనను ప్రవక్తగా పంపటం ఎంతో అవసరం. అల్లాహ్ ప్రతిఫలం గురించి మాకు శుభవార్తనిచ్చే మరియు ఆయన శిక్ష నుండి మమ్మల్ని హెచ్చరించే ఏ ప్రవక్త మా వద్దకు రాలేదని మీరు వంకలు పెడుతూ పలకకుండా ఉండటానికి. నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ప్రతిఫలం గురించు శుభవార్తనిస్తూ మరియు ఆయన శిక్ష నుండి హెచ్చరిస్తూ మీ వద్దకు వచ్చారు. మరియు అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు. ప్రవక్తలను పంపించటం మరియు వారి (పరంపరను) ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అంతం చేయటం ఆయన సామర్ధ్యంలోంచిదే.

(20) ఓ ప్రవక్తా మూసా అలైహిస్సలాం తన జాతి బనీ ఇస్రాయీలుతో ఇలా పలికినప్పటి వైనమును గుర్తు చేసుకోండి : ఓ నా జాతి వారా మీరు మీ మనస్సులతో మరియు మీ నాలుకలతో మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహములను గుర్తు చేసుకోండి అయన మీలో మిమ్మల్ని సన్మార్గము వైపునకు పిలిచే ప్రవక్తలను చేశాడు. మరియు మీరు బానిసలుగా లోబడి ఉండిన తరువాత మీ స్వయం అధికారం కల రాజులుగా మిమ్మల్ని ఆయన చేశాడు. మరియు ఆయన మీ కాలంలో సర్వలోకాల్లోంచి ఎవరికి ఇవ్వని తన అనుగ్రహాలను మీకు ప్రసాదించాడు.

(21) మూసా అలైహిస్సలాం ఇలా పలికారు ఓ నా జాతివారా మీరు అల్లాహ్ మీకు ప్రవేశించమని మరియు అందులో ఉన్న అవిశ్వాసపరులతో పోరాడమని వాగ్దానం చేసిన పరిశుద్ధ భూమిలో (బైతుల్ మఖ్దిస్ మరియు దాని చుట్టు ప్రక్కల ఉన్న ప్రాంతం) ప్రవేశించండి. మరియు మీరు దుర్మార్గుల ముందు ఓడిపోకండి. అలాగే జరిగితే ఇహపరాల్లో మీ పరిణామం నష్టమే జరుగుతుంది.

(22) ఆయనతో ఆయన జాతి వారు ఇలా పలికారు : ఓ మూసా నిశ్చయంగా పవిత్ర ప్రదేశములో బలం కల,తీవ్ర పరాక్రమ వంతులైన జాతివారు ఉన్నారు. మరియు ఇది మమ్మల్ని అందులో ప్రవేశించటం నుండి ఆపుతుంది. వారందరు అందులో ఉన్నంతవరకు మేము అందులో ప్రవేశించము. ఎందుకంటే మాకు వారితో పోరాడే ఎటువంటి శక్తి సామర్ధ్యాలు లేవు. ఒక వేళ వారు అక్కడ నుండి వెళ్లిపోతే మేము అందులే ప్రవేశిస్తాము.

(23) అల్లాహ్ నుండి భయపడి ఆయన శిక్ష నుండి భయపడే మూసా అలైహిస్సలాం అనుయాయుల్లోంచి ఇద్దరు వ్యక్తులు వారిపై అల్లాహ్ తన విధేయత కొరకు భాగ్యము ద్వారా అనుగ్రహించాడు. వారు తమ జాతి వారిని మూసా అలైహిస్సలాం ఆదేశమునకు కట్టుబడి ఉండుటకు ప్రేరేపించారు వారు ఇలా పలికారు : మీరు నగర ద్వారము ద్వారా పోయి దుర్మార్గులపై దాడి చేయండి. మీరు ద్వారమును బద్దలకొట్టి దానిలో ప్రవేశించినప్పుడు మీరు నిశ్చయంగా అల్లాహ్ అనుమతితో చేశారు. మీరు వారిని అధిగమిస్తారు, దేవుని ధర్మశాస్త్రాన్ని విశ్వసించి, దేవునిపై నమ్మకం నుండి కారణాలను తీసుకొని భౌతిక మార్గాలను సిద్ధం చేయడం ద్వారా విజయం సాధించడం ద్వారా. మీరు వాస్తవంగా విశ్వాసపరులే అయితే ఒక్కడైన అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండండి. ఎందుకంటే విశ్వాసము పరిశుద్ధుడైన ఆయనపై నమ్మకముతో ముడిపడి ఉన్నది.

(24) బనీ ఇస్రాయీల్లోంచి మూసా జాతి వారు తమ ప్రవక్త మూసా అలైహిస్సలాం ఆదేశము విబేధించటంపై మొండితనమును చూపుతూ ఇలా పలికారు : నిశ్చయంగా నగరంలో దుర్మార్గులు ఉన్నంత వరకు మేము అందులో ప్రవేశించము. ఓ మూసా నీవు మరియు నీ ప్రభువు వెళ్ళి దుర్మార్గులతో పోరాడండి. ఇక మేము మీతోపాటు యుద్దంలో ఉండకుండా వెనుక ఉండిపోయి మా ప్రదేశముల్లో ఉండిపోతాము.

(25) మూసా అలైహిస్సలాం తన ప్రభువుతో ఇలా పలికారు : ఓ నా ప్రభువా నాపై మరియు నా సోదరుడైన హారూనుపై తప్ప ఇంకెవరపై నాకు ఎటువంటి అధికారము లేదు. కావున నీవు మా మధ్య మరియు నీ విధేయత నుండి మరియు నీ ప్రవక్త విధేయత నుండి వైదొలగిన జాతి వారి మధ్య వేరు పరచు.

(26) అల్లాహ్ తన ప్రవక్త మూసాఅలైహిస్సలాంతో ఇలా పలికాడు : నిశ్చయంగా అల్లాహ్ బనీ ఇస్రాయీల్ పై నలభై సంవత్సరముల కాలం వరకు పవిత్ర భూమిలో ప్రవేశమును నిషేదించాడు. ఈ కాలములో ఎడారిలో వారు అయోమయంలో పడి మార్గభ్రష్టులుగా తిరుగుతుంటారు. సన్మార్గం పొందరు. ఓ మూసా అల్లాహ్ విధేయత నుండి వైదొలగిన జాతి వారిపై మీరు విచారించకండి. నిశ్చయంగా వారికి సంభవించిన శిక్ష వారి అవిధేయకార్యాలు మరియు వారి పాపముల కారణం చేత.

(27) ఓ ప్రవక్తా యూదుల్లోంచి దుర్మార్గులైన,అసూయాపరులైన వీరందరికి ఎటువంటి సందేహం లేని ఆదమ్ ఇద్దరు కుమారుల గాధను సత్యముతో తెలియపరచండి. వారిద్దరు ఖాబీలు మరియు హాబీలు. వారిద్దరిలో నుంచి ప్రతి ఒక్కరు అల్లాహ్ సాన్నిద్యమును కోరుకుంటూ ఒక ఖుర్బానీను సమర్పించుకున్నారు. కాని అల్లాహ్ హాబీలు సమర్పించుకున్న ఖుర్బానీని స్వీకరించాడు. ఎందుకంటే అతడు దైవభీతిపరుడు. మరియు ఖాబీలు ఖుర్బానీని స్వీకరించలేదు. ఎందుకంటే అతడు దైవభీతిపరుడు కాడు. అప్పుడు ఖాబీలు హాబీలు ఖుర్బానీ స్వీకరించబడటాన్ని అసూయతో ద్వేషించాడు. మరియు ఇలా పలికాడు : ఓ హాబీలు నేను నిన్ను హతమార్చుతాను. అప్పుడు హాబీలు ఇలా పలికాడు : నిశ్చయంగా అల్లాహ్ తన ఆదేశాలను పాటించి తాను వారించిన వాటికి దూరంగా ఉండి తన భీతి కలిగిన వారి ఖుర్బానీని స్వీకరిస్తాడు.

(28) ఒక వేళ నీవు నన్ను చంపే ఉద్దేశంతో నా వైపు నీ చేయి చాపితే నేను నువ్వు చేసిన కార్యంలా చేసి నీపై అతిక్రమించేవాడిని కాదు. ఇది నా వైపు నుండి పిరికి తనం కాదు. కానీ నేను సర్వ సృష్టితాల ప్రభువు అయిన అల్లాహ్ తో భయపడుతున్నాను.

(29) అప్పుడు అతడు (హాబీలు) అతనితో (ఖాబీలుతో) భయపెడుతూ ఇలా పలికాడు : నిశ్చయంగా నీవు అన్యాయంగా, దుర్మార్గంగా నన్ను హత్య చేసిన పాపము ద్వారా నీ మునుపటి పాపములకు చేరుకుని ప్రళయదినం నాడు నరకాగ్నిలో ప్రవేశించే వారిలో నీవు కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రతిఫలమే అతిక్రమించేవారి యొక్క ప్రతిఫలము. మరియు నేను నీ హత్య చేసి వారిలో నుండి అయ్యి మరలటమును కోరుకోవటం లేదు.

(30) అప్పుడు ఖాబీలుకు తన సోదరుడు హాబీలును హతమార్చటమును చెడుపై ప్రేరేపించే అతని మనస్సు అలంకరించి చూపించింది అప్పుడు అతడు అతడిని హతమార్చాడు. అప్పుడు అతడు దాని వలన తమ ఇహపరాల్లో తమ మనస్సులకు నష్టం చేసుకునేవారిలో నుంచి అయిపోయాడు.

(31) అప్పుడు అల్లాహ్ తన సోదరుని శరీరమును ఎలా దాచాలో అతనికి నేర్పించటానికి ఒక కాకిని పంపించాడు అది అతని ముందు భూమిని తవ్వుతుంది చనిపోయిన కాకిని అందులో పూడ్చటానికి. హంతకుడు అప్పుడు తన సోదరునితో ఇలా పలికాడు అయ్యో నేను ఈ కాకిలా కాలేకపోయాను ఏదైతే మరణించిన ఇంకో కాకిని దాచినదో అప్పుడు నేనూ నా సోదరుని మృతశరీరమును దాచేవాడిని. అప్పుడు అతను తన సోదరుని శరీరమును దాచి చింతించే వాడైపోయాడు.

(32) ఖాబీల్ తన సోదరుడిని హతమార్చిన వైనము ద్వారా మేము ఇస్రాయీల్ సంతతి వారికి ఎవరైతే ప్రాణమునకు బదులుగా కాకుండా లేదా అవిశ్వాసము ద్వారా భూమిపై ఉపద్రవమును సృష్టించుటకు లేదా పోరాడటానికి ఒక ప్రాణమును హతమార్చితే అతడు సమస్త మానవాళిని హతమార్చాడని మనము తెలియపరిచాము. ఎందుకంటే అతని వద్ద దోషికి మరియు నిర్దోషికి మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు. మరియు ఎవరైతే మహోన్నతుడైన అల్లాహ్ ఏ ప్రాణమునైతే నిషేధించాడో దాన్ని హతమార్చటము యొక్క నిషేదమును విశ్వసిస్తూ ఆ ప్రాణమును హతమార్చటం నుండి ఆగిపోయి దాన్ని హతమార్చడో అతడు సమస్త మానవాళిని జీవింపజేసినట్లు. ఎందుకంటే అతని చర్యలో వారందరి శ్రేయస్సు ఉన్నది. మరియు నిశ్చయంగా బనీ ఇస్రాయీలు వద్దకు మా ప్రవక్తలు స్పష్టమైన వాదనలను మరియు స్పష్టమైన ఆధారాలను తీసుకుని వచ్చారు. అయినా కూడా నిశ్ఛయంగా వారిలో నుండి చాలా మంది పాపకార్యములకు పాల్పడి మరియు తమ ప్రవక్తలను విబేధించి అల్లాహ్ హద్దులను అతిక్రమించేవారు.

(33) ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్దం చేస్తారో మరియు దానిని శతృత్వముతో మరియు హతమార్చటం ద్వారా,సంపదలను లాక్కొని,దారిని కోసి భూమిలో ఉపద్రవాన్ని రేకెత్తించటంతో బహిర్గతం చేస్తారో వారి శిక్ష వారిని శిలువ వేయకుండా హతమార్చటం లేదా కట్టెపై,అటువంటి వాటిపై శిలువ వేసి వారిని హతమార్చటం లేదా వారి ఎడమ కాలితో పాటు కుడి చేతిని నరకటం ఆ తరువాత మరల చేస్తే అతని కుడి కాలితో సహా ఎడమ చేతిని నరకటం లేదా దేశ బహిష్కరణ చేయటం. ఈ శిక్ష వారికి ఇహలోకములో అవమానము మరియు వారి కొరకు పరలోకంలో పెద్ద శిక్ష ఉన్నది.

(34) కాని ఈ యుద్దం చేసే వారిలో నుండి ఓ విజ్ఞులారా మీరు వారిపై ఆధిక్యతను కనబరచక ముందు పశ్చాత్తాప్పడి మరలితే మీరు తెలుసుకోండి అల్లాహ్ వారిని పశ్చాత్తాపము తరువాత మన్నించేవాడును,వారిపై కరుణించేవాడును, వారి నుండి శిక్షను తొలగించటం వారి కల ఆయన కారుణ్యము.

(35) ఓ విశ్వాసులారా మీరు అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడండి. మరియు మీరు ఆయన మీకు ఆదేశించిన వాటిని నెరవేర్చటం ద్వారా ఆయన మిమ్మల్ని వారించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా ఆయన సాన్నిధ్యమును కోరుకోండి. మరియు మీరు ఆయన మన్నతలను ఆశిస్తూ అవిశ్వాసపరులతో పోరాడండి. బహుశా మీరు వాటిని పాటిస్తే మీరు ఆశించినవి పొందుతారు మరియు మీరు భయపడే వాటి నుండి బ్రతికి బయటపడుతారు.

(36) నిశ్చయంగా అల్లాహ్ ను ఆయన ప్రవక్తను అవిశ్వసించేవారు ఒక వేళ వారిలో నుండి ప్రతి ఒక్కరికి భూమిలో ఉన్నదంతా మరియు దానికి తోడు దానంత అధికారమే ఉంటే ప్రళయదినమున అల్లాహ్ శిక్ష నుండి తమను ఆపటానికి దాన్ని వారు ప్రవేశపెట్టేవారు. ఆ పరిహారం వారి నుండి స్వీకరించబడదు. మరియు వారి కొరకు బాధాకరమైన శిక్ష కలదు.

(37) వారు నరకము నుండి దానిలో వారు ప్రవేశించినప్పుడు వెలుపలికి రావాలనుకుంటారు. అది వారికి ఎలా సాధ్యం ?! వారు దాని నుండి బయటకు రాలేరు. మరియు వారి కొరకు అందులో శాశ్వతమైన శిక్ష కలదు.

(38) ఓ పాలకుడా దొంగతనం చేసిన పురుషుడు,దొంగతనం చేసిన స్త్రీ వారిద్దరికి వారు అన్యాయంగా ప్రజల సొమ్మును కాజేయటం వలన అల్లాహ్ తరుపు నుండి వారికి శిక్షగా,ప్రతిఫలంగా కుడి చేయిని నరికివేయండి. మరియు వారిద్దరిని,ఇతరులను భయపెట్టటానికి. మరియు అల్లాహ్ సర్వాధిక్యుడు ఆయనను ఏదీను ఓడించదు. తన విధివ్రాతలో మరియు తన ధర్మ శాసనం రచించటంలో వివేకవంతుడు.

(39) ఎవరైతే దొంగతనం చేయటం నుండి అల్లాహ్ యందు పశ్తాతాప్పడి తన కార్మను సంస్కరించుకుంటాడో నిశ్చయంగా అల్లాహ్ తన వద్ద నుండి అనుగ్రహంగా అతని పశ్చాత్తాపమును స్వీకరిస్తాడు. ఇది ఎందుకంటే అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్ఛాత్తాప్పడేవారి పాపములను మన్నించేవాడును వారిపై కరుణించేవాడును. కాని విషయం పాలకుల వద్దకు వెళ్ళినప్పుడు పశ్ఛాత్తాపము వలన వారి నుండి శిక్ష విధించే ఆదేశం తప్పిపోదు.

(40) ఓ ప్రవక్తా భూమ్యాకాశముల రాజ్యాధికారము అల్లాహ్ దే అని మీకు తెలుసు. ఆయన వాటిని తాను తలచిన విధంగా కార్యచరణ చేస్తాడు. మరియు ఆయన తాను తలచిన వారికి తన న్యాయముతో శిక్షిస్తాడు. మరియు తాను తలచిన వారికి తన అనుగ్రహముతో మన్నిస్తాడు. నిశ్ఛయంగా అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు. ఆయనను ఏదీ అశక్తుడిని చేయదు.

(41) ఓ ప్రవక్తా విశ్వాసమును బహిర్గతం చేసి అవిశ్వాసమును దాచి ఉంచిన కపటుల్లోంచి మిమ్మల్ని ఆగ్రహానికి గురి చేయటానికి అవిశ్వాస కార్యాలను బహిర్గతం చేయటంలో త్వరపడేవారు మిమ్మల్ని దుఃఖానికి గురి చేయకూడదు. మరియు తమ పెద్దల అబద్దమును చెవి ఒగ్గి విని దాన్ని స్వీకరించి,మీ నుండి విముఖతతో మీ వద్దకు రాని వారైన తమ నాయకులను అనుకరించేవారైన యూదులు మిమ్మల్ని దుఃఖానికి గురిచేయకూడదు. వారు తౌరాత్ లో ఉన్న అల్లాహ్ వాక్కును తమ మనో వాంఛంలకు అనుగుణంగా మార్చుకునేవారు, తమను అనుసరించేవారితో ఇలా పలికే వారు : ఒక వేళ ముహమ్మద్ ఆదేశము మీ మనోవాంఛలకు అనుగుణంగా ఉంటే దాన్ని మీరు అనుసరించండి. ఒక వేళ అది వాటికి భిన్నంగా ఉంటే దాని నుండి జాగ్రత్తపడండి. మరియు అల్లాహ్ ప్రజల్లోంచి ఎవరిని అపమార్గమునకు గురి చేయదలచుకుంటే ఓ ప్రవక్తా అతని నుండి అపమార్గమును తొలగించి అతన్ని సత్య మార్గము వైపునకు మార్గదర్శకం చేసే వాడిని మీరు పొందరు. యూదుల్లోంచి మరియు కపటుల్లోంచి ఈ గుణములను కలిగిన వారందరే అల్లాహ్ వారి హృదయములను అవిశ్వాసము నుండి పరిశుద్ధపరచటమును కోరలేదు. వారికి ఇహలోకంలో అవమానము మరియు పరాభవము కలదు. మరియు పరలోకంలో పెద్ద శిక్ష కలదు . అది నరకాగ్ని శిక్ష.

(42) ఈ యూదులందరు అబద్దాలను ఎక్కువగా వినేవారు,వడ్డీ లాంటి నిషిద్ధ సంపదను అధికంగా తినేవారు. ఓ ప్రవక్తా ఒక వేళ వారు మీ వద్దకు తీర్పు ఇవ్వమని వస్తే మీరు తలచుకుంటే వారి మధ్య తీర్పునివ్వండి లేదా మీరు తలచుకుంటే వారి మధ్య తీర్పును వదిలివేయండి. ఈ రెండు విషయముల్లో మీకు ఎంపిక చేసుకునే హక్కు ఉన్నది. మరియు ఒక వేళ మీరు వారి మధ్య తీర్పునివ్వటమును వదిలివేస్తే వారు మీకు ఎటువంటి కీడును కలిగించలేరు. మరియు ఒక వేళ మీరు వారి మధ్య తీర్పునిస్తే న్యాయముతో వారి మధ్య తీర్పునివ్వండి. మరియు ఒక వేళ వారు దుర్మార్గులైనా,శతృవులైనా. నిశ్చయంగా అల్లాహ్ తమ తీర్పునివ్వటంలో న్యాయంగా వ్యవహరించేవారిని ఇష్టపడుతాడు. మరియు ఒక వేళ తీర్పు ఇవ్వబడిన వారు తీర్పునిచ్చే వారి కొరకు శతృవులైనా సరే.

(43) మరియు నిశ్చయంగా వీరందరి విషయం ఆశ్ఛర్యకరమైనది. వారు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు మరియు తమ మనోవాంఛలకు అనుగుణంగా ఉండే వాటితో మీ తీర్పు ఉంటుందని ఆశిస్తూ మీ వద్దకు తీర్పుకోసం వస్తున్నారు. వాస్తవానికి తమ విశ్వాసమున్నదని వారు వాదిస్తున్న తౌరాత్ వారి వద్ద ఉన్నది. అందులో అల్లాహ్ తీర్పు ఉన్నది. ఆ పిదప వారు మీ తీర్పు నుండి అది వారి మనో వాంఛలకు అనుగుణంగా లేనప్పుడు విముఖత చూపుతున్నారు. అయితే వారు తమ పుస్తకములో ఉన్న వాటి పట్ల తిరస్కారము మరియు మీ తీర్పు నుండి విముఖతకు మధ్య సమీకరిస్తున్నారు. మరియు వారందరు చేసినది విశ్వాసపరులు చేసినది కాదు. కావున వారు అప్పుడు మీపై మరియు మీరు తీసుకుని వచ్చిన దానిపై విశ్వాసము కనబరచినవారు కాదు.

(44) నిశ్చయంగా మేము తౌరాతును మూసా అలైహిస్సలాంపై అవతరింపజేశాము. అందులో ఋజుమార్గ దర్శకం మరియు మేలు గురించి సూచనలు కలవు. మరియు వెలుగును పొందే జ్యోతి కలదు. అల్లాహ్ కు విధేయత ద్వారా కట్టుబడి ఉండిన బనీ ఇస్రాయీల్ యొక్క ప్రవక్తలు వాటి ద్వారా తీర్పునిస్తున్నారు. మరియు తమను అల్లాహ్ తన గ్రంధముపై పరిరక్షకులుగా చేయటం వలన ప్రజలను సంస్కరించే (బోధించే) ధర్మ పండితులు మరియు విధ్వంసులు వాటి ద్వారా తీర్పునిస్తున్నారు. మరియు ఆయన వారిని దాని పరిరక్షకులుగా చేశాడు వారు దాన్ని మర్పు చేర్పుల నుండి పరిరక్షిస్తున్నారు. మరియు అది సత్యమని వారే సాక్షులు. మరియు ప్రజలు దాని విషయంలో వారి వైపునకే మరలుతున్నారు. ఓ యూదులారా మీరు ప్రజల నుండి భయపడకండి నా ఒక్కడితోనే భయపడండి. మరియు అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశమునకు బదులుగా అల్ప ఖరీదైన రాజరికమును లేదా గౌరవమును లేదా సంపదను తీసుకోకండి. మరియు ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన దైవవాణి ద్వారా తీర్పు జెప్పడో దాన్ని ధర్మ సమ్మతంగా అనుకుంటూ లేదా దానిపై వేరేదాన్ని ప్రాధాన్యతనిస్తూ లేదా దాన్ని దానికి సమానంగా అనుకుంటూ. వారే వాస్తవానికి అవిశ్వాసులు.

(45) మరియు మేము తౌరాతులో యూదులపై విధిగావించాము ఎవరైతే అన్యాయంగా కావాలని ఏ ప్రాణమును హతమార్చినా అతడిని దానికి బదులుగా హతమార్చాలి మరియు ఎవరైతే ఉద్ధేశపూర్వకంగా ఏదైన కన్ను పీకితే అతని కన్ను పీకివేయాలని మరియు ఎవరైతే ఉద్ధేశపూర్వకంగా ఏదైన ముక్కు కోసినా అతని ముక్కు కోసివేయాలని మరియు ఎవరైతే ఉద్ధేశపూర్వకంగా ఏదైన చెవి కోస్తే అతని చెవి కోసివేయాలని మరియు ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ఏదైన పన్ను పీకితే అతని పన్ను పీకివేయాలని. మరియు గాయాల విషయంలో నేరస్తుడు తన అదే నేరంతో శిక్షింపబడతాడని మేము వారిపై వ్రాశాము. మరియు ఎవరైతే నేరస్తుడిని స్వచ్ఛందంగా క్షమించి వేస్తాడో అతని క్షమాపణ అతని పాపములకు పరిహారమవుతుంది అతని క్షమాపణ తనకు అన్యాయం చేసినవాడి కొరకు. ప్రతీకారం విషయంలో మరియు ఇతర వ్యవహారాల విషయంలో అల్లాహ్ అవతరించిన దాని ద్వారా ఎవడైతే తీర్పు ఇవ్వడో అతడు అల్లాహ్ హద్దులను అతిక్రమించినవాడు.

(46) మరియు మేము మర్యమ్ కుమారుడగు ఈసా అలైహిస్సలాంను తౌరాత్ లో ఉన్న వాటిని విశ్వసించే వాడిగా మరియు వాటి ప్రకారం తీర్పునిచ్చేవాడిగా బనీ ఇస్రాయీలు ప్రవక్తల అడుగుజాడల్లో నడిపించాము. మరియు మేము అతనికి సత్యమునకు మార్గదర్శకం చేయటమును మరియు సందేహాలు కలిగిన వాదనలను తొలగించటమును కలిగిన ఇంజీలును ప్రసాదించాము. మరియు అది తీర్పుల (ఆదేశముల) సమస్యలను పరిష్కరిస్తుంది. మరియు దాని కన్న ముందు అవతరింపబడిన తౌరాత్ కు అనుగుణంగా ఉండేటట్లుగా దాని నిబందనల్లో రద్దుచేయబడ్డ కొన్ని తప్ప. మరియు మేము ఇంజీలును మార్గదర్శకం పొందే విధంగా మార్గదర్శకంగా మరియు ఆయన నిషేదించిన వాటిని పాల్పడటం నుండి వారిని మందలించేదానిగా చేశాము.

(47) మరియు క్రైస్తవులు ఇంజీలులో అల్లాహ్ అవతరింపజేసిన దాన్ని విశ్వసించాలి మరియు వారి వద్దకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపబడక మునుపు వారు అందులో వచ్చిన నిజాల వాటి విషయంలో దాని ప్రకారమే తీర్పునివ్వాలి. మరియు ఎవరైతే అల్లాహ్ అవతరింపజేసిన వాటి ప్రకారంగా తీర్పునివ్వరో వారందరు అల్లాహ్ విధేయత నుండి వైదొలగినవారు మరియు సత్యమును విడిచినవారు,అసత్యము వైపునకు వాలినవారు.

(48) ఓ ప్రవక్తా మేము మీ వైపునకు ఖుర్ఆన్ ను అది అల్లాహ్ వద్ద నుండి కావటంలో ఎటువంటి సందేహము కాని సంశయం కాని లేని సత్యముతో అవతరింపజేశాము. అది తనకు పూర్వం అవతరింపబడిన గ్రంధములను దృవీకరిస్తుంది. వాటిని పరిరక్షిస్తుంది. అది వాటిలో నుండి దేనికి అనుగుణంగా ఉన్నదో అది సత్యము. మరియు అది దేనికి భిన్నంగా ఉన్నదో అది అసత్యము. కావున మీరు అల్లాహ్ మీపై అందులో ఏది అవతరింపజేశాడో దానితో ప్రజల మధ్య తీర్పునివ్వండి. మరియు ఎటువంటి సందేహం లేని మీపై అవతరింపబడిన సత్యమును వదిలివేస్తూ వారు ఎంచుకున్నటువంటి వారి మనోవాంఛలను అనుసరించకండి. మరియు మేము ప్రతీ సమాజం కొరకు ఆచరణాత్మక తీర్పులు కల ధర్మాన్ని మరియు మార్గదర్శకం పొందే స్పష్టమైన మార్గమును చేశాము. మరియు ఒక వేళ అల్లాహ్ ధర్మాలన్నింటిని ఒకే ధర్మంగా చేయదలచుకుంటే చేసేవాడు. కాని ఆయన ప్రతీ సమాజం కొరకు ఒక ధర్మాన్ని చేశాడు. ఆయన అందరిని పరీక్షించటానికి .అప్పుడు అవిధేయుడి నుండి విధేయుడు స్పష్టమవుతాడు. కావున మీరు సత్కర్మలు చేయటానికి మరియు చెడులను విడనాడటానికి త్వరపడండి. ప్రళయదినమున మీ మరలటం అన్నది ఒక్కడైన అల్లాహ్ వైపే జరుగును. మరియు ఏ విషయంలో నైతే విబేధించుకుంటున్నారో దాని గురించి ఆయన మీకు తొందరలోనే తెలియపరుస్తాడు. మరియు తొందరలోనే ఆయన మీరు ముందు పంపించుకున్న కర్మలకు మీకు ప్రతిఫలం ప్రసాదిస్తాడు.

(49) మరియు ఓ ప్రవక్తా మీరు అల్లాహ్ మీ వైపు అవతరింపజేసిన శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యండి. మరియు మీరు మనోవాంఛల్లాంటి ఉద్భవించే వారి అభిప్రాయాలను అనుసరించకండి. అల్లాహ్ మీపై అవతరింపజేసిన కొన్ని శాసనాల నుండి వారు మిమ్మల్ని తప్పించకుండా మీరు వారి నుండి జాగ్రత్తగా ఉండండి. వారు ఆ మార్గంలో ఎటువంటి ప్రయత్నం చేయరు. ఒక వేళ వారు మీపై అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పును స్వీకరించటం నుండి విముఖత చూపితే అల్లాహ్ వారిని వారి కొన్ని పాపములకు ప్రాపంచిక శిక్ష విధించదలచాడని మీరు తెలుసుకోండి. మరియు వాటన్నింటికి ఆయన వారిని పరలోకంలో శిక్షిస్తాడు. మరియు నిశ్ఛయంగా ప్రజల్లోంచి చాలా మంది అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోయేవారున్నారు.

(50) ఏమీ వారు తమ మనోవాంఛలకు అనుసరణగా తీర్పునిచ్చే విగ్రహారాధకులైన అజ్ఞానుల తీర్పును కోరుకుంటూ మీ తీర్పు నుండి విముఖత చూపుతున్నారా ?! అల్లాహ్ గురించి,ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన వాటి గురించి అర్ధం చేసుకునే వారైన నమ్మకమును కలిగిన వారి వద్ద అల్లాహ్ కన్న మంచిగా తీర్పు ఇచ్చేవాడు ఎవడూ ఉండడు. తమ మనోవాంఛలకు అనుగుణంగా ఉండే వాటిని - అవి ఒక వేళ అసత్యమైన సరే - తప్ప స్వీకరించని వారైన అజ్ఞానులు మరియు మనోవాంఛలను అనుసరించే వారి వద్ద కాదు.

(51) ఓ అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించేవారా మీరు యూదులను మరియు క్రైస్తవులను వారితో స్నేహం చేస్తూ మితృలుగా,స్వచ్ఛతావాదులుగా చేసుకోకండి. యూదులు తమ మత ప్రజలతో స్నేహం చేస్తారు. మరియు క్రైస్తవులు తమ మత ప్రజలతో స్నేహం చేస్తారు. ఇరు వర్గములను మీ పై ఉన్న శతృత్వము సమీకరిస్తుంది. మరియు మీలో నుండి ఎవరైతే వారితో స్నేహం చేస్తారో వారు వారిలోనే షుమారు చేయబడుతారు. నిశ్ఛయంగా అల్లాహ్ అవిశ్వాసపరులతో తమ స్నేహం వలన దుర్మార్గమునకు పాల్పడిన జనులను సన్మార్గం చూపడు.

(52) అప్పుడు ఓ ప్రవక్త మీరు చూస్తారు బలహీన విశ్వాసం ఉన్న కపటవాదులు యూదులు మరియు క్రైస్తవులతో ఇలా పలుకుతూ స్నేహం చేయటం ప్రారంభిస్తారు : వీరందరు గెలుస్తారని మరియు దేశం వారిదై వారు మాపై బలవంతాన ఆధిక్యతను చూపుతారని మేము భయపడుతున్నాము. బహుశా అల్లాహ్ తన ప్రవక్తకు మరియు విశ్వాసపరులకు విజయమును కలిగించవచ్చు లేదా తన వద్ద నుండి ఏదైన ఆదేశమును తీసుకుని రావచ్చు దానితో యూదుల మరియు వారి అనుచరుల బలము (ఆధిక్యత) తొలగిపోవును. అప్పుడు వారితో స్నేహం చేయటంలో త్వరపడేవారు తమ హృదయముల్లో దాచి ఉంచిన కపటత్వముపై పశ్ఛాత్తాప్పడేవారు అయిపోతారు. దానితో జత చేయబడిన తప్పుడు కారణాలు నిర్వీర్యం అయిపోవటం వలన.

(53) మరియు విశ్వాసపరులు ఈ కపటులందరి పరిస్థితి నుండి ఆశ్ఛర్యపోతూ ఇలా పలుకుతారు : ఓ విశ్వాసపరులారా విశ్వాసములో మరియు సహాయములో మరియు స్నేహంలో నిశ్చయంగా మీతో పాటు ఉన్నారని కఠోరంగా తమ ప్రమాణాలను చేసినవారు వీరేనా ?! వారి కర్మలు నిర్వీర్యమైపోతాయి. అప్పుడు వారు తమ ఉద్దేశములను కోల్పోవటం వలన మరియు తమ కొరకు సిద్ధం చేయబడిన శిక్ష వలన నష్టపోయేవారిలోంచి అయిపోతారు.

(54) ఓ విశ్వాసపరులారా మీలో నుండి ఎవరైన తన ధర్మము నుండి అవిశ్వాసం వైపునకు మరలితే తొందరలోనే అల్లాహ్ వారికి బదులుగా ఇతర జనులను తీసుకుని వస్తాడు వారిని ఆయన ఇష్టపడుతాడు వారు ఆయనను ఇష్టపడుతారు ఎందుకంటే వారిలో స్థిరత్వం ఉంటుంది,వారు విశ్వాసపరులపై దయ కలిగిన వారై అవిశ్వాసపరులపై కాఠిన్యమును కలిగినవారై ఉంటారు. వారు అల్లాహ్ కలిమా ఉన్నత శిఖరాలకు చేరటానికి తమ సంపదల ద్వారా మరియు తమ ప్రాణముల ద్వారా పోరాడుతారు. వారు తమను నిందించే వారి నిందల నుండి భయపడరు. ఎందుకంటే వారు సృష్టిరాసుల యొక్క మన్నతుపై అల్లాహ్ యొక్క మన్నతను ప్రాధాన్యతనిచ్చి ఉంటారు. ఇది అల్లాహ్ అనుగ్రహము దాన్ని ఆయన తన దాసుల్లోంచి తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ విశాలమైన అనుగ్రహము,ఉపకారమును కలిగినవాడు. తన అనుగ్రహమునకు ఎవరు హక్కుదారుడో బాగా తెలిసిన వాడు దాన్ని అతడికే ప్రసాదిస్తాడు. దానికి ఎవరు హక్కుదారుడు కాడో దాని నుండి దూరం చేస్తాడు.

(55) యూదులు గాని క్రైస్తవులు గాని ఇతర అవిశ్వాసపరులు గాని మీ స్నేహితులు కారు. నిశ్చయంగా మీ స్నేహితుడు మరియు మీకు సహాయకుడు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మరియు నమాజులను పరిపూర్ణంగాపాటించే మరియు తమ సంపదల నుండి జకాత్ ను ఇచ్చే విశ్వాసపరులు. మరియు వారు అల్లాహ్ కొరకు నిమమ్రతతో వంగుతూ ఉంటారు.

(56) మరియు ఎవడైతే సహాయము ద్వారా అల్లాహ్ ను ఆయన ప్రవక్తను మిత్రులుగా చేసుకుంటాడో అతడు అల్లాహ్ పక్షం వాడు. మరియు అల్లాహ్ పక్షం వారే విజయం సాధిస్తారు ఎందుకంటే అల్లాహ్ వారికి సహాయకుడిగా ఉంటాడు.

(57) ఓ విశ్వాసపరులారా మీ ధర్మం పట్ల పరిహాసమాడే,దాని పట్ల ఆటలాడే మీ కన్న పూర్వం గ్రంధం ఇవ్వబడిన యూదులను మరియు క్రైస్తవులను మరియు మష్రికులను మీరు స్నేహితులుగా, సత్యసందులుగా చేసుకోకండి. మరియు మీరు అల్లాహ్ కు ఆయన మీకు వారించిన వారితో స్నేహం చేయటం నుండి దూరంగా ఉండి భయపడండి ఒకవేళ మీరు ఆయనను మరియు ఆయన మీపై అవతరింపిచేసిన దాన్ని విశ్వసిస్తే.

(58) మరియు ఇదే విధంగా మీరు గొప్ప సాన్నిధ్యమును కలిగించే నమజు కొరకు అజాన్ ఇచ్చినప్పుడు వారు పరిహాసమాడేవారు,ఆటలాడేవారు. దీనికి కారణం వారు అల్లాహ్ ఆరాధన యొక్క అర్ధాలను మరియు ఆయన ప్రజల కొరకు ధర్మ బద్ధం చేసిన తన ధర్మాదేశాలను అర్ధం చేసుకోని జనులు.

(59) ఓ ప్రవక్తా మీరు గ్రంధవహుల్లోంచి పరిహాసమాడేవారితో ఇలా పలకండి : ఏమీ? మేము అల్లాహ్ ను మరియు ఆయన మాపై అవతరింపజేసిన మరియు మాకు పూర్వం అవతరింపజేసిన (గ్రంథాలను) విశ్వసించామని మరియు మీలో చాలా మంది తమ విశ్వాసమును మరియు ఆదేశములను పాటించటం వదిలి వేయటం వలన అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోయారని మాకు విశ్వాసముండటం వలన మీరు మమ్మల్ని నిందిస్తున్నారా ?! మీరు మమ్మల్ని నిందించడం మాకు ప్రశంసలవుతాయి. నిందలు కావు.

(60) ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి : వీరందరికన్న ఎవరు ఎక్కువ నిందకు మరియు తీవ్ర శిక్షకు అర్హులో నేను మీకు తెలుపనా. నిశ్చయంగా వారే ఎవరినైతే అల్లాహ్ తన కారుణ్యము నుండి గెంటివేసి వారి రూపాలను మర్చిన తరువాత కోతులుగా పందులుగా మార్చి వేశాడో మరియు వారిలో నుండి కొందరిని తాగూత్ లకు దాస్యం చేసే వారిగా చేశాడో, అల్లాహ్ ను వదిలి ఇష్టతతో ఎవరి ఆరాధన చేయబడునో దాన్ని తాగూత్ అంటారు. ఈ ప్రస్తావించబడిన వారందరు ప్రళయదినమున చెడ్డ స్థానము కలవారు మరియు ఋజుమార్గము నుండి తప్పిపోయిన వారు.

(61) ఓ విశ్వాసపరులారా కపటులు మీ వద్దకు వచ్చినప్పుడు వారిలోని కొందరు కపటత్వమును కలిగి ఉండి మీ ముందు విశ్వాసమును బహిర్గతం చేస్తారు. వాస్తవానికి వారు వచ్చేటప్పుడు మరియు వెళ్ళేటప్పుడు అవిశ్వాసమును కలిగి ఉంటారు దాని నుండి వారు వేరు కారు. ఒక వేళ వారు మీ ముందు విశ్వాసమును బహిర్గతం చేసినా అల్లాహ్ కు వారు దాస్తున్న అవిశ్వాసం గురించి బాగా తెలుసు. తొందరలోనే ఆయన వారికి వాటి పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.

(62) ఓ ప్రవక్తా యూదుల్లోంచి మరియు కపటుల్లోంచి చాలా మంది అబద్దమాడటం,తమ దుర్మార్గముతో ఇతరులపై దౌరజన్యం చేయటం,హరాం పద్దతిలో ప్రజల సొమ్ము తినటం లాంటి పాపకార్యములకు పాల్పడటంలో త్వరపడటమును మీరు చూస్తారు. వారు చేస్తున్నది ఎంత చెడ్డది.

(63) ఎందుకని వారి ధర్మవేత్తలు మరియు మతాచారులు వారు త్వరపడుతున్న అబద్దం పలకటం,అబద్దపు సాక్ష్యమివ్వటం,అన్యాయంగా ప్రజల సొమ్మును తినటం నుండి వారిని వారించటంలేదు. వారిని చెడు నుండి వారించని వారి ధర్మవేత్తల,మతాచారుల చర్య ఎంతో చెడ్డదైనది.

(64) యూదులు వారికి కష్టము,లేమి కలిగినప్పుడు ఇలా పలికేవారు : మేలును ఖర్చు చేయటం,ప్రసాదించటం నుండి అల్లాహ్ చేయి కట్టబడి ఉంది. ఆయన వద్ద ఉన్న దాన్ని మాకు ఇవ్వటం నుండి ఆయన ఆపి ఉంచాడు. వినండి వారి ఈ మాట పలకటం వలన వారి చేతులు మేలుని చేయటం నుండి,ఇవ్వటం నుండి ఆగిపోవుగాక మరియు వారు అల్లాహ్ కారుణ్యం నుండి గెంటివేయబడుగాక. కాని పరిశుద్దుడైన,మహోన్నతుడైన అల్లాహ్ రెండు చేతులు మేలు చేయటంలో,ప్రసాదించటంలో విస్తరించి ఉన్నాయి. ఆయన ఎలా తలచుకుంటే అలా ఖర్చు చేస్తాడు. ఆయన విస్తరింపజేస్తాడు మరియు పిడికిలి బిగించివేస్తాడు. ఆయనపై అభ్యంతరం చేసేవాడెవడూ లేడు మరియు ఆయనకు బలవంతం చేసేవాడెవడూ లేడు. ఓ ప్రవక్తా మీపై అవతరింపబడినది యూదులకు హద్దును అతిక్రమించటం మరియు నిరాకరించటమును తప్ప దేనిని అధికం చేయలేదు. ఇది వారి అసూయ వలన. మరియు మేము యూదుల వర్గముల మధ్య శతృత్వమును,ద్వేషమును వేశాము. వారు ఎప్పుడైన యుద్ధం కొరకు సమావేశమై దాని కొరకు సిద్ధం అవుతారో లేదా దాన్ని మండించటానికి కుట్రలు పన్నుతారో అల్లాహ్ వారి సమూహమును వేరు చేశాడు. మరియు వారి బలమును తొలగించాడు. వారు ఇస్లామును తప్పు పట్టటానికి మరియు దాని కొరకు కుట్రలు పన్నటానికి క్రమం తప్పకుండా భూమిలో ఉపద్రవాలను తలపెట్టే విషయంలో ప్రయత్నాలు చేశారు. మరియు అల్లాహ్ ఉపద్రవాలను తలపెట్టేవారిని ఇష్టపడడు.

(65) మరియు ఒక వేళ యూదులు మరియు క్రైస్తవులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన దాన్ని విశ్వసించి మరియు పాప కార్యముల నుండి దూరంగా ఉండి అల్లాహ్ కు భయపడి ఉంటే మేము వారు పాల్పడిన పాపములను వారి నుండి ప్రక్షాళణ చేస్తాము ఒక వేళ అవి అధికంగా ఉన్నా సరే. మరియు మేము వారిని ప్రళయదినమున అనుగ్రహాలు కల స్వర్గ వనముల్లో ప్రవేశింపజేస్తాము. వారు అందులో ఉన్న అంతము కాని సుఖభోగాలను అనుభవిస్తారు.

(66) మరియు ఒక వేళ యూదులు తౌరాతులో ఉన్న దాని ప్రకారం ఆచరిస్తే మరియు క్రైస్తవులు ఇంజీలులో ఉన్న దాని ప్రకారం ఆచరిస్తే మరియు వారందరు తమపై అవతరింపబడిన ఖుర్ఆన్ ప్రకారం ఆచరిస్తే నేను వారి కొరకు ఆహారోపాధి కారకాలైన వర్షమును కురిపించటం మరియు భూమిని మొలకెత్తించటమును శులభతరం చేస్తాము. గ్రంధవహుల్లోంచి కొంత మంది సత్యముపై సరిగా, నిలకడగా ఉన్నారు. వారిలో నుండి చాలా మంది ఆచరణ వారి విశ్వాసం లేకపోవటం వలన చెడుగా ఉన్నది.

(67) ఓ ప్రవక్తా మీ ప్రభువు వద్ద నుండి మీ వైపునకు అవతరింపబడిని దాన్ని పరిపూర్ణంగా తెలియపరచండి. అందులో నుంచి ఏదీ మీరు దాయకండి. ఒక వేళ మీరు అందులో నుండి ఏదైన దాచితే మీరు మీ ప్రభువు సందేశమును చేరవేసినవారు కాదు. (వాస్తవానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు చేరవేయమని ఆదేశించిన వాటన్నింటిని చేరవేశారు. అయితే ఎవరైన దీనికి విరుద్ధంగా భావిస్తే అది అల్లాహ్ పై పెద్ద నిందే.) ఈ రోజు తరువాత అల్లాహ్ మిమ్మల్ని ప్రజల నుండి కాపాడుతాడు. వారు మీకు చెడును కలిగించలేరు. సందేశములను చేరవేయటం మాత్రం మీపై బాధ్యత కలదు. సన్మార్గమును కోరని అవిశ్వాసపరులకు అల్లాహ్ సన్మార్గమును పొందే భాగ్యమును కలిగించడు.

(68) ఓ ప్రవక్తా మీరు ఇలా తెలియపరచండి : ఓ యూదులు మరియు క్రైస్తవులారా మీరు తౌరాతులో మరియు ఇంజీలులో ఉన్నవాటిని మరియు మీపై అవతరింపబడినటువంటి ఖుర్ఆన్ ను దాన్ని విశ్వసిస్తేనే మరియు దానిలో ఉన్నవాటిని ఆచరిస్తేనే తప్ప మీ విశ్వాసము సరికాదు ఆచరించనంత వరకు మీరు గుర్తించబడిన ధర్మము పై లేరు. మరియు గ్రంధవహుల్లోంచి చాలా మందిని వారికి ఉన్న అసూయ వలన మీ ప్రభువు తరుపు నుండి మీపై అవతరింపబడినది తలబిరుసుతనంపై తలబిరుసుతనాన్ని మరియు అవిశ్వాసంపై అవిశ్వాసమును అధికం చేస్తుంది. కావున మీరు ఈ అవిశ్వాసపరులందరిపై విచారించకండి ఎందుకంటే మిమ్మల్ని అనుసరించే విశ్వాసపరుల్లో వారి అవసరం లేకుండా చేసింది.

(69) నిశ్ఛయంగా విశ్వాసపరులు,యూదులు,కొంతమంది ప్రవక్తలను అనుసరించిన వారిలో నుంచి ఒక వర్గమైన సాబియీలు మరియు క్రైస్తవులు వారిలో నుండి ఎవరైనా అల్లాహ్ పై మరియు అంతిమ దినముపై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేస్తే తాము ఎదుర్కొనే వాటి విషయంలో వారిపై ఎటువంటి భయం ఉండదు. మరియు ప్రాపంచిక భాగముల్లోంచి తాము కోల్పోయిన వాటిపై వారికి దుఃఖము కలగదు.

(70) నిశ్చయంగా మేము ఇస్రాయీలు సంతతి వారితో వినటం మరియు విధేయత చూపటం పై దృఢమైన ప్రమాణములను తీసుకున్నాము. మరియు మేము అల్లాహ్ షరీఅత్ ను వారికి చేరవేయటానికి వారి వైపు ప్రవక్తలను పంపించాము. అయితే వారు తమతో తీసుకోబడిన వాటిలో నుండి భంగపరిచారు. మరియు తమ మనో వాంఛలు నిర్దేశించినటువంటి తమ వద్దకు తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటి నుండి విముఖత చూపటం మరియు వారిలో నుండి కొందరిని తిరస్కరించటం మరియు కొందరిని హతమర్చటంను అనుసరించారు.

(71) వారు తమ ప్రమాణాలను భంగపరచటం, నిబంధనలను కాలరాయడం, సత్యాన్ని తిరస్కరించటం, ప్రవక్తలను హతమార్చటం వారికి ఎటువంటి హాని తలపెట్టదని భావించారు. కాని వారు ఊహించని విదంగా వారిపై శిక్ష పడుతుంది. వారు సత్యాన్ని చూడలేని అంధులైపోయారు. దాని వైపునకు వారు దిశానిర్దేశం పొందలేరు. వారు దాన్ని స్వీకరించే ఉద్ధేశముతో వినకుండా చెవిటి వారైపోయారు. అల్లాహ్ తన తరుపు నుండి అనుగ్రహంగా వారి పశ్చాత్తాపమును స్వీకరించాడు. వారు దాని తరువాత సత్యం నుండి అంధులైపోయారు. దానిని వినడం నుండి చెవిటి వారైపోయారు. ఇలా వారిలో చాలా మందికి సంభవించింది. అల్లాహ్ వారి కర్మలన్నింటిని వీక్షిస్తున్నాడు. ఆయన నుండి ఏ వస్తువూ గోప్యంగా లేదు. తొందరలోనే దాని ప్రకారమే వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

(72) నిశ్చయంగా – అల్లాహ్ కానటువంటి మర్యం కుమారుడైన ఈసాహ్ మసీహ్ ని “ఈయనే అల్లాహ్” అని ఆయనకు దైవత్వమును ఆపాదించి – క్రైస్తవులు అవిశ్వాసులై పోయారు. (వాస్తవం ఏమిటంటే) మర్యమ్ కుమారుడైన మసీహ్ అలైహిస్సలాం స్వయంగా వారితో అన్నారు : ఓ ఇస్రాయీలు సంతతివారా మీరు ఏకైకుడైన అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడా. మనమందరం ఆయన ఆరాధన చేయటంలో సమానులం. ఎందుకంటే ఇతరులను అల్లాహ్ తో పాటు సాటి కల్పించే వాడిపై స్వర్గంలో ప్రవేశించుటను అల్లాహ్ శాశ్వతంగా నిషేధించాడు. మరియు నరకాగ్నియే అతని నివాస స్థలము. అల్లాహ్ వద్ద అతనికి తోడ్పడేవారు, సహాయపడేవారు ఎవరూ ఉండరు. అతని కోసం వేచి ఉన్న శిక్ష నుండి రక్షించే రక్షకుడు ఎవడూ ఉండడు.

(73) "అల్లాహ్ అంటే ముగ్గురి కలయిక, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ” అని పలికే వారు (క్రైస్తవులు) నిశ్చయంగా అవిశ్వాసపరులైపోయారు. వారి ఈ మాటకంటే అల్లాహ్ ఎంతో ఉన్నతుడు. అల్లాహ్ అనేకుల సమ్మేళనం కాదు. ఆయన ఏకైకుడు. నిశ్చయంగా ఆయన ఎటువంటి సాటి లేని ఒకే ఆరాధ్య దైవము. ఈ భయంకరమైన మాటలను విడనాడక పోతే వారికి బాధాకరమైన శిక్ష చేరుతుంది.

(74) వీరందరు అల్లాహ్ తో పశ్చాత్తాప్పడుతూ, ఆయనతో తాము చేసిన షిర్క్ నుండి క్షమాపణ వేడుకుంటూ తమ మాటల నుండి ఎందుకు మరలటం లేదు. మరియు ఏ పాపము చేసిన వాడైన, ఒక వేళ అది ఆయనను అవిశ్వసించిన పాపమైనా సరే క్షమాపణ వేడుకుంటే మన్నించే వాడును, విశ్వాసపరుల పై కరుణించే వాడును.

(75) మర్యమ్ కుమారుడగు ఈసా మసీహ్ ప్రవక్తల్లోంచి ఒక ప్రవక్త మాత్రమే. వారికి మరణం వచ్చినట్లే ఈయనకు మరణం వస్తుంది. మరియు అతని తల్లి, మర్యం అలైహస్సలాం, చాలా నిజాయతీ పరురాలు, సత్యాన్ని స్వీకరించే స్త్రీ. వారిద్దరు తమకు భోజన అవసరముంది కాబట్టి తింటున్నారు. భోజన అవసరమున్న వారు ఎలా దైవాలవుతారు ?. ఓప్రవక్తా! ఏకత్వమును నిరూపించే ఆయతులను మేము ఏవిధంగా వివరిస్తున్నామో, అల్లాహేతరుల కొరకు దైవత్వం అపాదించే విషయంలో వారి హద్దు మీరిన ప్రవర్తన అసత్యమన్న విషయంలో మీరు యోచనతో దృష్టిని సారించండి. అయినా కూడా వారు ఈ ఆయతులను తిరస్కరిస్తున్నారు. అల్లాహ్ ఏకత్వమును నిరూపించే స్పష్టమై ఆయతులు ఉన్నా కూడా వారు సత్యం నుండి ఏ విదంగా మరలిపోతున్నారో మరల మీరు యోచనతో దృష్టిని సారించండి.

(76) ఓ ప్రవక్త వారి అల్లాహేతరుల ఆరాధన విషయంలో వారికి వ్యతిరేకంగా ఆధారం చూపుతూ ఇలా తెలపండి : మీకు లాభం చేకూర్చలేని, మీ నుండి నష్టమును దూరం చేయలేని, నిస్సహాయులైన వారిని మీరు ఆరాధిస్తారా? అల్లాహ్ నిస్సహాయం నుండి పరిశుద్ధుడు. అల్లాహ్ ఒక్కడే మీ మాటలను ఆలకిస్తున్నాడు, వాటిలో నుంచి ఏది కూడా ఆయన నుండి తప్పి పోదు. మీ కర్మలను తెలుసుకునేవాడు, వాటిలో నుండి ఏది కూడా ఆయన పై గోప్యంగా ఉండదు. తొందరలోనే వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

(77) ఓ ప్రవక్తా, క్రైస్తవులకు తెలపండి, సత్యాన్ని అనుసరించటం గురించి మీకు ఆదేశించబడిన విషయంలో మీరు హద్దుమీరకండి. ఎవరిని గౌరవించమని మీకు ఆదేశించడం జరిగిందో వారిని గౌరవించటంలో అతిక్రమించకండి. ఉదాహరణకు ప్రవక్తల విషయంలో, మీరు మర్యం కుమారుడైన ఈసా విషయంలో చేసినట్లుగా, ప్రవక్తలకూ దైవత్వం ఉన్నదని మీరు విశ్వసించారు. కారణం, మార్గభ్రష్టులైన మీ పూర్వికులను మీరు అనుసరించటం. వారు చాలా మంది ప్రజలను మార్గభ్రష్టులు చేశారు మరియు వారు కూడా సత్యమార్గము నుండి తప్పి పోయారు.

(78) అల్లాహ్ దావూద్ పై అవతరింపజేసిన గ్రంధం జబూరులో,మర్యం కుమారుడగు ఈసా పై అవతరింపజేసిన గ్రంధం ఇంజీలులో ఇస్రాయీల్ సంతతిలో నుంచి సత్య తిరస్కారులైన వారిని తన కారుణ్యం నుండి ధూత్కరించాడని సమాచారమిస్తున్నాడు.వారు చేసిన పాపాలు,అల్లాహ్ గౌరవ ప్రధమైన విషయాల్లో హద్దు మీరటం కారుణ్యం నుండి ఈ ధూత్కారమునకు కారణం.

(79) వారిలోని కొందరు కొందరిని పాపాలకు పాల్పడటం నుండి వారించే వారు కాదు,అంతే కాదు వారిలోంచి పాపాత్ములు తాము చేసే పాపాలను,చెడులను బహిర్గంగా చేసేవారు.ఎందుకంటే వారిని ఆపేవాడు ఎవడూ ఉండేవాడు కాదు.వారు చెడును నిర్మూలించటంను వదిలిపెట్టే కార్యం ఎంతో చెడ్డదైనది.

(80) ఓ ప్రవక్తా ఈ యూదుల్లోంచి చాలా మంది అవిశ్వాసపరులు అవిశ్వాసపరులను ఇష్టపడటమును,వారి వైపునకు వాలటంను మీరు చూస్తారు.వారు మీతో శతృత్వమునకు పాల్పడుతారు. మరియు ఒకే దైవాన్ని విశ్వసించే వారితో శతృత్వమునకు పాల్పడుతారు.సత్య తిరస్కారులతో వారి చెలిమి దేనినైతే వారు ముందు పంపించుకున్నారో అది చెడ్డది.అది వారి పై అల్లాహ్ యొక్క ఆగ్రహం కురవటానికి,ఎల్లప్పటికీ వారిని ఆయన నరకంలో ప్రవేశింపజేయటానికి కారణమైనది.వారు దాని నుండి ఎన్నటికి బయటకు రాలేరు.

(81) మరియు ఒక వేళ ఈ యూదులందరు నిజంగా అల్లాహ్ పై విశ్వాసమును చూపితే,ఆయన ప్రవక్తపై విశ్వాసమును చూపితే వారు బహుదైవారాధకులను విశ్వాసపరులను వదిలి వారి వైపునకు మగ్గుతూ,వారిని ఇష్టపడుతూ స్నేహితులుగా చేసుకోరు.ఎందుకంటే వారు సత్య తిరస్కారులను స్నేహితులుగా చేసుకోవటం నుండి వారించబడ్డారు.కాని చాలా మంది ఈ యూదులు అల్లాహ్ విధేయత నుండి,ఆయన స్నేహం నుండి,మరియు విశ్వాసుల స్నేహం నుండి దూరమైపోయారు.

(82) ఓ ప్రవక్త మీపై,మీరు తీసుకుని వచ్చిన దానిపై విశ్వాసమును కనబరచిన వారిపట్ల ప్రజలందరిలోకల్ల యూదులను వారిలో ఉన్న ద్వేషం,అసూయ,అహంకారము వలన మరియు విగ్రహారాధకులను,అల్లాహ్ తోపాటు సాటి కల్పించే ఇతరులను శతృత్వమును ప్రదర్శించటం మీరు చూస్తారు.మీపై,మీరు తీసుకుని వచ్చిన దానిపై విశ్వాసమును కనబరిచే వారికి అత్యంత సన్నిహితులుగా వారిలో నుంచి కొందరిని మీరు పొందుతారు.వారు తమను నసారా (సహాయకులు) అని చెప్పుకుంటారు.వీరందరు ఈ విశ్వాసపరులకి సన్నిహితులు,ఎందుకంటే వారిలో మతాచర్యులు (పండితులు), ఆరాధకులు ఉన్నారు.వారు గర్వఅహంకారాలు లేని వినయవినమ్రతలు కలవారు.ఎందుకంటే గర్వఅహంకారము కలవాడి మనస్సులో మేలు అన్నది చేరదు (ఉండదు).

(83) నజాషీ,ఆయన సహచరులు లాంటి వీరందరూ మృధువైన హృదయం కలవారు.వారు అవతరింపబడిన ఖుర్ఆను ను విన్నప్పుడు ఈసా తీసుకుని వచ్చిన గ్రంధం పట్ల జ్ఞానం ఉండటం వలన అది సత్యమని గుర్తించినప్పుడు అణుకువతో ఏడవ సాగారు.వారంటారు ఓ మా ప్రభూ నీవు నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింప జేసిన దానిని మేము విశ్వసిస్తున్నాము.నీవు మమ్మల్ని ప్రళయ దినాన ప్రజలపై వాదించే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జాతి వారితో పాటు వ్రాయి.

(84) మరియు మా మధ్య అల్లాహ్ పై,ఆయన అవతరింపజేసి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకుని వచ్చిన సత్యం పై విశ్వాసం మధ్య ఏ కారణం చేరుతుంది.వాస్తవానికి మేము దైవ ప్రవక్తలతో పాటు,అల్లాహ్ శిక్షకు భయపడుతూ,ఆయనకు విధేయత చూపుతూ దైవ ప్రవక్తలను అనుసరించే వారితో పాటు స్వర్గంలో ప్రవేశించాలని ఆశిస్తున్నాము.

(85) సత్యాన్ని స్వీకరించి,దానిపై వారు విశ్వాసమును కనబరచటానికి ప్రతి ఫలంగా వారికి అల్లాహ్ భవనాల,వృక్షాల క్రింది నుంచి కాలువలు ప్రవహించే స్వర్గ వనాలను ప్రసాదించాడు. వాటిలో వారు ఎల్లప్పుడు ఉంటారు.సత్యాన్ని అనుసరించి ఎటువంటి పరిమితి లేదా షరతు లేకుండా దానికి కట్టుబడి ఉండటం వలన సజ్జనులకు ఈ ప్రతిఫలము ప్రసాదించటం జరిగింది.

(86) అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై అవిశ్వాసమును కనబరిచేవారు,అల్లాహ్ తన ప్రవక్త పై అవతరింపజేసిన ఆయతులను తిరస్కరించే వారందరు రగులుతున్న నరకాగ్నిలో పడి ఉంటారు.వారు ఎన్నటికీ దాని నుండి బయటకు రాలేరు.

(87) ఓ విశ్వాసపరులారా తినే ఆహారములో నుంచి,త్రాగే పానియాల్లో నుంచి,స్తీలలో నుంచి కోరికలను తీర్చే ధర్మసమ్మతమైన వాటిని సన్యాసంగా లేదా ఆరాధనగా నిషేదించుకోకండి.అల్లాహ్ మీ పై నిషేదించిన వాటి హద్దులను అతిక్రమించకండి.నిశ్చయంగా అల్లాహ్ తన హద్దులను అతిక్రమించే వారిని ఇష్టపడడు.అంతే కాక వారిని ధ్వేషిస్తాడు.

(88) అల్లాహ్ మీవద్దకు తీసుకుని వచ్చిన తన ఆహారములో నుంచి పరిశుద్ధమైనవి,ధర్మసమ్మతమైనవిగా ఉన్నప్పుడు మీరు తినండి.అంతేకాని నిషేధించబడిన వాటిని తినకండి. ఉదాహరణకు బలవంతాన తీసుకోవబడినది,చెడ్డదైనది.అల్లాహ్ ఆదేశాలను పాటించటంలో ఆయన వారించిన వాటికి దూరంగా ఉండటంలో అల్లాహ్ కి భయపడుతూ ఉండండి.ఆయన పైనే మీరు విశ్వాసమును కనబరుస్తున్నారు.ఆయనపై మీ యొక్క విశ్వాసము ఆయనకు భయపడటంను మీపై తప్పనిసరి చేస్తుంది.

(89) ఓ విశ్వాసపరులారా ఉద్దేశ్యపూర్వకంగా కాకుండా మీ నోటా వెలువడే ప్రమాణాలకు అల్లాహ్ లెక్కతీసుకోడు. కావాలని ఉద్దేశ్యపూర్వకంగా మనస్పూర్తిగా మీరు చేసే ప్రమాణాలకు ,ప్రమాణాలను విరగ్గొట్టటం గురించి లెక్క తీసుకుంటాడు.ఉద్దేశ్యపూర్వకంగా మీరు చేసిన ప్రమాణపు పాపమును ,దానిని మీ నోటితో పలికి దానిని భంగపరచినప్పుడు మూడు వస్తువుల్లోంచి ఏదైన ఒక దానిని ఎంచుకుని పూర్తి చేస్తే పాపమును తుడిచి వేస్తుంది.అవి పది మంది నిరు పేదలకు మీ ప్రాంతములో తినే ఆహారములో నుంచి మధ్యరకపు భోజనం తినిపించడం,ప్రతి మనిషికి సగం సా (1.25 కిలోలు) లేదా వారికి అక్కడ వాడకంలో ఉన్న బట్టలను తొడిగించటం లేదా ఒక విశ్వాసపరుడైన బానిసను విముక్తి కలిగించటం.తన ప్రమాణ పరిహారమును చెల్లించే వ్యక్తి ఈ మూడింటిలోంచి ఏదీ పొందకపోతే మూడు రోజుల ఉపవాసములను పరిహారంగా ఉండాలి. ఓ విశ్వాసపరులారా మీరు అల్లాహ్ పై ప్రమాణం చేసి భంగపరచినప్పుడు తెలియపరచిన ఇదే మీ ప్రమాణాల పరిహారము.మీ ప్ఱమాణాలను కాపాడుకోండి అల్లాహ్ పై అబద్దపు ప్రమాణాలు చేయకుండా,అల్లాహ్ పై అధిక ప్రమాణాలు చేయకుండా,ఏ ప్రమాణంలో మేలున్నదో అటువంటి ప్రమాణాన్ని భంగపరచకుండా.మీరు మంచిని చేయండి.ప్రమాణాల పరిహారమును అల్లాహ్ మీకు తెలిపిన విదంగా చెల్లించండి.అల్లాహ్ హలాల్ హరామ్ గురించి తన స్పష్టమైన ఆదేశాలను మీ కొరకు వివరిస్తున్నాడు.బహుశా మీరు అల్లాహ్ మీకు తెలియని విషయాలను తెలియపరచినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటారని.

(90) ఓ విశ్వాసపరులారా మతిని పోగొట్టే మత్తు పదార్దం (ముస్కిర్),ఇరువైపుల నుండి ప్రత్యామ్నాయాన్ని కలిగి ఉన్న జూదము,విగ్రహారాధకులు జంతువులను బలి ఇవ్వటానికి గౌరవంగా ఏర్పాటు చేసుకున్న లేదా ఆరాధన కోసం పాతిపెట్టుకున్న రాళ్ళు,తమ కోసం నిర్ధారించబడిన అగోచర విషయాలను వేటి ద్వారా నైతే అన్వేషిస్తారో ఆ బాణాలు ఇవన్ని షైతాను అలంకరించిన పాప కార్యాలు.అయితే మీరు గౌరవప్రదమైన జీవితము ద్వారా,పర లోకములో స్వర్గ వనాల అనుగ్రహాల ద్వారా సాఫల్యం పొందటం కొరకు వాటి నుండి దూరంగా ఉండండి.

(91) షైతాను ఉద్దేశం మాత్రం మత్తు పదార్దాల ద్వారా,జూదము ద్వారా హృదయాల మధ్య ధ్వేషాలను,వైరాలను వేయటం,అల్లాహ్ ధ్యానము నుండి మరలించటం.ఓ విశ్వాసపరులారా మీరు ఈ చెడులను వదిలేస్తారా?.ఇది (వదిలి వేయటం) మీకు తగినదని చెప్పడంలో సందేహం లేదు.అయితే మీరు వాటిని వదిలి వేయండి.

(92) మీరు ధర్మ ఆదేశాలను పాటించి,అది (ధర్మము) వారించిన వాటికి దూరంగా ఉండి అల్లాహ్ కు,ప్రవక్తకు విధేయత చూపండి.వ్యతిరేకతకు దూరంగా ఉండండి.ఒక వేళ మీరు దీని నుండి విముఖత చూపితే మన ప్రవక్తపై అల్లాహ్ చేరవేయమని ఇచ్చిన ఆదేశాలను చేరవేసే బాధ్యత మాత్రమే అన్న విషయాన్ని తెలుసుకోండి.ఆయన చేరవేసేశారు.ఒక వేళ మీరు సన్మార్గమును స్వీకరిస్తే అది మీ స్వయం కొరకు.ఒక వేళ మీరు చెడు చేస్తే దాని ప్రకారం (ప్రతి ఫలం) ఉంటుంది.

(93) అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ఆయన సన్నిదిని పొందటానికి సత్కార్యాలు చేసినవారిపై అల్లాహ్ ఆగ్రహం తమపై కురుస్తుందని భయపడి ఆయనపై విశ్వాసమును కనబరుస్తూ,సత్కార్యములను చేస్తూ నిషేదించబడిన వాటికి దూరమైనప్పుడు మధ్యమును నిషేదించబడక మునుపు సేవించిన దానికి ఎటువంటి దోషం లేదు.ఆ తరువాత వారు అల్లాహ్ సన్నిదిని ఎంతవరకు పొందారంటే అల్లాహ్ ను ప్రత్యక్షంగా చూస్తున్నట్లు ఆరాధించసాగారు.అల్లాహ్ తనను ప్రత్యక్షంగా చూస్తున్న భావనతో ఆరాధన చేసేవారిని ఇష్టపడుతాడు.వారిలో అల్లాహ్ యొక్క పర్యవేక్షణ భావన ఎల్లప్పుడు ఉండటం వలన అది విశ్వాసపరునికి తన ఆచరణను ఉత్తమంగా,నైపుణ్యతతో చేయటానికి తోడ్పడుతుంది.

(94) ఓ విశ్వాసపరులారా అల్లాహ్ మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేట జంతువులను మీ వద్దకు తీసుకుని వచ్చి మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాడు.వాటిలోంచి చిన్న వాటిని మీ చేతులతో,పెద్దవాటిని మీ ఈటెలతో పొందుతారు.అల్లాహ్.దాశుల్లోంచి ఎవరు ఆయనను చూడకుండానే ఆయనపై,ఆయన జ్ఞానం పట్ల సంపూర్ణ విశ్వాసం వలన ఆయనతో భయపడుతాడో,తన కార్యం తన సృష్టికర్తపై గోప్యంగా ఉండదని భయపడి వేటను ఆపుకుంటాడో అల్లాహ్ తన ఆవిర్బావ జ్ఞానము ద్వార తెలుసుకుని దాని ప్రకారం లెక్క తీసుకుంటాడు.ఎవరైతే హద్దుమీరి ప్రవర్తిస్తాడో,హజ్,ఉమ్రా ఇహ్రామ్ స్ధితిలో వేటాడుతాడో అతని కొరకు ప్రళయ దినాన బాధాకరమైన శిక్ష ఉన్నది.ఎందుకంటే అతను అల్లాహ్ వారించిన దానిని చేసి వ్యతిరేకతను చూపాడు.

(95) ఓ విశ్వాసపరులారా మీరు హజ్ లేదా ఉమ్రా ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేట జంతువులను చంపకండి.మీలో నుంచి ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా దానిని చంపితే అతనిపై తాను చంపిన జంతువునకు సమానమైన జంతువు ఒంటె,ఆవు,గొర్రెలో నుంచి పరిహారంగా చెల్లించటం ఆవశ్యం.దాని గురించి ముస్లిముల మధ్య న్యాయవంతులైన ఇద్దరు వ్యక్తులు తీర్పునిస్తారు.వారిద్దరు నిర్ణయించేది చేయాలి.పరిహారంగా ఇచ్చే ఖుర్బానీని మక్కాకు చేరవేసి హరమ్లో దానిని జుబాహ్ చేయాలి లేదా దాని విలువగల భోజనమును హరమ్ ప్రాంతపు పేదవారికి ఏర్పాటు చేయాలి.ప్రతి పేదవానికి సగం సా (1.25కిగ్రా) ఇవ్వాలి లేదా ప్రతి సగం సా కి బదులుగా ఒక రోజు ఉపవాసముండాలి.ఇదంతా వేట జంతువుని చంపిన వ్యక్తి తాను దానిని చంపటానికి ముందడుగు వేసినందుకు శిక్షను అనుభవించటం కొరకు.వేట జంతువును చంపటంను నిషేదించక మునుపు ఇహ్రామ్ వేసుకున్న వ్యక్తి చంపిన దానిని అల్లాహ్ మన్నించి వేశాడు.నిషేదము తరువాత దానిని చేసేవాడిని అల్లాహ్ శిక్షిస్తూ ప్రతీకారం తీసుకుంటాడు.మరియు అల్లహ్ బలవంతుడును,ఆపేవాడును తనపై విధేయత చూపే వారిని తాను తలచుకుంటే ప్రతీకారం తీసుకోవటం అతని శక్తిలోంచే.దాని నుంచి ఎవరు ఆయనను ఆపలేరు.

(96) అల్లాహ్ మీ కొరకు నీటి జంతువుల వేటను ధర్మ సమ్మతం చేశాడు.మరియు సముద్రం మీ కొరకు జీవించి ఉన్న దానిని లేదా మరణించిన దానిని బయటకు విసిరేస్తే మీలో నుంచి ప్రయాణంలో ఉన్నవారి కొరకు,ప్రయాణంలో లేని వారి కొరకు దానిని ఆహార సామగ్రిగా చేసుకోవటం ప్రయోజనకరమైనది.మీరు హజ్ లేదా ఉమ్రా ఇహ్రామ్ స్థితిలో ఉన్నంత వరకు అడవి జంతువుల వేటను ఆయన మీపై నిషేదించాడు.అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉంటూ ఆయన పట్ల భయభీతిని కలిగి ఉండండి.ప్రళయ దినాన ఆయన ఒక్కడి వైపునే మీరు మరలించబడుతారు.ఆయన మీ కర్మల పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

(97) గౌరవప్రద గృహమైన కాబాను అల్లాహ్ మానవుల కొరకు నివాసంగా చేశాడు.వారి మతపరమైన ఆసక్తులు : నమాజు,హజ్,ఉమ్రా అక్కడే నిర్వహించబడుతాయి.మరియు ప్రాపంచిక ఆసక్తులు : హరమ్ (నిషిద్ద ప్రాంతం) లో శాంతిని (కార్యాలు) నెలకొల్పటం, దాని వైపు అన్ని రకాల ఫలాలలను తీసుకుని రావటం జరుగుతుంది.వారి కొరకు నిషిద్ద మాసములైన జీఖాఅద,జిల్ హిజ్జ,ముహర్రం,రజబ్ మాసములను అందులో వారికి శాంతిని కలిగించి నివాసం కొరకు చేశాడు.హదీ పశువులను మెడలో పట్టాలు వేసిన జంతువులను హరమ్ ప్రాంతమునకు తీసుకుని వెళ్ళటం వలన ఆ జంతువుల యజమానులకు ఎటువంటి బాధను కలిగించకుండా ఉండటం ద్వారా శాంతిని కలిలిగించి వారి కొరకు మనుగడ సాధనంగా చేశాడు.భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తము గురించి అల్లాహ్ కు తెలుసని ,అల్లాహ్ ప్రతీది తెలిసిన వాడని మీరు తెలుసుకోవాలని మీ పై ఈ ఉపకారాలను చేశాడు.ఆయన శాసనాలు దీని కొరకే.మీ కొరకు ఆసక్తులను తీసుకు రావటానికి,మీకు నష్టం వాటిల్లక ముందే మీ నుండి నష్టమును ఆపటానికి,దాసుల కొరకు ఉపయోగ కరమైన ఆయన జ్ఞానమునకు రుజువు.

(98) ఓ ప్రజలారా అల్లాహ్ తనపై అవిధేయతకు పాల్పడే వాడిని కఠినంగా శిక్షించే వాడని,పశ్చ్యాత్తాప్పడే వాడిని క్షమించే వాడని,అతని పట్ల కరుణ కల వాడని మీరు తెలుసుకోండి.

(99) అల్లాహ్ ఏ సందేశాలను చేరవేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు ఆదేశించాడో వాటిని చేరవేయటం ఒక్కటే ఆయన బాధ్యత. ప్రజలను సన్మార్గము పై నడిచే సౌభాగ్యం కలిగించటం ఆయన బాధ్యత కాదు.అది ఒక్కడైన అల్లాహ్ చేతిలోనే ఉన్నది.సన్మార్గము,మార్గభ్రష్టత దేనినైతే మీరు బహిర్గతం చేస్తున్నారో,గోప్యంగా ఉంచుతున్నారో అల్లాహ్ కు బాగా తెలుసు. తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

(100) ఓ ప్రవక్త మీరు తెలియ పరచండి : ఒక వేళ అపవిత్రమైన వస్తువుల ఆధిక్యత మీకు ఎంత బాగా నచ్చినప్పటికి అపవిత్రమైన వస్తువులన్ని పవిత్రమైన వస్తువులన్నింటికి సరితూగలేవు.ఎందుకంటే వాటి ఆధిక్యత వాటిని గొప్పవిగా చేయలేవు.ఓ వివేకవంతులారా స్వర్గము ద్వారా మీరు సాఫల్యము చెందుట కొరకు అపవిత్రమైన వాటిని విడనాడి పవిత్రమైన వాటిని చేసి అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. బహుశా మీరు స్వర్గమును పొంది సాఫల్యమును పొందుతారు.

(101) ఓ విశ్వాసపరులారా మీరు ప్రవక్తని మీకు అనవసరమైన విషయాల గురించి అడగకండి అవి మీ ధర్మ విషయాల్లో మీకు తోడ్పడవు. ఒక వేళ వాటిని మీ కొరకు బహిర్గతం చేస్తే అందులో ఉన్న కష్టము వలన మీకు చెడుగా అనిపిస్తాయి. ప్రశ్నించడం గురించి మీకు వారించబడిన ఈ విషయాల గురించి మీరు ప్రవక్తపై వహీ అవతరించే వేళ అడిగితే వాటి గురించి మీకు విశదపరచవచ్చు. ఇది అల్లాహ్ పై ఎంతో శులభమైనది. అల్లాహ్ వదిలి వేసిన విషయాల గురించి ఖుర్ఆన్ మౌనం వహించింది. అయితే మీరు వాటి గురించి అడగకండి. ఒక వేళ మీరు వాటి గురించి అడిగితే వాటిని పాటించే ఆదేశం మీపై అవతరిస్తుంది. మరియు అల్లాహ్ తన దాసుల పాపములను వారు పశ్చాత్తాపము పడినప్పుడు మన్నించేవాడును. వాటి వలన వారిని శిక్షించటం నుండి ఆయన దయ కలవాడును.

(102) మీకన్న పూర్వం గతించిన వారు ఇలాంటి విషయాల గురించి అడిగారు.వారిపై పాటించటం తప్పనిసరి అయినప్పుడు వారు వాటిని ఆచరించలేదు.అంచేత వారు సత్య తిరస్కారులైపోయారు.

(103) అల్లాహ్ జంతువులను ధర్మసమ్మతం (హలాల్) చేశాడు.ఆయన విగ్రహారాధకులు తమ విగ్రహాల కొరకు తమ పై నిషేదించుకున్న జంతువులను నిషేదించ లేదు.అవి బహీరహ్ :నిర్దిష్ట సంఖ్యను జన్మనిచ్చిన ఒంటే.దాని చెవి కోయబడుతుంది.సాయిబహ్ :నిర్దిష్ట వయస్సుకు చేరుకున్న ఒంటే వారి విగ్రహాల పేరు మీద వదిలివేయబడుతుంది.వసీలహ్ :ఒక సారి ఆడ ఒంటెను ఈని రెండవ సారి కూడా ఆడ ఒంటెనే ఈనిన ఒంటె దేవతల పేరు మీద వదిలి పెట్టబడుతుంది.హామ్ :అనేక ఒంటె పిల్లల పుట్టుకకు మూలంగా నిలిచిన మగ ఒంటే.కాని అల్లాహ్ ఈ తెలుపబడిన జంతువులను నిషేదించాడని సత్యతిరస్కారులు అల్లాహ్ పై అబద్దమును,నిందను అంటగడుతున్నారు.చాలామంది అవిశ్వాసపరులు సత్య,అసత్యాలు,హలాల్,హరాంల మధ్య వ్యత్యాసం చేయటం లేదు.

(104) జంతువుల్లోంచి కొన్ని జంతువులను నిషేధించుకోవటం వలన అల్లాహ్ పై అబద్దమును అంటగట్టిన వీరందరితో మీరు హలాల్,హరాంను తెలుసుకోవటం కొరకు అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్,ప్రవక్తగారి సున్నత్ వైపునకు తరలి రండి అని అన్నప్పుడు వారు మన పూర్వికులనుండి వారసత్వంగా పొందినవి,విశ్వాసాలు,మాటలు,కార్యాలు మనకు చాలు అని సమాధానమిచ్చారు.అవి వారికి ఎలా తగును.వాస్తవానికి వారి పూర్వికులందరికి ఏమి తెలియదు.వారికి సత్యమేదో తెలియదు.వారిని వారిలోంచి అందరికంటే ఎక్కువ అజ్ఞానులు,మార్గభ్రష్టులు మాత్రమే అనుసరిస్తారు.అయితే వారందరు అజ్ఞానులు,సన్మార్గము నుండి తప్పినవారు.

(105) ఓ విశ్వాసపరులారా మీరు మీ మనస్సులను అట్టిపెట్టుకుని ఉండండి (జాగ్రత్తగా ఉండండి).వాటిని సరిదిద్దే వాటిని పాటించటం ద్వారా వాటిని అట్టిపెట్టుకుని ఉండండి.మీరు సన్మార్గం పై ఉన్నంత వరకు ప్రజల్లోంచి మార్గభ్రష్టులు మిమ్మల్ని హాని తలపెట్టలేరు.వారు మీ మాట వినరు.మీరు మంచి గురించి ఆదేశించటం చెడు నుండి వారించటం కూడా మీరు సన్మార్గం పై ఉండటంలో నుంచే.ప్రళయదినాన మీరు మరలవలసింది ఒక్కడైన అల్లాహ్ వైపునకే.ఆయన మీరు ఇహలోకంలో చేసిన కార్యాల గురించి మీకు తెలియ పరుస్తాడు,వాటి పరంగానే ఆయన మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

(106) ఓ విశ్వాసపరులారా మరణ సూచనల్లోంచి ఏదైన సూచన బహిర్గతమై మీలో నుంచి ఎవరికైన మరణం ఆసన్నమైనప్పుడు తన వీలునామా వ్రాసేటప్పుడు ముస్లిముల్లోంచి న్యాయశీలులైన ఇద్దరిని సాక్షులగా నియమించుకోవాలి.లేదా ఒక వేళ మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు మీకు మరణం ఆసన్నమైతే సాక్షులుగా ముస్లిములు లేని పక్షంలో ఇద్దరు అవిశ్వాసపరులను సాక్షులుగా నియమించుకోవచ్చు.ఒక వేళ వారిద్దరి సాక్షంలో సందేహం కలిగితే వారిద్దరిని మీరు నమాజుల్లోంచి ఏదైన ఒక నమాజు తరువాత నిలబెట్టండి.వారిద్దరు దేనికీ బదులుగా అల్లాహ్ వద్ద ఉన్న తమ వాటాను అమ్ముకోము అని,దానికి బదులుగా ఏ దగ్గరి బందువును ఇష్టపడమని,తమ వద్ద ఉన్న అల్లాహ్ సాక్షాలను వేటినీ దాచి పెట్టమని వారిద్దరు అల్లాహ్ పై ప్రమాణం చేయాలి.ఒక వేళ వారిద్దరు ఇలా చేస్తే వారు అల్లాహ్ కొరకు పాపమును చేసిన వారు,అవిధేయతకు పాల్పడిన వారవుతారు.

(107) ఒక వేళ ప్రమాణం చేసిన తరువాత సాక్షంలో లేదా ప్రమాణంలో వారిద్దరి అసత్యం బట్టబయలైతే లేదా వారిద్దరి అవినీతి బహిర్గతమైతే మృతునికి దగ్గరి వారు ఇద్దరు వారిద్దరి స్థానంలో నిలబడి సత్యమేదో తెలిపి ప్రమాణం చేస్తూ సాక్షమివ్వాలి.వారిరువురు మా సాక్షము వారిద్దరి నీతి,నిజాయితి విషయంలో వారి సాక్షముకన్న వారి అసత్యము,అవినీతి విషయంలో ఎక్కువ హక్కు కలదని అల్లాహ్ పై ప్రమాణం చేయాలి.మరియు మేము అసత్యపు ప్రమాణం చేయలేదు.ఒకవేళ మేము అబద్దపు సాక్షం పలికితే మేము దుర్మార్గుల్లోంచి,అల్లాహ్ హద్దులను అతిక్రమించే వారిలో నుంచి అవుతాము.

(108) ఈ తెలియజేయబడిన ఆదేశము వారిరువురి సాక్షం విషయంలో సందేహం కలిగినప్పుడు నమాజు తరువాత ఇద్దరి సాక్షుల ప్రమాణంను తీసుకోవటం నుండి,వారిరువురి సాక్షమును రద్దుపరచడం నుండి సాక్షులిరువురు తమ తమ సాక్షమును ధర్మబద్దంగా ప్రవేశ పెట్టటానికి ఎంతో దోహదపడుతుంది.అయితే వారిరువురు సాక్షమును తారుమారు చేయరు,అవినీతికి పాల్పడరు.మరియు తాము ప్రమాణం చేసిన తరువాత వారసులు తమ సాక్షాలకు వ్యతిరేకంగా ప్రమాణం చేసి తమ ప్రమాణాలను రద్దు పరిస్తే తలదించుకోవలసి వస్తుందని వారిరువురు భయపడటానికి ఎంతో దోహద పడుతుంది.సాక్షం విషయంలో,ప్రమాణం చేసే విషయంలో,అబద్దమును,అవినీతిని విడనాడటం ద్వారా అల్లాహ్ కు భయపడండి.మీకు ఆదేశించబడిన వాటిని స్వీకరించే ఉద్దేశంతో మీరు వినండి.అల్లాహ్ తన విధేయత నుండి దూరం అయ్యేవారిని సన్మార్గమును పొందే సౌభాగ్యమును కలిగించడు.

(109) ఓ ప్రజలారా ప్రళయ దినాన అల్లాహ్ ప్రవక్తలందరిని సమావేశపరచినప్పటి వైనాన్ని గుర్తు చేసుకోండి అప్పుడు అల్లాహ్ వారితో ఇలా అంటాడు: మీరు ప్రవక్తలుగా ఎవరి వద్దకు పంపించబడ్డారో దాని గురించి వారి సమాధానమేమిటి ?.వారు అల్లాహ్ వైపునకు సమాధానమును అప్పజెప్పుతూ ఇలా అంటారు : దాని గురించి మనకు జ్ఞానం లేదు.నిశ్చయంగా జ్ఞానం నీ వద్దే ఉన్నది.ఓ మా ప్రభువా నీకొక్కడికే అగోచర విషయాల గురించి జ్ఞానము కలదు.

(110) అల్లాహ్ ఈసా అలైహిస్సలాం ను ఉద్దేశించి తెలిపిన వేళను మీరు గుర్తు చేసుకోండి : ఓ మర్యం కుమారుడగు ఈసా, తండ్రి లేకుండా నిన్ను పుట్టించి నీపై నేను చేసిన అనుగ్రహమును గుర్తు చేసుకో,నీ తల్లి మర్యం అలైహస్సలాం ను ఆమె కాలపు స్త్రీలపై ప్రాధాన్యతను ప్రసాదించి నేను చేసిన అనుగ్రహమును గుర్తు చేసుకో,నీ పై నేను కురిపించిన అనుగ్రహాల్లోంచి హజ్రత్ జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా నేను నీకు బలమును చేకూర్చిన నా అనుగ్రహమును గుర్తు చేసుకో,నీవు శిసువుగా ఉన్నప్పుడే అల్లాహ్ వైపున పిలుస్తూ ప్రజలతో సంభాషించినావు,నీవు పెద్దవాడైనప్పుడు మేము నీకు ఇచ్చి పంపించిన దైవదౌత్యం ద్వారా వారితో సంభాషించినావు,నేను నీకు వ్రాయటం నేర్పించటం ,మూసా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై నేను అవతరింపజేసిన తౌరాతును ,నేను నీపై అవతరింపజేసిన ఇంజీలును నేను నీకు నేర్పించటం,ధర్మ రహస్యాలను,దాని లాభాలను,దాని వివేచనాలను నేను నీకు నేర్పించటం నేను నీకు ప్రసాధించిన అనుగ్రహాల్లోంచివి.నీవు మట్టితో పక్షి రూపమును తయారు చేసి ఆ తరువాత నీవు అందులో ఊదితే అది పక్షిగా అవ్వటం,పుట్టుకతో అంధులుగా ఉన్న వారిని నీవు అతనిని అంధత్వం నుండి నయం చేయటం,నీవు కుష్ఠి రోగిని నయం చేసి మంచి మృధువైన చర్మం గల వారిగా చేయటం,మృతులను బ్రతికించమని అల్లాహ్ తో నీ దుఆ ద్వారా వారిని నీవు జీవింప చేయటం నేను నీకు ప్రసాదించిన అనుగ్రహాల్లోంచే.ఇవన్నీ నా ఆదేశంతోనే జరిగినవి.నీవు ఇస్రాయీలు సంతతి వద్దకు స్పష్టమైన మహిమలను తీసుకుని వచ్చినప్పుడు వారు నిన్ను హత్య చేయాలని పూనుకుంటే వారిని నీ నుండి ఆపటం నేను నీకు ప్రసాధించిన అనుగ్రహాల్లోంచే.అయితే వారు వాటిని తిరస్కరించారు.ఈసా తీసుకుని వచ్చినవి స్పష్టమైన మాయాజాలము అని వారన్నారు.

(111) నాపై,నీపై విశ్వాసమును కనబరచమని హవారీల మనస్సులో వేసి నీ కొరకు సహాయకులను ఏర్పాటు చేసి నేను నీకు ప్రసాదించిన ఆ అనుగ్రహాన్ని గుర్తు చేసుకో.అయితే వారు ఆ బాధ్యతను నెరవేర్చారు,స్వీకరించారు.మేము విశ్వసించాము అన్నారు.ఓ మా ప్రభువా మేము ముస్లిములయ్యామని,నీకు విధేయులయ్యామని నీవు సాక్షం పలుకు.

(112) ఆహారముతో నిండిన పళ్ళెమును ఆకాశము నుండి దింపమని నీవు నీ ప్రభువును దుఆ చేస్తే నీ ప్రభువు దింపగలడా అని హవారీలు కోరినప్పటి సంధర్భమును గుర్తు చేసుకోండి.అయితే ఈసా అలైహిస్సలాం వారిని అల్లాహ్ కు భయపడుతూ ఉండమని,వారు అడుగుతున్న కోరికను వదిలేయమని ఆదేసిస్తూ వారికి సమాధానమిచ్చారు.బహుశా అందులో వారి కొరకు పరీక్ష (ఫిత్నా) ఉన్నదేమో.మరియు ఆయన వారితో ఇలా అన్నారు : ఒక వేళ మీరు విశ్వాసపరులే అయితే మీ ఆహారమును కోరే విషయంలో మీ ప్రభువు పై నమ్మకమును కలిగి ఉండండి.

(113) హవారీలు ఈసా అలైహిస్సలాం తో ఇలా అన్నారు-: మేము ఈ పళ్లెము నుండి తినాలని,అల్లాహ్ సంపూర్ణ సామర్ధ్యం గురించి,మీరు ఆయన ప్రవక్త అని మా మనస్సులు సంత్రుప్తి చెందాలని,అల్లాహ్ వద్ద నుండి మీరు తీసుకుని వచ్చినది సత్యమని మనకు నమ్మకమైన జ్ఞానము కలగాలని,ఆ సమయంలో ప్రజల్లోంచి ఎవరు హాజరు కాలేదో వారి కొరకు దాని గురించి మేము సాక్షం పలికే వారవ్వాలని మేము కోరుకుంటున్నాము.

(114) ఈసా అలైహిస్సలాం వారి కోరికను స్వీకరించారు. అల్లాహ్ తో ఇలా దుఆ చేశారు,"ఓ మా ప్రభువా మా పై ఆహార పళ్ళెమును దింపు. మేము దాని దిగే రోజును పండుగ జరుపుకుని నీకు కృతజ్ఞత తెలుపుకుంటాము.అది నీ ఏకత్వమునకు,నేను దేనిని తీసుకుని వచ్చానో అది సత్యమనుటకు సూచకము,ఆధారమవుతుంది. నీ ఆరాధన చేయటానికి మాకు దోహదపడే ఆహారాన్ని మనకు ప్రసాదించు. ఓ మా ప్రభువా అందరికన్న శ్రేష్టమైన ఆహారాన్ని ప్రసాదించే వాడివి నీవే".

(115) అల్లాహ్ ఈసా అలైహిస్సలాం దుఆను స్వీకరించాడు.మరియు ఇలా అన్నాడు : మీరు మీపై దింపమని కోరిన ఈ ఆహార పళ్ళెమును నిశ్చయంగా నేను దింపుతాను.అయితే దానిని దింపిన తరువాత ఎవరైతే తిరస్కరిస్తారో వారు తమనే నిందించుకోవాలి.నేను తొందరలోనే ఎవరికీ విధించనటువంటి కఠినమైన శిక్షను అతనికి విధిస్తాను.ఎందుకంటే అతను తిరుగులేని మహిమను చూశాడు.అతని అవిశ్వాసం బలమైనది.అల్లాహ్ తన వాగ్దానమును వారి కొరకు నిజం చేసి చూపించాడు.దానిని (ఆహారపళ్ళెంను) వారిపై దింపినాడు.

(116) ప్రళయ దినమున మర్యం కుమారుడు ఈసా అలైహిస్సలాంను ఉద్దేశించి అల్లాహ్ పలికే సంధర్భమును మీరు గుర్తు చేసుకోండి: ఓ మర్యం కుమారుడగు ఈసా మీరు ప్రజలతో మీరు నన్ను నా తల్లిని అల్లాహ్ ను వదిలి ఆరాధ్య దైవాలుగా చేసుకోండి అని అన్నారా ?. అప్పుడు ఈసా అలైహిస్సలాం తన ప్రభువు పరిశుద్దతను కొనియాడుతూ ఇలా సమాధానమిచ్చారు : వారికి నేను సత్యం తప్ప వేరే వాటిని తెలపటం నాకు తగదు.ఒక వేళ నేను అలా అని ఉంటే దానిని నీవు తెలుసుకుంటావు.ఎందుకంటే నీ ముందు ఏ విషయం దాగదు.నేను నా మనస్సులో దాచిన విషయాలను నీవు తెలుసుకుంటావు.నీ మనస్సులో ఏముందో నాకు తెలియదు.నిశ్చయంగా నీ ఒక్కడివే ప్రతి అగోచర విషయాన్ని,ప్రతి దాగి ఉన్న విషయాన్ని,ప్రతి బహిర్గతమైన విషయాన్ని తెలుసుకుంటావు.

(117) ఈసా అలైహిస్సలాం తన ప్రభువుతో ఇలా అంటారు : నీ ఒక్కడి ఆరాధన చేయమని ప్రజలకు నీవు ఇచ్చిన ఆదేశము మాట తప్ప వేరేది నేను వారికి చెప్పలేదు.నేను వారి మధ్య ఉన్నంత కాలం వారు చెప్పిన మాటలపై సాక్షిగా ఉన్నాను.అయితే ఎప్పుడైతే నీవు నన్ను జీవించి ఉండగానే ఆకాశముపై ఎత్కుకుని వారి మధ్య నా నివాసమును సమాప్తము చేశావో అప్పటి నుండి ఓ నా ప్రభువా నీవే వారి కార్యాలను కనిపెట్టుకుని ఉన్నావు.అన్ని విషయాలను కనిపెట్టుకుని ఉండేవాడివి నీవే.నీ ముందట ఏదీ అదృశ్యం అవ్వదు,వారికి నేను చెప్పిన మాటలు,వారు నా తరువాత చెప్పిన మాటలు నీ పై గోప్యంగా ఉండవు.

(118) ఓ నా ప్రభువా ఒక వేళ నీవు వారికి శిక్షించదలచుకుంటే నిశ్చయంగా వారు నీ దాసులే.వారి విషయంలో నీవు తలచుకున్నది చేయి.వారిలోంచి విశ్వాసపరులపై క్షమాపణ ద్వారా దయ చూపదలచుకుంటే నీ కొరకు ఆ విషయంలో ఎటువంటి అఢ్డంకి లేదు. ఓడింపబడని సర్వాధిక్యుడివి,నీ పర్యాలోచనలో వివేకవంతుడివి నీవే.

(119) అల్లాహ్ ఈసా అలైహిస్సలాం తో ఇలా అంటాడు-: "ఈ రోజు సంకల్పాల్లో,ఆచరణల్లో,మాటల్లో సత్యవంతులైన వారికి వారి నిజాయితీ ప్రయోజనకరమవుతుంది".వారి కొరకు భవనాల క్రింద నుంచి,వృక్షాల క్రింద నుంచి సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలు కలవు.వాటిలో వారు ఎల్లప్పుడు ఉంటారు.మరణం వారికి సంభవించదు.అల్లాహ్ వారితో ప్రసన్నుడయ్యాడు.వారిపై ఎన్నడు ఆగ్రహం చెందడు.వారు తాము ఏవైతే అతని వద్ద శాస్వత అనుగ్రహాలు పొందారో వాటి కారణంగా అతనితో సంతుష్ఠ పడ్డారు.ఈ ప్రతిఫలము, వారి నుండి (అల్లాహ్) ప్రసన్నతే గొప్ప సాఫల్యము.ఎటువంటి సాఫల్యము దానికి సరితూగదు.

(120) భూమ్యాకాశాలపై అధికారము అల్లాహ్ ఒక్కడి కొరకే.ఆ రెండింటిని సృష్టించిన వాడు,వాటి పర్యాలోచన చేసేవాడు ఆయనే.వాటిలో ఉన్న సృష్టిరాసులన్నింటి పై అధికారం ఆయన కొరకే.మరియు ఆయన ప్రతి వస్తువు పై అధికారము కలవాడు.ఏ వస్తువు ఆయనను అశక్తుడు చేయదు(విఫలం చేయలేవు).