(1) అల్లాహ్ మూసా అలైహిస్సలాంతో ఏ కొండపైనైతే సంభాషించాడో దానిపై ప్రమాణం చేశాడు.
(2) మరియు వ్రాయబడిన గ్రంధముపై ఆయన ప్రమాణం చేశాడు.
(3) అవతరింపబడిన గ్రంధముల వలె పరచబడిన,తెరవబడిన ఒక పత్రములో.
(4) మరియు ఆయన దైవదూతలు అకాశములో అల్లాహ్ ఆరాధన ద్వారా జనసమ్మర్ధన చేస్తున్న (ఆబాద్ చేస్తున్న) గృహముపై ప్రమాణం చేశాడు.
(5) మరియు ఆయన భూమికి కప్పు అయినటువంటి ఎత్తైన ఆకాశముపై ప్రమాణం చేశాడు.
(6) మరియు ఆయన నీటితో నిండిన సముద్రముపై ప్రమాణం చేశాడు.
(7) ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువు శిక్ష ఖచ్చితముగా అవిశ్వాసపరులపై వాటిల్లుతుంది.
(8) దాన్ని వారి నుండి అడ్డుకునేవాడు మరియు వారిపై దాని వాటిల్లటం నుండి ఆపేవాడు ఎవడూ లేడు.
(9) ఆ రోజు ఆకాశము కదులుతుంది మరియు ప్రళయము గురించి ప్రకటనగా కంపిస్తుంది.
(10) మరియు పర్వతాలు తమ స్థానముల నుండి చలిస్తాయి.
(11) అల్లాహ్ అవిశ్వాసపరులకు వాగ్దానం చేసిన శిక్ష ద్వారా తిరస్కారుల కొరకు ఆ రోజున వినాశనము మరియు నష్టము కలదు.
(12) వారు వృధాకలాపనల్లో,అసత్యములో ఆటలాడుతున్నారు. వారు మరణాంతరం లేపబడటమును గాని మరలించబడటంను పట్టించుకోవటం లేదు.
(13) ఆ రోజు వారు తీవ్రముగా,గట్టిగా నరకాగ్ని వైపు నెట్టబడుతారు.
(14) వారిని మందలిస్తూ ఇలా పలకబడుతుంది : ఈ అగ్ని అదే దేని గురించైతే మీ ప్రవక్తలు మిమ్మల్ని భయపెట్టినప్పుడు మీరు తిరస్కరించేవారో అది.
(15) ఏ మీరు కళ్ళారా చూస్తున్న ఈ శిక్ష మంత్రజాలమా ?! లేదా మీరు దాన్ని చూడటం లేదా ?!
(16) మీరు ఈ నరకాగ్ని వేడిని చవి చూడండి మరియు దాన్ని అనుభవించండి. దాని వేడిని అనుభవించటంపై మీరు సహనం చూపండి లేదా సహనం చూపకండి. మీ సహనం చూపటం,మీ సహనం చూపకపోవటం సమానము. ఇహలోకంలో మీరు చేసుకున్న అవిశ్వాసము మరియు పాపకార్యములకు మాత్రమే ఈ రోజు మీరు ప్రతిఫలం ప్రసాదించబడుతారు.
(17) నిశ్ఛయంగా తమ ప్రభువుకు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడే వారు అంతంకాని స్వర్గ వనముల్లో మరియు అనుగ్రహముల్లో ఉంటారు.
(18) తినే,త్రాగే,వివాహం లాంటి అల్లాహ్ వారికి ప్రసాదించిన రుచులను వారు అనుభవిస్తారు. మరియు పరిశుద్ధుడైన వారి ప్రభువు నరక శిక్ష నుండి వారిని రక్షించాడు. కాబట్టి వారు తాము ఆశించిన ఆనందాలను పొంది కష్టాల నుండి తమను రక్షించుకోవటం ద్వారా సాఫల్యం పొందారు.
(19) మరియు వారితో ఇలా పలకబడును : మీరు మీ మనసుకు నచ్చిన వాటిని హాయిగా తినండి మరియు త్రాగండి. మీరు తినే వాటి విషయంలో గాని లేదా త్రాగే వాటి విషయంలో గాని ఎటువంటి కీడు,బాధ గురించి భయపడకండి. ఇహలోకములోని మీ సత్కర్మలకు ఇది మీకు ప్రతిఫలము.
(20) అలంకరించబడి ఒక దానికి ఒకటి ఎదురుగా పెట్టబడిన ఆసనాలపై ఆనుకుని కూర్చుని ఉంటారు. మరియు మేము వారిని విశాలమైన తెల్లటి కన్నులు కల స్త్రీలతో వివాహం చేయిస్తాము.
(21) మరియు ఎవరయితే విశ్వసించి వారి సంతానము విశ్వాసములో వారిని అనుసరించి ఉంటే మేము వారి ద్వారా వారి కంటికి చలువను కలిగించటానికి వారితో వారిని కలుపుతాము. ఒక వేళ వారు వారి కర్మలకు చేరకుండా ఉంటే మేము వారి కర్మల పుణ్యములో నుంచి ఏమీ తగ్గించము. ప్రతీ మనిషి తాను సంపాదించుకున్న దుష్కర్మకు తాకట్టుగా ఉంటాడు. అతని నుండి అతని కర్మను ఏమాత్రం ఇతరులు మోయరు.
(22) మరియు మేము స్వర్గవాసులైన వీరందరికి రకరకాల ఫలాలను పుష్కలంగా సరఫరా చేస్తాము. మరియు వారు కోరే ప్రతీ మాంసమును వారికి పుష్కలంగా సరఫరా చేస్తాము.
(23) స్వర్గములో వారు ఒకరికొకరు (మధు) పాత్రలను ఇచ్చుకుంటుంటారు. దాన్ని త్రాగటం వలన మత్తు వలన ఇహలోకములో కలిగే వ్యర్ధపు మాటలు మరియు పాపపు మాటలు కలగవు.
(24) వారి చుట్టూ వారి సేవకు ఉంచబడిన పిల్లలు తిరుగుతుంటారు. వారు తమ చర్మ స్వచ్ఛతలో దాని తెల్లదనంలో తమ గవ్వల్లో దాయబడిన ముత్యములవలే ఉంటారు.
(25) మరియు స్వర్గ వాసుల్లోంచి కొందరు కొందరి వైపునకు ఇహలోకములో తమ పరిస్థితి గురించి ప్రశ్నించుకుంటూ మరలుతారు.
(26) అప్పుడు వారితో వారు ఇలా సమాధానమిస్తారు : నిశ్ఛయంగా మేము ఇహలోకములో అల్లాహ్ శిక్ష నుండి భయపడుతూ మా ఇంటివారి మధ్య ఉండేవారము.
(27) అప్పుడు అల్లాహ్ ఇస్లాం వైపునకు మార్గదర్శకత్వము ద్వారా మాపై ఉపకారముచేశాడు. మరియు ఆయన మమ్మల్ని అత్యంత వేడిదైన శిక్ష నుండి కాపాడాడు.
(28) నిశ్చయంగా మేము మా ఇహలోక జీవితంలో ఆయనను ఆరాధించేవారము. మరియు మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి రక్షించమని ఆయనను మేము వేడుకునేవారము. నిశ్చయంగా ఆయన తన దాసులకు తాను చేసిన వాగ్దానములో సత్యవంతుడైన ఉపకారి,వారిపై అపారంగా కరుణించేవాడును. మమ్మల్ని ఆయన విశ్వాసమునకు మర్గం చూపటం మరియు మమ్మల్ని స్వర్గములో ప్రవేశింపజేయటం మరియు మమ్మల్ని నరకాగ్ని నుండి దూరం చేయటం మాపై ఉన్న ఆయన ఉపకారము మరియు ఆయన కారుణ్యములోనిదే.
(29) ఓ ప్రవక్తా మీరు ఖుర్ఆన్ ద్వారా హితోపదేశం చేయండి. అల్లాహ్ మీపై అనుగ్రహించిన విశ్వాసం మరియు బుద్ధి వలన జిన్నుల్లోంచి ఇష్టపడే మీరు ఏ జ్యోతిష్యులు కారు. మరియు మీరు పిచ్చివారు కాదు.
(30) లేదా ఈ తిరస్కారులు నిశ్చయంగా ముహమ్మద్ ఒక ప్రవక్త కాదు. కాని అతను ఒక కవి,అతన్ని మరణం ఎత్తుకుపోవాలని ఎదురుచూస్తున్నాము. అప్పుడు మేము అతని నుండి మనశ్శాంతి పొందుతాము అని అంటున్నారా ?.
(31) ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి : మీరు నా మరణం గురించి ఎదురు చూడండి. మరియు మీరు నన్ను తిరస్కరించటం వలన మీపై కురిసే శిక్ష గురించి నేనూ నిరీక్షిస్తాను.
(32) ఏమీ వారి మాట నిశ్చయంగా అతడు జ్యోతిష్యుడు,పిచ్చివాడు అని వారి మనస్సులు వారిని ఆదేశిస్తున్నాయా ?! వారు ఒక వ్యక్తిలో ఇమడని వాటి మధ్య సమీకరిస్తున్నారు. అంతే కాదు వారు హద్దులను అతిక్రమించిన జనులు. కావున వారు ఏ ధర్మ శాసనం వైపునకు గాని ఏ బుద్ధి వైపున గాని మరలరు.
(33) లేదా వారు నిశ్చయంగా ముహమ్మద్ ఈ ఖుర్ఆన్ ను అల్లుకున్నాడు అని, అది దివ్య వాణి ద్వారా అవతరింపబడలేదని అంటున్నారా ?! ఆయన దాన్ని అల్లుకోలేదు. కాని వారే దానిపై విశ్వాసమును కనబరచటం నుండి అహంకారమును చూపుతున్నారు అప్పుడే వారు ఆయన దాన్ని అల్లుకున్నాడు అని చెబుతున్నారు.
(34) అయితే వారు దాని లాంటి వాక్కును తీసుకుని రావాలి ఒక వేళ అది అల్లించబడి ఉంటే,ఒక వేళ వారు ఆయన అల్లుకున్నారు అన్న తమ వాదనలో సత్యవంతులే అయితే.
(35) లేదా వారు ఏ సృష్టి కర్త సృష్టించకుండానే సృష్టించబడ్డారా ?! లేదా వారు తమను స్వయంగా సృష్టించుకున్నారా ?! ఎటువంటి సృష్టికర్త లేకుండా సృష్టి ఉనికిలోకి రావటం సంభవం కాదు. మరియు ఏ సృష్టి సృష్టించబడదు. అటువంటప్పుడు వారు తమ సృష్టికర్తను ఎందుకు ఆరాధించటంలేదు ?!
(36) లేదా వారు ఆకాశములను మరియు భూమిని సృష్టించారా ?! అలా కాదు అల్లాహ్ వారి సృష్టికర్త అని విశ్వసించటంలేదు. ఒక వేళ వారు దానిని విశ్వసిస్తే ఆయన ఏకత్వమును చాటేవారు మరియు ఆయన ప్రవక్తను విశ్వసించేవారు.
(37) లేదా వారి వద్ద మీ ప్రభువు యొక్క ఆహార నిక్షేపాలున్నాయా దాన్ని వారు తాము తలచిన వారికి ప్రసాదించటానికి, మరియు దైవదౌత్యమున్నదా దాన్ని వారు తాము తలచిన వారికి ఇవ్వటానికి మరియు దాన్ని ఆపటానికి ?! లేదా వారు తమ ఇష్టానికి అనుగుణంగా వ్యవహరించే అధికారులా ?!
(38) లేదా వారి కొరకు ఏదైన నిచ్చెన ఉన్నదా దాని ద్వారా వారు ఆకాశముపై ఎక్కి అక్కడ వారు సత్యంపై ఉన్నారని అల్లాహ్ అవతరింపజేసిన ఏదైన దైవవాణిని వింటున్నారా ?! వారిలో నుండి ఆ దైవవాణి విన్నవారు తాము సత్యంపై ఉన్నామని వాదిస్తున్న విషయంతో తమను మిమ్మల్ని దృవీకరించే ఏదైన స్పష్టమైన వాదనను తీసుకుని రావాలి.
(39) లేదా పరిశుద్ధుడైన,మహోన్నతుడైన ఆయనకు మీకు ఇష్టంలేని కుమార్తెలు మరియు మీకు మీరు ఇష్టపడే కుమారులా ?!
(40) లేదా ఓ ప్రవక్తా మీరు మీ ప్రభువు వద్ద నుండి వారికి చేరవేసిన వాటిపై మీరు వారి నుండి ఏదైన ప్రతిఫలం అడుగుతున్నారా ?! దాని వలన వారు తాము మోయలేని భారమును మోసే బాధ్యులవుతున్నారు.
(41) లేదా వారి వద్ద అగోచర జ్ఞానమున్నదా వారు తాము తెలుసుకున్న అగోచర విషయాలను ప్రజల కొరకు వ్రాసుకుని వాటిలో నుండి తాము తలచిన వాటిని వారికి తెలియపరుస్తున్నారా ?!
(42) లేదా ఈ తిరస్కారులందరు మీ గురించి మరియు మీ ధర్మం గురించి ఏదైన కుట్రను పన్నుతున్నారా ?! అయితే మీరు అల్లాహ్ పై నమ్మకమును కలిగి ఉండండి. అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై అవిశ్వాసమును కనబరచిన వారే తమ కుట్రకు గురవుతారు మీరు కాదు.
(43) లేదా వారి కొరకు అల్లాహ్ కాక వేరే ఆరాధ్యదైవమున్నాడా ?! అల్లాహ్ వారు ఆయనకు అంటగడుతున్న భాగస్వాముల నుండి పరిశుద్ధుడు మరియు అతీతుడు. పైన పేర్కొనబడినవన్నీ జరగలేదు. మరియు ఏవిధంగాను ఊహించబడవు.
(44) మరియు ఒక వేళ వారు ఆకాశము నుండి ఏదైన తునకను రాలటమును చూస్తే దాని గురించి ఇలా పలికేవారు : ఇది ఎప్పటిలాగే ఒకదానిపై ఒకటి పేరుకున్న ఒక మేఘము. వారు హితబోధన గ్రహించరు మరియు విశ్వసించరు.
(45) ఓ ప్రవక్తా తాము శిక్షింపబడే రోజును వారు పొందనంతవరకు తమ వ్యతిరేకతలో మరియు తమ తిరస్కారములో వారిని మీరు వదిలివేయండి.
(46) ఆ రోజు వారి కుట్ర వారికి కొంచము గాని లేదా ఎక్కువ గాని ప్రయోజనం కలిగించదు. మరియు వారు తమను శిక్ష నుండి రక్షించుకుని సహాయము చేసుకోలేరు.
(47) మరియు నిశ్ఛయంగా షిర్కు ద్వారా మరియు పాపకార్యముల ద్వారా తమకు అన్యాయం చేసుకున్న వారికి పరలోక శిక్ష కన్న ముందు ఇహలోకంలో హతమార్చటం,బందీ చేయటం ద్వారా మరియు బర్జఖ్ లో సమాధి శిక్ష ద్వారా శిక్ష కలదు. మరియు వారిలో చాలామందికి అది తెలియదు. అందుకనే వారు తమ అవిశ్వాసంపై స్థిరంగా ఉన్నారు.
(48) ఓ ప్రవక్తా మీరు మీ ప్రభువు తీర్పుపై మరియు తన ధర్మ ఆదేశముపై సహనం చూపండి. నిశ్చయంగా మీరు మా చూపుల ముందు,మా పర్యవేక్షణలో ఉన్నారు. మరియు మీరు మీ నిదుర నుండి మేల్కొన్నప్పుడు మీ ప్రభువు యొక్క పరిశుద్ధతను స్థుతుల ద్వారా కొనియాడండి.
(49) మరియు రాత్రి నీ ప్రభువు యొక్క పరిశుద్ధతను కొనియాడి ఆయన కొరకు నమాజును పాటించు. మరియు నక్షత్రములు పగటి వెలుగులో అస్తమించి మరలేవేళ ఫజర్ నమాజును పాటించు.