(1) ఓ ప్రవక్తా ఇస్లాంను బహిర్గతం చేసి అవిశ్వాసమును హృదయముల్లో దాచిన కపటులు మీ సభలో హాజరు అయినప్పుడు వారు ఇలా పలికేవారు : నిశ్చయంగా వాస్తవానికి నీవు అల్లాహ్ ప్రవక్త అని మేము సాక్ష్యం పలుకుతున్నాము. నిశ్చయంగా మీరు ఆయన ప్రవక్త అని అల్లాహ్ కు తెలుసు. మరియు మీరు ఆయన ప్రవక్త అని తమ హృదయముల లోతు నుండి వారు సాక్ష్యం పలుకుతున్నారన్న వాదనలో కపటులు అబద్దము పలుకుతున్నారని అల్లాహ్ సాక్ష్యం పలుకుతున్నాడు.
(2) విశ్వాసవంతులన్న తమ వాదనపై వారు చేసే తమ ప్రమాణములను హతమార్చబడటం నుండి మరియు బందీకాబడటం నుండి తమ కొరకు పరదాగా మరియు ఢాలుగా చేసుకునేవారు. మరియు వారు వ్యపింపజేసిన సందేహాలు,అపోహల ద్వారా ప్రజలను విశ్వాసము నుండి మరల్చేవారు. నిశ్చయంగా వారు ఆచరించే కపటత్వము మరియు అబద్దపు ప్రమాణాలు ఎంతో చెడ్డవైనవి.
(3) ఇది ఎందుకంటే వారు కపటత్వాన్ని విశ్వసించారు. మరియు విశ్వాసము వారి హృదయములకు చేరుకోలేదు. ఆ తరువాత వారు రహస్యంగా అల్లాహ్ పట్ల అవిశ్వాసమును చూపారు. అప్పుడు వారి అవిశ్వాసం వలన వారి హృదయములపై సీలు వేయబడినది. కాబట్టి వాటిలో విశ్వాసము ప్రవేశించదు. కావున ఈ సీలు వేయబడటం వలన తమకు ప్రయోజనం కలిగించే వాటిని,తమకు ఋజు మార్గం ఉన్న వాటిని వారు అర్ధం చేసుకోలేరు.
(4) ఓ చూసేవాడా నీవు వారిని చూసినప్పుడు వారు ఉన్న తాజాదనము మరియు అనుగ్రహాల వలన వారి రూపాలు మరియు వారి ఆకారాలు నీకు అద్భుతంగా కనిపిస్తాయి. వారు మాట్లాడితే, వాక్చాతుర్యాన్ని కలిగి ఉన్నందున మీరు వారి మాటలు వింటారు. ఓ ప్రవక్తా వారు మీ సభలో ఉన్నప్పుడు ఆనించి ఉంచిన కట్టె వలె ఉంటారు. వారు దేనిని అర్ధం చేసుకోరు. మరియు దాన్ని గుర్తుంచుకోరు. వారిలో ఉన్న పిరికితనం వలన ప్రతీ స్వరము తమను లక్ష్యంగా చేసుకున్నదని వారు భావిస్తారు. వారే వాస్తవనికి శతృవులు. ఓ ప్రవక్తా వారు మీ రహస్యాలను బహిర్గతం చేయటం గాని లేదా మీ పట్ల కుట్రలు పన్నటం గాని చేస్తారని మీరు వారితో జాగ్రత్తగా ఉండండి. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక. వారు విశ్వాసము నుండి దాని సూచనలు స్పష్టమైనా కూడా మరియు దాని ఆధారాలు బహిర్గతమైనా కూడా ఎలా మరలించబడుతున్నారు ?.
(5) మరియు ఈ కపటులందరితో : మీ నుండి జరిగిన తొందరపాటుకు కారణం చూపుతూ దైవ ప్రవక్త వద్దకు రండి ఆయన మీ కొరకు అల్లాహ్ యందు మీ పాపముల నుండి మన్నింపును వేడుకుంటారు అని పలకబడినప్పుడు వారు తమ తలలను హేళనగా,ఎగతాళిగా ఊపారు. మరియు నీవు వారిని వారికి ఇవ్వబడిన ఆదేశము నుండి విముఖత చూపుతుండగా చూస్తావు. మరియు వారు సత్యమును స్వీకరించటం నుండి మరియు దాన్ని అంగీకరించటం నుండి అహంకారమును చూపుతారు.
(6) ఓ ప్రవక్తా వారి పాపముల కొరకు మీరు మన్నింపు వేడుకోవటం మరియు వారి కొరకు మీరు మన్నింపు వేడుకోకపోవటం సమానము. అల్లాహ్ వారి కొరకు వారి పాపములను మన్నించడు. నిశ్చయంగా అల్లాహ్ తన విధేయత నుండి వైదొలగిపోయిన ,ఆయన అవిధేయతపై మొండిగా ఉన్న జనులకు భాగ్యమును కలిగించడు.
(7) వారే ఇలా పలికేవారు : మీరు మీ సంపదలను అల్లాహ్ ప్రవక్త వద్ద ఉన్న పేద వారిపై మరియు మదీనా చుట్టు ప్రక్కల ఉన్న పల్లె వాసులపై వారు ఆయన వద్ద నుండి వేరవ్వనంత వరకు ఖర్చు చేయకండి. మరియు ఆకాశములలో ఉన్న ఖజానాలు మరియు భూమిలో ఉన్న ఖజానాలు అల్లాహ్ కే చెందుతాయి. ఆయన వాటిని తన దాసుల్లోంచి తాను తలచిన వారికి ప్రసాదిస్తాడు. కాని పరిశుద్ధుడైన ఆయన చేతిలోనే ఆహారపు ఖజానాలు ఉన్నాయని కపటులకు తెలియదు.
(8) వారి నాయకుడు అబ్దుల్లాహ్ ఇబ్నె ఉబయ్ ఇలా పలికే వాడు : ఒక వేళ మేము మదీనాకు వాపసు అయితే గౌరవోన్నతుడు - అంటే వారు నేను మరియు నా జాతివారు - అక్కడ నుండి నీచులను - వారు ముహమ్మద్ మరియు అతని సహచరులని - తప్పకుండా వెళ్ళగొడుతాము. గౌరవం అన్నది ఒక్కడైన అల్లాహ్ కొరకు మరియు ఆయన ప్రవక్త కొరకు మరియు విశ్వాసపరుల కొరకు. మరియు అది అబ్దుల్లాహ్ ఇబ్నె ఉబయ్ మరియు అతని సహచరుల కొరకు కాదు. కాని గౌరవం అన్నది అల్లాహ్ కొరకు,ఆయన ప్రవక్త కొరకు,విశ్వాసపరుల కొరకు అని కపటులకు తెలియదు.
(9) ఓ అల్లాహ్ ను విశ్వసించి ఆయన తమ కొరకు ధర్మ బద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీ సంపదలు గాని మీ సంతానము గాని నమాజు నుండి లేదా ఇస్లాం యొక్క ఇతర అనివార్య కార్యాల నుండి మిమ్మల్ని నిర్లక్ష్యంలో పడవేయకూడదు. మరియు ఎవరినైతే అతని సంపదలు,అతని సంతానము అతనిపై అల్లాహ్ అనివార్యం చేసిన నమాజు,ఇతర వాటి నుండి నిర్లక్ష్యంలో పడవేస్తాయో వారందరు వాస్తవానికి ప్రళయదినమున తమ స్వయానికి,తమ ఇంటివారికి నష్టం కలిగించుకుని నష్టపోయేవారు.
(10) మరియు మీరు మీలో నుండి ఎవరికి మరణం రాక ముందే అల్లాహ్ మీకు ప్రసాదించిన సంపదల్లోంచి ఖర్చు చేయండి. అప్పుడు అతడు తన ప్రభువుతో ఓ నా ప్రభువా ఎందుకని నీవు నాకు కొంత గడువు ఇవ్వలేదు. నేను నా సంపద నుండి అల్లాహ్ మార్గంలో దానం చేసి తమ సత్కర్మలు చేసుకున్న అల్లాహ్ యొక్క పుణ్య దాసుల్లోంచి అయిపోయే వాడిని.
(11) ఏ మనిషి యొక్క మరణం ఆసన్నమై అతని ఆయుషు పూర్తి అవుతుందో అతనికి పరిశుద్ధుడైన అల్లాహ్ గడువు ఇవ్వడు. మీరు ఏమి చేస్తున్నారో అల్లాహ్ తెలుకునేవాడు. మీ కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు. మరియు తొందరలోనే వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఒక వేళ అది మంచిదైతే మంచిదవుతుంది. ఒక వేళ అది చెడ్డదైతే అది చెడ్డదవుతుంది.