68 - Al-Qalam ()

|

(1) (నూన్) సూరె బఖరా ఆరంభములో వీటి సారుప్యముపై చర్చ జరిగినది. అల్లాహ్ కలముపై ప్రమాణం చేశాడు మరియు ప్రజలు తమ కలములతో వ్రాసే వాటి గురించి ప్రమాణం చేశాడు.

(2) ఓ ప్రవక్త అల్లాహ్ మీకు అనుగ్రహించిన దైవ దౌత్యము వలన మీరు పిచ్చివారు కాదు. అంతే కాదు ముష్రికులు మీపై వేస్తున్న అపనింద అయిన పిచ్చితనముతో మీకు సంబంధము లేదు.

(3) నిశ్చయంగా మీ కొరకు మీరు ప్రజలకు సందేశాలను చేరవేసే విషయంలో అనుభవించిన బాధపై అంతం కాని పుణ్యం కలదు. దాని ద్వారా మీపై ఎవరికీ ఎటువంటి ఉపకారము లేదు.

(4) మరియు నిశ్చయంగా మీరు ఖుర్ఆన్ తీసుకుని వచ్చిన ఉత్తమ గుణాలు కలవారు. కాబట్టి మీరు అందులో ఉన్న నైతికతను పరిపూర్ణ రీతిలో పూర్తి చేసేవారు.

(5) అయితే తొందరలోనే మీరు చూస్తారు మరియు ఈ తిరస్కారులందరు చూస్తారు.

(6) సత్యము తేటతెల్లం అయినప్పుడు మీలో నుండి ఎవరికి పిచ్చి ఉన్నదో స్పష్టమైపోతుంది.

(7) ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువుకు తెలుసు ఎవరు ఆయన మార్గము నుండి మరలిపోయారో. దాని వైపునకు సన్మార్గం పొందేవారి గురించి ఆయనకు బాగా తెలుసు. కావున ఎవరు దాని నుండి తప్పిపోయారో ఆయనకు తెలుసు. మరియు మీరు దాని వైపునకు ఎవరిని మార్గదర్శకం చేశారో ఆయనకు తెలుసు.

(8) ఓ ప్రవక్తా మీరు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించే వారి మాట వినకండి (అనుసరించకండి).

(9) ధర్మ లెక్క విషయంలో ఒక వేళ మీరు వారి పట్ల మెతక వైఖరిని చూపి వారిపై కనికరిస్తే వారు మీ పట్ల మెతక వైఖరిని చూపి మీ పై కనికరిస్తారని ఆశించారు.

(10) మరియు మీరు అసత్యముపై అధికముగా ప్రమాణాలు చేసే,దిగజారిన వాడి మాటలు వినకండి.

(11) ప్రజల వీపు వెనుక వారి గురించి అధికముగా చెడు ప్రస్తావన చేసేవాడి (గీబత్ చేసేవాడు) వారి మధ్య దూరాలు పెంచటానికి వారి మధ్య చాడీలు చెప్పేవాడి మాటను;

(12) మంచిని అధికంగా నిరోధించేవాడి,ప్రజలపై వారి సంపదలలో,వారి మానమర్యాదల విషయంలో,వారి ప్రాణముల విషయంలో మితిమీరిపోయేవాడి,అధికముగా పాపాలు,అవిధేయ కార్యాలు చేసేవాడి;

(13) కఠినుడు,కర్కశుడు,తన జాతివారిలో నిందార్హుడు;

(14) అతడు సంపద,సంతానము కలవాడని అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసము కనబరచటం నుండి అహంకారమును చూపాడు.

(15) మా ఆయతులు అతనిపై చదివి వినిపించబడినప్పుడు వాడు ఇవి వ్రాయబడిన పూర్వికుల కట్టుకథలు అని అన్నాడు.

(16) మేము తొందరలోనే అతని ముక్కుపై ఒక గర్తును పెడతాము అది అతనిలో లోపమును ఏర్పరుస్తుంది మరియు అతనికి అంటిపెట్టుకుని ఉంటుంది.

(17) నిశ్చయంగా మేము ఈ ముష్రికులందరిని ఏ విధంగానైతే మేము తోటవారిని పరీక్షించామో అలా కరువుకాటకాల ద్వారా మరియు ఆకలి ద్వారా పరీక్షించాము. అప్పుడు వారు ప్రొద్దిన వేళ త్వరగా వెళ్ళి వాటి ఫలాలను తప్పకుండా కోస్తామని ప్రమాణం చేశారు చివరికి దాని నుండి ఏ పేదవాడు తినకూడదు అని.

(18) మరియు వారు తమ ప్రమాణంలో ఇన్ షా అల్లాహ్ అన్న తమ ఈ మాటతో మినహాయించలేదు.

(19) అప్పుడు అల్లాహ్ దానిపై అగ్నిని పంపించాడు. అప్పుడు అది దాని యజమానులు నిదురపోతుండగా తినివేసింది. వారు దాని నుండి అగ్నిని తొలగించలేకపోయారు.

(20) అప్పుడు అది కటిక చీకటి రాత్రివలె నల్లగా అయిపోయింది.

(21) తెలతెల్ల వారే వేళ వారు ఒకరినొకరు పిలవసాగారు.

(22) ఇలా పలుకుతూ : ఒకవేళ మీరు దాని ఫలాలను కోసేవారే అయితే పేదవారు రాక ముందే మీరు మీ పంట వద్దకు ఉదయాన్నే బయలుదేరండి.

(23) అప్పుడు వారు తమ చేను వద్దకు తొందర చేస్తూ ఒకరితో ఒకరు నెమ్మది స్వరముతో పలుకుతూ బయలుదేరారు.

(24) వారు ఒకరినొకరు ఇలా పలకసాగారు : ఈ రోజు మీ వద్దకు తోటకాడ ఏ పేదవాడు రాకూడదు.

(25) వారు తమ ఫలముల నుండి వారిని ఆపటంపై దృఢ నిర్ణయం చేసుకుంటూ ఉదయ మొదటి వేళలో బయలు దేరారు.

(26) ఎప్పుడైతే వారు దాన్ని కాలిపోయి ఉండగా చూశారో వారు ఒకరినొకరు మేము దాని దారి తప్పిపోయాము అని అన్నారు.

(27) కాదు కాదు దాని నుండి పేదలను ఆపే మన గట్టి నిర్ణయం వలన మేము దాని ఫలాలను కోయటం నుండి ఆపబడ్డాము.

(28) వారిలో ఉన్నతుడు ఇలా పలికాడు : మీరు పేదవారిని దాని నుండి ఆపటంపై గట్టి నిర్ణయం ఏదైతే చేసుకున్నారో అప్పుడు నేను మిమ్మల్ని మీరు ఎందుకు అల్లాహ్ పరిశుద్ధతను కొనియాడటం లేదు మరియు ఆయన వైపునకు పశ్ఛాత్తాపముతో మరలటం లేదు అని మీతో చెప్పలేదా ?!

(29) వారు ఇలా పలికారు : మా ప్రభువు పరిశుద్ధుడు. మా తోట ఫలముల నుండి పేదవారిని ఆపటం పై మేము గట్టి నిర్ణయం తీసుకున్నప్పుడు మేము మా స్వయంపై దుర్మార్గమునకు పాల్పడ్డాము.

(30) అప్పుడు వారు నిందించుకునే దారిలో తమ మాటల్లో తిరోగమునకు ముందడుగు వేశారు.

(31) వారు అవమానముతో కృంగిపోతూ ఇలా పలికారు : అయ్యో మా నష్టము. నిశ్చయంగా మేము పేదవారిని వారి హక్కు నుండి ఆపి హద్దును అతిక్రమించిన వారిలో అయిపోయాము.

(32) బహుశా మా ప్రభువు తోట కన్న మేలైనది మాకు బదులుగా ప్రసాదిస్తాడు. నిశ్చయంగా మేము అల్లాహ్ ఒక్కడినే కోరుతున్నాము. మేము ఆయన నుండి మన్నింపును ఆశిస్తున్నాము మరియు ఆయనతో మేలును కోరుతున్నాము.

(33) ఆహారోపాధి నుండి దూరం చేసి ఈ శిక్ష లాగే మేము మాపై అవిధేయత చూపే వారిని శిక్షిస్తాము. మరియు పరలోక శిక్ష ఎంతో పెద్దది ఒక వేళ వారు దాని తీవ్రతను,దాని శాశ్వతను తెలుసుకుంటే.

(34) నిశ్చయంగా అల్లాహ్ కు ఆయన ఆదేశములను పాటించి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి భయపడేవారి కొరకు వారి ప్రభువు వద్ద అనుగ్రహ భరితమైన స్వర్గ వనాలు కలవు. వారు అందులో పరమానందమవుతారు. వారి అనుగ్రహాలు అంతం కావు.

(35) ఏమీ మేము ప్రతిఫల విషయంలో ముస్లిములను అవిశ్వాసపరులుగా చేస్తామా ఏవిధంగానైతే మక్కా వాసుల్లోంచి ముష్రికులు వాదించేవారో అలా ?!

(36) ఓ ముష్రికులారా మీకు ఏమయింది మీరు ఎలా ఈ అన్యాయమైన,వక్రమమైన తీర్పునిస్తున్నారు ?!

(37) లేదా మీ వద్ద ఏదైన పుస్తకం ఉన్నదా అందులో మీరు విధేయుడికి మరియు అవిధేయుడికి మధ్య సమానత ఉన్నట్లు చదువుతున్నారా ?!

(38) నిశ్చయంగా మీ కొరకు ఆ పుస్తకములో మీరు పరలోకములో మీ కొరకు మీరు ఏదైతే ఎంచుకుంటున్నారో అది ఉన్నదా.

(39) లేదా మీ కొరకు మా వద్ద మీరు మీ స్వయం కొరకు ఏవైతే నిర్ణయించుకుంటారో అవి ఉన్నట్లు తాకీదు చేయబడ్డ ప్రమాణాలు ఉన్నాయా?!

(40) ఓ ప్రవక్తా మీరు ఈ మాటను పలికిన వారిని అడగండి వారిలో నుండి ఎవరు దీనికి హామిగా ఉంటాడు ?!

(41) లేదా వారి కొరకు అల్లాహ్ కాకుండా ఎవరైన భాగస్వాములు ఉన్నారా వారు వారిని ప్రతిఫల విషయంలో విశ్వాసపరులతో సమానులుగా చేస్తున్నారా ?! అయితే వారు తమ ఈ భాగస్వాములందరిని తీసుకుని రావాలి ఒక వేళ వారు తాము వాదిస్తున్న విషయమైన వారు ప్రతిఫల విషయంలో విశ్వాసపరులతో సమానులు అన్న దానిలో సత్యవంతులే అయితే.

(42) ప్రళయదినమున భయానక పరిస్థితి బహిర్గతమవుతుంది మరియు మన ప్రభువు తన పిక్కను బహిర్గతం చేస్తాడు. మరియు ప్రజలు సాష్టాంగపడటం వైపు పిలవబడుతారు. అప్పుడు విశ్వాసపరులు సాష్టాంగపడుతారు. మరియు అవిశ్వాసపరులు మరియు కపటులు ఉండిపోతారు. వారు సాష్టాంగం చేయలేకపోతారు.

(43) వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి,వారిపై అవమానము,పరాభవము ఆవరించి ఉంటుంది. వాస్తవానికి ఇహలోకంలో వారితో అల్లాహ్ కు సాష్టాంగపడమని కోరబడేది మరియు వారు ఈ రోజు ఉన్న దాని కంటే ఆరోగ్యంగా ఉండేవారు.

(44) ఓ ప్రవక్తా మీరు నన్ను మరియు మీ పై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ను తిరస్కరించిన వారిని వదలండి. మేము తొందరలోనే వారిని శిక్ష వైపునకు క్రమక్రమంగా తీసుకుని వెళతాము ఎలాగంటే అది వారిపట్ల వ్యూహమని మరియు వారిని నెమ్మదిగా తీసుకెళ్ళబడటం అని వారికి తెలియదు.

(45) మరియు వారు తమ పాపములో పెరిగిపోవటానికి నేను వారికి కొంత కాలం గడువిస్తాను. నిశ్చయంగా నా వ్యూహం అవిశ్వాసపరుల పట్ల మరియు తిరస్కారుల పట్ల దృఢమైనది. వారు నా నుండి తప్పించుకోలేరు. మరియు నా శిక్ష నుండి భద్రంగా ఉండరు.

(46) ఓ ప్రవక్తా వారిని మీరు దేని వైపునైతే పిలుస్తున్నారో దానిపై ఏదైన ప్రతిఫలం వారితో మీరు కోరారా వారు దాని కారణం వలన పెద్ద విషయాన్ని మోస్తున్నారు. కావున అది మీ నుండి విముఖత చూపటానికి కారణమా ?! వాస్తవం మరోలా ఉన్నది. మీరు వారితో ఎటువంటి ప్రతిఫలమును అడగలేదు. అలాగైతే మిమ్మల్ని అనుసరించటం నుండి వారిని ఏది ఆటంకపరుస్తుంది?

(47) లేదా వారి వద్ద అగోచర జ్ఞానం ఉన్నదా కాబట్టి వారు తమకు ఇష్టమైన వాదనలు వేటితోనైతే మీతో వాదిస్తున్నారో వాటిని వ్రాస్తున్నారా ?!.

(48) అయితే ఓ ప్రవక్త మీ ప్రభువు వారికి గడువిచ్చి నెమ్మదిగా తీసుకుని వెళ్లే ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దానిపై సహనం చూపండి. మరియు తన జాతివారితో విసుగు చెందిన చేప వారైన యూనుస్ అలైహిస్సలాం మాదిరిగా మీరు అవకండి. అప్పుడు అతను సముద్రపు చీకటిలో మరియు చేప కడుపు చీకటిలో బాధలో ఉన్న స్థితిలో తన ప్రభువును పిలిచాడు.

(49) ఒక వేళ అతనికి దైవ కారుణ్యమే చేరకుండా ఉంటే చేప అతడిని నిందించబడిన స్థితిలో ఖాళీ నేలలో విసిరివేసేది.

(50) అయితే అతని ప్రభువు అతడిని ఎన్నుకుని అతడిని తన పుణ్య దాసుల్లో చేశాడు.

(51) అల్లాహ్ ను అవిశ్వసించి ఆయన ప్రవక్తను తిరస్కరించిన వారు దగ్గర దగ్గర మీ వైపు వారి తీవ్ర పదునైన చూపులతో మిమ్మల్ని పడవేసేటట్లున్నారు ఎప్పుడైతే వారు మీపై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ ను విన్నారో. మరియు వారు తమ మనోవాంఛలను అనుసరిస్తూ మరియు సత్యము నుండి విముఖత చూపుతూ ఇలా పలికేవారు : నిశ్ఛయంగా దీన్ని తీసుకుని వచ్చిన ప్రవక్త పిచ్చివాడు.

(52) మీపై అవతరింపబడిన ఖుర్ఆన్ మానవులకు,జిన్నులకు ఒక హితోపదేశము మరియు ఒక జ్ఞాపిక మాత్రమే.