73 - Al-Muzzammil ()

|

(1) ఓ తన దుస్తులతో చుట్టుకున్నవాడా (అంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం)

(2) రాంత్రంతా నీవు నమాజు చదువు అందులో నుంచి కొంచము తప్ప.

(3) మీరు తలచుకుంటే అందులో (రాత్రిలో) సగ భాగం నమాజు చదవండి లేదా మీరు మూడవ వంతు వచ్చే వరకు సగం కన్నా కొంచెం తక్కువ నమాజు చదవండి.

(4) లేదా మీరు మూడింట రెండు వంతుల వరకు వచ్చే వరకు దాన్ని పెంచండి, మీరు ఖుర్ఆన్ ను చదివినప్పుడు స్పష్టపరచండి. మరియు దానిని చదవడంలో నిదానంగా చదవండి.

(5) ఓ ప్రవక్తా నిశ్చయంగా మీపై ఖుర్ఆన్ ను వేస్తాము. అది అందులో ఉన్న అనివార్య విషయాలు మరియు హద్దులు మరియు ఆదేశాలు మరియు పద్దతులు మొదలైన వాటి వలన భారమైన మాట.

(6) నిశ్ఛయంగా రాత్రి ఘడియలు చదవటానికి తోడుగా మనస్సునకు ఎంతో ఉపయుక్తమైనవి మరియు మాట సూటిగా వెలువడటానికి ఎంతో అనువైనది.

(7) నిశ్ఛయంగా పగటిపూట మీ పనుల కార్యచరణ ఉంటుంది దాని వలన మీకు ఖుర్ఆన్ పఠనం కొరకు తీరిక లేకున్నది. కావున మీరు రాత్రి వేళ నమాజును చదవండి.

(8) అన్ని రకాల స్మరణల ద్వారా మీరు అల్లాహ్ స్మరణ చేయండి. మరియు పరిశుద్ధుడైన ఆయన వైపునకు (ప్రాపంచికి విషయాల నుండి దూరంగా ఉండి) ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకించుకుని మరలండి.

(9) ఆయన తూర్పు పడమరల ప్రభువు. ఆయన తప్ప వాస్తవ ఆరాధ్యదైవం ఎవరూ లేరు. మీ వ్యవహారములన్నింటిలో ఆయనపైనే మీరు నమ్మకమును కలిగి ఉండి ఆయన్ని మీరు కార్యసాధకునిగా చేసుకోండి.

(10) సత్యతిరస్కారులు పలికే హేళన,దూషణ పై మీరు సహనమును చూపండి. మరియు ఎటువంటి బాధ లేని విధంగా వారి నుండి తొలగిపోండి.

(11) ఈ ప్రపంచంలోని ఆనందాలను ఆస్వాదించే తిరస్కరించే వారి గురించి మీరు చింతించకండి. నన్ను మరియు వారిని విడిచిపెట్టి, వారి సమయం వచ్చే వరకు కొంతకాలం వేచి ఉండండి.

(12) నిశ్చయంగా పరలోకంలో మా వద్ద భారీ గొలుసులు మరియు ఉగ్రమైన అగ్ని ఉన్నాయి.

(13) మరియు తీవ్రమైన చేదు వలన గొంతులో ఇరుక్కునే ఆహారము మరియు బాధాకరమైన శిక్ష; మునుపటి వాటి కంటే అధికముగా.

(14) సత్యతిరస్కారులకు ఈ శిక్ష సంభవించే రోజు భూమి మరియు పర్వతాలు ప్రకంపిస్తాయి. మరియు పర్వతాలు ఆ దినపు భయానక పరిస్థితుల వలన జారిపోయి చెల్లాచెదురైపోయే ఇసుక వలె అయిపోతాయి.

(15) నిశ్చయంగా మేము ప్రళయదినమున మీ కర్మలపై సాక్షిగా ఒక ప్రవక్తను మీ వైపునకు పంపాము. ఏ విధంగానైతే మేము ఫిర్ఔన్ వద్దకు ఒక ప్రవక్తను పంపించామో ఆయన మూసా అలైహిస్సలాం.

(16) అప్పుడు ఫిర్ఔన్ అతని ప్రభువు వద్ద నుండి తన వైపునకు పంపించబడ్డ ప్రవక్తను తిరస్కరించాడు. అప్పుడు మేము అతడిని ఇహలోకంలో ముంచి పరలోకంలో అగ్ని శిక్ష ద్వారా తీవ్రంగా శిక్షించాము. మీరు మీ ప్రవక్త పై అవిధేయత చూపకండి మీకు కూడా అతడికి సంభవించినది సంభవిస్తుంది.

(17) మిమ్మల్ని మీరు ఎలా నిరోధించుకుంటారు మరియు రక్షించుకుంటారు - ఒక వేళ మీరు అల్లాహ్ ను అవిశ్వసించి, ఆయన ప్రవక్తను తిరస్కరించినట్లయితే - తీవ్రమైన, సుదీర్ఘమైన ఆ రోజు నుండి, అది చిన్నపిల్లల తలను దాని భయానక తీవ్రత వలన మరియు పొడవు కారణంగా ముసలివారిలా మార్చివేస్తుంది.

(18) దాని భయాందోళన వలన ఆకాశము బ్రద్దలైపోతుంది. అల్లాహ్ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది.

(19) నిశ్ఛయంగా ప్రళయదినమున సంభవించే భయాందోళనలు మరియు తీవ్రతల ప్రకటనతో కూడుకున్న ఈ ఉపదేశము ఒక హితోపదేశము. విశ్వాసపరులు దాని నుండి ప్రయోజనం చెందుతారు. కాబట్టి తన ప్రభువు వద్దకు చేర్చే మార్గమును అవలంబించదలచినవాడు దాన్ని అవలంబించవచ్చు.

(20) ఓ ప్రవక్తా నిశ్చయంగా మీ ప్రభువుకు తెలుసు మీరు ఒక్కొక్కసారి మూడింట రెండు వంతుల రాత్రి కన్న తక్కువ నమాజు చేస్తున్నారని మరియు ఒక్కొక్కసారి మీరు దానిలో (రాత్రిలో) సగం నిలబడుతున్నారని మరియు ఒక్కొక్కసారి దాని మూడో వంతు భాగం. మరియు విశ్వాసపరుల్లోంచి ఒక వర్గము మీతో పాటు నిలబడుతుందని. మరియు అల్లాహ్ రేయింబవళ్ళ పరిమాణాలను నిర్ణయిస్తాడు. మరియు వాటి ఘడియలను షుమారు చేస్తాడు. దాని ఘడియలను లెక్కవేయటం మరియు షుమారు చేయటం మీకు సాధ్యం కాదని పరిశుద్ధుడైన ఆయనకు తెలుసు. అప్పుడు ఆశించిన దాని కొరకు పరిశోధించటానికి దాని కన్న ఎక్కువ నిలబడటం మీకు భారం కావచ్చు. అందుకనే ఆయన మీపై దయ చూపాడు. కాబట్టి మీరు మీకు సౌలభ్యం ఉన్నంత వరకు రాత్రి నమాజు చదవండి. ఓ విశ్వాసపరులారా మీలో రోగము అలసటకు గురి చేసిన రోగులు ఉంటారని మరియు ఇతరులు అల్లాహ్ ప్రసాదించే ఆహారోపాధిని ఆశిస్తూ ప్రయాణం చేసేవారు ఉంటారని మరియు ఇతరులు అల్లాహ్ మన్నతను ఆశిస్తూ,అల్లాహ్ వాక్కు ఉన్నత శిఖరాలకు చేరటానికి అవిశ్వాసపరులతో పోరాడేవారు ఉంటారని అల్లాహ్ కు తెలుసు. కావున వీరందరిపై రాత్రి (నమాజు కొరకు) నిలబడటం భారం కావచ్చు. కాబట్టి మీరు మీకు సౌలభ్యంగా ఉన్నంత వరకు రాత్రి నమాజు (తహజ్జుద్) చదవండి. మరియు మీరు విధి గావించబడిన నమాజును పరిపూర్ణ పద్దతిలో పాటించండి. మరియు మీరు మీ సంపదల జకాత్ ను చెల్లించండి. మరియు మీరు మీ సంపదల నుండి అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండి. మరియు మీరు ఏ మేలునైనా మీ స్వయం కొరకు ముందు పంపించుకుంటే దాన్ని మీరు మంచిగా మరియు పెద్ద పుణ్యముగా పొందుతారు. మరియు మీరు అల్లాహ్ తో మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారికి మన్నించేవాడును మరియు వారిపై అపారంగా కరుణించేవాడును.