(1) అవిశ్వాసపరుల ఆత్మలను కఠినంగా మరియు బలంగా గుంజే దైవదూతలపై అల్లాహ్ ప్రమాణం చేశాడు.
(2) మరియు విశ్వాసపరుల ఆత్మలను సులువుగా మరియు తేలికగా తీసే దైవదూతలపై ప్రమాణం చేశాడు.
(3) మరియు అల్లాహ్ ఆదేశమును తీసుకుని ఆకాశము నుండి భూమివైపునకు తేలయాడే దైవదూతలపై ప్రమాణం చేశాడు.
(4) మరియు అల్లాహ్ ఆదేశమును నెరవేర్చటంలో ఒకరితో ఒకరు పోటీపడే దైవదూతలపై ప్రమాణం చేశాడు.
(5) దాసుల కార్యముల బాధ్యత అప్పగించబడిన దూతలవలె అల్లాహ్ తమకు ఆదేశించిన వాటిని నెరవేర్చేటటువంటి దూతల పై ఆయన ప్రమాణం చేశాడు. లెక్క తీసుకోవటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించటం కొరకు వారిని ఆయన తప్పకుండా మరల లేపుతాడని వీటన్నింటిపై ప్రమాణం చేశాడు.
(6) ఆ రోజు మొదటి బాకా ఊదబడినప్పుడు భూమి ప్రకంపిస్తుంది
(7) ఈ బాకా వెనుకే రెండవ బాకా ఊదబడుతుంది.
(8) ఆ దినమున కొంత మంది ప్రజల హృదయాలు భయపడుతుంటాయి.
(9) వారి చూపులపై అవమాన ఛాయలు ప్రత్యక్షమై ఉంటాయి.
(10) మరియు వారు ఇలా పలుకుతుండేవారు : ఏమి మేము మరణించిన తరువాత జీవనం వైపునకు మరలుతామా ?.
(11) ఏమీ మేము క్రుశించిపోయి ఖాళీ అయిపోయిన ఎముకలు అయపోయినప్పుడు మరలించబడుతామా ?.
(12) వారు ఇలా పలికారు : మేము మరలినప్పుడు ఆ మరలింపు నష్టము కలిగిస్తుంది, మరలే వారికి నష్టపూరితమైనది.
(13) మరణాంతరం లేపబడే విషయం శులభమైనది. అది కేవలం బాకా ఊదే బాధ్యత కల దూత నుండి ఒక గర్జింపు మాత్రమే.
(14) అప్పుడు అందరు భూమిపై దానిలోపల మృతులుగా ఉన్న తరువాత కూడా జీవించబడుతారు.
(15) ఓ ప్రవక్తా ఏమీ మీ వద్దకు మూసా వార్త ఆయన ప్రభువుతో పాటు మరియు ఆయన శతృవు అయిన ఫిర్ఔన్ తోపాటు మీకు చేరినదా ?!
(16) ఆయనను పరిశుద్ధుడైన ఆయన ప్రభువు పరిశుద్ధ తువా లోయలో పిలిచినప్పుడు.
(17) అతనితో అతను చెప్పిన దాని విషయంలో ఇలా చెప్పాడు : నీవు ఫిర్ఔన్ వద్దకు వెళ్ళు. నిశ్చయంగా అతడు దుర్మార్గంలో మరియు అహంకారంలో మితిమీరిపోయాడు.
(18) అతడితో నీవు ఇలా పలుకు : ఓ పిర్ఔన్ నీవు అవిశ్వాసము నుండి మరియు పాపకార్యముల నుండి పరిశుద్ధుడివవుతావా ?.
(19) మరియు నిన్ను సృష్టించి,నిన్ను జాగ్రత్తగా చూసుకున్న నీ ప్రభువు వైపునకు నేను మార్గదర్శకం చేస్తే నీవు ఆయనతో భయపడుతావా మరియు ఆయన ఇష్టపడే కార్యములను చేసి ఆయనకు క్రోధాన్ని కలిగించే వాటి నుండి దూరంగా ఉంటావా ?.
(20) అప్పుడు మూసా అలైహిస్సలాం అతని ముందు తాను తన ప్రభువు వద్ద నుండి ప్రవక్త అని సూచించే పెద్ద అద్భుతమును ప్రవేశపెట్టారు. అది చేయి మరియు చేతి కర్ర.
(21) అయితే ఫిర్ఔన్ తో ఈ అద్భుతమును తిరస్కరించటం తప్ప ఇంకేమి జరగ లేదు. మరియు అతను మూసా అలైహిస్సలాం తనకు ఆదేశించిన దాన్ని ఉల్లంఘించాడు.
(22) ఆ తరువాత అతడు అల్లాహ్ పట్ల అవిధేయత చూపటంలో కృషి చేస్తూ మరియు సత్యము పట్ల విముఖత చూపుతూ మూసా అలైహిస్సలాం తీసుకుని వచ్చిన దానిపై విశ్వాసం చూపటం నుండి విముఖత చూపాడు.
(23) అప్పుడు అతడు తన జాతివారిని మరియు తన అనుచరులను మూసా అలైహిస్సలాం పై ఆధిపత్యం చెలాయించటం కొరకు సమీకరించాడు. అప్పుడు ఇలా పలుకుతూ ప్రకటించాడు
(24) నేనే మీ యొక్క మహోన్నత ప్రభువును. కాబట్టి మీపై నాకు తప్ప ఇతరులకు విధేయత చూపే బాధ్యత లేదు.
(25) అల్లాహ్ అతడిని పట్టుకుని ఇహలోకంలో అతడిని సముద్రంలో ముంచి శిక్షించాడు మరియు అతడిని పరలోకంలో తీవ్రమైన శిక్షలో ప్రవేశింపజేసి శిక్షించాడు.
(26) నిశ్ఛయంగా మేము ఫిర్ఔన్ ను ఇహలోకంలో మరియు పరలోకంలో శిక్షించిన దానిలో అల్లాహ్ తో భయపడే వారి కొరకు హితబోధన కలదు. అతడే హితబోధనల ద్వారా ప్రయోజనం చెందుతాడు.
(27) ఓ తిరస్కారులారా మరల లేపి మిమ్మల్ని ఉనికిలోకి తీసుకుని రావటం అల్లాహ్ పై కష్టమా లేదా ఆయన తయారు చేసిన ఆకాశమును ఉనికిలోకి తీసుకు రావటం (కష్టమా) ?!
(28) ఆయన దాని కప్పును పైకి చాలా ఎత్తుగా లేపాడు. దాన్ని సమాంతరంగా క్రమపరిచాడు. అందులో ఎటువంటి పగులు గాని బీట గాని ఎటువంటి లోపముగాని లేదు.
(29) మరియు దాని సూర్యుడు అస్తమించినప్పుడు దాని రాత్రిని చీకటిగా చేశాడు. మరియు అది ఉదయించినప్పుడు దాని వెలుగును బహిర్గతం చేశాడు.
(30) ఆకాశమును సృష్టించిన తరువాత భూమిని విస్తరింపజేశాడు. అందులో దాని ప్రయోజనాలను నిక్షిప్తం చేశాడు.
(31) దాని నుండి దాని నీటిని ప్రవహించే సెలయేరుల రూపంలో వెలికి తీశాడు. మరియు పశువులు మేసే మొక్కలను అందులో మొలకెత్తించాడు.
(32) మరియు పర్వతములను భూమిపై స్థిరంగా నాటాడు.
(33) ఓ ప్రజలారా ఇవన్ని మీకు మరియు మీ పశువులకు ప్రయోజనములు. వీటన్నింటిని సృష్టించినవాడు వారిని సరి క్రొత్త రూపంలో మరలించటం నుండి అశక్తుడు కాడు.
(34) తన భయానక పరిస్థితులతో ప్రతీ వస్తువును కప్పివేసే రెండవ బాకా వచ్చినప్పుడు. మరియు ప్రళయం వస్తుంది.
(35) అది వచ్చిన రోజు మనిషి తాను చేసిన దాన్ని గుర్తు చేసుకుంటాడు అది మంచి అయినా గాని చెడు అయినా గాని.
(36) మరియు నరకం తీసుకు రాబడుతుంది. దాన్ని చూసే వారి కొరకు ప్రత్యక్షంగా బహిర్గతం చేయబడుతుంది.
(37) ఇక అపమార్గంలో ఎవరైతే హద్దును అతిక్రమిస్తాడో
(38) మరియు నిత్యం ఉండే పరలోక జీవితంపై అంతమైపోయే ఇహలోక జీవితమును ప్రాధాన్యతనిచ్చాడో
(39) నిశ్చయంగా నరకాగ్ని అతను శరణు తీసుకునే అతని నివాస స్థలమవును.
(40) మరియు ఎవరైతే తన ప్రభువు ముందట తాను నిలబడటం నుండి భయపడి అల్లాహ్ నిషేదించిన వాటిలో నుండి తన మనోవాంఛలను అనుసరించటం నుండి తన మనసును ఆపుకున్నాడో అతను శరణు తీసుకునే అతని నివాస స్థలం స్వర్గము.
(41) మరియు ఎవరైతే తన ప్రభువు ముందట తాను నిలబడటం నుండి భయపడి అల్లాహ్ నిషేదించిన వాటిలో నుండి తన మనోవాంఛలను అనుసరించటం నుండి తన మనసును ఆపుకున్నాడో అతను శరణు తీసుకునే అతని నివాస స్థలం స్వర్గము.
(42) ఓ ప్రవక్తా మరణాంతరం లేపబడటంను తిరస్కరించే వీరందరు ప్రళయం ఎప్పుడు వాటిల్లుతుందని మిమ్మల్ని అడుగుతున్నారు.
(43) దాని గురించి మీకు ఎటువంటి జ్ఞానం లేదు చివరికి మీరు దాన్ని వారికి తెలియపరచటానికి. మరియు అది మీ విషయం కాదు. మీ విషయం మాత్రం మీరు దాని కొరకు సిద్ధం కావటం.
(44) నీ ప్రభువు ఒక్కడి వద్దే ప్రళయం యొక్క జ్ఞానం ముగింపు ఉన్నది.
(45) నువ్వు మాత్రం ప్రళయం నుండి భయపడే వారికి హెచ్చరించే వాడివి. ఎందుకంటే నీ హెచ్చరికతో ప్రయోజనం చెందేవాడు అతడే.
(46) ఏ రోజైతే వారు ప్రళయమును కళ్లారా చూస్తారో వారు తమ ఇహలోక జీవితంలో ఒక రోజు సాయంత్రం వేళను లేదా దాని ఉదయం వేళను గడిపినట్లు ఉంటారు.