(1) సూర్యుని ఆకారము సమీకరించబడి దాని వెలుగు తొలగిపోయినప్పుడు.
(2) మరియు నక్షత్రములు రాలిపోయి వాటి కాంతి తుడిచివేయబడినప్పుడు.
(3) మరియు పర్వతములు తమ స్థానము నుండి కదిలించబడినప్పుడు.
(4) యజమానులు తాము పోటీపడేటటువంటి గర్భిణీ ఒంటెలను నిర్లక్ష్యంగా వదిలివేసినప్పుడు
(5) మరియు కృూరమృగాలు మానవులతో పాటు ఒకే నేలలో సమీకరించబడినప్పుడు.
(6) మరియు సముద్రాలు వెలిగించబడినప్పుడు చివరికి అవి అగ్నిగా అయిపోతాయి.
(7) మరియు ప్రాణములు తమ లాంటి వారితో కలిపివేయబడినప్పుడు. అప్పుడు దుష్టుడు దుష్టునితో మరియు దైవబీతిపరుడు దైవబీతిపరునితో కలిపివేయబడుతాడు.
(8) మరియు పూడ్చబడిన ఆడ పిల్ల అది జీవించి ఉన్నప్పుడు అల్లాహ్ దానిని ప్రశించినప్పుడు.
(9) నిన్ను హతమార్చినవాడు ఏ పాపము వలన నిన్ను హతమార్చాడు ?!
(10) మరియు దాసుల కర్మల పుస్తకములు తెరవబడినప్పుడు ప్రతి ఒక్కడు తమ కర్మల పుస్తకమును చదవటానికి.
(11) మరియు ఆకాశము మేక నుండి తోలు ఒలిచివేయబడినట్లు ఒలిచివేయబడినప్పుడు
(12) మరియు నరకాగ్ని వెలిగించబడినప్పుడు.
(13) మరియు స్వర్గం దైవభాతిపరులకు దగ్గర చేయబడినప్పుడు.
(14) ఇవి సంభవించినప్పుడు ప్రతి ప్రాణి తాను ఆ రోజు కొరకు ఏమి చేసుకున్నాడో తెలుసుకుంటుంది.
(15) దాగిన నక్షత్రాలపై అల్లాహ్ అవి రాత్రి ప్రత్యక్షం కాక ముందే ప్రమాణం చేశాడు.
(16) తమ కక్ష్యల్లో ప్రకాశించేవి అవి జింకలు తాము దాక్కొనే ప్రదేశంలో అంటే తమ ఇండ్లలోకి ప్రవేశించే మాదిరిగా తెల్లవారగానే కనుమరుగవుతాయి.
(17) మరియు ఆయన రాత్రి మొదటి వేళ అది వచ్చినప్పుడు మరియు దాని చివరి వేళ అది వెళ్ళినప్పుడు ప్రమాణం చేశాడు
(18) మరియు ఆయన ఉదయంపై దాని కాంతి ఉదయించినప్పుడు ప్రమాణం చేశాడు.
(19) నిశ్చయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపబడిన ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు దాన్ని నీతి మంతుడైన ఒక దైవదూత చేరవేశాడు. ఆయనే జిబ్రయీల్ అలైహిస్సలాం. అల్లాహ్ ఆయనపై నమ్మకం ఉంచాడు.
(20) మహాబలవంతుడు, పరిశుద్ధుడైన సింహాసన యజమాని వద్ద ఉన్నత స్థానం కలవాడు.
(21) ఆకాశ వాసులు అతనిపై విధేయత చూపుతారు. ఆయన చేరవేసే దైవ వాణి విషయంలో నమ్మకస్తుడు.
(22) మీతోపాటే ఉండే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు అతని బుద్ధి గురించి,అతని నీతి గురించి,అతని నిజాయితీ గురించి తెలుసు. అతడు మీరు నిందమోపినట్లు పిచ్చివాడు కాదు.
(23) మరియు నిశ్ఛయంగా మీ సహచరుడు జిబ్రయీల్ ను స్పష్టమైన ఆకాశపు అంచులపై ఆయన సృష్టించబడిన ఆయన రూపములో చూశాడు.
(24) మరియు మీ సహచరుడు మీకు చేరవేయమని అతనికి ఆదేశించబడిన వాటిని మీకు చేరవేయటంలో మీయందు పిసినారి కాదు. మరియు అతడు జ్యోతిష్యులు తీసుకున్నట్లు ఎటువంటి వేతనం తీసుకోడు.
(25) మరియు ఈ ఖుర్ఆన్ దైవ కారుణ్యము నుండి ధూత్కరించబడిన షైతాను వాక్కు కాదు.
(26) అయితే ఈ వాదనల తరువాత అది అల్లాహ్ వద్ద నుండి అన్న దానికి నిరాకరించటమునకు మీరు ఏ మార్గములో నడుస్తారు ?!
(27) ఖుర్ఆన్ జిన్నులకు మరియు మానవులకు ఒక జ్ఞాపిక మరియు హితోపదేశం మాత్రమే.
(28) మీలో నుండి సత్య మార్గంపై తిన్నగా నడవదలచిన వారి కొరకు.
(29) తిన్నగా ఉండటము గాని ఇతర వాటిగా గాని అల్లాహ్ తలచుకుంటే తప్ప మీరు తలచుకోలేరు. ఆయన సృష్టి రాసులన్నింటి ప్రభువు.