(1) మరియు ఆకాశము దాని నుండి దైవదూతలు దిగటానికి బ్రద్ధలైపోయినప్పుడు.
(2) మరియు అది తన ప్రభువు మాటను విధేయతగా విన్నది. అదే దాని విధ్యుక్త ధర్మం.
(3) మరియు చర్మము విస్తరించబడినట్లు భూమిని అల్లాహ్ విస్తరింపజేసినప్పుడు
(4) మరియు అది తనలో ఉన్న నిధులను,మృతులను బయటకు విసిరివేసి వాటి నుండి అది ఖాళీ అయిపోతుంది.
(5) మరియు అది తన ప్రభువు మాటను విధేయతగా విన్నది. అదే దాని విధ్యుక్త ధర్మం.
(6) ఓ మానవుడా నిశ్చయంగా నీవు మంచిని గాని చెడుని గాని చేస్తావు. ప్రళయదినమున దాన్ని పొందుతావు అల్లాహ్ దానిపై నీకు ప్రతిఫలం ప్రసాదించటానికి.
(7) ఇక ఎవరి కర్మల పుస్తకం అతని కుడి చేతిలో ఇవ్వబడుతుందో
(8) తొందరలోనే అల్లాహ్ అతనితో తేలికపాటి లెక్క తీసుకుని అతని కర్మను అతనికి దానిపై పట్టుకోకుండా ఇస్తాడు.
(9) మరియు అతను తన ఇంటి వారి వైపుకు ఆనందముగా మరలుతాడు.
(10) మరియు ఇక ఎవరి కర్మల పుస్తకం అతని వీపు వెనుక నుండి అతని ఎడమ చేతిలో ఇవ్వబడుతుందో
(11) తొందరలోనే అతడు తన స్వయంపై వినాశనమును పిలుచుకుంటాడు.
(12) మరియు అతడు నరకాగ్నిలో ప్రవేశించి దాని వేడిని అనుభవిస్తాడు.
(13) నిశ్ఛయంగా అతడు తాను ఉన్న అవిశ్వాసము,అవిధేయత వలన ఇహలోకంలో తన ఇంటివారి మధ్య సంతోషముగా ఉండేవాడు.
(14) నిశ్చయంగా అతడు తన మరణం తరువాత జీవనం వైపునకు మరలడని భావించాడు.
(15) ఎందుకు కాదు. తప్పకుండా అల్లాహ్ అతడిని మొదటి సారి సృష్టించినట్లే జీవనం వైపునకు మరలిస్తాడు. నిశ్చయంగా అతని ప్రభువు అతని స్థితిని వీక్షించేవాడు. దానిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండేది కాదు. మరియు అతడిని అతని కర్మ పరంగా ప్రతిఫలం ప్రసాదిస్తాడు.
(16) సూర్యాస్తమయం తరువాత ఆకాశపు అంచుల్లో ఉండే ఎరుపుదనంపై అల్లాహ్ ప్రమాణం చేశాడు.
(17) మరియు రాత్రిపై,అందులో సమీకరించబడే వాటిపై ప్రమాణం చేశాడు.
(18) మరియు నెలవంక సమీకరించబడి పరిపూర్ణమై పూర్ణచంద్రుడైనప్పుడు సాక్షిగా
(19) ఓ ప్రజలారా మీరు తప్పకుండా ఒక స్థితి తరువాత ఇంకో స్థితికి మారుతారు వీర్యబిందువు నుండి రక్తపు ముద్దగా ఆ తరువాత మాంసపు ముద్దగా. జీవనం ఆ తరువాత మరణం ఆతరువాత మరణాంతర జీవితం.
(20) ఈ అవిశ్వాసపరులందరికి ఏమయింది అల్లాహ్ పై మరియు అంతిమ దినముపై విశ్వాసము కనబరచటం లేదు ?.
(21) వారిపై ఖుర్ఆన్ పఠించబడినప్పుడు వారు తమ ప్రభువు కొరకు సాష్టాంగపడటం లేదు ?!
(22) అలా కాదు అవిశ్వాసపరులు తమ వద్ద తమ ప్రవక్తలు తీసుకుని వచ్చిన వాటిని తిరస్కరిస్తున్నారు.
(23) మరియు వారి హృదయములు సేకరించే వాటి గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. వారి కర్మల్లోంచి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.
(24) ఓ ప్రవక్తా వారి కోసం నిరీక్షించే బాధాకరమైన శిక్ష గురించి వారికి తెలియపరచండి.
(25) కాని ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి సత్కర్మలు చేస్తారో వారికి అంతం కాని పుణ్యం కలదు. మరియు అది స్వర్గము.