90 - Al-Balad ()

|

(1) పవిత్ర పట్టణమైన మక్కతుల్ ముకర్రమ పై అల్లాహ్ ప్రమాణం చేశాడు.

(2) ఓ ప్రవక్త మీరు చేసేది హతమార్చబడటానికి హక్కు దారుడైన వాడిని హతమార్చటం మరియు బంధీ చేయబడటానికి హక్కుదారుడైన వాడిని బంధీ చేయటం మీకు ధర్మ సమ్మతము.

(3) మరియు అల్లాహ్ మానవుని తండ్రిపై ప్రమాణం చేశాడు. మరియు అతని నుండి కలిగే సంతానముపై ప్రమాణం చేశాడు.

(4) నిశ్చయంగా మేము మనిషిని శ్రమలో,కష్టములో సృష్టించాము. ఇహలోకంలో కష్టాలను అతడు అనుభవిస్తాడు.

(5) ఏమిటి మనిషి తాను పాపకార్యములకు పాల్పడినప్పుడు అతనిపై ఎవరి అదుపు లేదని మరియు అతనితో ఎవరు ప్రతీకారము తీర్చుకోడని బావిస్తున్నాడా, ఒక వేళ అతడు తనను సృష్టించిన తన ప్రభువైనా కూడా ?!

(6) అతను ఇలా అంటున్నాడు : నేను ఒక దానిపై ఒకటి పేరుకుపోయిన చాలా సంపదను ఖర్చు చేశాను.

(7) తాను ఖర్చు చేసిన దానిపై ప్రగల్బాలు పలికే ఇతను తనను అల్లాహ్ చూడటం లేదని భావిస్తున్నాడా ? మరియు ఆయన అతని సంపద విషయంలో అతడు ఎక్కడ నుండి సంపాదించాడు మరియు ఎక్కడ ఖర్చు చేశాడు అన్న దానిలో లెక్క తీసుకోడని భావిస్తున్నాడా ?.

(8) ఏమీ మేము అతని కొరకు అతను చూసే రెండు కళ్ళను తయారు చేయలేదా ?!

(9) మరియు అతను మాట్లాడే నాలుకను మరియు రెండు పెదాలను.

(10) మరియు మేము అతనికి మంచి మార్గమును మరియు దుర్మార్గమును పరిచయం చేశాము.

(11) మరియు అతను స్వర్గం నుండి అతన్ని వేరు చేసే కనుమను దాటటానికి మరియు అదిరోహించటానికి ఆశిస్తున్నాడు.

(12) ఓ ప్రవక్త అతడు స్వర్గంలో ప్రవేశించటానికి అతను దాటే కనుమ ఏమిటో మీకేమి తెలుసు ?!

(13) అది పురుషుడైనా లేదా స్త్రీ అయినా బానిసత్వం నుండి విడిపించడం.

(14) లేదా ఆహారం లభించటం అరుదుగా ఉండే కరువు దినంలో ఆహారమును తినిపించటం

(15) తనకు సమీప బందువైన తన తండ్రిని కోల్పోయిన శిసువుకు (సమీప అనాధకు)

(16) తన యాజమాన్యంలో ఏమీ లేని బీధ వానికి

(17) ఆ తరువాత అతడు అల్లాహ్ ను విశ్వసించి మరియు విధేయత కార్యాలు చేయటంపై,అవిధేయత కార్యాలను విడనాడటంపై,ఆపదలపై ఓర్పు చూపమని ఒకరినొకరు సహనం చూపుకోమని తాకీదు చేసుకున్న వారిలో నుంచి మరియు అల్లాహ్ దాసులపై కరుణించమని ఒకరినొకరు తాకీదు చేసుకున్న వారిలొ నుంచి అయిపోయాడు.

(18) ఈ సుగుణాలు కలిగిన వారందరే కుడి పక్షం వారు.

(19) మా ప్రవక్తపై అవతరింపబడిన మా ఆయతులను తిరస్కరించిన వారే ఎడమ పక్షం వారు.

(20) వారిపై ప్రళయ దినమున బందించబడిన నరకాగ్ని ఉంటుంది అందులో వారు శిక్షంపబడుతారు.