91 - Ash-Shams ()

|

(1) అల్లాహ్ సూర్యుని పై ప్రమాణం చేశాడు మరియు దాని ఉదయించే స్థలం నుండి ఉదయించి దాని ప్రకాశించే వేళ పై ప్రమాణం చేశాడు.

(2) మరియు దాని అస్తమించిన తరువాత దాన్ని అనుసరించే చంద్రునిపై ప్రమాణం చేశాడు.

(3) మరియు తన వెలుగుతో భూమిపై ఉన్న వాటిని బహిర్గతం చేసే పగలుపై ప్రమాణం చేశాడు.

(4) మరియు భూమిపై ఉన్న వాటిని క్రమ్మి వేసినప్పుడు చీకటిగా అయిపోయే రాత్రిపై ప్రమాణం చేశాడు.

(5) మరియు ఆయన ఆకాశముపై ప్రమాణం చేశాడు మరియు దాని దృడనిర్మాణం పై ప్రమాణం చేశాడు.

(6) మరియు ఆయన భూమిపై ప్రమాణం చేశాడు. మరియు దానిపై ప్రజలు నివాసముండుటకు దాన్ని విస్తరించిన ప్రక్రియపై ప్రమాణం చేశాడు.

(7) మరియు ఆయన ప్రతీ ప్రాణిపై ప్రమాణం చేశాడు. మరియు దాని కొరకు అల్లాహ్ సృష్టిని తీర్చి దిద్దిన దానిపై ప్రమాణం చేశాడు.

(8) చెడు ఏదైతే ఉన్నదో దాని నుండి భద్రంగా ఉండటానికి మరియు మేలు ఏదైతే ఉన్నదో దానికి అది దగ్గర అవ్వటానికి దానికి నేర్పించకుండానే అర్ధం అయ్యేటట్లు చేశాడు.

(9) ఎవరైతే తన మనస్సును సద్గుణాలతో అలంకరించుకుని పరిశుద్ధపరచుకున్నాడో మరియు దాని నుండి దుర్గుణాలను ఖాళీ చేశాడో అతడు తాను ఆశించిన వాటితో సాఫల్యం పొందాడు.

(10) నిశ్ఛయంగా ఎవరైతే తన మనస్సును దాన్ని అవిధేయ కార్యాల్లో మరియు పాపకార్యాల్లో గోప్యంగా ఉంచి అణగద్రొక్కాడో అతడు విఫలుడయ్యాడు.

(11) సమూద్ జాతి అవిధేయ కార్యములను పాల్పడటంలో మరియు పాపకార్యములకు పాల్పడటంలో తాను హద్దును అతిక్రమించటం వలన తన ప్రవక్త సాలిహ్ ను తిరస్కరించింది.

(12) వారిలో నుండి దుష్టుడు తనను తన జాతి వారు సారధిగా నిలబెట్టిన తరువాత నిలబడినప్పుడు.

(13) అయితే దైవ ప్రవక్త సాలిహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : మీరు అల్లాహ్ ఒంటెను మరియు దాని వంతు దినములో దాని త్రాగటమును వదిలివేయండి. దానికి చెడును తలపెట్టకండి.

(14) అయితే వారు ఒంటె విషయంలో తమ ప్రవక్తను తిరస్కరించారు. మరియు వారిలోని దుష్టుడు తాను చేసిన దానిపై వారి ఇష్టతతో దాన్ని హతమార్చాడు. కాబట్టి వారు పాపములో భాగస్వాములయ్యారు. అప్పుడు అల్లాహ్ వారిపై తన శిక్షను కురిపించాడు. వారి పాపముల వలన భయంకర శబ్దముతో వారిని నాశనం చేశాడు. వారిని నాశనం చేసిన శిక్షలో వారిని సమానం చేశాడు.

(15) వారిని నాశనం చేసిన శిక్ష ఏదైతే వారిపై అల్లాహ్ అమలు చేశాడో పరిశుద్ధుడైన ఆయన దాని పర్యవసానాల నుండి భయపడడు.