97 - Al-Qadr ()

|

(1) నిశ్ఛయంగా మేము రమజాన్ నెలలో ఘనమైన రాత్రిలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖుర్ఆన్ అవతరణను ఆరంభించినట్లే పూర్తి ఖుర్ఆన్ ను భూమికి దగ్గర ఉన్న ఆకాశము పై ఒకేసారి అవతరింపజేశాము.

(2) ఓ ప్రవక్తా ఈ రాత్రిలో ఉన్న మేలు,శుభము ఏమిటో నీకు తెలుసా ?!

(3) ఈ రాత్రి గొప్ప మేలు కలిగిన రాత్రి. విశ్వాసముతో మరియు పుణ్యాన్ని ఆశిస్తూ అందులో ఆరాధన చేస్తూ జాగారం చేసే వాడి కొరకు అది వెయ్యి నెలల కన్నా శ్రేష్ఠమైనది.

(4) దైవదూతలు మరియు జిబ్రయీల్ అలైహిస్సలాం అందులో పరిశుద్ధుడైన తమ ప్రభువు ఆదేశముతో ఆ సంవత్సరం అల్లాహ్ నిర్ణయించిన ప్రతీ విషయమును అది ఆహారం అయినా లేదా మరణం అయినా లేదా జననం అయినా లేదా ఇతర విషయాలు అల్లాహ్ అంచనా వేసిన వాటిని తీసుకుని దిగుతారు.

(5) ఈ శుభప్రధమైన రాత్రి దాని ఆరంభం నుంచి ఫజర్ ఉదయించటంతో దాని ముగింపు అయ్యే వరకు పూర్తిగా మేలు కలది.