98 - Al-Bayyina ()

|

(1) యూదుల్లోంచి,క్రైస్తవుల్లోంచి మరియు ముష్రికుల్లోంచి అవిశ్వాసపరులు వారి వద్దకు స్పష్టమైన ఆధారము మరియు జ్యోతిర్మయమైన వాదన వచ్చేంత వరకు అవిశ్వాసులు తమ సమావేశము,తమ సంయోగము నుండి విడిపోరు.

(2) ఈ స్పష్టమైన ఆధారము మరియు జ్యోతిర్మయమైన వాదన ఏమిటంటే అది అల్లాహ్ వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త .ఆయన అతనిని పంపించాడు. పరిశుద్ధులు తప్ప ఎవరు ముట్టని పరిశుద్ధ గ్రంధములను చదివి వినిపిస్తాడు.

(3) ఈ గ్రంధాల్లో సత్య సమాచారాలు మరియు న్యాయపూరితమైన ఆదేశాలు కలవు. అవి ప్రజలను వారి ప్రయోజనం ఉన్న వాటి వైపుకు మరియు వారి సన్మార్గం ఉన్న వాటి వైపుకు మార్గదర్శకం చేస్తాయి.

(4) తౌరాత్ ఇవ్వబడిన యూదులు మరియు ఇంజీలు ఇవ్వబడిన క్రైస్తవులు అల్లాహ్ వారి వద్దకు తన ప్రవక్తను పంపించిన తరువాతే విభేదించుకున్నారు. అయితే వారిలో నుండి ఇస్లాం స్వీకరించిన వారు ఉన్నారు మరియు వారిలో నుంచి ఆయన ప్రవక్త నిజాయితీ జ్ఞానము తనకు కలిగిన తరువాత కూడా తన అవిశ్వాసంలో కొనసాగిన వారు ఉన్నారు.

(5) మరియు యూదుల మరియు క్రైస్తవుల అపరాధము మరియు వ్యతిరేకత బహిర్గతమవుతుంది. వారి గ్రంధంలో వారికి ఆదేశించబడిన అల్లాహ్ ఒక్కడి ఆరాధన చేయటం,బహుదైవారాధన నుండి దూరంగా ఉండటం,నమాజు పాటించటం,జకాత్ ఇవ్వటం గురించే వారు ఈ ఖుర్ఆన్ లో ఆదేశించబడ్డారు. ఎటువంటి వంకరతనం లేని తిన్నని ధర్మం గురించి వారికి ఆదేశించబడినది.

(6) నిశ్చయంగా యూదుల్లోంచి,క్రైస్తవుల్లోంచి,ముష్రికుల్లోంచి తిరస్కరించిన వారు ప్రళయదినమున నరకములో ప్రవేశిస్తారు అందులో శాశ్వతంగా నివాసముంటారు. వారందరే అత్యంత నికృష్ట సృష్టి; అల్లాహ్ ను వారు అవిశ్వసించటం వలన మరియు ఆయన ప్రవక్తను వారు తిరస్కరించటం వలన.

(7) నిశ్చయంగా అల్లాహ్ ను విశ్వసించి సత్కర్మలు చేసిన వారందరే ఉత్తమ సృష్టి.

(8) వారి ప్రతిఫలం పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన వారి ప్రభువు వద్ద స్వర్గ వనాలు కలవు వాటి భవనముల మరియు వాటి వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో శాశ్వతంగా నివాసముంటారు. అల్లాహ్ వారు ఆయనను విశ్వసించి ఆయనకు విధేయత చూపటం వలన వారి నుండి సంతుష్టపడినాడు. మరియు వారు ఆయన నుండి పొందిన ఆయన కారుణ్యము నుండి సంతృప్తి చెందినారు. ఈ కారుణ్యమును తన ప్రభువు నుండి భయపడి ఆయన ఆదేశించిన వాటిని పాటించి ఆయన వారించిన వాటి నుండి దూరంగా ఉన్న వాడు పొందుతాడు.