కేటగిరీలు

 • తెలుగు

  LINK

  ఇంటర్నెట్ లో ప్రపంచ భాషలలో ఇస్లాంను పరిచయం చేయడానికి అతిపెద్ద మరియు అత్యంత ప్రామాణికమైన ఉచిత సూచన https://islamhouse.com/te/main

 • తెలుగు

  LINK

  ఈ ప్రాజెక్ట్ సరళీకృత వివరణలు మరియు ప్రామాణిక ప్రవచన హదీసులను స్పష్టంగా అనువాదం చేయడమే లక్ష్యంగా ఉంది

 • తెలుగు

  LINK

  ఖుర్ఆన్ యొక్క అర్థాలను ప్రపంచ భాషలలో విశ్వసనీయమైన భాష్యాలు మరియు అనువాదాలను అందించే దిశగా.

 • ఇంగ్లీష్

  LINK

  www.edialogue.org అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లిమేతరులు ధర్మ ప్రచారకులతో ఇస్లాం ధర్మం అంటే ఏమిటో అర్థం చేసుకునేందుకు స్వేచ్ఛగా పరస్పరం చర్చించే అవకాశం కల్పిస్తున్న ఒక వెబ్సైటు. ఇక్కడి ధర్మప్రచారకులు ఇస్లామీయ విద్య నభ్యసించిన మంచి విద్యావంతులు. ఇక్కడ వన్ టు వన్ చాటింగ్ జరుగుతుంది. దీని సేవలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయి.

 • ఇంగ్లీష్

  LINK

  న్యూు ముస్లిం అకాడమీ ఒక NGO సంస్థ. ఇది ఇస్లాం ధర్మ ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవటంలో నవముస్లిం సోదరసోదరీమణులకు తోడ్పాటు నందిస్తుది. అంతేగాక షేఖ్ యాసర్ ఫజాగా, షేఖ్ జమాల్ జర్బోజో, డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ మొదలైన ఇస్లామీయ పండితుల మార్గదర్శకత్వంలో స్వల్పకాల మరియు ఉత్తమ ప్రమాణాలతో తయారైన కోర్సులను బోధిస్తూ అర్థం చేసుకున్న విషయాలను ఎలా ఆచరణలో పెట్టాలనే ఇబ్బందిని దూరం చేస్తున్నది. ప్రతి నవముస్లింల మదిలో మెదిలే 'ఇస్లాం స్వీకరించిన తర్వాత ఏమి చేయాలి? ఎలా ఆరాధించాలి?' మొదలైన బేసిక్ ప్రశ్నలకు సమాధానం అందజేయాలనే లక్ష్యంతో న్యూ ముస్లిం అకాడమీ పనిచేస్తున్నది. ఇస్లామీయ ధర్మ ఆరాధనలు ఆచరించేందుకు, ఇస్లాం ధర్మంపై సందేహాలు మరియు విమర్శలు ఎదురైనప్పుడు ఇస్లాం ధర్మంపై విశ్వాసం చెదరకుండా నిలకడగా ఉండేందుకు అవసరమైన ప్రామాణిక ఇస్లామీయ జ్ఞానాన్ని న్యూ ముస్లిం అకాడమీ విద్యార్థులకు అందజేస్తున్నది. తోటి నవముస్లింల ద్వారా ఆన్ లైనులో న్యూ ముస్లిం అకాడమీ విద్యార్థులకు సామాజిక తోడ్పాటు అందజేయబడుతున్నది. నవముస్లిం స్త్రీలు మరియు పురుషుల కోసం వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేయబడినాయి. ఇస్లామీయ ధర్మ విషయాలు బోధించడంలో మరియు కౌన్సిలింగులో ఆరితేరిన బోధకులు ఈ గ్రూపులో సేవలు అందిస్తున్నారు.

 • ఇంగ్లీష్

  LINK

  ది జనరల్ ప్రెసిడెన్సి ఆఫ్ స్కాలర్లీ రిసెర్చ్ అండ్ ఇఫ్తా పోర్టల్

 • ఇంగ్లీష్

  LINK

  షరిఅహ్ అకాడమీ ఆఫ్ అమెరికా అనేది ఒక స్వతంత్ర విద్యాసంస్థ. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని టాంపా, ఫ్లోరిడా లో ఉంది. ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో అహ్లె సున్నతుల్ జమఆతు విధానాన్ని అనుసరిస్తున్నది. ఇస్లామీయ ధర్మ జ్ఞానాన్ని మోడరేట్ మరియు సంతులిత మార్గంలో అందజేస్తున్నది. మౌఖికంగా ఇస్లామీయ ధర్మ జ్ఞానాన్ని బోధిస్తున్న అపూర్వ విద్యాసంస్థ ఇది. ఇంటర్ యాక్టివ్ ఇంటర్నెట్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ ఇది అందుబాటులో ఉన్నది. ఇది ప్రతి డిగ్రీ ప్లాన్ అవసరాలకు అనుగుణంగా తన పాఠ్యప్రణాళిక కొరకు క్రెడిట్ అవర్ పద్ధతిని వాడుతున్నది.

 • ఇంగ్లీష్

  LINK

  ఇలాంటి ఇతర వెబ్సైటుల మాదిరిగా ఇది కూడా అస్సలఫ్ సాలెహీన్ మార్గాన్ని అనుసరిస్తున్నది. ఇస్లాం ధర్మం గురించి చాలా స్పష్టమైన మరియు చక్కటి అవగాహన అందజేస్తున్నది. ఏ వర్గాన్నీ లేదా గ్రూపును ఇది సమర్థించడం లేదు. Islamway ప్రసార సేవలను కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి మొదలు పెట్టారు మరియు వారిద్దరే దీని బరువు బాధ్యతలు మోసేవారు. కొన్ని సర్వర్లలో చవుకగా అద్దెకు లభించిన స్పేస్ ను వారు పొందగలిగారు మరియు దానిలో మంచి మంచి ఇస్లామీయ అంశాలను ఉంచగలిగారు. అల్లాహ్ దయ వలన నేడు 150 అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకులు దీని కోసం తమ సమయాన్ని కేటాయించి, దీనిని ఒక అద్భుత రూపానికి తీసుకువచ్చారు. చిత్తశుద్ధితో కూడిన వ్యవస్థాపకుల మరియు స్వచ్ఛంద సేవకుల ప్రయత్నాలకు ప్రతిఫలంగా ఇది ఈనాటి అత్యుత్తమ ఇస్లామీయ వెబ్సైట్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

 • ఇంగ్లీష్

  LINK

  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులకు గుర్తింపుగా ప్రచురణల పరంపరను తయారు చేయబడానికి ప్రోఫెటిక్ సున్నహ్ అండ్ ఇట్స్ సైన్సెస్ అనే ఈ వెబ్సైటు నిర్ణయించుకున్నది. ఈ పరంపర సున్నతులను వివరిస్తుంది మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రచారమవుతున్న కొన్ని అపోహలలోని నిజానిజాలను స్పష్టం చేస్తున్నది. అంతేగాక ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అద్భుత గుణగణాల గురించి మరియు ఘనతల గురించి చర్చిస్తున్నది. ఈ వెబ్సైటును రియాద్ లోని ఇమామ్ ముహమ్మద్ బిన్ సౌద్ ఇస్లామీయ యూనివర్శిటీలో ప్రోఫెటిక్ సున్నహ్ అండ్ ఇట్స్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న షేఖ్ ఫాలెహ్ ఇబ్నె ముహమ్మద్ అల్ సుగైర్ నడుపుతున్నారు.

 • ఇంగ్లీష్

  LINK

  రౌధహ్ జాలియాత్, రియాద్, సౌదీ అరేబియాకు చెందిన వెబ్సైటు ఇది. ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, పోర్చుగీసు, రష్యన్, జపనీస్ మరియ చైనీస్ వంటి కొన్ని అంతర్జాతీయ భాషలలో ఇది ఇస్లాం ధర్మం గురించి పరిచయం చేస్తున్నది మరియు ప్రచారం చేస్తున్నది. అనేక సంక్షిప్త వ్యాసాలను నిరంతరం తాజాగా అప్ డేటు చేస్తూ ఉంటుంది. ఇస్లాం గురించి మరింతగా తెలుసు కోవాలనుకునే వారి కోసం ఇది లైవ్ చాట్ అంటే ప్రత్యక్ష సంభాషణ సేవలు కూడా అందిస్తున్నది.

 • ఇంగ్లీష్

  LINK

  ఇస్లాం ధర్మ అసలు మూలాధారాలైన ఖుర్ఆన్ మరియు హదీథుల ఆధారంగా ఇస్లాం ధర్మం గురించి నేర్చుకోవాలనే ఆసక్తి చూపుతున్న ప్రతి ఒక్కరి కోసం ఈ వెబ్సైటు తయారు చేయబడింది. అన్ని రకాల తీవ్రవాదాలకు దూరంగా, సరైన ఇస్లామీయ ధర్మ జ్ఞానాన్ని ప్రజలలో వ్యాపింపజేయాలనేది దీని ముఖ్య ఉద్దేశ్యం. ఎలాంటి తీవ్రవాద మరియు ఉగ్రవాద చర్యలనూ ఇస్లాం ధర్మం గుర్తించడం లేదు. అన్ని రకాల తీవ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించి ఉన్నారు. ఇది ముస్లిమేతరులకు ఇస్లాం ధర్మం గురించిన ఖచ్చితమైన సమాచారాన్ని మరియు జ్ఞానాన్ని ప్రభావశీలమైన మరియు ఆసక్తికరమైన పద్ధతిలో అందజేస్తున్నది. ప్రజలలో వ్యాపించి ఉన్న అపోహలను ఖండిస్తున్నది. అపార్థాల గురించి స్పష్టంగా వివరిస్తున్నది. ఇస్లాం గురించి తరుచుగా ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబిస్తున్నది. నవముస్లింలకు దారి చూపుతున్నది. వారికి అవసరమైన జ్ఞానం అందజేస్తున్నది మరియు సహాయం చేస్తున్నది.

 • ఇంగ్లీష్
 • ఇంగ్లీష్

  LINK

  ఇస్లాం ధర్మం గురించి ప్రశ్నించే ముస్లింల మరియు ముస్లిమేతరుల ప్రశ్నలకు వివేకవంతమైన మరియు ప్రామాణికమైన సమాధానం ఇస్తూ, సాధారణ మరియు వ్యక్తిగత సామాజిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడే ఒక గొప్ప వెబ్సైటు. దీని జవాబులు గొప్ప ఇస్లామీయ పండితుడు మరియు రచయిత అయిన షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ మునజ్జిద్ చే సంకలనం చేయబడతాయి. ఈ వెబ్సైటులోని ప్రశ్నోత్తరాలన్నీ షేఖ్ సాలెహ్ అల్ మునజ్జిద్ నాయత్వంలోని గొప్ప ఇస్లామీయ పండితుల కమిటీచే తయారు చేయబడతాయి, ఆమోదించబడతాయి, సవరించబడతాయి, సరిదిద్దబడతాయి, మార్చబడతాయి లేదా వివరించబడతాయి.

 • ఇంగ్లీష్

  LINK

  ముస్లింలలో ఇస్లామీయ ధర్మజ్ఞానం వ్యాపింపజేయటానికి అనేక భాషలలో ఇస్లామీయ ధర్మాజ్ఞల బోధనలను సులభతరం చేయటానికి కృషి చేస్తున్న ఒక మంచి ప్రాజెక్టు ఇది. "Illustrated Islamic Law for Acts of Worship (దైవారాధనలను తేటతెల్లంగా తెలిపే చేసే ఇస్లామీయ ధర్మాజ్ఞలు)" అనే పుస్తకం ద్వారా ఈ కృషి చేయబడుతున్నది. ఈ పుస్తకంలో ఐదు అధ్యాయాలు ఉన్నాయి - అవి పరిశుద్ధి, నమాజు (సలాహ్), ఉపవాసం (సోమ్), విధిదానం (జకాతు) మరియు హజ్ యాత్ర. ఈ పుస్తకంలో వీడియోలు, ఫోటోలు మరియు నిదర్శనాలతో కూడిన వివరణలు ఉన్నాయి. అంతేగాక, అరబీ, స్పానిష్, ఫ్రెంచ్, జర్మనీ, చైనీస్, రష్యన్, పోర్చుగీస్, బెంగాలీ, స్వాహిలీ, ఇండోనేషియన్, అమ్హారిక్, తజిక్ మరియు హౌసా భాషలలో వెబ్సైట్లు, న్యూస్ మీడియాలు, CDROM లలో ఈ ప్రాజెక్టు పనిచేస్తున్నది.

 • ఇంగ్లీష్

  LINK

  డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్ యొక్క సరికొత్త ఆలోచన ది ఇస్లామిక్ ఆన్ లైన్ యూనివర్శిటీ (The Islamic Online University - iou). ఎలాంటి బోధనా రుసుము లేకుండా ఉచితంగా ఆన్ లైనులో ఇంటెన్సివ్ (intensive), అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేటు ఇస్లామీయ కోర్సులను ప్రజలకు అందజేయాలనే ఆయన ప్రయత్నమే ఈ యూనివర్శిటీ. దీని ఫౌండర్ మరియు డీన్ డాక్టర్ బిలాల్ ఫిలిఫ్స్. ఇది 2007లో అసలు ఎలాంటి ఫీజులు చెల్లించే షరతు లేకుండా పూర్తి ఉచిత డిప్లొమా కోర్సులను అందజేస్తూ ఖతర్ దేశం నుండి ప్రారంభమైంది. అల్హందులిల్లాహ్ మేము 2007లో 1,500 విద్యార్థులతో ప్రారంభించినా, 2008 సంవత్సరం చివరికి 4,500 సంఖ్య చేరుకున్నారు. ఇప్పుడు ఇందులో అల్లాహ్ దయవలన 177 దేశాల నుండి దాదాపు 30,000 విద్యార్థులు ఉన్నారు. 2010లో ది ఇస్లామిక్ ఆన్ లైన్ యూనివర్శిటీ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఎలాంటి ట్యూషన్ ఫీజులు లేకుండా పూర్తి ఉచితంగా BAIS (Bachelor of Arts in Islamic Studies) కోర్సు ప్రారంభించింది. విద్యార్జనలో అన్ని ఆటంకాలు తొలగించే ఈ అద్భుత ప్రయత్నం, ప్రపంచ వ్యాప్తంగా ఉనికిలో ఉన్న ఇంటర్నెట్ మరియు అడ్యాన్సుడు ఓపెన్ సోర్సు ఆన్ లైన్ లెర్నింగ్ టెక్నాలజీలను వాడుకుంటూ తక్కువ ఖర్చుతో యూనివర్శిటీ స్థాయి ఇస్లామీయ విద్యను కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ సౌలభ్యం ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులోనికి తీసుకు వచ్చింది. ఆ విధంగా iou లో ఇప్పుడు రెండు వేర్వారు కాంపస్ లు ఉన్నాయి - డిగ్రీ కాంపస్ మరియు డిప్లొమా కాంపస్. ప్రతి కాంపస్ కు ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ సర్వర్ ఉన్నది.

 • తెలుగు

  LINK

  అరబీ భాష తమ మాతృభాష కాని వారికి, ఇస్లాం గురించి తెలియజేయటానికే ఈ వెబ్ సైటు తయారు చేయబడింది. ఇస్లాం గురించిన విషయాలు చాలా స్పష్టంగా మీ ముందు ఉంచటమే దీని ప్రధాన లక్ష్యం. ఈ స్వచ్ఛమైన ధర్మమంటే గిట్టని కొన్ని మీడియాలు ఇస్లాం మరియు ముస్లింల గురించి పనిగట్టుకుని మరీ వ్యాపింప జేస్తున్న అపోహలను, భ్రమలను, అసత్య ప్రచారాలను ఇది ప్రామాణిక ఆధారాలతో ఖండిస్తుంది. కాబట్టి, దయచేసి, ఈ సైటును సందర్శించండి మరియు లాభం పొందండి. మీ బాధ్యతగా ఇతరులకు కూడా దీని గురించి తెలియజేయండి.

 • ఇంగ్లీష్

  LINK

  తమ మాతృభాష అరబీ భాష కాని ప్రజలు ఇస్లాం గురించి తెలుసుకునేందుకు ఈ వెబ్సైటు సహాయం చేస్తున్నది. నిర్మలమైన ఇస్లామీయ ప్రతిబింబాన్ని అందజేయటం మరియు ఇస్లాం గురించి వ్యాపించిన అపార్థాలను ఖండించడం మొదలైన లక్ష్యాలతో ఇది పనిచేస్తున్నది.

 • ఇంగ్లీష్

  LINK

  ఇస్లాం, ముస్లిం మరియు ఖుర్ఆన్ గురించి అర్థం చేసుకోవాలనుకునే ముస్లిమేతరుల కోసం ఈ వెబ్సైటు ఏర్పాటు చేయబడింది. ఇది ఇస్లామీయ సమాచారాలు, రిఫరెన్సులు, బయోగ్రఫీలు మరియు నిదర్శనాలతో నిండి ఉంది. దీనిని అనేక మంది ప్రొఫెసర్లు మరియు విద్యావేత్తలు సమీక్షించారు మరియు సరిదిద్దారు. చదవటానికిది క్లుప్తంగా మరియు సింపుల్ గా ఉంటుంది. కానీ, సైంటిఫిక్ జ్ఞానాన్ని కూడా కలిగి ఉన్నది. దీనిలో “A Brief Illustrated Guide to Understanding Islam” మొత్తం పుస్తకం మరియు ఇంకా ఎన్నో మంచి పుస్తకాలు ఉన్నాయి.

 • ఇంగ్లీష్

  LINK

  ఇది ఖుర్ఆన్ మరియు సున్నతుల వెలుగులో ప్రామాణిక ఆధారాల నుండి ముస్లింలు మరియు ముస్లిమేతరుల కోసం సరైన సమాచారం అందించేదుకు ఏర్పడిన ఒక ముస్లిం ఫిల్మ్ కంపెనీ. ఇది ఏ వర్గానికి, ఉద్యమానికీ, గ్రూపుకు చెందదు. వీరు కఠినమైన పదాలతో తీవ్రవాదాన్ని మరియు ఇస్లాం పేరు మీద చేయబడే ఉగ్రవాదాన్ని పూర్తిగా ఖండిస్తారు. అలాంటి అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారితో మరియు ఆలోచించేవారితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోరు. వీరు అమెరికాలో నివసిస్తున్న అమెరికన్ ముస్లింలు. వీరు ఎలాంటి సాంస్కృతిక, సాంప్రదాయక లేదా జాతీయవాద పక్షపాతం మరియు భ్రష్టత్వాలకు తావివ్వకుండా నిజమైన ఇస్లాం సందేశాన్ని బోధించడం మరియు పంచుకోవడంలో సంత్పప్తి చెందుతారు మరియు ప్రాధాన్యతనిస్తారు.

 • ఇంగ్లీష్
పేజీ : 2 - నుండి : 1
ఫీడ్ బ్యాక్