కేటగిరీలు

معلومات المواد باللغة العربية

పుస్తకాలు

అంశాల సంఖ్య: 123

  • తెలుగు

    PDF

    డా. సయీద్ అహ్మద్ ఉమ్రీ మదనీ గారు ఈ పుస్తకంలో పరస్పరం విభేదిస్తున్న అసత్య పలుకులతో, ప్రజలను అయోమయంలో పడవేసి, తప్పుడు దారి పట్టిస్తున్న ఖాదియానియత్ గురించి ప్రామాణిక ఆధారాలతో చాలా క్షుణ్ణంగా చర్చించారు. సత్యం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తప్పకుండా చదవ వలసిన మంచి రిసెర్చ్ పుస్తకమిది.

  • తెలుగు

    PDF

    ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరి కోసం ఇది ఉపయోగపడుతుంది.

  • తెలుగు

    PDF

    ముస్లింలు మరియు ముస్లిమేతరుల కొరకు ఇది ఒక మంచి పుస్తకం. దీనిలో అల్లాహ్ పై విశ్వాసం గురించి మరియు మన ఆరాధనలలోని అనేక తప్పిదాల, కల్పితాల, భ్రమల గురించి చర్చించబడింది. అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన పద్ధతిలో అల్లాహ్ ను ఎలా ఆరాధించాలనే విధానం వైపు ఇది దారి చూపుతున్నది.

  • తెలుగు

    PDF

    ఈ పుస్తకంలో క్లుప్తంగా ఇస్లాం పరిచయం ఉన్నది. ముఖ్యంగా ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే నవముస్లింలను ఉద్ధేశించి ఈ పుస్తకం తయారు చేయబడింది. దీని ద్వారా అనేక ఇస్లామీయ విషయాలను మనం తెలుసుకోవచ్చును. అనేక భాషలతో పాటు తెలుగులో కూడా దీనిని దారుస్సలాం పబ్లిషర్స్ ప్రచురించినారు. దీనిని కొనుక్కోవాలనుకుంటే, దారుస్సలాంను సంప్రదించవలెను.

  • తెలుగు

    PDF

    ఈ పుస్తకంలో ‘సకల లోకాల సృష్టికర్త అసలు పేరేమిటి’ అనే ముఖ్యమైన విషయాన్ని డాక్టర్ అబ్దుల్ కరీమ్ (నాగిరెడ్డి శ్రీనివాస రావు) గారు చాలా వివరింగా చర్చించినారు. అనేక వాస్తవాలను ప్రామాణిక ఆధారాలతో సహా మన ముందుంచారు. దీనికి మూలం ఇంగ్లీషులోని రమదాన్ జుబైరీ గారి పరిశోధన. ఎలాంటి పక్షపాతం లేకుండా దీనిని చదివినట్లయితే, మనలోని అనేక అపోహలు, భ్రమలు తొలగిపోయి, అసలైన సృష్టకర్త వైపు మరలి, ఇహపరలోకాల సాఫల్యం వైపుకు సాగటానికి అవకాశం ఉంది.

  • తెలుగు

    PDF

    ఈ పుస్తకంలో జీసస్ (ఈసా అలైహిస్సలాం) యొక్క అసలు సందేశం – బైబిలు మరియు ఖుర్ఆన్ వెలుగులో చాలా స్పష్టంగా, నిష్పక్షపాతంగా చర్చించబడినది.

  • తెలుగు

    PDF

    హిందూ ధర్మ గ్రంథాలలో, క్రైస్తవ ధర్మగ్రంథాలలో మరియు ఖుర్ఆన్ లో సర్వలోక సృష్టకర్త అయిన ఆ ఏకైక ఆరాధ్యుడిని గురించి వివరించిన అనేక విషయాలు ఈ పుస్తకంలో చర్చించబడినాయి. ప్రతి ఒక్కరూ విశాల దృక్పథంతో చదవవలసిన పుస్తకం ఇది. దీని ద్వారా మనకు సరైన మార్గదర్శకత్వం లభిస్తుందని ఆశిస్తున్నాము.

  • తెలుగు

    PDF

    ఈ చిరుపుస్తకంలో ముస్లింలు ఏ విధంగా తమను తాము సరిదిద్దుకోవాలి అనే అంశాన్ని రచయిత చాలా చక్కగా వివరించారు

  • తెలుగు

    PDF

    ఇస్లామీయ మూసవిశ్వాసం మరియు ఏకదైవారాధన గురించి ఈ పుస్తకంలో చర్చించబడినది.

  • తెలుగు

    PDF

    ఏకదైవత్వం (తౌహీద్), ఆరాధనలు, బహుదైవారాధన – అల్లాహ్ కు సాటి కల్పించడం, ప్రార్థనలు, అగోచర జ్ఞానం, సిఫారసు, చికిత్స మొదలైన విషయాలు.

  • తెలుగు

    PDF

    ఇస్లామీయ మూలవిశ్వాసాలపై 50 ప్రశ్నలు - జవాబులు

  • తెలుగు

    PDF

    ఈ పుస్తకంలో చర్చించబడిన విషయాలు: అఖీదహ్, మూలవిశ్వాసాలు, తౌహీద్, బహుదైవారాధన, షిర్క్; ఖుర్ఆన్ మరియు సున్నతుల అనుసరణ, శుచీ-శుభ్రత, నమాజు, ప్రార్థనలు, ఉపవాసం, రమదాన్ మాసం, తరావీలు, జకాతు, వారసత్వం, హజ్, ఉమ్రా, పండుగలు, సంతోష సమయాలు – నిఖా, అఖీఖహ్; జనాజ - అంత్యక్రియలు, ఇస్లాం జీవన విధానం - సలాం ఆదేశాలు, తల్లిదండ్రుల హక్కులు, పిల్లల శిక్షణ, రోగుల పరామర్శ, అతిథి మర్యాద, భోజన నియమాలు.

  • తెలుగు

    PDF

    ఇది తెలుగులో నేటికీ వాడుకలో నున్న మొదటి అనువాదం. మౌల్వీ అబ్దుల్ గపూర్ గారు దీనిని తిన్నగా అరబీ భాష నుండి అనువదించినారు.

  • తెలుగు

    PDF

    ఉర్దూ భాషలో మౌలానా ముహమ్మద్ జునాగడీ మరియు హాఫిజ్ సలాహుద్దీన్ యుసుఫ్ లు కలిసి తయారు చేసిన అహ్సనుల్ బయాన్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ సంకలనం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని ముమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు తెలుగులో అనువదించినారు. శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించినారు. వారి అనుమతి లేకుండా ఎవరూ దీనిని అధిక సంఖ్యలో ప్రింటు చేయరాదు. తెలుగు భాషలో ఇటువంటి అమూల్యమైన గ్రంథం లభ్యమవటం మన అదృష్టం.

  • తెలుగు

    PDF

    ఇది తెలుగు భాషలో ఖుర్ఆన్ భావం యొక్క అనువాదము. మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఇక్కడ పొందుపరచ బడినది. దీనిని మెరుగుపరచటానికి, మీ సలహాలు ఏమైనా ఉంటే దయచేసి అనువాదకుడికి పంపగలరు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ప్రతి అరబీ వచనమునకు దాని ప్రక్కనే తెలుగు అనువాదం చేయబడినది.

  • తెలుగు

    PDF

    సులభశైలిలో పవిత్ర ఖుర్ఆన్ - మౌలానా అబ్దుస్సలామ్ ఉమ్రీ గారి మరియు మౌలానా జాకిర్ ఉమ్రీ గారి అహర్నిశల కృషి ఫలితంగా పూర్తి అయింది. అల్లాహ్ వారి కృషిని స్వీకరించుగాక. ఈ ఖుర్ఆన్ వ్యాఖ్యానానికి విశ్వవిఖ్యాత తఫ్సీర్లు అయిన తఫ్సీర్ ఇబ్నె కథీర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి తర్జుమానుల్ ఖుర్ఆన్, సఊదీ అరబ్ నుండి ప్రచురించబడిన అహ్సనుల్ బయాన్, డా. లుఖ్మాన్ గారి తఫ్సీర్ తైసురుర్రహ్మాన్, మౌలానా అబ్దుర్రహ్మాన్ కీలానీ గారి తైసీరుల్ ఖుర్ఆన్, మౌలానా సనావుల్లా అమృతసరీ గారి తఫ్సీరె సనాయిలను ఆధారంగా చేసుకోవటం జరిగింది. ఇది 30 భాగాలలో ఉంది.

  • తెలుగు

    PDF

    ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథ్ ల సంకలనం.

  • తెలుగు

    PDF

    ఈ పుస్తకం జీసస్ మరియు ముహమ్మద్ గురించి క్రైస్తవులలో ఉన్న అనేక అపోహలను ప్రామాణిక ఆధారాలతో దూరం చేస్తున్నది. సత్యం తెలుసుకోగోరిని ప్రతి ఒక్కరికీ ఇది ప్రయోజనం చేకూర్చును.

  • తెలుగు

    PDF

    ఈ పుస్తకంలో అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని గురించి చాలా వివరంగా చర్చించబడినది. ఇంకా షిర్క్ అంటే బహుదైవారాధన రుగ్మతల గురించి కూడా విశదీకరించటం జరిగినది. అంతే గాక అల్లాహ్ యొక్క సందేశహరుడిని, సందేశాన్ని మరియు అల్లాహ్ కు దూరం చేసే తాగూత్ అంటే దుష్టశక్తుల గుర్తింపు మరియు ఇతర ఏకదైవారధనకు సంబంధించిన విషయాలు కూడా దీనిలో విపులంగా చర్చించబడినవి. ప్రతి పాఠకునికి దీనిలోని విషయాలు ఇహపరలోకాలలో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.

  • తెలుగు

    PDF

    అత్తౌహీద్ అంటే ఏకదైవత్వం పై వ్రాయబడిన ఉత్తమ పుస్తకాలలో ఇది ఒకటి. దీనిలో సకల లోక సృష్టికర్త యొక్క ఏకదైవత్వం గురించి వివరంగా చర్చించబడినది. అల్లాహ్ గురించి తెలుసుకోదలచిన ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన ఒక మంచి పుస్తకం.