కేటగిరీలు

 • అకానీ

  MP3

  ఇస్లాం అంటే ఏమిటి అనే అంశంపై అల్ అకానియ్యహ్ భాషలో తయారైన చర్చ.

 • అకానీ

  MP3

  ఇస్లాం అంటే ఏమిటి, దాని వాస్తవికత ఏమి అనే విషయం గురించి అల్ అకానియ్యహ్ భాషలో వెలువడిన చర్చ.

 • ఇంగ్లీష్

  MP3

  ఇస్లాం ధర్మంలోని సౌందర్యాన్ని చక్కగా వివరించే గొప్ప ఆడియో. దీనిని డాక్టర్ నాజీ ఇబ్రాహీం అర్ఫాజ్ తయారు చేసారు. అందరికీ నచ్చే ఒక మంచి ఆడియో ప్రోగ్రాం ఇది.

 • ఇంగ్లీష్

  MP3

  అనేక కోణాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి వివరించే ఒక గొప్ప ఆడియో ఇది. ఆయన యొక్క కొన్ని బోధనలను ప్రస్తావించారు మరియు ఆయన జీవిత ఘటనలపై ఒకసారి దృష్టి సారించారు. అంతేగాక, ప్రపంచ ధార్మిక గ్రంథాలు ఆయన గురించి ఏమి పలికాయో పేర్కొన్నారు. ఇంకా, ఆయన గురించి సైన్సు పరంగా వివిధ కోణాలలో కొందరు ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రజ్ఞుల పలికిన అద్భుత విషయాలు మరియు పొగడ్తలు, ఆయన యొక్క అత్యుత్తమ గుణగణాలు మరియు సమగ్ర చట్టం గురించి ప్రస్తావించారు.

 • ఇంగ్లీష్

  MP3

  అల్లాహ్ వద్దకు చేర్చే సన్మార్గం కనుగొన్న ప్రతి నవముస్లిం కొరకు ఇది ఒక గొప్ప కానుక. వారి విశ్వాసాన్ని మరింత బలర్చుకోవడానికి మరియు భద్రంగా కాపాడుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆడియోలలో ముస్లింగా మారటం వలన లభించే ప్రతిఫలం, ఇస్లాం ధర్మం యొక్క ఉత్తమమైన విశేషతలు మరియు ఇస్లాం ధర్మంలోని ముఖ్యమైన విషయాన్నింటినీ షేఖ్ ఫహద్ సాలెమ్ బహమ్మమ్ ఇక్కడ చర్చించారు. ఒకరి దైవవిశ్వాసం ఆధారంగా చేసుకోవలసిన అర్కాన్ అల్ ఈమాన్ అంటే దైవ విశ్వాసపు మూలసిద్ధాంతాలు మరియు అవయవాల ఉత్తమమైన ఆచరణలు (ఆరాధనలు) మరియు హృదయాల ఉత్తమమైన ఆచరణలు (తౌహీద్ అనే ఏకదైవత్వ సిద్ధాంతం) కలిగి ఉన్న అర్కాన్ అల్ ఇస్లాం అంటే ఇస్లాం మూల సిద్ధాంతాలను ఆయన చక్కగా వివరించారు. ఇస్లాం ధర్మం ఒక సామాజిక ధర్మం అయినందున, చిన్నా లేక పెద్ద, ముస్లిం లేక ముస్లిమేతరులు మొదలైన సమాజంలోని ప్రతి ఒక్కరితో ఒక ముస్లిం ఎలా ప్రవర్తించాలి, షేఖ్ ఫహద్ వివరించారు. తర్వాత ఆయన అనుమతించబడిన మరియు నిషేధించబడిన కొన్ని ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. అలాగే ఒకరి ఈమాన్ అంటే దైవవిశ్వాసాన్ని పెంచే మరియు అల్లాహ్ ఆజ్ఞలను పాటించడంలో సహాయపడే అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. అల్లాహ్ మార్గంలో అడ్డుపడే (కామం, అత్యాశ, దురాశ, అపోహలు మరియు అజ్ఞానం వంటి) కొన్ని ఆటంకాలను కూడా ఆయన పేర్కొన్నారు. అంతేగాక ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఒక వ్యక్తి తన సృష్టికర్త వద్ద మనస్పూర్తిగా పశ్చాత్తాప పడేందుకు అవసరమైన వాటిని చూపారు. చివరిగా, నవముస్లిం కొరకు ఆయన మంచి సందేశాన్ని ఇచ్చారు.

 • ఇంగ్లీష్

  MP3

  సాక్ష్యప్రకటన, ఎలా నమాజు చేయాలి, ఎలా సంతోషంగా ఉండాలి, మహిళల గురించి కొన్ని విషయాలు మరియు జీసస్ అలైహిస్సలాం యొక్క దైవత్వ అంశం మొదలైన ఇస్లాం గురించిన అనేక అంశాలను కొందరు పండితులు ఇచ్చిన ఈ ఉపన్యాసాలు చర్చిస్తున్నాయి.

 • ఇంగ్లీష్

  MP3

  "Beyond Mere Christianity" అంటే క్రైస్తవానికి ఆవల అనే రచన యొక్క ఆడియో రికార్డింగు. ఒకవేళ దీనిని చదివే పాఠకుడు క్రైస్తవుడు అయినట్లయితే, దయచేసి ఇది వారిని కించపరచటానికి తయారు చేయలేదని, కేవలం ప్రవక్త జీసస్ అలైహిస్సలాం పై ఉన్న ప్రగాఢ ప్రేమను పంచుకోవటంలో భాగంగా దీనిని అర్థం చేసుకోవాలని మనవి.

 • ఇంగ్లీష్

  MP3

  అబ్దుల్ ఖాలిఖ్ అష్షరీప్ తయారు చేసిన వ్యాసం యొక్క ఆడియో రికార్డింగ్. దీనిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధర్మప్రచారం మరియు ధర్మప్రచారం మొదలు పెట్టినప్పటి నుండి తాయిఫ్ ప్రయాణం వరకు ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందుల గురించి వివరించబడింది.

 • ఇంగ్లీష్

  MP3

  దీనిలో రచయిత ఇలా పేర్కొన్నారు, "నేను చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే నేను వారి అఖీదహ్ పుస్తకాన్ని ఇంగ్లీషులో చదివాను. అలా చదవటానకి కూర్చున్న ప్రతిసారి నాలో రేగిన ఆధ్యాత్మిక భిన్నాభిప్రాయాలు, తుఫానులు నాకింకా గుర్తున్నాయి. నేను తిరగేసిన ప్రతిపేజీలో నాకు నా విశ్వాసాన్ని పరీక్షించే కొన్ని దైవదూషణలు, దైవనిందలు కనబడేవి. అయితే వాటి ప్రభావానికి లోను కాకుండా నేను అల్లాహ్ యొక్క ఆరాధనలు, అల్లాహ్ యొక్క గౌరవస్థానం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలపైనే దృష్టి పెట్టాను."

 • అరబిక్

  MP3

  ఇస్లామీయ షరిఅతు అమలు చేయడం ద్వారానే శాంతి భద్రతలు స్థాపించబడతాయి. ఇస్లామీయ షరిఅతు సృష్టిపై అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం. ఎవరైతే దీనిని విశ్వసిస్తారో వారు అల్లాహ్ యొక్క ధర్మంపై ఉన్నట్లే. అలాంటి అల్లాహ్ యొక్క దాసులు శాంతి భద్రతలలో, సుఖశాంతులలో ఉంటారు. మరి ఎవరైతే తమ ఇష్టానుసారం జీవిస్తారో, తమ సంపద మరియు తమ కోరికల ఆధారంగా జీవిస్తారో, వారు ఒక్కసారి తమ జీవితం గురించి ఆలోచించుకోవాలి, సత్యాన్వేషణ చేయాలి.

 • ఇంగ్లీష్

  MP3

  మై పాథ్ టు ఇస్లాం అనే ఈ వృత్తాంతంలో ఎలా హుడా డాడ్జ్ Huda Dodge ఇస్లాం స్వీకరించారో తెలిపినారు. దీని చదవటం ద్వారా మీలో ధర్మప్రచారంలో పాల్గొనాలనే ఆలోచన రేకిత్తించవచ్చు లేదా మీ దైవవిశ్వాసం పెరగవచ్చు. ఏదేమైనా దీనిని తప్పక చదవండి. ఇది కేవలం ఇస్లాం స్వీకరించిన ఒక మహిళ యొక్క వృత్తాంతం కానీ ఇంకా అనేక మంది ఇస్లాం ధర్మంలో ప్రవేశించక, తమ అజ్ఞానంలోనే జీవిస్తున్నారు.

 • ఇంగ్లీష్

  MP3

  మీ మెదడును మెలితిప్పే లేదా మీ ధర్మాన్ని మార్చే ఉద్దేశ్యం నాకు లేదు. నా ఉద్దేశ్యం మరియు లక్ష్యం ఏమిటంటే మీ జ్ఞాన పరిధి పెంచుకోవడం కోసం ఇస్లాం గురించి మీరు తెలుసుకోవాలి, ఇస్లాం స్వీకరించాలా లేదా అనేది పూర్తిగా మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది.

 • అరబిక్

  MP3

  శాంతిభద్రతలపై తౌహీద్ ప్రభావం - రియాద్ లోని ఒక పెద్ద మస్జిదులో చేసిన ప్రసంగంలో షేఖ్ ఇహపరలోకాలలో శాంతిభద్రతల గురించి తెలుపుతూ, తౌహీద్ లేకుండా శాంతిభద్రతల స్థాపన జరగదని తెలిపినారు. శాంతిభద్రతల స్థాపనకు ముఖ్యమైన పరికరం ఏకదైవత్వమనే తౌహీద్ సిద్ధాంతమనీ, అదే శాంతిభద్రతలను స్థాపించే మార్గం చూపుతుందని స్పష్టం చేసారు.

 • ఇంగ్లీష్

  MP3

  మానవజాతి కొరకు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ నిర్దేశించిన ఉత్తమ చట్టం షరిఅహ్ చట్టం. దానిని అనుసరించమని ఆయన ఆదేశించినాడు. షరిఅహ్ చట్టం యొక్క ప్రధాన మూలం ఖుర్ఆన్ గ్రంథం. దీనిలో ప్రాథమిక నియమాలు ప్రస్తావించబడినాయి మరియు సున్నతులనబడే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవనవిధానం మరియు బోధనలు వాటి ఆచరణాత్మక వివరాలను అందజేస్తున్నాయి. ఉదాహరణకు, ఖుర్ఆన్ లో 'నమాజు స్థాపించండి, ఉపవాసాలు పాటించండి, జకాతు చెల్లించండి, సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోండి, తప్పుడు మార్గాలలో సంపాదించవద్దు మరియు ఖర్చు పెట్టవద్దు' మొదలైన ధర్మాజ్ఞలు పేర్కొనబడినాయి. అయితే, వాటిని ఎలా ఆచరణలో పెట్టాలో వివరించబడలేదు. వాటి ఆచరణ పద్దతి మనకు సున్నతులలో లభిస్తుంది.

 • అరబిక్

  MP3

  ఇస్లాం యొక్క అనుగ్రహాలు - షేక్ సయీద్ బిన్ వహాఫ్ అల్ గహతానీ చేసిన ఈ ప్రసంగం రియాద్ లోని పెద్ద జామియా మస్జిదులో రికార్డు చేయబడింది. మానవజాతిపై సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క అనుగ్రహాలలో అతి గొప్ప అనుగ్రహాలు ఇస్లాం ధర్మంలో ఉన్నాయని ఆయన తెలిపినారు. దీనికి మనం ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో ఆయన తెెలిపినారు.

 • అరబిక్

  MP3

  రియాద్ లోని ప్రధాన జామియా మస్జిదులో అల్ షేఖ్ ఇచ్చిన ప్రసంగం. దీనిలో ఆయన ఇస్లాం ధర్మంలోని కొన్ని శుభాల గురించి వివరించారు మరియు ఇస్లాం ధర్మంలోని అద్భుతాలను పరిచయం చేసారు. తర్వాత ఆయన ప్రజల ప్రశ్నలకు జవాబిచ్చారు.

 • తెలుగు

  MP3

  “ఇస్లాం అంటే ఏమిటి?” అనే చాలా ముఖ్యమైన విషయాన్ని ipc, కువైత్ చాలా చక్కగా ఇక్కడ చర్చించింది. ప్రతి ఒక్కరూ తప్పక లాభం పొందుతారు.

 • అరబిక్

  MP3

  ఇస్లామీయ ప్రాథమిక నియమాలు - కువైత్ లో జరిగిన కార్యక్రమం 2-1-1432 హి

 • పోర్చుగీస్

  MP3

  క్లుప్తంగా ఇస్లాం గురించి పరిచయం చేస్తున్న ఒక మంచి పుస్తకం. ఇది వివిధ కోణాలలో ఇస్లాం గురించి, దాని మూలసిద్ధాంతాల గురించి, పునాదుల గురించి, దానిలోని అద్భుతాల గురించి, దాని ప్రయోజనాలు మరియు శుభాల గురించి ప్రజలలో చర్చలు జరిగే ప్రశ్నోత్తరాలలో ఉన్నది. ఇస్లాం గురించి ఎవరైతే చిత్తశుద్ధితో తెలుసుకోవాలని ఆసక్తి చూపుతారో, వారి కోసం ఇది ఒక అసలైన తాళం చెవిలా పనిచేస్తుంది.

 • తెలుగు

  MP3

  ఇస్లామీయ జీవిత విధానాన్ని అనుసరించడంలో మనం కలిగి ఉండవలసిన పటిష్ఠమైన ఈమాన్ గురించి ఈ ఉపన్యాసంలో షేఖ్ ముహమ్మద్ జాకిర్ ఉమ్రీ గారు చాలా స్పష్టంగా, సూటీగా వివరించారు.

పేజీ : 7 - నుండి : 1
ఫీడ్ బ్యాక్