కేటగిరీలు

అల్ అఖీదహ్

ఇస్లామీయ అఖీదహ్ కు సంబంధించి అనేక అంశాలు ఇక్కడ ఉన్నాయి - ఉదాహరణకు వర్గాలు మరియు ధర్మాలు, అల్లాహ్ పై విశ్వాసం, ముహమ్మద్ రసూలుల్లాహ్ పై విశ్వాసం, దైవదూతలపై విశ్వాసం, జాదూ మరియు మాయలు, సందేశహరుడు మరియు ఆయన సందేశాలు, అంతిమదినం పై విశ్వాసం, ఖదర్ పై విశ్వాసం, ఈమాన్ యొక్క మూలస్థంభాలు, అఖీదహ్ ప్రాథమిక నియమాలు, సహాబాలు, అల్ వలా మరియు అల్ బరా అంటే ఇష్టాయిష్టాలు మొదలైన అన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.

అంశాల సంఖ్య: 114

 • video-shot

  MP4

  ఈ వీడియోలో ఈ ప్రాపంచిక జీవితంలోని కొన్ని సంఘటనల గురించి ప్రస్తావిస్తూ, సంతోషంగా ఉండాలంటే మనం తప్పక దైవ విశ్వాసం కలిగి ఉండాలనే విషయాన్ని షేఖ్ ఉమర్ సులైమాన్ చక్కగా వివరించారు.

 • video-shot

  PDF

  అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని విశ్వసించకుండా దారి తప్పించే షైతాను పన్నాగాలు, ధర్మంలో నూతన కల్పితాలు, పాపకార్యాలు ఆకర్షణీయంగా కనబడేలా చేయడం మొదలైన షైతాను యొక్క కొన్ని ముఖ్య కుతంత్రాల గురించి ఈ కరపత్రం చర్చిస్తున్నది. చివరిగా మనం షైతానును ఎలా ఓడించాలో సూచిస్తున్నది.

 • PDF

  ఇస్లామీయ ఏకదైవత్వం గురించి ప్రచురించబడిన మంచి పుస్తకాలలో ఒకటి. దీనిలో ప్రతి మానవుడు తన సృష్టికర్త గురించి తెలుసుకోవలసిన అనేక విషయాలు స్పష్టంగా తెలుపబడినాయి. అంతేగాక కొందరు ప్రజలలో కనబడే అవిశ్వాసం, కపటత్వం మరియు నూతన కల్పితాల గురించి కూడా స్పష్టంగా వివరించబడింది.

 • DOC

  ఇస్లామీయ మూలసిద్ధాంతాల గురించి అర్థం చేయుకోవటానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నోత్తరాలు.

 • PDF

  ఇది ఇస్లామీయ పండితులు ఇబ్నె తైమియ్యహ్ రచించిన సుప్రసిద్ధ కితాబుల్ ఈమాన్ అనే పుస్తకం యొక్క మొట్టమొదటి పూర్తి ఇంగ్లీషు అనువాదం. ఈమాన్ (దైవవిశ్వాసం) అనేది ఇస్లాం ధర్మం యొక్క ఒక ప్రాథమిక సిద్ధాంతం. ఒక ముస్లిం జీవితం ఎలా ఉండాలో మరియు మొత్తం మీద ధర్మం యొక్క అసలు ప్రాతిపదిక ఏమిటో అది నిర్వచిస్తున్నది.

 • PDF

  ముస్లింలలో ఈమాన్ (దైవ విశ్వాసం) బలహీనపడటమనే విషయం సర్వసాధారణమై పోయింది. అనేక మంది ప్రజలు తమ మనస్సు బండరాయిలా మారిపోయిందని చెబుతుండడం వింటుంటాము - నా మనస్సంతా కఠినత్వంతో నిండిపోయినట్లు అనిపిస్తున్నది, ఆరాధనలలో సంతృప్తి కలగడం లేదు, నాలోని ఈమాన్ అడుగంటిపోయినట్టు అనిపిస్తున్నది, ఖుర్ఆన్ పఠనం నాలో చలనం తీసుకురావటం లేదు, చాలా తేలిగ్గా నేను పాపాలలో పడిపోతున్నాను. అనేక మంది ప్రజలలో మనకు ఇలాంటి ఆందోళన కనబడుతుంది. ఈ సమస్య ప్రతి వినాశానికి మరియు అనర్థానికి కారణం.

 • video-shot

  MP4

  షైతాను చేసే మోసం అనే అంశం గురించి షేఖ్ అబ్దుల్లాహ్ హాకిమ్ ఇక్కడ చర్చించారు.

 • video-shot

  MP4

  జిన్నాతులు మరియు మ్యాజిక్ అనే ఆసక్తికరమైన అంశంపై షేక్ అబూ హంజా ఇచ్చిన ప్రసంగం.

 • PDF

  1- ఇస్లాంలో ఆంతరంగిక విశ్వాసం మరియు మంచి పనుల మధ్య సంబంధం 2 - విశ్వాసం మరియు ప్రేమలకు సంబంధించి నోటి పలుకు మరియు ఆచరణల పాత్ర. 3- స్వర్గప్రవేశం కేవలం ఆంతరంగిక విశ్వాసం మరియు మంచి పనుల వలన ద్వారా మాత్రమే సాధ్యం అనే భ్రమ 4 - కేవలం దైవవిశ్వాసం అనే భావనను బైబిల్ లో అన్వేషించుట

 • video-shot

  MP4

  ఈ వీడియోలో మొత్తం ధర్మాలు, మతాలన్నీ ఒక్కటే అని వాదించడం ఎందుకు సబబు కాదు అనే ముఖ్యవిషయం గురించి డాక్టర్ జాకిర్ నాయక్ వివరించారు.

 • PPT

  ఇస్లాం ధర్మం ఒక సార్వజనిక ధర్మం. ఇస్లాం మరియు క్రైస్తవ ధర్మాల మధ్య జరిగిన ఈ కంపేరిటివ్ స్టడీలో ఇస్లాం ధర్మం యొక్క అన్యమత సహనశీలతను పాఠకుడు గుర్తిస్తాడు.

 • DOC

  మంత్రజాలం గురించి ఇస్లాం ధర్మం ఏమి చెబుతున్నది ? మంత్రజాల ప్రభావానికి గురైన వ్యక్తి చికిత్స కొరకు ఇస్లాం ధర్మం అనేక ప్రత్యుపాయాలను సూచిస్తున్నది.

 • DOC

  ఇస్లాం ధర్మం సోది చెప్పుట, జాతకం చెప్పుట మొదలైన భవిష్యత్తు గురించి చెప్పే అసత్యాల నుండి ఎలా నివారిస్తున్నది.

 • ఏక దైవత్వం ఇంగ్లీష్

  DOC

  ఇస్లామీయ ఏక దైవత్వం అంటే ఏమిటి ?

 • DOC

  జిన్నాతుల ఉనికి మరియు వాటి శక్తిసామర్ధ్యాల సంక్షిప్త పరిచయం

 • MP3

  దీనిలో రచయిత ఇలా పేర్కొన్నారు, "నేను చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే నేను వారి అఖీదహ్ పుస్తకాన్ని ఇంగ్లీషులో చదివాను. అలా చదవటానకి కూర్చున్న ప్రతిసారి నాలో రేగిన ఆధ్యాత్మిక భిన్నాభిప్రాయాలు, తుఫానులు నాకింకా గుర్తున్నాయి. నేను తిరగేసిన ప్రతిపేజీలో నాకు నా విశ్వాసాన్ని పరీక్షించే కొన్ని దైవదూషణలు, దైవనిందలు కనబడేవి. అయితే వాటి ప్రభావానికి లోను కాకుండా నేను అల్లాహ్ యొక్క ఆరాధనలు, అల్లాహ్ యొక్క గౌరవస్థానం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలపైనే దృష్టి పెట్టాను."

 • video-shot

  MP4

  ఈ వీడియోలో బహుదైవారాధన అంటే ఏమిటి ముఖ్య విషయం పై గుంటూర్ పట్టణంలోని సెంటర్ ఫర్ ఫైనస్ మెసేజ్ టు మాన్ కైండ్ అనే ధర్మప్రచార సంస్థకు చెందిన ప్రముఖ ఉపన్యాసకులు జనాబ్ అబ్దుల్ కరీమ్ గారు ఖుర్ఆన్ మరియు సున్నతుల ప్రామాణిక ఆధారాలతో చాలా చక్కగా వివరించారు.

 • PDF

  ప్రజలు విభిన్నంగా ఉంటారు. వారు పొందే సమాచారం మరియు అభ్యసించే విద్య యొక్క మూలాలు వేర్వేరు. దీని వలన వారి ఆలోచనలలో మరియు అభిప్రాయాలలో భిన్నత్వం ఉంటుంది. అంతేగాక వారి విశ్వాసాలలో కూడా భిన్నత్వం ఉంటుంది. అయితే, వీరి విభిన్న ఆలోచనలను మరియు విశ్వాసాలను ఒకచోటికి చేర్చి, వాటిని పరిశోధించే మరియు వాటిలోని మంచి-చెడులను వేరు చేసే మాధ్యమం తప్పకుండా ఉండాలి. అందే ఇంటర్ ఫెయిత్ డైలాగ్.

 • PDF

  ఇదొక సంక్షిప్త పుస్తకం. ఇందులో ఇస్లామీయ దైవ విశ్వాసం గురించి ఒక ముస్లిం తెలుసుకోవలసిన విషయాలు చర్చించబడినాయి. దీనిని షేఖ్ సాలెహ్ అస్సుహైమీ మరియు షేఖ్ అబ్దుల్ రజ్జాక్ అల్ అబ్బాద్ లతో సహా అనేక మంది పండితులు కలిసి తయారు చేసినారు. దీనిని షేఖ్ అలీ ఇబ్నె ముహమ్మద్ నాసర్ ఫఖీహీ రివ్యూ చేసారు.

 • video-shot

  MP4

  ప్రపంచం వైపు పంపబడిన చివరి ముగ్గురు ప్రవక్తల గురించి ఈ ఉపన్యాసంలో చర్చించబడింది. వారు ముగ్గురు ఎవరు? వారి ముగ్గురు వేర్వేరు సందేశాలు ఇచ్చారా లేక ఒకే సందేశం ఇచ్చారా ? వారు ముగ్గురూ ఒకే ధర్మాన్ని బోధించారా లేక వేర్వేరు ధర్మాలనా ? ఈనాడు ప్రపంచంలో మూడు ప్రధాన ఏకదైవారాధన ధర్మాలున్నాయి - అవి ఇస్లాం, క్రైస్తవ మతం మరియు యూద మతం. ఇవి మూడూ తమ తమ ప్రవక్తలను, సందేశహరులను నమ్ముతాయి - వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త ఈసా అలైహిస్సలాం మరియు ప్రవక్త మూసా అలైహిస్సలాం. ఈ ఉపన్యాసంలో ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం పై కూడా మనం దృష్టి సారిస్తున్నాము.

ఫీడ్ బ్యాక్